ఇదే నా విల్లు -మౌమ్మర్ గడ్డాఫీ


ఇది నా విల్లు. మౌమ్మర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుస్సలాం బి హుమాయ్ద్ బిన్ అబు మాన్యర్ బిన్ హుమాయ్ద్ బిన్ నాయిల్ ఆల్ ఫషి గడ్డాఫీ అను నేను, ప్రమాణం చేసి చెప్పునదేమనగా, అల్లా తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ దేవుడి ప్రవక్త, ఆయనకు శాంతి లభించు గాక. నేను ముస్లిం గానే మరణిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

నన్ను చంపేస్తే గనక, ముస్లిం సాంప్రదాయాల ప్రకారమే నన్ను పూడ్చిపెట్టాలి. చనిపోయినపుడు ఏవి ధరించి ఉన్నానో అవే బట్టలతో, నా శరీరాన్ని శుభ్రపరచకుండా, సిర్టే లో ఉన్న స్మశానంలో మా కుటుంబం, బంధువల పక్కనే నన్ను సమాధి చేయాలి.

నేను చనిపోయాక, మా కుటుంబాన్ని ముఖ్యంగా స్త్రీలు పిల్లలను బాగా చూసుకోవాలని కోరుతున్నాను.

లిబియా ప్రజలు తమ ఐడెంటిటీని, సాధించిన విజయాలనూ, చరిత్రనూ, గౌరవనీయులైన పూర్వీకులనూ హీరోలనూ కాపాడుకోవాలి. స్వేచ్ఛా ప్రజానీకం మరియు అత్యున్నతమైన మనుషులు చేసిన త్యాగాలను లిబియా ప్రజలు వదిలిపెట్టకూడదు.

ఈరోజు, రేపు మరియు అన్ని సమయాలలోనూ ప్రతిఘటనను కొనసాగించవలసిందిగా నా మద్దతుదారులకు పిలుపునిస్తున్నాను. లిబియాను దురాక్రమించే ఏ విదేశీ దురాక్రమదారుడిపైనైనా పోరాడవలసిందిగా కోరుతున్నాను.

మేము బేరాసారాలాడి మరింత సాధించగలిగి ఉండేవారమని ప్రపంచంలో స్వేచ్ఛా జీవులు తెలుసుకుంటారని ఆశిద్దాం. మా గమ్యాన్ని అమ్ముకుని, ఫలితంగా వ్యక్తిగత భద్రతనూ, సుస్ధిరమైన జీవితాన్ని పొందగలిగేవారమని వారు తెలుసుకోవాలి. ఆ మేరకు అనేక రకాలుగా మాకు ఆశలు చూపారు. కాని, మా కర్తవ్య దీక్షకు గౌరవప్రదమైన రీతిలో, ఘర్షణను ముందుండి నడపడానికే మేము నిర్ణయించుకున్నాం.

తక్షణమే మేము గెలవలేకపోయినప్పటికీ, దేశ రక్షణకే మొగ్గుచూపడం గొప్ప గౌరవంగా మా భవిష్యత్తు తరాలకు పాఠం నేర్పుతున్నాం. దేశాన్ని అమ్మేయడం అంటే చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకునే దారుణమైన ద్రోహం అని పాఠం నేర్పుతున్నాం. ఇతరులు మరో విధంగా చెబుతున్నప్పటికీ ఈ పాఠాలే విలువైనవి.

200 బిలియన్ డాలర్లు సంపాదించి దాచి పెట్టాడని గడ్డాఫిపైన పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు సిగ్గు వదిలేసి పచ్చి అబద్ధాలు రాస్తున్నాయి. అవెక్కడున్నాయో, ఎక్కడ ఎలా దాచాడో చెప్పగల దమ్ము వాటికి లేవు. అంత దాచాడనుకున్నా అలా దాచడానికి పశ్చిమ దేశాలు ఎలా సహకరించాయో కూడా వార్తా సంస్ధలు చెప్పాలి. ఆ వార్త నిజం కాదు గనక ఆ వివరాలేవీ అవి చెప్పలేవు. లిబియాపైన దాడి చేయబోయే ముందు వరకూ గడ్డాఫీతో చర్చలు జరుపుతున్న అమెరికా, యూరప్ లు ఏ నీతి ప్రకారం ఆ సంబంధాలను గడ్డాఫీతో నెరిపారో చెప్పాల్సి ఉంది.

