(గమనిక: “భాష, ప్రజాస్వామ్యం, సోషలిజం – పరస్పర సంబంధాలు” వ్యాసంలో ఒక భాగం ఇది.)
ప్రజాస్వామ్య భావజాలం ప్రజలందరినీ సమానులుగా చూస్తుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా అన్ని రకాల ప్రజల విశ్వాసాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుతుంది. ప్రజాస్వమిక హక్కులు ప్రజలందరికి సమానంగా వర్తింపజేయాలని భావిస్తుంది. పౌరుల మధ్య ఉన్న వివిధ వ్యత్యాసాలను, అంతరాలను తిరస్కరిస్తుంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రజాస్వామ్యం గుర్తిస్తుంది. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని తిరస్కరిస్తుంది. అలా జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించడమే కాక ఆ జోక్యందారీ విధానాలపైన అంతర్జాతీయంగా దేశాలను సమీకరించి తిప్పికొడుతుంది. బడుగు దేశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దేశంలోని ప్రజలను ఎలా గౌరవిస్తుందో ప్రపంచంలోని మరే ఇతర దేశాలన్నింటిలోని పౌరులను గౌరవంచి వారి హక్కులను గుర్తిసుంది. స్వార్ధప్రయోజనాల కోసం బలహీన దేశాలపైకి దురాక్రమణ యుద్ధాలకు తెగబడడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే కాక అందుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులను కూడగట్టి ఓడించడానికి ప్రయత్నిస్తుంది.
ఈ లక్షణాలేవయినా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ఉన్న సామాజిక వ్యవస్ధలకు ఉన్నాయా? పెట్టుబడిదారీ వ్యవస్ధకు ప్రజాస్వామిక లక్షణం ఉందని వాదించదలిస్తే, పైన ఉదహరించిన ప్రజాస్వామ్య లక్షణాలను ఆ వ్యవస్ధ కలిగి ఉండాలి. కాని ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకుంటున్న ఈ దేశాలకు పై లక్షణాలేవీ లేవని వారి ఆచరణ ద్వారా తెలుస్తున్నది. ఈ దేశాలలోని వ్యవస్ధలకు ప్రజాస్వామిక లక్షణాలు లేకపోవడమే కాక అవి ప్రజాస్వామ్య వ్యవస్ధలేనని గుడ్డిగా (హేతుబద్ధంగా నమ్ముతున్నవారితో హేతుబద్దంగా చర్చించి రుజువులతో వారి భావాలను మార్చడమో లేదా మన భావాలనే మార్చుకోవడమో చెయ్యవచ్చు) నమ్ముతూ వాదిస్తున్నవారికి కూడా ప్రజాస్వామిక లక్షణాలు లేని సంగతి మనం గమనించవచ్చు.
ఇలాంటివారు ప్రజాస్వామిక భావజాలాన్ని గురించి చర్చించడమే గొప్పవింత. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ భావజాలం గురించి సరిగ్గా చర్చచేయలేని వీరు ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తూ ప్రజాస్వామ్యం కాని దానిని గుర్తించబూనుకోవడం సాహసంగానె చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళు మతపరమైన భారత దేశ ఆత్మ గురించి మాట్లాడతారు గాని, సజీవమైన భారత దేశ ఆత్మ అయిన గ్రామీణ భారతాన్ని గురించి వీరు చర్చించలేరు. నాలుగు అంకెల్ని చూపి అభివృద్ధి అని గుడ్డిగా నమ్మడం తప్ప దానివెనుక ఛిద్రమవుతున్న కోట్లాది ప్రజానీకఫు ఆకలి దరిద్రాలను చూడలేరు. భారత దేశంలో ఆకలి, దరిద్రం తాండవిస్తున్నాయి కనుక వీరికి భారతీయులమని చెప్పుకోవడానికి పరమ నామోషి. కాని కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి డాలర్ల కోసం అమెరికాకు చేరి దాని దురహంకారానికీ, దోపిడికీ, దుర్మార్గమైన దాని విదేశాంగ విధానానికి పోలో మని మద్దతు వస్తున్న వీరికి ప్రజాస్వామ్యం గురించిన అవగాహన ఉంటుందని భావించడం నేతి బీరలో నెయ్యిని వెతకడమే. అమెరికా విదేశాంగ విధానాలతో పాటు అది, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ద్వారా భారత దేశంపై బలవంతంగా అమలు చేయిస్తున్న నూతన ఆర్ధిక విధానాల వలన దేశంలో అనేక వృత్తులలో ఉన్న కోట్లాదిమంది ప్రజలు జీవనాధారం కోల్పోయి ఆకలికి మలమల మాడుతున్న పరిస్ధితిని తొంగిచూడనైనా లేరు.
