2జి స్పెక్ట్రం కుంభకోణంలో పీకలలోతుల్లో చిదంబరం?


కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం మెడ చుట్టూ 2జి స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల కేటాయింపు కుంభకోణం ఉరి బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రికి రాసిన నోట్‌ను బట్టి స్పెక్ట్రం ధరలను అతి తక్కువగా నిర్ణయించడంలో చిందంబరం పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖనుండి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన రహస్య నోట్ పైన ఆధారపడి జనాతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి, 2జి కేసులో చిదంబరంను విచారించాలని వాదిస్తున్నాడు. కేసులో చిందంబరం ను కూడా నిందితుడిగా చేర్చాలని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు. మంగళవారం ఈ మేరకు సుబ్రమణ్య స్వామి, స్పెక్ట్రంను తక్కువ ధరలకు కేటాయించడంలో, చిదంబరం పాత్రపైన సి.బి.ఐ విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టుకి విన్నవించాడు.

25 మార్చి, 2011 తేదీన ఆర్ధిక మంత్రిత్వ శాఖలో డిప్యుటీ డైరెక్టర్ గా పని చేస్తున్న పి.జి.ఎస్.రావు, ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న విని మహాజన్‌కు, 2జి స్పెక్ట్రం కేటాయింపు ధరలపైన ఒక రహస్య నోట్ డాక్యుమెంటు పంపాడు. 2జి స్పెక్ట్రంను అప్పటి టెలికం మంగ్రి ఎ.రాజా “మొదట వచ్చినవారికి మొదట” ప్రాతిపదికన అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నపుడు అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరంకు, స్పెక్ట్రంను వేలం వేయడం ద్వారా కేటాయించాలని ఒత్తిడి చేయగల అవకాశం ఉండికూడా అలా చేయలేదని సదరు డాక్యుమెంటులో పొందుపరిచారు. పి.జి.ఎస్.రావు పంపిన నోట్‌కు రాసిన కవరింగ్ లెటర్‌లో “ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 11 పేజీల ఈ నోట్‌ను వ్యక్తిగతంగా చదివి ఆమోదించాడు” అని పేర్కొనబడింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డిఒటి) నవంబరు 29, 2007 తేదీన రాసిన లేఖను పి.జి.ఎస్.రావు డాక్యుమెంటు ప్రస్తావించింది. అందులో 2003లో నిర్ణయించబడిన ఎంట్రీ ఫీజుని సమీక్షించాలనీ స్పెక్ట్రం వినియోగం ఛార్జీల నిర్ణయానికి వేలం పద్ధతిని అనుసరించాలనీ డి.ఒ.టి సిఫారసులు చేసింది. తత్సంబంధిత పొజిషన్ పేపర్‌కు జనవరి 9, 2008 తేదీతో ఉన్న నోట్ జతపరచబడిందనీ  రావు నోట్ తెలిపింది. అలాగే జనవరి 9, 2008 న జరగవలసి ఉన్న పూర్తి స్ధాయి టెలికం కమిషన్ సమావేశం జనవరి 15, 2008 తేదీకి వాయిదా వేశారని కూడా నోట్ తెలిపింది.

ఆ నోట్ డాక్యుమెంటు ఇంకా ఎలా పేర్కొంది “అప్పటి ఆర్ధికమంత్రి పి.చిదంబరం జనవరి 15, 2008 తేదీన ప్రధానికి రాసిన సీక్రెట్ నోట్‌ను ఈ పొజిషన్ పేపర్ ఆధారంగానే రాశాడు. చిదంబరం తన నోట్‌లో భవిష్యత్తులో జరిగే కేటాయింపులకు వేలం విధానాన్ని పాటించాలనీ, అప్పటివరకు జరిగిన కేటాయింపులను ముగిసిన అధ్యాయంగా పరిగణించాలనీ రాశాడు.” ఆర్ధిక మంత్రిగా పి.చిదంబరం 4.4 మెగా హెర్ట్జ్ ల స్పెక్ట్రంను వేలం వేయాలన్న తన పాత డిమాండ్‌కి కట్టుబడి ఉన్నట్లయితే డి.ఒ.టి 2జి లైసెన్సులను రద్దు చేయక తప్పని పరిస్ధితి తలెత్తేదని ‘ది హిందూ’ పత్రిక పేర్కొన్నది. ఇప్పుడీ లైసెన్సుల కేటాయింపులే క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున సంగతి విదితమే. అంటే పి.చిదంబరంకు మొదటినుండీ ఎ.రాజా ఏం చేస్తున్నదీ తెలుసని అర్ధమవుతోంది.

