‘యాపిల్’ సారధి ‘స్టీవ్ జాబ్స్’ అస్తమయం


యాపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించాడు. చాలా కాలంగా ‘పాంక్రియటిక్ కేన్సర్’ తో బాధపడుతున్న గత ఆగస్టు నెలలోనే యాపిల్ కంపెనీ సి.ఇ.ఓ పదవినుండి తప్పుకుని ఛైర్మన్ గా మిగిలాడు. యాపిల్ కంపెనీ ‘ఐ ఫోన్ 4ఎస్’ ని విడుదల చేసిన తర్వాత రోజే స్టీవ్ చనిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో పాలో ఆల్టో పట్టణంలో స్టీవ్ జాబ్స్ చనిపోయినపుడు అతని భార్య, బంధువులు పక్కనే ఉన్నట్లు సమాచారం. తన కేన్సర్ జబ్బుకి ట్రీట్‌మెంట్ ఉన్నదని ప్రపంచానికి నచ్చజెప్పిన స్టీవ్ జాబ్స్ తరుముకొస్తున్న మృత్యువుకు మాత్రం నచ్చజెప్పలేకపోయాడు.

స్టీవ్ జాబ్స్ మరణవార్త విని దేశ విదేశాల రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ కంపెనీల అధిపతులు సంతాప సందేశాలు పంపారు. ప్రపంచవ్యాపితంగా లాస్ ఏంజిలిస్ నుండి సిడ్నీ వరకూ ఉన్న యాపిల్ స్టోర్‌ల ముందు స్టీవ్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ పూలు, కొవ్వొత్తులు ఉంచారు. యాపిల్ కంపెనీ, తన వెబ్‌సైట్‌లో ప్రఖ్యాతి పొందిన స్టీవ్ జాబ్స్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఉంచి తన గౌరవాన్ని ప్రకటించుకుంది.

“ప్రపంచం ఒక దార్శనికుడ్ని కోల్పోయింది. స్టీవ్ కనిపెట్టిన ఉపకరణం ద్వారానే ఆయన మరణం గురించి ప్రపంచం తెలుసుకోవలసి రావడం కంటే గొప్ప శ్రద్ధాంజలి మరొకటి ఉండకపోవచ్చు” అని అమెరికా అధ్యక్షుదు బారక్ ఒబామా తన సందేశంలో పేర్కొన్నాడు. ఐ ఫోన్, ఐ ప్యాడ్ ల ను సొంతం చేసుకోవడానికి ఓ చైనా విద్యార్ధి తన మూత్రపిండం అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే స్టీవ్ తయారు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ఉన్న క్రేజ్ ను ఆర్ధం చేసుకోవచ్చు.

స్టీవ్ జాబ్స్ పరోక్షంలో విడుదలైన ‘ఐ ఫోన్ 4ఎస్’ లో పెద్దగా కొత్తదనం ఏమీ లేదని ఉత్పత్తిపై వెలువడుతున్న సమీక్షలు తెలుపుతున్నాయి. బహుశా అందుకే కొత్త ఐ ఫోన్ కు ‘ఐ ఫోన్ 5 బదులుగా ‘ఐ ఫోన్ 4ఎస్’ అని నామకరణం చేసి ఉండవచ్చు. ఆర్భాటం కాని కనీస్ డిజైన్ తో, గొప్ప మార్కెటింగ్ నైపుణ్యంతో స్టీవ్ జాబ్స్ యాపిల్ ఉత్పత్తులకు మంచి గిరాకి తెచ్చిపెట్టాడు. ఒక విధంగా యాపిల్ కంపెనీ భవిష్యత్తును కూడా స్టీవ్ ముందే రచించి వెళ్ళాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అతని దార్శనికతను అందిపుచ్చుకోవడంలోనే యాపిల్ భవిష్యత్తు ఆదారపడి ఉండవచ్చు.

దత్తత కుమారుడిగా వెళ్ళిన స్టీవ్ జాబ్స్ కాలేజి చదువు మధ్యలోనె వదిలిపెట్టాడని పత్రికలు రాశాయి. 1970ల చివరిలో టెక్నాలజీ ప్రపంచంలో ఒక నూతన ఒరవడిని స్టీవ్ తీసుకొచ్చాడు. మొదటి పర్సనల్ కంప్యూటర్ తయారు చేసిన యాపిల్ కంపెనీ వెనుక స్టీవ్ జాబ్స్ కృషి దాగి ఉంది. మేకింతోష్ కంప్యూటర్ ఆవిష్కరణ స్టీవ్ జాబ్స్ కృషికి మరో తార్కాణం. విచిత్రంగా 1985లో ఆయనను కంపెనీ నుండి తొలగించారు. అయినా 1997 నాటికి మళ్ళీ యాపిల్ కంపెనీకి స్టీవ్ తిరిగి వచ్చాడు. యాపిల్ కంపెనీ ప్రముఖ ఉత్పత్తుల త్రయం “ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్” తో ప్రపంచంలో అనేక మంది రోజువారి అలవాట్లను స్టీవ్ ప్రభావితం చేశాడు.

ఎగువ మధ్య తరగతి, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఉత్పత్తులను మాత్రమే యాపిల్ కంపెనీ తయారు చేస్తున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి క్రమంలో స్టీవ్ జాబ్ స్ధాపించిన యాపిల్ కంపెనీ ఒక మైలు రాయి గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

2 thoughts on “‘యాపిల్’ సారధి ‘స్టీవ్ జాబ్స్’ అస్తమయం

 1. Of course, you are right. All these consumer electronic goods are not essential parts of the human life.
  They are meant for capitalists for extracting quick profits.
  What ever product that attracts quick profits it is projected as an essential item by the business friendly media.
  Shops showcase them in an attractive manner to lure the customers so that people pledge themselves to buy them.
  Those who can afford buying such goods become short time heroes and people surrounding him get tempted even if their economic capacity doesn’t support it.
  As I pointed out in my article, a Chinese student has sold his kidney just to own an iPhone and an iPad.
  Capitalists prop up consumerism among people for their own profits.
  Such consumer articles can not become essential to human lives unless people feel so.
  It’s an aberration of daily needs.
  They are artificially created needs.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s