వీళ్ళు పుట్టింది ఇండియాలో. చదివింది ఇండియాలో. వీళ్ళు చదవడానికి ఉపయోగించబడిన వనరులన్నీ ఇండియావే. భారతీయుల కష్టంతో తయారు చేసినవే. కానీ వీళ్ళు సేవలు చేయాల్సి వచ్చేసరికి అమెరికా, ఇంగ్లండ్ వీటివైపే చూస్తారు. అమెరికా పౌరులు కావడానికి అదే పనిగా వెంపర్లాడతారు. అమెరికా వెళ్ళడానికి అవకాశం రావడమే జీవితంలో సాధించిన పెద్ద విజయంగా మురిసిపోతారు. అమెరికా పౌరుడుగా హోదా లభిస్తే ఇక వారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంతగా సంతోషిస్తారు. పుట్టిన దేశాన్ని వదిలిపెట్టి డాలర్ల కోసం అమెరికా చేరి అక్కడ గుళ్ళూ గోపురాలు తిరిగినంత మాత్రానే తమను తాము భారత దేశ వీరాభిమానులుగా ముద్ర వేసుకుంటారు. ఆ ముద్రతో భారత దేశంలో నివసిస్తున్నవారిని దేశాభిమానం లేదని ఆక్షేపించడానికి సిద్ధపడడం ఏ కోవలోకి వస్తుంది? మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం కాదా ఇది? బతుకంతా అమెరికాకి సేవచేయడానికి అంకితం చేసినవారు దేశ భక్తి గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అమెరికాలో భావదాస్యంలో బతుకుతూ అమెరికా దురాక్రమణ పూరిత విదేశాంగ విధానాన్ని విమర్శిస్తున్న భారతీయులను దేశ భక్తి లేదని ఆక్షేపించడానికి అర్హత ఎక్కడినుండి వస్తుంది? ఒక మతాన్ని నమ్ముతున్న కోట్లాదిమంది ప్రజానికాన్ని కేవలం ముస్లింలు అయినందుకు అకారణంగా ద్వేషించే వారు సోషలిజంపైనా ప్రజాస్వామ్యంపైన చర్చ చేయగల అర్హతను కలిగి ఉంటారా? మొత్తంగా ఒక మతాన్నే ద్వేషిస్తున్నవారు ప్రజలందరి హక్కులను గౌరవించే ప్రజాస్వామిక భావాజాలాన్ని గురించిన చర్చ నిష్పాక్షికంగా చేయగలరా?
తాము వ్యతిరేకించే భావాలు వ్యక్తం చేసే బ్లాగర్లను వేధించడానికి ప్రయత్నించడం, దూషిస్తూ కామెంట్లు పెట్టడం, తమ భావాలు మాత్రమే బ్లాగర్లు వ్యక్తం చేయాలని నమ్ముతూ భిన్నమైన భావాలు వ్యక్తం చేస్తే ఒక్కరే అనేక పేర్లు మార్చుకుని ప్రాక్సీ ఐ.పి నంబర్లతో సంస్కారహీనంగా దూషించడం వీరు చేస్తున్నారు. తాము ద్వేషిస్తున్న సిద్ధాంతాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియకుండానే ద్వేషిస్తుంటారు. పుక్కిటి పురాణాలు నమ్మి వివిధ సంప్రదాయాల తంతులను పాటిస్తున్న తరహాలోనే పెద్దలు కాని పెద్దలు చేసే విద్వేషపూరిత ప్రసంగాలను ఎక్కించుకుని వాదించడమే వీరికి తెలిసింది. ముస్లింలపై మారణ కాండ సాగించిన మోడీ చేసిన పనులు సరైనవేనని వాదిస్తున్న వీరు ఆ మోడీయే ప్రధానమంత్రి పదవి అందుబాటులో కనిపించడంతో తాను చేసినవి తప్పులేననీ, చూసి చూడనట్లు పోవాలనీ వేడుకుంటున్న సంగతిని గుర్తిస్తున్నారో లేదో తెలియదు. వీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారే అయితే, ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నవారే అయితే, వారినుండి ఈ విధమైన ప్రవర్తనను ఆశించలేము.
