
లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీని అతని సొంత పట్టణం సిర్టే లోనే పట్టుకుని చంపినట్లుగా ఆల్ జజీరా టివి ఛానెల్ ప్రకటించింది. బిబిసి, రాయిటర్స్ తదితర ఛానెళ్ళు గడ్డాఫీని పట్టుబడ్డాడని చెబుతున్నప్పటికీ చంపేసిన సంగతిని ధ్రృవీకరించడం లేదు. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని గడ్డాఫీ కేకలు వేసినట్లుగా పశ్చిమ దేశాల వార్తా ఛానెళ్ళు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గడ్డాఫీ గాయపడ్డాడని కొందరు చెబుతుండగా అతన్ని చంపేశారని మరికొందరు చెబుతున్నారని బిబిసి తెలిపింది.
“అతను పట్టుబడ్డాడు. అతని రెండు కాళ్ళకూ గాయలయ్యాయి” అని తిరుగుబాటు ప్రభుత్వ సంస్ధ నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎన్.టి.సి) అధ్కారి అబ్జెల్ మాజిద్ చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ ప్రకటించింది. అతనిని అంబులెన్సులో తీసుకెళ్ళారు అని కూడా రాయిటర్స్ ఎన్.టి.సి అధికారిని ఉటంకిస్తూ తెలిపింది. గడ్డాఫీ పట్టుబడ్డాడనీ, తీవ్రంగా గాయపడ్డాడనీ ఇంకా ఊపిరి పీలుస్తున్నాడనీ మరొక ఎన్.టి.సి అధికారి మహమ్మద్ లిత్ ను ఉటంకిస్తూ ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది.
అయితే ఎన్.టి.సి అధికారి అబ్దుల్ మజీద్ లెగ్తా రాయిటర్స్ తో మాట్లాడుతూ గడ్డాఫీ తలలో కాల్చడంతో ఆయన చనిపోయాడని చెప్పాడని మరొక వార్త చెబుతోంది. తామే వార్తలనూ ధృవపరుచుకోలేక పోతున్నామని అమెరికా అధికార్లు చెబుతున్నారు.
ట్రిపోలిని తిరుగుబాటు బలగాల ముసుగులో నాటో దళాలు ఆక్రమించుకున్నాక గడ్డాఫీ పొరుగు దేశాలకు పారిపోయాడనీ, నైజీరియాలో తలచాచుకున్నాడనీ, ట్యునీషియా ఆశ్రయం కల్పించిందనీ అనేక పుకార్లను పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు ప్రచారంలోకి తెచ్చాయి. అయితే గడ్డాఫీ మాత్రం తాను తన చివరి రక్తపు బొట్టువరకూ లిబియాను వదిలి వెళ్ళేది లేదని అప్పటినుండీ ప్రకటిస్తూ వచ్చాడు. తాను చెప్పిన విధంగానే గడ్డాఫీ చివరి వరకూ లిబియాలోనే ఉన్న సంగతి అతని మరణంతో స్పష్టమయ్యింది.
సిర్టే నుండి తిరుగుబాటు బలగాల ముసుగులో ఉన్న నాటో బలగాలకు పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురుకావడంతో మౌమ్మర్ గడ్డాఫీ అక్కడ ఉండవచ్చని కొన్ని వార్తా సంస్ధలు అంచనా వేశాయి. వారు ఊహించినట్లుగానే, తాను చెప్పినట్లుగానే గడ్డాఫీ తాను పుట్టి పెరిగిన ఊరిలోనే తుది శ్వాస విడిచినట్లుగా ఆల్ జజీరా వార్త ద్వారా స్పష్టం అవుతోంది.
