గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు


గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు నిశ్చింతగా గడిపారు. అటువంటి గడ్డాఫీని చంపి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల ధనికుల ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి అడుగులకు మడుగులొత్తే తొత్తు పాలకులు లిబియాని ఏలడానికి సిద్దంగా ఉన్నారు. గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు ఎన్ని సౌకర్యాలు అనుభవించారో తెలుసుకుంటే వారిపైన అసూయ కలుగుతుంది.

 • లిబియాలో విద్యుత్ వాడుకున్నందుకు నెల నెలా బిల్లులు రావు. దేశ ప్రజలందరికీ విద్యుత్ ఉచితం. (కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై బాదే అధికారులు అక్కడ ఉండరు)
 • అప్పులు తీసుకున్నవారి నుండి వడ్డీలు వసూలు చేయరు. అక్కడ బ్యాంకులన్నీ ప్రభుత్వరంగ బ్యాంకులే. అక్కడి చట్టం ప్రకారం వడ్డీలు వసూలు చేయకూడదు.
 • ఇల్లు కలిగి ఉండడం లిబియాలో మానవ హక్కుగా పరిగణిస్తారు. లిబియాలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూరే వరకూ తన తల్లిదండ్రులకు కూడా సొంత ఇల్లు ఉండదని ప్రతిజ్ఞ చేసిన గడ్డాఫీ దానిని చివరి వరకూ నిలుపుకున్నాడు. గడ్డాఫీ నివాసం అంతా గుడారాల్లోనే గడిచింది. గుడారంలో ఉండగానే గడ్డాఫీ తండ్రి చనిపోయాడు.
 • కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు 60,000 దీనార్లు ప్రభుత్వం నుండి పొందుతారు. ఆ డబ్బుతో వారు అపార్ట్‌మెంటు కొనుక్కోవలసి ఉంటుంది. తద్వారా పెళ్లయినవెంటనే కుటుంబ జీవనం గడపడానికి కొత్త దంపతులకు లిబియా ప్రభుత్వం  అవకాశం కల్పిస్తుంది.
 • విద్య, వైద్యం లిబియాలో ఉచితంగా లభిస్తాయి. గడ్డాఫీ అధికారంలోకి రాకముందు 25 శాతం అక్షరాస్యత ఉంటే, మరణించేనాటికి అది 83 శాతానికి పెరిగింది.
 • వ్యవసాయం వృత్తిగా చేసుకోదల్చుకున్నవారికి పూర్తి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ భూమి ఉచితం, వ్యవసాయం దగ్గరుండి చూసుకోవడానికి పొలం దగ్గరే ఉచిత ఇల్లు, వ్యవసాయ పరికరాలు ఉచితం, విత్తనాలు, పశువులు అన్నీ ఉచితంగా లభిస్తాయి.

 • లిబియన్లు ఎవరైనా వారు చదువుకోవాలనుకున్న కోర్సు లిబియాలో లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్రభుత్వం పూర్తి ఖర్చు భరిస్తుంది. నెలకు 2300 డాలర్లు ఖర్చులకు ఇస్తుంది. ఉండడానికీ అలవెన్సు ఇస్తుంది. కారు అలవెన్సు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
 • అలాగే ఎవరైనా జబ్బు పడితే, వారికి లిబియాలో వైద్యం దొరక్కపోతే వాళ్లు ప్రభుత్వ ఖర్చులతోటే విదేశాలకు వెళ్ళి వైద్యం పొందవచ్చు. వైద్య ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
 • లిబియన్లు కారు కొనదలుచుకుంటే ధరలో సగం ప్రభుత్వం చెల్లిస్తుంది.
 • లిబియాలో పెట్రోలు ధర లీటరు 14 సెంట్లు. అంటే కేవలం 7 రూపాయలు. (నిజానికి కూడా పెట్రోల్ ధర అంతే ఉంటుంది. పన్నులూ, అవి ఇవీ కలిపి భారత దేశంలో రు.70 పైనే వసూలు చేస్తున్నారు. కంపెనీలకు నష్టం వస్తున్నదని ప్రతి నెలా ధరలు పెంచే భారత ప్రభుత్వంతో గడ్డాఫీని పోల్చగలమా?)
 • లిబియా ప్రభుత్వానికి విదేశీ అప్పు లేదు. విదేశాల్లో రిజర్వులు 150 బిలియన్ డాలర్లు ఉన్నాయి. వీటిని అమెరికా, యూరప్ లు స్తంభింపజేసాయి. (ప్రభుత్వ రిజర్వులే 150 బిలియన్ డాలర్లుంటే, సొంతానికి 200 బిలియన్ డాలర్లు దాచాడని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు ప్రచారం చేయడం నమ్మశక్యంగా ఉందంటారా?)
 • గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉద్యోగం దొరక్కపోతే వాళ్ళు చేయగల ఉద్యోగానికి ఎంత ఇస్తారో అంత మొత్తం వారికి చెల్లిస్తారు. ఉద్యోగం దొరికేవరకూ ఇది సాగుతుంది. అలాగని ఉద్యోగాలు చెయ్యకుండా ఉండడానికి లిబియన్లెవ్వరూ ఇస్టపడరు. తగిన పని దొరికాక చేయకుండా ఉంటానంటే ప్రభుత్వమూ ఒప్పుకోదు.
 • ఆయిల్ అమ్మకాలలో కొంతభాగం లిబియా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి ఆటోమేటిక్ గా జమ అయ్యే ఏర్పాట్లు చేశారు.
 • బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి తల్లీ 5000 డాలర్లు ప్రభుత్వం నుండి పొందుతుంది. (ఆడపిల్ల పుడితే రు. 5000 ఇస్తానని రాజశేఖర రెడ్డి చెప్పి ఒక్క తల్లికీ ఇవ్వలేదు)
 • లిబియాలో రొట్టే అతి చౌక. 40 రొట్టె ముక్కల ధర 15 సెంట్లు.
 • అక్షరాస్యులలో 25 శాతం మందికి యూనివర్సిటీ డిగ్రీ హోల్డర్లు.