వీరు చర్చించే పద్ధతీ, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించే పద్ధతే అప్రజాస్వామికం కాగా వీరు ప్రజాస్వామిక భావజాలం కలిగి ఉంటారని నమ్మడం అసాధ్యం. ఎటొచ్చీ వారు తమను తాము తెలుసుకోవల్సిన అవసరమే మిగిలి ఉంది. అది కూడా సరైన పద్ధతుల్లో చేయగలిగితేనే వారిని వారు తెలుసుకోగలరు. లేదా వారి ధోరణి కొనసాగుతూ తమను తామే అప్రతిష్టపాలు చేసుకుంటారు. బ్లాగర్లు, పాఠకులు వారిని తిరస్కరించే కొద్దీ ఏకాకులుగా మిగలడం తప్ప వారు చేసేదీ, చేయగలిగేదీ ఏమీ ఉండదు.
శేఖర్ గారూ,
తె…. కూ… వె… మాదిరి వాణ్ణి ఊరూ వాడా చిన్నా పెద్దా లేకుండా అందరూ (..). తొక్కుతూ ఉంటారు. వాణ్ణి తిట్టడానికి ఒక కారణం, సందర్భం అవసరంలేదు. వాణ్ణి తిట్టడానికి మొత్తం తెలుగుబ్లాగర్ల సమాజం మొత్తం ఒంటికాలుమీద లేస్తుంది. గజ్జికుక్క అని పబ్లిక్ గా తిట్టించుకునే లెవల్ కి దిగజారిపోయాడు.
వాణ్ణి పట్టించుకోకండి. మీ బ్లాగు మీరు రాసుకోండి
వీళ్ళు మహిళా బ్లాగర్లనీ వేధిస్తారు. నీహారిక అనే మహిళా బ్లాగర్‌తో నాకు అక్రమ సంబంధం అంటగడుతూ చెత్త వ్రాతలు వ్రాసారు. స్క్రీన్‌షాట్‌తో సహా ఎవిడెన్స్ ఉంది http://evidences.maalikaasalurangu.info/59990550
అవునాండి. మరీ అంత దిగజారాడని అనుకోలేదు. కాని మనిషి జన్మ ఎత్తాక మనిషి లక్షణాలని కనీసం ప్రదర్శించాలి గదా! సర్లెండి, చేసేదేముంది?!
బోన్సాయ్ మొక్కల గురించి విన్నారా..? వేప చెట్టు,మర్రి చెట్టు లాంటి మహా వృక్షాల్ని చిన్న చిన్న కుండీల్లో పెంచటాన్నే బోన్సాయ్ మొక్కలంటారు. వీటిని షోకేజ్ లలో, టీపాయ్ ల మీదా గృహాలంకరన వస్తువులుగా వాడుతుంటారు. మామూలు వేప చెట్లలాగానే వీటికీ ఆకులూ,పువ్వులూ కాయలూ కాస్తాయి,కానీ అన్నీ సూక్ష్మంగానే ఉంటాయి, పైగా ఆ కుండీ దాటి బయటికి ఎదగలేవు.
మీరు పైన రాసిన బ్లాగర్లు ఈ బోన్సాయ్ మొక్కల్లాంటి వారు. వీరికీ తెలివీ,ఆలోచన,వివేకం,జాలి లాంటివి ఉంటాయి కానీ, అన్నీ సూక్ష్మంగానే. వీరి లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు రాసిన దేశభక్తి,మతభక్తి లాంటివి చాలా నిజం.