సద్దాం సరిగ్గే ఇవే రకం అబద్ధాలు ప్రచారం చేశారు. ఇరాన్ కి వ్యతిరేకంగా సద్ధాం ఇరాక్ కి ఆయుధాలు అమ్మి, తమకు ఎదురు తిరిగేసరికల్లా ఆ ఆయుధాలనే సాకు చూపి దాడి చేసాయి నాటో దేశాలు. టెర్రరిజం కి వ్యతిరేకంగా గడ్డాఫీ పెరట్లోనే టెర్రరిస్టులను విచారించిన అమెరికా యూరప్ లు, లిబియా వనరుల కోసం అదే టెర్రరిస్టులతో కలిసి తోలుబొమ్మ ప్రభుత్వం నిలపడానికి సిద్ధమయ్యాయి.

సద్దాం కొడుకులు, బంధువులు అంతా అమెరికా దురాక్రమణ పోరాటంలో మరణించారు. వారెవ్వరూ సద్దాం సంపాదించాడని ఆరోపించిన లక్షల కోట్ల ఆస్తుల్ని అనుభవించలేదు. అనుభవించడానికి ఆస్తులూ లేవు, అనుభవించేవారూ లేరు.

గడ్డాఫీ సంపాదించాడంటున్న 200 బిలియన్ డాలర్లు అనుభవించడానికి గడ్డాఫీయే సిద్దం కాలేదు. కనీసం అతని కొడుకులను కూడా అనుభవించడి పోండి అని విదేశాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించలేదు. అవేవీ చేయకపోగా తన కొడుకుల్ని సైతం లిబియా దేశ రక్షణకోసం సమిధలుగా ఆహుతిచ్చాడు కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ. అటువంటి గడ్డాఫీ కాలి గోటికి కూడా ఎందరు ఒబామాలు, ఎందరు సర్కోజీలు, మరెందరు కామెరూన్ లు కలిసినా సరిరారు.

దేశం కోసం మరణీంచడానికి సిద్ధపడడం, ఏ దుస్తుల్లో చనిపోయారో ఆ దుస్తుల్లోనే, శరీరాన్ని శుభ్రపరచకుండా పాతి పెట్టాలని విల్లు రాయడం 200 బిలియన్ డాలర్లు దాచిపెట్టుకున్న కుబేరుడికి సాద్యమయ్యే పని కాదని విష పత్రికల రాతగాళ్ళకు ఎన్నటికి అర్ధమయ్యేను? ఎన్నికల్లో గెలవడానికి సవాలక్ష రకాలుగా తమ సొంత ప్రజలనే ప్రలోభ పరచడానికీ నానా గడ్డీ కరిచే ఒబామా, కామెరూన్, సర్కోజిలకూ, గడ్డాఫీకి పోటీయా?! యూదు అమెరికన్ల నుండి వచ్చే ఎన్నిల నిధుల కోసం పాలస్తీనా ప్రజల స్వాతంత్ర పిపాసను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిన ఒబామా, గడ్డాఫీ మరణంపై స్టేట్‌‌మెంట్ ఇస్తాడా?

కడుపు నిండక, చేయడానికి పని దొరక్క, నిత్యం ఎదురవుతున్న ఛీత్కారాలను భరించలేక, గౌరవప్రదమైన జీవితాలకు ఆశ చావక సమాజానికి దూరంగా నెట్టబడిన లండన్ యువత నిరాశా నిస్పృహలలో తాత్కాలిక అల్లర్లకు పాల్పడితే, దూరంనుండి చూసిన వారిని సైతం యావజ్జీవ శిక్షలను విధించిన కోర్టు తీర్పుల ను సెభాష్ అంటూ మెచ్చుకున్నాడు బ్రిటన్ ప్రధాని కామెరూన్. చదువుకుంటానంటే అన్నీ సమకూర్చాడు, జబ్బు చేస్తే విదేశీ డాక్టర్లను సైతం రప్పించాడు, కాదు పని కావలంటే చేతిక తగ్గ పని ఇచ్చాడు. ఆడవాళ్ళను గౌరవించాడు, స్త్రీ విధ్యకు ప్రాధాన్యమిచ్చాడు. పిల్లలకు తన దేశం ఇవ్వగలిగిన అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. అతడే గడ్డాఫీ. అటువంటి గడ్డాఫీ మరణానికి, ధనికుల చెప్పులుమోసే కామెరూన్, దీపావళి జరుపుకోమంటాడా?