13 thoughts on “గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

 1. ఛా? సౌది అరేబియా, ఇరాన్ లు ఎందుకు తక్కువ రేటుకి ఇవ్వడం లేదు? క్రిష్టా-గోదావరి బేసిన్ లో గ్యాస్, చమురుని ముఖేష్ అంబానికి ఎందుకు అప్పజెప్పారు? ఆయన రేట్లు పెంచుకుంటున్నా ఎందుకు అనుమతిస్తున్నారు? విదేశాలనుండి దిగుమతి చేసుకునే పెట్రోలు దిగుమతి ధరకే అమ్మితే పది రూపాయలకంటె తక్కువకే లీటర్ పెట్రోల్ అమ్మవచ్చనీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే పెట్రోల్ రేటు పెంచుతున్నాయని మన పత్రికలు అనేకసార్లు రాశాయి. అవన్నీ ఎందుకు చేస్తున్నట్లు?

  పెట్రోలు ఉచితంగా వద్దు. అయిన ఖర్చుకంటె తక్కువ రేటుకి కూడా వద్దు. దిగుమతి చేసుకున్న రేటుకి అమ్మినా చాలు అని కదా పత్రికలు అంటున్నది? దానికి అడ్డం ఏమిటి? కంపెనీలకు నష్టాలని చెప్పి ఎన్నిసార్లు పెంచుతారు? రూపాయి విలువ తగ్గిందని కూడా పెంచారే?! వీళ్ళా గడ్డాఫీ కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేసేది? స్విస్ బ్యాంకుల్లో డబ్బుదాచినోళ్ళ పేర్లు చెప్పమంటె దేశ భద్రత అంటున్నారు కదా, ధనికులకు సేవలు మాని ప్రజలకు సేవ చేస్తారా వీళ్ళు?

 2. What you have said is just one side of the coin. The other side of the coin is that human rights are frequently violated, justice is denied for ordinary citizens and poverty prevailed across the community. If Libyan people are so happy with Gaddafi, why he has refused to quit the office and conduct free and fair elections?
  Why Gaddafi has prepared a strong ground to bring his son into power?

 3. ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనకు కొదవలేదు. విదేశీ కంపెనీల కోసం గ్రామాలను ఖాళీ చేయించి మైనింగ్ చేసుకొమ్మని చెబుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలన్న ధ్యాస కూడా లేదు. సెజ్ లన్నింటికీ ప్రజల ఆస్తి హక్కులతో సహా ప్రాధమిక హక్కులని కాలరాసి స్ధాపిస్తున్నవే. వాటిలో పరిశ్రమలు పెట్టడం మాని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అడిగే నాధుడు లేడు ఆ వ్యాపారంలో ఖాళీ చేయించినవారికి కొన్ని మెతుకుల్ని విసిరినా వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. కాని అవి జరగడం లేదు. ఇండియా వ్యాప్తంగా ఇవన్నీ డెమొక్రసీ పేరు చెప్పి అమలు చేస్తున్నారు. మరి ఇండియా పైన కూడా బాంబులెయ్యమని అమెరికా, యూరప్ లని డిమాండ్ చేద్దామా?

