సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే.
ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల వద్ద ఆగదు. కారణం ఆ స్ధానంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెళుతుండడమే. హాన్షిన్ ఎక్స్ప్రెస్ వే లో ఈ బ్రిడ్జి ఒక భాగం. భవంతికి ఇరువైపులా ఉండే నిర్మాణాలు బ్రిడ్జిని మోస్తుంటాయి. శబ్దాలు, వాహనాలు వెళ్ళేప్పుడు సంభవించే ప్రకంపనలు భవంతిని తాకకుండా బ్రిడ్జిని అర్ధవృత్తం ఆకారంలో ఉండేలా డిజైన్ చేసారు.
ఒసాకా నగరంలోని ఫుకుషిమా-కు ప్రాంతంలో అప్పటికే హైవే నిర్మాణానికి పధకం వేసిన చొట ఆ ప్రాంత పునరభివృద్ధిలో భాగంగా 1983 లో వేరొకరికి స్ధల యాజమాన్య హక్కులు అప్పగించారు. హైవే నిర్మాణం పూనుకున్నందున యాజమాన్య హక్కులు ఉన్న వ్యక్తికి భవంతి నిర్మాణ అనుమతిని నిరాకరించారు. కాని యాజమాన్య హక్కులు ఉన్నవారు అంత తేలికగా తమ హక్కులను వదిలిపెట్టలేదు. దానితో ఇరువురూ చర్చించి ఈ పరిష్కారానికి వచ్చారు. వివాదాల వలన ఆవిష్కరించబడిన ఈ సాంకేతిక అద్భుతం బహుధా ప్రశంసనీయం.