అమెరికా గ్రీన్ కార్డు కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసి, అది రాగానే జన్మధన్యమైనట్లుగా పండగ చేసుకుని, తమని తాము పుట్టు దేశభక్తుల్లా (Cerified దేశభక్తులు) భావించుకునే ప్రభుద్ధుల్ని చాలా మందిని నేను కూడా చూసి ఉన్నాను. వీరెలాగూ సర్టిఫైడ్ దేశభక్తులు కాబట్టి, ఇక ఇతరుల దేశభక్తిని నిర్ధారించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు, పాపం. కొన్ని వందల ఏల్ల క్రితం ముస్లిం రాజుల దురాగతాల గురించి గొంతు చించుకుంటారు కానీ, కల్ల ముందు గుజరాత్లో జరిగిన దురాగతాలు చాలా కన్వీనియంట్ గా అభివృద్ధి మాటున మరిచిపోతారు. పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురుకి ఉరి శిక్ష విధించాలనే విషయం మీద చూపించే ఆవేశంలో ఒకటో వంతు కూడా, గుజరాత్ లో పసిపిల్లల్ని,మహిలల్ని చివరికి గర్భవతుల్ని కూడా చంపిన వారికి శిక్షించాలని అడగడంలో ఉండదు. అలాగని వీరిని ‘మత మౌఢ్యులు ‘ అంటే వీరు ససేమిరా ఒప్పుకోరు గానీ, ఇలా అడిగే వాన్ని మాత్రం మత మౌఢ్యునిగా, హిందూ మత ద్వేషిగా చిత్రించడానికి ఏ మాత్రం వెనుకాడరు.
“Empty vessaels make more noise”- కాబట్టి వీరి హడావిడి,గుర్తింపు కోసం వీరి తపన లను అర్థం చేసుకోవచ్చు.
మరో ముఖ్య విషయం ఏంటంటే, వీరి ద్వంద స్వభావాల్ని, కపట నీతిని ఎంత బాగా ఎండగడితే వారి మీద వీరు అంతగా దాడి చేస్తారు. ఉదాహరణ- తెలకపల్లి రవి గారి బ్లాగులోనూ, మీ బ్లాగులోనూ వీరు పదే పదే చేస్తున్న అడ్డగోలు వాదనలు.
ఏ బోన్సాయ్ మొక్క కూడా, తాను బోన్సాయ్ మొక్కనని ఒప్పుకోదు. పైగా దానిని ఒరిజినల్ వేప చెట్టు పక్కన పెడితే, నువ్వేంటి ఇంత పెద్దగా ఉన్నావని దానిని వెక్కిరిస్తాయి.
కాబట్టి, ఇలాంటి మరుగుజ్జుల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా వీరిని జస్ట్ ఇగ్నోర్ చేయడం మంచిది.
సింపుల్‌గా, బాగా చెప్పారు.
>>>>>
కొన్ని వందల ఏల్ల క్రితం ముస్లిం రాజుల దురాగతాల గురించి గొంతు చించుకుంటారు కానీ, కల్ల ముందు గుజరాత్లో జరిగిన దురాగతాలు చాలా కన్వీనియంట్ గా అభివృద్ధి మాటున మరిచిపోతారు.
>>>>>
ఔరంగజేబ్ హిందువులపై జుత్తు పన్ను విధించడం ఎవరూ కళ్ళారా చూడలేదు. అయినా ఔరంగజేబ్ హిందువులపై జుత్తు పన్ను విధించాడని నేను నమ్ముతున్నాను. గుజరాత్‌లో జరిగిన హింసకి పత్రికలలో ఫొటోలు, టివి చానెళ్ళలో వీడియోలే సాక్ష్యాలు. అవి నమ్మకూడదా? మహమూద్ ఘజనీ సోమనాథ దేవాలయన్ని కొల్లగొట్టాడు కనుక మేము ఇప్పుడు మస్జీద్‌లని కూలుస్తాము అనేవాళ్ళకి చెపితే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది.