“డిసెంబరు 31, 2008 తేదీ వరకూ కేటాయించిన లైసెన్సులకు 2001 నాటి ఎంట్రీ ఫీజులనే అమలు చేయవలసిందిగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ లోపాయకారిగా ఆమోదం తెలిపింది” అని రావు డాక్యుమెంటు పేర్కొన్నది. నవంబరు 22, 2007 తేదీన అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ దువ్వూరి సుబ్బారావు తన నోట్ లో మొబైల్ లైసెన్సు ఎంట్రీ ఫీజును మార్కెట్ ధరలబట్టి కాకుండా 2001 నాటి ధరల ఆధారంగా 1650 కోట్లకు నిర్ణయించారని తెలిపినప్పటికీ అది జరగడం విశేషం. 4.4 MHz వరకు స్పెక్ట్రం కేటాయింపులకు పాత ధరలకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయరాదని నిర్ణయించడంలో ఎ.రాజా, పి.చిదంబరం లమధ్య ఏకాభిప్రాయం కుదిరించని డాక్యుమెంటి వివరించింది.

స్పెక్ట్రం కేటాయింపుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లను జారీ చేసినప్పటికీ, ఆర్ధిక వ్యవహారాల విభాగం స్పెక్ట్రం ధరలను పునః సమీక్ష చేయడానికి చట్టబద్ధంగా అన్ని హక్కులూ కలిగి ఉన్నదని పి.ఎం.ఒ కి రాసిన నోట్ డాక్యుమెంటులో పేర్కొనబడింది. అప్పటికే 2జి స్పెక్ట్రం లైసెన్సులు కేటాయించబడిన సంస్ధలనుండి న్యాయపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆర్ధిక వ్యవహారాల విభాగానికి స్పెక్ట్రం ధరలను పునః సమీక్షించే హక్కు అధికారం ఉన్నాయని నోట్ తెలిపింది.

ఈ కధనాన్ని బట్టి పి.చిదంబరంకు అప్పటి ఆర్ధిక మంత్రి హోదా ఉన్నవాడుగా స్పెక్ట్రం కుంభకోణంలో పాత్రధారి అని స్పష్టంగా తెలుస్తోంది. మొదట స్పెక్ట్రంను వేలం వేయాలని డిమాండ్ చేసిన పి.చిదంబరం, ఆ తర్వాత ప్రధాన మంత్రికి ‘గతం గతః’ అని సర్ది చెబుతూ నోట్ రాయడం వెనక కమీషన్లు చేతులు మారాయని స్పష్టమవుతున్నది.

సుప్రీం కోర్టు చిదంబరం విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగినట్లయితే పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధలకు దేశ వనరులను దోచిపెట్టడానికి కంకణం కట్టుకున్న ఒక వ్యక్తి పీడను దేశం విరగడ చేసుకున్నట్లు అవుతుంది. ప్రజల ఆందోళనల వెనుక సమస్యలను పరిశీలించి పరిష్కరించడానికి బదులు పోలీసు నిర్భంధాన్ని పరిష్కారంగా ఎంచే ఒక ప్రజా వ్యతిరేక వ్యక్తిని వదిలించుకున్నట్లు కాగలదు. చర్చలు జరుదాం రమ్మని మావోయిస్టులను ఆహ్వానించి, ఆయన ఆహ్వానం మేరకు బయలుదేరిన మావోయిస్టు నాయకుడు అజాద్ ను బూటకపు ఎన్‌కౌంటర్ లో మట్టుబెట్టించిన ఒక నేరస్ధుడిని ప్రజా జీవితంనుండి తప్పించినట్లు కాగలదు. తాను భాగస్వామిగా ఉన్న కంపెనీల ప్రయోజనాల కోసం అడవుల్లో నివసిస్తున్న గిరిజనులను బైటికి రప్పించి వారి ఆవాసాలను తవ్వకాలకోసం వశపరుచుకున్న ఒక ఘరానా దొంగను కటకటాల వెనక్కి కాకపోయినా, కోర్టు బోనులో నైనా నిలబెట్టినట్లు కాగలదు.