  గడ్డాఫీ డెమొక్రసీ అని కబుర్లు చెప్పలేదు. కాని డెమొక్రసీ కబుర్లు చెబుతున్న భారత పాలకులకంటే ఎక్కువే తమ ప్రజలకు చేశాడు. కొడుక్కి పవర్ అప్పజెప్పాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసినా (అదెంతవరకు నిజమో, నిజమైతే దాని వెనక కారణాలేమిటో చర్చనీయాంశాలు) దాడి జరుగుతున్నపుడు కొడుకుల్ని కాపాడుకోవడానికి గడ్డాఫీ ప్రయత్నించాడా? ఒకడు అమెరికా బాంబుదాడిలో చనిపోతే ఇద్దరు తిరుగుబాటుదారులు అని చెబుతున్న కిరాయి సైనికుల చేతిలో చనిపొయారు. కుటుంబం మొత్తం తప్పించుకోవడానికి అవకాశం అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినా తీసుకోలేదు. దేశ ప్రయోజనాల కోసమే చచ్చిపోతానన్నాడు. అదే జరిగింది చివరికి.

  గడ్డాఫీ చేసిందంతా కరెక్టు కాదు. అంతా కరెక్టుగా చేయడానికి అవసరమైన సైద్ధాంతిక ఆయుధం అతని దగ్గర లేదు. తెలిసింది చేశాడు. కాని నిజాయితీగా చేశాడు. జనాల సొమ్ము తిందామని అనుకోలేదని చేప్పడానికి అతనూ, అతని కొడుకుల చావులే సాక్ష్యాలు. గడ్డాఫీ చెడ్డవాడని చెపడానికి ఉండే ఆసక్తి దేశాలపైన వరసగా దాడి చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర దేశాల దుర్మార్గాలని ఎందుకు ప్రశ్నించరు? అరవై లక్షల జనభా ఉన్న దేశం పైన ఆధునిక ఆయుధాలతో దాడి చేసి సర్వనాశనం చేయడాన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించరు? ప్రజాస్వామ్యం స్దాపిస్ధామని దాడులు చేస్తున్న ఆ దగుల్బాజీ దేశాలు ఆ పని చేస్తున్నాయా? చెప్పేవి చేయనప్పుడు ఎందుకు దాడి చేస్తున్నాయి? వీటికి సమాధానాలు వెతికితే గడ్డాఫీపై ప్రచారాని అర్ధం కనిపించదు. ప్రపంచానికి ఎవరు ప్రమాదకారులు అర్ధం అవుతుంది.

 4. kaani tirugubaatu libia lone vachindi kaada ante kaadu aneka africa desalalone vachimdi kaada mari prajalu enduku tirugubatu chesaru do u have any proofs on your post ofcourse i dont like america but i think your post is lot blame bcoz before the death of gudafi there is a revalution in that country but no one pointed these issues but after the death so many pointed these
  but my question if people are this much happy why they fight

 5. క్రిష్ణ గారు, ట్యునీషియా, ఈజిప్టు, యెమెన్, బహ్రెయిన్ దేశాల్లో ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. ఆ మేరకు ప్రపంచవ్యాపితంగా పత్రికలన్నీ ప్రజా తిరుగుబాట్ల ఫొటోలు ప్రచురించాయి. ఊరేగింపుల ఫొటోలు, సైన్యం ట్యాంకులు నడిపిన ఫొటోలు ప్రచురించాయి. ఆయా దేశాల రాజధానుల్లో ప్రధాన కూడలిలో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు చేసిన ఫొటోలు ప్రచురించాయి.

  కాని, లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిందని చెప్పిన దగ్గర్నుండి, ఇప్పటివరకూ అక్కడ ప్రజలు ఊరేగింపులు తీసిన ఫొటోలు గాని, నిరసన ప్రదర్శనలు చేసిన ఫొటోలు గాని ఏ పత్రికా ప్రచురించలేదు. లిబియా ప్రజల్ని గడ్డాఫీ చంపుతున్నాడు అందుకే తాము దాడులు చేస్తున్నామని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు చెప్పాయి. కాని గడ్డాఫీ ప్రభుత్వం చంపిన పౌరుడి వివరాలు ఏ పత్రికా రాయలేదు. గడ్డాఫీ చంపుతున్నాడు అన్నదే రాశాయి తప్ప వివరాలు రాయలేదు. గడ్డాఫీ పత్రికలను అనుమతించడం లేదు అని రాశాయి. ఇప్పుడు గడ్డాఫీ లేడు కదా. ఇప్పుడైనా ఆ వివరాలు రాయొచ్చు. ఎప్పుదో తొంభైల్లో గడ్డాఫీ చంపిన సామూహిక ఫొటోలు కనుగొన్నాం అని ఇపుడు రాస్తున్నాయి గానీ తిరుగుబాటు మొదలయ్యాక చంపిన పౌరుల గురించి మాట్లాడడం మానేశాయి. తుపాకులు ఎత్తి పట్టుకున్న కిరాయి సైనికుల ఫొటోలు తప్ప వేరే ఏ ఫొటో పత్రికలు ప్రచురించలేకపోయాయి. కానీ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల బాంబు దాడుల్లో చనిపోయిన వారి గురించి అన్ని పత్రికలూ రాశాయి. వారి బాంబుల్లో లిబియా ప్రబుత్వ భవనాలు కూలిన ఫొటోలు కూడా ప్రచురించాయి.