ముస్లింలు హిందూ దేవాలయలాని కూల్చారని చెపితే ఎందుకు నమ్మాలి? వాళ్ళు దేవాలయాలని కూల్చడం ఎవరూ చూడలేదు కదా. ప్రతి దానికీ ఎవిడెన్సులు అడిగేవాళ్ళే ఇందుకు సమాధానం చెప్పాలి. మహమూద్ ఘజనీ సోమనాథ దేవాలయాన్ని కూల్చి ఆ మెటీరియల్‌తో మక్కాకి మెట్లు వెయ్యించిన మాట నిజమే. కానీ మహమూద్ ఘజనీ ఆస్థానంలో కొందరు హిందూ అధికారులు పని చేశారనేది కూడా నిజమే కనుక మహమూద్ ఘజనీ హిందూ ద్వేషి కాదు అని నిరూపించొచ్చు. నరేంద్ర మోడీకి వోట్లు వేసిన వాళ్ళలో కొందరు ముస్లింలు ఉన్నారు కనుక నరేంద్ర మోడీ ముస్లిం ద్వేషి కాదు అని వాదించేవాళ్ళు మహమూద్ ఘజనీ దగ్గర పని చేసినవాళ్ళలో కొందరు హిందువులు ఉన్నారు కనుక మహమూద్ ఘజనీ హిందూ ద్వేషి కాదు అంటే ఒప్పుకుంటారా? హిందువుల దగ్గర జుత్తు పన్ను వసూలు చేసిన ఔరంగజేబ్ సైన్యంలోనూ హిందూ రాజపుత్ర కులస్తులు అధికారులుగా పని చేసేవాళ్ళు. మతం కంటే డబ్బే ఎక్కువగా మనిషిని ప్రభావితం చేస్తుందనేది ఏ కాలంలోనైనా నిజం. ఉనికి (existence)లో లేని దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ రాదు కనుక మనిషి దేవుని కంటే భౌతిక లోకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. నిత్యం మతాన్ని పట్టుకుని వేలాడే కొందరు చాంధసవాదులు ఈ విషయం తెలిసినా తెలియనట్టే నటిస్తారు.
తమకు అంతా తెలుసనుకొని ఫిక్స్ ఐపోఇనోళ్ళు నా ఈ కామెంట్ ని ఇగ్నోర్ చేసుకోవచ్చు.(ఎలాగూ చేస్తారు).
సోం నాథ్ ఆలయం మీద ఘజని మహమ్మద్ దండయాత్రలగురించి చాలా మంది నుండి చాలా విన్నాను. ఏ ఇద్దరు చెప్పేదానికి పొంతన ఉండదు. కానీ కళ్ళ ముందే జరిగినట్లు,చూసినట్లు నమ్మకంగా చెప్తుంటారు. పైన ప్రవీన్ శర్మ గారిది కూడా ఒక వెర్షన్.
ఈ విషయం మీద ప్రఖ్యాత హిస్టారియన్ రోమీల థాపర్ గారి పరిశోధనాత్మక వ్యాసం లింక్ ఇది.
http://www.hindu.com/fline/fl1608/16081210.htm
ఇది 1999 లో ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైంది.
రోమీలా థాపర్, హిందూ పత్రిక కలిసి ఏదో కుట్ర పన్ని దీనిని ప్రచురించాయని ఎవరైనా మేతావులు వాదిస్తే వారికో నమస్కారం.
వీరి ఆవేశం ఎలాంటిదంటే, పై రెండు వాక్యాలు చదివి, ఘజనీ మహమ్మదుని నేను వారిలా తిట్టడం లేదు కాబట్టి, నేను అతన్ని మంచి వాడని అంటున్నాననుకొని ఫిక్స్ ఐపోయి, నన్ను కూడా ద్వేషించడానికి రెడీ ఐపోతారు. కొన్ని జీవితాలంతే..
చరిత్రను చదివేటప్పుడు అప్పటి రాజకీయ,సామాజిక,సాంస్కృతిక పరిస్తితుల్నన్నింటినీ బేరీజు వేసుకోవాలి. అలాకాకుండా ప్రస్తుత రాజకీయాల్తో చరిత్రను బేరీజు వేయాలనుకోవడం మూర్ఖత్వం. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో గత కొంతకాలంగా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. పైగా దీనితో కొన్ని రాజకీయ పక్షాలకి ప్రత్యక్ష లాభం ఉండటంతో, దాన్ని వ్యూహాత్మకంగా చాపకింద నీరులా అమలు చేస్తున్నారు.