అమెరికా, యూరప్ దేశాల సామ్రాజ్యవాద దోపిడికి ఎదురొడ్ది నిలిచినవారిలో మౌమ్మర్ గడ్డారీ ఒకరు. అత్యంత అభివృద్ధి నిరోధక పాలకులను కూలదోసి మౌమ్మర్ గడ్డాఫీ లిబియా పీఠాన్ని అధిష్టించాడు. లిబియా వనరులను సామ్రాజ్యవాద కంపెనీలకు అప్పగించడానికి కల్నల్ గడ్డాఫీ గట్టిగా తిరస్కరించడమే కాక అమెరికా దుష్కృత్యాలపైన గట్టి పోరాటం నిర్వహించాడు. ప్రపంచంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు, తిరుగుబాట్లకు కల్నల్ గడ్డాఫీ సహాయం అందించాడు. నైతిక మద్దతు అందించాడు.
గడ్డాఫీ తిరస్కార ధోరణిని అమెరికా సహించలేకపోయింది. 1980లలోనే రీగన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో నేరుగా ఒబామా ఇంటిపైనే అమెరికా బాంబుల వర్షం కురిపించి అతనిని చంపడానికి ప్రయత్నించింది. కాని గడ్డాఫీ అమెరికా జరిపిన అనేక దాడులనుంది హత్యా ప్రయత్నాలనుండి విజయవంతంగా తప్పించుకున్నాడు.
గడ్డాఫీ అరబ్బు దేశానికి అధిపతి అయినప్పటికీ ఆఫ్రికా దేశాలను ఒకటిగా చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. అనేక ఆఫ్రికా దేశాలకు చమురును అతి తక్కువ ధరలకు అందించాడు. ఆఫ్రికన్ యూనియన్ కింద ఆఫ్రికా దేశాలు సమీకృతం కావడానికి గడ్దాఫీ ఎనలేని కృషి జరిపాడు. కాని కొన్ని ఆఫ్రికా దేశాలలోని అమెరికా కీలుబొమ్మలు గడ్డాఫీ ప్రయత్నాలని అడుగడుగునా ఆటంకాలుగా నిలిచారు. ఆఫ్రికా దేశాలు శక్తివంత్గమైన యూనియన్ గా మారనప్పటికీ ఏదో ఒక మేరకు ఎ.యు కింద అవి ఇప్పుడు సమీకృతం అయ్యాయంటే అది పూర్తిగా గడ్డాఫీ కృషిగానే చెప్పుకోవాలి. లిబియా ప్రజలకు అనేక సౌకర్యాలని ప్రభుత్వమే అందించేట్లుగా గడ్డాఫీ ఏర్పాట్లు చేశాడు. మానవాభివృద్ధిలో ప్రపంచ దేశాల్లో లిబియాను చాలా దేశాలకంటే, ముఖ్యంగా ఇండియా కంటే ఉన్నతంగా గడ్డాఫీ నిలిపాడు. ఆఫ్రికా దేశాల్లో లిబియా పౌరులే ఉన్నత స్ధాయి జీవనాన్ని గడిపారనడంలో అతిశయోక్తి లేదు.
అరబ్బు దేశాల కూటమి అయిన అరబ్ లీగ్, లిబియాపై విమానాలు ఎగరకుండా భద్రతా సమితి నిషేధం విధించడానికి అంగీకరించి పరోక్షంగా గడ్డాఫీ హత్యకు దోహదపడింది. లిబియా ప్రజల్ని రక్షించే పేరుతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించి ప్రభుత్వ భవనాలను, రవాణా సౌకర్యాలను ఇతర అన్ని రంగాల మౌలిక నిర్మాణాలని సర్వనాశనం చేయడానికి కూడ అరబ్ లీగ్ సహకారం అందించింది. ఆ విధంగా గడ్డాఫీ హత్యలో అరబ్ లీగ్ ప్రముఖ పాత్ర నిర్వహించింది.
రానున్న రోజుల్లో గడ్డాఫీ గురించి అనేక అబద్ధాలు పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు ప్రచారంలో పెడతాయి. గడ్డాఫీ గుణగణాలపైన మనిషన్నవాడెవ్వడూ సాహసించని అబద్ధాలను నిస్సిగ్గుగా వల్లెవేస్తాయి. ఎన్ని అబద్ధాలు చెప్పినా లిబియా చరిత్రలో గడ్డాఫీ యుగం