  లిబియా యుద్ధంలో మొట్టమొదటి క్షతగాత్రురాలు ‘నిజం’ అని ఓ విలేఖరి మంత్లీ రివ్యూ పత్రికలో రాశాడు. అది అక్షరాలా నిజం. గడ్డాఫీ ప్రజలకు సౌకర్యాలు సమకూర్చాడుగానీ వారిలో జాతీయ సెంటిమెంట్లు బలపరచడంలో విఫలం అయ్యాడు. దేశాన్ని రక్షించుకోవాలన్న ధ్యాసను నేర్పలేకపోయాడు. జనాలకి మంచి చేయడమే కాకుండా ఆ మంచి ఖరీదు కూడా ప్రజలకు తెలియ జెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఖరీదు అంటే డబ్బులు కాదు. గడ్డాఫీని చంపడానికి ఎనభైల నుండీ అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా లిబియాపై చేస్తున్న దాష్టీకాన్ని ప్రజలకు వివరించి, భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా నుండి ప్రమాదం అనీ, ఆ ప్రమాదం వచ్చినపుడు పోరాటాలకి సిద్ధం కావాలనీ, ప్రభుత్వంతో కలిసి దురాక్రమణకు వ్యతిరేకంగా తిరగబడాలన్న చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడంలో గడ్డాఫీ విఫలమయ్యాడు. అందుకే గడ్డాఫీ చావుకీ తమ భవిష్యత్తు అంధకారం కావడానికి మధ్య సంబంధాన్ని లిబియా ప్రజలు చూడలేకపోయారు.

  పత్రికలు వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లు రాయడం లేదు. వాటి ఎజెండా ప్రకారం రాస్తున్నాయి. పశ్చిమ దేశాల దురాక్రమణ రాజకీయాలకు మద్దతు ఇవ్వడమే వారి ఎజెండా. ఆ వార్తలు చదివితే గడ్డాఫీ, సద్దాం ల లేని రాక్షసత్వాలు కనిపిస్తాయి తప్ప దేశాలను కబళిస్తున్న అమెరికా, యూరప్ ల క్రౌర్యం అస్సలు కనపడదు.

 6. లిబియా లో ఉన్న స౦పద తో పోల్చితే, గడాఫీ ప్రజలకు చేసి౦ది ఎ౦తో తక్కువ కదా. ఆ మాత్రం చెయ్యక పొతే లేబర్ దొరకేది ఎలా ,ఏమ౦టారు !

 7. మీ అభిప్రాయం నాకు పూర్తిగా అర్ధం కాలేదు. లిబియాలో ఎంత సంపద ఉందని మీరు భావిస్తున్నారు? ఎంత సంపద ఉంటే ప్రజలకు ఎంత సంపద అందిందో మీరెక్కడయినా చదివారా? ఆ వివరాలేవీ నాకు తెలియవు.

  గడ్డాఫీ తనకు లేబర్ దొరకడానికే ఆ మాత్రం చేసి ఉంటాడని మీరు పరోక్షంగా చెబుతున్నట్లున్నారు. కాని నేను ప్రస్తావించిన అంశాలు లేబర్ దొరకడం కోసమే చేశాడని ఎలా భావిస్తున్నారు? ఒక పాలకుడిగా తన ప్రజలకు చేసిన మంచి పనులను నేను ఉదహరించాను. ఆ పనులలో ఏవీ కూడా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ప్రజలకు అందుతున్న దాఖలాలు లేవు.