విశెఖర్ గారు,
మీరు సమస్యల్ని వివరించే తీరు, ఎప్పటికప్పుడు ప్రపంచ సమస్యల్ని అప్‌డెట్ చేసె తీరు చాల బావుంటుంది.
ఇలాంటి వారు మీతొ ఎలాగు రేసులొ పాల్గొనలేరు. పైగా మీరు సాగించే రేసులొ ముళ్ళు వేస్తుంటారు. బయపడకండి.
మీ బ్లాగు, మీ వ్రాతలు మీ ఇష్టం. ఇక కుప్పిగంతులంటారా? ఎగరనివ్వండి.
శీను గారూ మీ మద్దతుకు కృతజ్ఞతలు.
మహమూద్ ఘజనీ సోమనాథ దేవాలయాన్ని కూల్చడం నేను చూశానని అనలేదు. ముస్లింలు హిందూ దేవాలయాలు కూల్చడం ఎవరూ చూడకపోయినా ముస్లింలు దేవాలయాలని కూల్చారని నమ్ముతున్నవాళ్ళు కళ్ళ ముందే జరిగిన గుజరాత్ మారణకాండని కావాలని ఎలా మర్చిపోతున్నట్టు? కంటితో చూసినది అబద్దం, ఎవరో చెప్పినది నిజం అనుకునేవాళ్ళలాగ మాట్లాడుతున్నారు. గోల్కొండ రాజుల కింద సామంతునిగా పని చేసిన షేర్ ముహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో మందిరాన్ని కూల్చి మస్జీద్‌ని కట్టాడని ఒక వెబ్‌సైట్‌లో చదివినది నేను నమ్మలేదు. షేర్ ముహమ్మద్ ఖాన్ కట్టించిన శ్రీకాకుళం జామియా మస్జీద్‌కి రెండు కిలో మీటర్ల దూరంలోనే అరసవిల్లి అనే గ్రామంలో ఒక చారిత్రాత్మక సూర్య దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి రాష్ట్రం మొత్తం నుంచి భక్తులు వస్తారు. చారిత్రాత్మక దేవాలయాన్ని వదిలేసి వేరే గుడిని కూల్చాడంటే నమ్మాలా? ఎవరో చెప్పిన దాని ఆధారంగా చూడని వాటిని చూసినట్టు నమ్మే అలవాటు నాకు లేదు.
ప్రవీణ్, చీకటి గారు ‘కానీ కళ్ళ ముందే జరిగినట్లు,చూసినట్లు నమ్మకంగా చెప్తుంటారు’ అన్నది మిమ్మల్ని ఉద్దేశించి కాదని నాకనిపిస్తోంది. మిమ్మల్ని ఉద్దేశించి ఆయన అన్నది “పైన ప్రవీన్ శర్మ గారిది కూడా ఒక వెర్షన్” అన్న ఒక్క వాక్యం మాత్రమే. రెండింటిని వేరు చేస్తూ అక్కడ ఏమీ లేకపోవడం వలన ఆ మొత్తం మిమ్మల్ని ఉద్దేశించినట్లే అన్న అర్ధం వస్తున్నది. “సోమనాధ్ ఆలయం గురించి అనేక మంది చెబుతుంటారు. వారిలో కొంతమంది చూసినట్లే చెబుతుంటారు. మిగిలినవారు కూడా అనేక విధాలుగా చెబుతారు. వాటిలో ఒకదానికొకటి పొంతన కూడా ఉండదు. ప్రవీణ్ రాసింది కూడా ఆ అనేక వర్షన్లలో ఒకటి” అని చెప్పాలని ఆయన ఉద్దేశ్యం.
