అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం


ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికా ఆర్ధికంగా కునారిల్లుతోంది. అమెరికా దరిద్రం ఒడిలో కునుకు తీస్తోందని అమెరికా ప్రభుత్వ సర్వే తెలుపుతున్నా అమెరికాను ఆరాధించే మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమెరికా గడ్డపై పుట్టి పెరిగిన తెల్ల, నల్ల, రంగు అమెరికన్లు అంతా ఇపుడు తమ భవిష్యత్తును తామే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ కంపెనీలు తమ జీవితాల్ని ఎలా బలితీసుకుంటున్నదీ తెలుసుకుని వీధుల్లోకి వస్తున్నారు. సెప్టెంబరు 17న ప్రారంభమైన “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమంలో ఇప్పుదు 10,000 మందికి పైగా పాల్గొంటున్నారని ‘బ్లూమ్‌బర్గ్ వెబ్ సైట్’ తెలిపింది.

ఉద్యమం అంతకంతకూ మరింత విస్తరిస్తున్నదేగాని అంతం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడది “ఆకుపై బోస్టన్”, “ఆకుపై శాన్‌ఫ్రాన్‌సిస్కో”, “ఆకుపై కాలిఫోర్నియా”, “ఆకుపై లాస్‌వేగాస్”, “ఆకుపై చికాగో”, “ఆకుపై డెన్వర్” ఇలా 147 నగరాలకి విస్తరించింది. ఉద్యమం గురించిన తాజా వార్తలను వారి వెబ్‌సైట్ ‘ఆకుపై టుగెదర్’ ఎప్పటికప్పడు అందిస్తోంది. ఆ వెబ్ సైట్ ప్రకారం 45 రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ గురించి పధకాలు రచిస్తున్నారు. ఇప్పటివరకూ 35,000 డాలర్లను డోనేషన్ల రూపంలో సేకరించారు. విదేశాల్లో 28 నగరాలకు ఈ ఉద్యమం వ్యాపించిందని వారు చెబుతున్నారు.

“ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమకారులు “ఆకుపై వాల్‌స్ట్రీట్ జర్నల్” పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రికలో ఆందోళనకారులు తమ దేశం గురించిన కొన్ని వాస్తవాలను వివరిస్తున్నారు. తమ దేశం గురించి అమెరికన్లు చెబుతున్న వాస్తవాలను చూసయినా అమెరికా మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకుంటాయని ఆశిద్దాం.

(డాక్యుమెంటు ఒరిజినల్ లింక్ కింద ఇవ్వబడింది)

http://www.scribd.com/doc/67837516/Occupied-Wall-Street-Journal

2 thoughts on “అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం

  1. శేఖర్ గారు,
    ఈ ఆక్యుపై ఉద్యమాలని మెల్లగా ఏదో ఒక కంపెనీ స్పాన్సర్ చేయకపోతే సంతోషమే! మొన్నే MSN లో how to make a firm recession-proof అని ఒక article చదివాను. దాంట్లో కంపెనీలు ఇలాంటి ఉద్యమాలను స్పాన్సర్ చేసి నెమ్మది గా తమ జనాల ఆమోదమూ , పాపులారిటీ పొంది, చివరికి తమ సరుకులపై ఈ ఉద్యమాల ముద్రలు వేసి అమ్ముకోవచ్చని చెప్పాడు.

  2. బొందలపాటి గారూ అటువంటి అవకాశం లేకపోలేదు. కాని ఈ ఉద్యమం ప్రారంభం అయ్యి విస్తరించిన తీరు చూస్తే అటువంటు అవకాశం కొద్దిగానే కనిపిస్తోంది. వారం రోజుల్లోనే చాలా వేగంగా విస్తరించింది. ఇంకా విస్తరిస్తురిస్తూనే ఉంది. కాని ఈ ఉద్యమానికి నిర్ధిష్టమైన నాయకత్వం లేకపోవడం, నిర్ధిష్టమైన డిమాండ్లు లేకపోవడం, ఎజెండా లేకపోవడం పెద్ద బలహీనతలుగా కనిపిస్తున్నాయి. డిమాండ్లన్నీ నినాదాల రూపాల్లో ఉన్నాయి తప్ప ఓ పరిష్కారం పొందే విధంగా లేవు. అంతవరకూ అమెరికా పాలకవర్గాలకు ఈ ఉద్యమం వలన పెద్దగా నష్టం ఏమీ ఉండదు.

వ్యాఖ్యానించండి