ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని చేసే అవకాశం రష్యా రాజ్యాంగం ఇవ్వదు. అందువలన తన కీలు బొమ్మగా అధ్యక్ష స్ధానానికి తన అనుచరుడు మెడ్వెడెవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానిగా పుతిన్ పని చేశాడు.
ఇప్పుడు మెడ్వెడెవ్ పదవీకాలం ముగుస్తుండడంతో తదుపరి అధ్యక్ష పదవికి మెడ్వెడెవ్, పుతిన్ ను ప్రతిపాదిస్తాడా లేక పుతిన్ పై తిరుగుబాటు చేసి మరోసారి అధ్యక్షుడిగా ఉండడానికి ప్రయత్నిస్తాడా అని పశ్చిమ దేశాల పత్రికలు కృత్రిమ చర్చలను అనేకం జరిపాయి. మెడ్వెడేవ్ తుమ్మినా దగ్గినా అది పుతిన్ కి వ్యతిరేకంగానే అని కధలు అల్లాయి. ఎన్ని చేసిన మెడ్వెడెవ్ తన మాస్టర్ కి విధేయంగా ఉన్నానై స్వయంగా పుతిన్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించడం ద్వారా చాటుకున్నాడు.
అయితే అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో మెడ్వెడెవ్ కూడా పుతిన్ గుట్టుమట్లు పట్టుకున్నాడనీ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన పాలనను మెడ్వెడెవ్ ప్రభావితం చేస్తాడని వార్తా సంస్ధలు చెబుతున్నాయి. పరస్పర ప్రభావాలలో ఉన్న పుతిన్, మెడ్వెడెవ్ ల అవినాభావ సంబంధంపై ఈ కార్టూన్
—