లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా దుష్టత్రయానికి కనపడవు.
కొద్ది రోజుల క్రితం ఒక పౌర నిరసనకారుడికి మిలట్రీ కోర్టు మరణ శిక్ష విధించింది. గాయపడిన నిరసనకారులకు వైద్యం చేసినందుకు 13 మంది డాక్టర్లు నర్సులకు 15 సం.ల జైలు శిక్ష వేసింది. అంతకుముందు 21 మంది నిరసనకారులకు యావజ్జీవ శిక్ష వేసింది. నిరంతరం మెజారిటీ షియాలు మైనారిటీ సున్నీ రాజు ప్రభుత్వంలోని పోలీసుల అణచివేతకు గురవుతూనె ఉన్నారు. వారికి తోడుగా సౌదీ, కతారీ పోలీసులు మరింత రక్తం చిందిస్తున్నారు. బహ్రెయిన్ ఇప్పుడు మానని గాయాలతో రక్తం ఓడుతున్న దేహం.
(పై నమూనాలో ఉన్న కట్టడం మనామాలో పెరల్ రౌండ్ ఎబౌట్ పేరుతో ఉన్న కూడలిలో ఉండేది. ఈ కూడలి వద్ద నిరసనలు ప్రారంభమైన కొద్ది రోజులకే రాజు దానిని కూల్చి వేశాడు)
కార్టూనిస్టు: యారా కాసిం, ఈజిప్టు మహిళా కార్టూనిస్టు
—