రొమిల్లా ధాపర్ భారత దేశం గర్వించదగ్గ చరిత్రకారిణి. ఆమె చరిత్ర రచన వాస్తవాలకు దగ్గరగానూ మత మౌఢ్యుల అవాస్తవ ప్రచారాలను వెల్లడించేదిగానూ ఉండడంతో బి.జె.పి పాలనలో ప్రభుత్వం ఆమెను ఎన్.సి.ఇ.ఆర్.టి బోర్డు నుండి తొలగించింది. అప్పట్లో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న మురళీ మనోహర్ జోషి ఒక పద్ధతి ప్రకారం విద్యకు సంబంధించి వివిధ కరికులమ్స్ లో మత ఛాందసవాద భావాల దృక్పధంతో చేసిన చరిత్ర రచనను చొప్పించడానికి విపరీత ప్రయత్నాలు చేశాడు. “ఇండియా వెలిగిపోతోంది,” “అంతా బాగుంది” అంటూ ప్రజల స్ధితిగతులకు సుదూరమైన నినాదాలు ఇచ్చి ఎన్నికల్లో ఓడిపోవడంతో మురళీ మనోహర్ జోషి తన కుట్రల్ని కొనసాగించలేకపోయాడు. నాగపూర్‌లో అత్యంత విలువైన చారిత్రక మ్యూజియంనుకూడా మత సంస్ధల్లో ఒకటి ధ్వంసం చేసింది. వాళ్ళ మొఖాలు వికృతంగా కనపడుతుండడంతో అద్దాన్ని బద్దలు కొట్టారన్నమాట వాళ్ళు.
“కమ్యూనిస్టు” అన్న పదం కమ్యూనిస్టుల సొంతం కాదనీ, అది అప్పటికే భాషలో ఉందనీ, కమ్యూనిజం ఆ పదానికి ఉన్నతమైన అర్ధాన్ని సమకూర్చిందనీ నేను నా “భాష, ప్రజాస్వామ్యం, సోషలిజం, పరస్పర సంబంధాలు” వ్యాసంలో వివరించాను. వీళ్ళు ఎర్ర, కామీ అంటూ భాషనే ఎగతాళి చేయడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లే అని కూడా వివరించాను. అలా భాషలోని పదజాలాన్ని తమకు నచ్చనివాళ్ళు వాడుతున్నారన్న కక్షతో ఆ పదజాలాన్ని కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడుకోవడం చాలా అసహ్యాన్ని కలిస్తోంది.
నిజమే విశేఖర్ గారు, ఆ కామెంట్ ప్రవీణ్ గారిని ఉద్దేశించింది కాదు, అందుకే దానికి రిప్లయ్ గా కాకుండా సపరేట్ గా రాశాను.
Anyway.. ఆయన రాసిన మక్కాకి మెట్లు నిర్మించిన కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంది. ఇది రొమిల్లా థాపర్ కి కూడా తెలిసినట్లు లేదు. ఆమె రాసింది ఏంటంటే..
సోమ్‌నాథ్ ఆలయ గంధపు ద్వారాలను ఎత్తుకెళ్ళి తన సమాధి నిర్మాణానికి (బతికి ఉండగానే సమాధులు డిజైన్ చేసుకోవడం అప్పటి రాజులకు మామూలే), ఘజనీ మహమ్మదు వాడుకున్నాడని అప్పట్లో జనాల్లో చాలా కధలు ప్రచారంలో ఉండేవి. దీనికి బలం చేకూరుస్తూ బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ ఎలెంబరో 1843 లో బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. అది-” ఆఫ్ఘనిస్తాన్లో ఘజనీ మహ్మదు సమాధిని తాను కనుగొన్నట్లు, దానికి పెద్ద,పెద్ద ద్వారాలున్నట్లు, వాటిని తెచ్చి మళ్ళీ సోమ్‌నాథ్ ఆలయానికి బిగిస్తే ఇండియా హిందువుల విశ్వాసం చూరగొనవచ్చని ప్రతిపాదించాడు. దీనికి అనుకూలంగా,వ్యతిరేకంగా చాలా తర్జన భర్జల తర్వాత, ఆ ద్వారాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి సోమ్‌నాథ్ కి తరలించారు. తీరా చూస్తే.. ఈజిప్షియన్ శైలిలో నిర్మితమైన ఆ ద్వారాలకు, సోమ్‌నాథ్ ఆలయ శైలికి ఏమాత్రం పొంతన లేక అవి అక్కడ సరిపోక పోవడంతో, వాటిని తీసుకెళ్ళి ఆగ్రా కోటలోని ఓ స్టోర్ రూంలో పడేశారు. సోమ్నాథ్ కథలోని మొదటి పార్ట్ గురించి చాలా ఆవేశంగా చెప్పుకునే వారు, ఈ చివరి విషయాన్ని మాత్రం వదిలేస్తారు. ఎందుకంటే ఇది చెబితే స్టోరీ లో ‘కిక్’, ‘ఎమోషన్ ‘ ఉండదు కదా అందుకని.