  హౌస్ లోన్ తీసుకున్నవారినుండి వడ్డీ వసూలు చేయకపోవడం అన్న ఒక్క నిర్ణయాన్ని తీసుకొండి. ఆ చర్య ఉత్తర అమెరికా, యూరప్ లలోని ఏ అభివృద్ధి చెందిన దేశంలో కూడా కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. హౌసింగ్ లోన్లకు సంబంధించిన సబ్ ప్రైమరీ ఇళ్ల అప్పుల వల్లనే అమెరికాలో ద్రవ్య సంక్షోభం ఏర్పడి అది ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి దారి తీసిందని మీకు తెలిసే ఉంటుంది. కేవలం ఇళ్ల అప్పుల పైనే అనేక సంక్లిష్టమైన డెరివేటివ్ లు (సి.డి.ఓ, సి.డి.ఎస్, ఎస్.యు.వి ఇత్యాది) జారీ చేసి వాల్ స్ట్రీట్ బ్యాంకులు పెద్ద మొత్తంలో లాభాలు గుంజాయి. అటువంటి హౌసింగ్ లోన్లను వడ్డీ లేకుండా ఇవ్వడం మామూలు విషయం కాదని అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది. దానికీ లేబర్ దొరకడానికి సంబంధం ఎలా కలుపుతున్నారు?

 8. పరోక్షము గా చెప్పడం కాద౦డి, గడాఫీ ప్రజలకోసం ఖర్చు చెసి౦ది ఆదాయం తో పోల్చితే చాల తక్కువ అని విన్నపుడు, మీరు చెప్పిన పై సదుపాయాలు మాత్రం ఎ౦దుకు అ౦ది౦చాడు అన్న ప్రశ్న వస్తు౦ది. కాద౦టే మ౦చిదే.

  గడాఫీ తప్పి౦చు కోడానికి అమెరికా, యూరప్ లు అవకాశం ఇచ్చాయి అనడానికి ఆధారం ఉ౦దా?

 9. ఆదాయం ఎంత, ఖర్చు చేసింది ఎంతో మీ దగ్గర వివరాలు ఉన్నయా అని అడిగాను. మీరు అలా విన్నానని మాత్రమే అంటున్నారు గనక ఆ విషయం వదిలేద్దాం.

  గడ్డాఫీ తప్పించుకోవడానికి అమెరికా, యూరప్ లు అవకాశం ఇవ్వడానికి ఆధారాలు బహిరంగంగానే ఉన్నాయి.
  తిరుగుబాటు అన్న పేరుతో జరిగిన అమెరికా యూరప్ ల దాడి మొదలైనప్పటి నుండీ పత్రికల్లో అమెరికా యూరప్ ల ప్రకటనలు, ఇతర నాటో దేశాల ప్రకటనలు కూడా ఆ మేరకు చాలా వచ్చాయి.
  ఈ లింక్ చూడండి 1) http://tiny.cc/tvgea
  నాటో దేశం టర్కీ ఇచ్చిన ఆఫర్ ఇక్కడ చూడండి. 2) http://tiny.cc/1tn8o లేదా ఇది: http://tiny.cc/2y3f1
  గడ్డాఫీ సిర్టే పట్టణం వదిలి క్షేమంగా వెళ్ళడానికి అంగీకరించి కూడా దారుణంగా అతని కాన్వాయ్ పైన అమెరికా డ్రోన్ దాడులు చేయించింది.
  అంటే నమ్మించి మోసం చేసి గడ్డాఫీని చంపింది. దానికి సాక్ష్యం ఇదిగో: 3) http://tiny.cc/3mxoa
  ఇంకా ఉన్నాయి. ఇంకా అనుమానం ఉంటే చెప్పండి.

 10. వివరాలు: లిబియా జి డి పి, ఆయిల్ రిజర్వ్స్, గడాఫీ ఆస్తులు (బ్రిటన్ లోనే ౨౦ బిలియన్ దిర్హమ్స్ ఉన్నట్లు లెక్క ).

  క్షేమ౦గా వెళ్ళడానికి అ౦గీకరి౦చినా , అతన్ని పట్టిస్తే, లేదా చ౦పితె ఇచ్చే రివార్డ్ ని రద్దు చెయ్యలేదు కదా. గడాఫీ ని అ౦త హేయంగ చ౦ప౦డ౦ నేను సమర్ధి౦చను. లిబియా లో జరిగిన అభివృద్ధి ని కూడా అ౦గీకరిస్తాను కాని, అభివృద్ధి చె౦దిన దేశాలతో పోటిపడగల సత్తా ఉన్న దేశం లో కనిపి౦చాల్సిన అభివృద్ధి ఇ౦తేనా?

 11. If you are right why govt oil companies are showing loss? Libya will get crude at the cost of actual exploration and drilling costs. But India will get international market price. That difference you have to mention.

  If Gadafi is that much good why people of Libya fought against NATO?

  I feel this blog pro Leftist.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s