హిప్పీలు. యూరోప్ దేశాలన్నింటా వ్యాపించిన వారు. ఊరిబయట తప్ప లోపలికి రానివారు. తమ బతుకేతో బతుకుతున్నవారిని మెడపెట్టి బైటికి గెంటిందికాక అది ఖండించినవారిని కూడా తిట్టిపోసిన వ్యక్తి నికొలస్ సర్కోజి. ప్రజల విలువ తెలియని కర్కోటక పాలకుడు ఆయన. మరో పక్క తన దేశం కానివారిని కూడా పిలిచి పని కల్పించాడు గడ్డాఫీ. ఆఫ్రికన్లను నల్లవారు అని ప్రపంచం అంతా ఛీత్కరిస్తుంటే పొట్టచేత పట్టుకుని లిబియా వచ్చిన ప్రతి ఆఫ్రికన్ కీ ఉద్యోగం కల్పించి సరిపోయినంత వేతనాలిచ్చి వారి వారి కుటుంబాలకు కూడా డబ్బు పంపేలా ప్రోత్సహించాడు గడ్డాఫీ. విదేశియుల సైతం ఆహ్వానించి పని కల్పించిన గడ్డాఫీ మరణానికి, హిప్పీలను వెంటాడి తరిమిన సర్కోజీ గెంతులేస్తాడా?

ప్రపంచంలో అన్ని దేశాలనుండీ విదేశాలకు వలస వెళ్లినవారు కనిపిస్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఇండియా లనుండి కూడా పని వెతుక్కుంటూ వలస వెళ్ళే వాళ్లు ఎంతమందని? కాని లిబియానుండి పని లేక, కడుపు నిండక వలస వెళ్ళిన వారు కనబడరంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. లిబియాను మానవాభివృద్ధి సూచికలో ఇండియా, చైనాల కంటె ముందుంచాడు గడ్డాఫీ. అందుకే గడ్డాఫీపై తిరుగుబాటు అని చెప్పిన తిరుగుబాటులో ఒక్క రోజంటే ఒక్కరోజు కూడా ప్రజలు పాల్గొన్న ఊరేగింపు లేదు. తుపాకులెత్తిన కిరాయి సైనికుల ఫొటోలు తప్ప ప్రజలు చేసిన నిరసనపై ఒక్క ఫొటో లేదు. అవి జరిగితే కదా ఫొటో తీయడానికి!

ఏ సాక్ష్యం లేకుండా తిరుగుబాటు అని పశ్చిమ దేశాల విష పత్రికలు ప్రచారం చేయగానే పోలో మని నమ్మడానికి ఎవరికైనా నీతీ, నియమం ఉండొద్దా?

4 thoughts on “ఇదే నా విల్లు -మౌమ్మర్ గడ్డాఫీ

  1. అమెరికా లాగా రష్యా, చైనాలు యుద్ధ ఆర్ధిక వ్యవస్ధలు కలిగి లేవు. రష్యా వద్ద ఆయుధ శక్తి ఉన్నా, ఆర్ధిక శక్తి లేదు. చైనా వద్ద ఆర్ధిక శక్తి ఉంది గానీ ఆయుధ శక్తి లేదు. కనుక మధ్యధరా సముద్రం వెళ్ళి జోక్యం చేసుకునే బదులు సొంత రక్షణను బలోపేతం చేసుకునే పనిలో పడిపోయాయి రష్యా, చైనాలు.

    అమెరికా, పశ్చిమ రాజ్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ధైర్యం భారత పాలకులకు ఎప్పుడూ లేదు. (ప్రజలకు ఉండటం వేరే సంగతి) స్వదేశంలోనే పశ్చిమ పాలకుల విధానాలకు జో హుకుం అంటున్న భారత పాలకులు లిబియాకు సహాయం చేయగలరా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s