ఇకపోతే ఈ స్టోరీ అటూ,ఇటూ తిరిగి ఇప్పుడు ఏకంగా మక్కా మెట్ల దగ్గరికి వచ్చిందన్నమాట..బాగుంది.
2005 లో ప్రభుత్వం రోమీల థాపర్ కి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. విద్యా సంస్థలు ఇచ్చే అవార్డులే తప్ప, పార్టీలు,ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలు తీసుకోనని, ఆమె ఈ అవార్డును తిరస్కరించింది.
http://articles.timesofindia.indiatimes.com/2005-01-27/india/27864821_1_padma-award-padma-bhushan-hrd-ministry
విలువలు, వ్యక్తిత్వం లాంటివి ఉన్నోళ్ళకే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి.
మక్కాకి మెట్లు వెయ్యించాడనేది విన్నదే కానీ చదివినది కాదు. ఆ మెటీరియల్‌ని ఒంటెల మీద మక్కాకి రవాణా చేస్తే మహమూద్ ఘజనీకి చాలా ఖర్చైపోతుంది.
దేవాలయాలలో గుప్త నిధులు ఉంటాయి కనుక గుప్త నిధుల కోసమైనా దేవాలయంపై దాడి చెయ్యగలరు. పంచలోహ విగ్రహాన్ని కరిగించి కరెన్సీ నాణేలు ముద్రించడానికైనా విగ్రహాన్ని కొల్లగొట్టగలరు.
సోమనాద్ ఆలయంపైన ఘజనీ అన్నిసార్లు దాడి చేయడానికి కారణం ఆ ఆలయంలో ఉన్న సంపదే కారణమని కదా చరిత్రకారులు చెబుతున్నది. గంధపు వాకిలి, తలుపులు కూడా సంపదగానే చూడడం వల్లనే ఘజనీ తీసుకెళ్ళి ఉండాలి (అది నిజం అయితే). మతం వేరు కనుక మతం రంగు పులమడం తేలిక.
బ్రిటిష్ వాడు ఇండియా తిరుగుబాట్లను అణచివేయడానికి వేసిన ఎత్తుగడల్లో మత వైషమ్యాలు పెంచే ఎత్తుగడను బాగా వినియోగించుకున్నాడు. అది గమనించగలిగితే బ్రిటిష్ వాళ్ళు చొప్పించిన మత వైషమ్యాలను వదిలించుకోవడం సులభం అవుతుంది.
కాని బ్రిటిష్ వాడు ఏ ప్రయోజనాల కోసం హిందూ మత వైషమ్యాలను ప్రోత్సహించాడో, ఇపుడు ఇండియాలో కూడా ప్రధాన పార్టీలు రెండూ అదే ప్రయోజనాల కోసం మత వైషమ్యాలను వినియోగించుకుంటున్నాయి.
దానిని గ్రహించలేకనే ప్రజలు మతాన్ని నెత్తినెత్తుకుని తగువులాడుకోవడం.
చరిత్ర జ్ఞానం అందని వాళ్లు అలా తగులాడుకుంటే ఆశ్చర్యం లేదు.
కాని తాము అరివీర జ్ఞాన సంపన్నులమని తామే భావించుకుంటూ అమెరికా, లండన్ లలో స్ధిరపడినవారే వారి ఎత్తుగడల్లో పావులుగా మారడమే కాకుండా తోటి దేశస్ధులను తూలనాడుతూ అమెరికా, బ్రిటన్ ల దుర్మార్గాలకు వంతపాడడం విషాధం.
తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో గుప్త నిధులు వెలికి వచ్చాయి కదా. అలాంటి గుప్త నిధులే సోమనాథ ఆలయంలో ఉండొచ్చు. ఇందులో ఆశ్చర్యం ఏముంది?