ఇదిలా ఉండగా, ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ప్రధాని కార్యాలయానికి రాసిన నోట్‌పై వ్యాఖ్యానించడానికి ప్రణబ్ ముఖర్జీ నిరాకరించాడు. న్యాయస్ధానంలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించజాలనని ఆయన అన్నాడు. పి.చిదంబరంపైన కేసు మోపి విచారణ జరిపించాలని సి.పి.ఎం డిమాండ్ చేసింది. డి.ఎం.కె పార్టీ, తమ పార్టీ సభ్యుడు ఎ.రాజా చెప్పినది వాస్తవమేనని తేలిందని వ్యాఖ్యానించింది. నిజానికి అంత భారీ విలువ కలిగిన స్పెక్ట్రం కేటాయింపులు మంత్రివర్గంలో ముఖ్యమైన ఆర్ధిక మంత్రిత్వ శాఖకు, ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలియకుండా జరుగుతుందని భావించడమే వీలుకాని విషయం. సాక్ష్యాల కోసం విచారణ తంతే తప్ప, అతి తక్కువ ధరలకు స్పెక్ట్రం కేటాయింపులు చేయడం, ఆర్ధిక శాఖకూ, పి.ఎం.ఒ కూ తెలియకుండా జరగడానికి వీలేలేదు.

9 thoughts on “2జి స్పెక్ట్రం కుంభకోణంలో పీకలలోతుల్లో చిదంబరం?

 1. బాబు ఈ విషయం మీద 2జి అనే పుస్తకం సుబ్రమణ్య స్వామి ఎప్పుడో రాశాడు. కొని చదివేది flipkart.com లో దొరుకుతుంది. మీకొక చిన్న ప్రశ్న ఇన్ని స్కాం లు జరుగుతూ వుంటే ఎర్ర మేధావులు ఎప్పుడు స్వామి,అరుణ్ శౌరి లాగా పోరాడరెందుకని? అదే వినయక సేన్ ని అరేస్ట్ చేస్తే పోలోమని అంతర్జాతీయంగా గోల చేశారు. స్కాములు గురించి ఆ విధంగా ఎందుకు పోరాడరో మీరు చెప్పగలరా?

 2. సుప్రీం కోర్టు చిదంబరం విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగినట్లయితే పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధలకు దేశ వనరులను దోచిపెట్టడానికి కంకణం కట్టుకున్న ఒక వ్యక్తి పీడను దేశం విరగడ చేసుకున్నట్లు అవుతుంది.

  Well said. Don’t agree with parts of that paragraph. The bosses (two of them) of చిదంబరం must be probed by Supreme Court.

 3. శ్రీరాంబాబూ, ఈ పనికిమాలిన వెధవలు స్కాంలు చేస్తా కూచుంటే వాటిమీద పోరాడుతూ కూర్చోవాలా? సంవత్సరానికి ఎన్ని స్కాంలు జరిగితే, ఎన్ని పోరాటాలు చెయ్యాలి బాబూ?
  బైటపడుతుంది నిన్నమొన్నటి నుండే గదా? బైటపడకుండా ఎన్నున్నాయో తమకు తెలుసా బాబూ? ఎన్ని స్కాంలు చేస్తే స్విస్ బాంకుల్లో కోటి కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి బాబూ?
  2జి పైన పుస్తకం ఆయన రాయడం, చదవమని తమరు సలహా ఇవ్వడం కూడానా!. స్కాంల మీద పుస్తకాలేంటి బాబూ? సోషల్, పొలిటికల్ స్కాంలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి బాబూ. తమరెప్పుడూ గమనించలేదా బాబూ? ఎన్ని పుస్తకాలు రాస్తే భారత పాలకుల స్కాంలు పూర్తిగా రాయగలరు బాబూ?
  అరుణ్ శౌరి పోరాటాన్ని తమరే మెచ్చుకోవాలి మరి! అసలు ఎన్.డి.ఎ పాలనలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అయిన కాడికి అమ్మడానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖని పెట్టి దానికి అరుణ్ శౌరిని ఎన్నుకున్నారు. ఆ శాఖే భారత దేశ ఆస్తుల్ని ప్రవేటోళ్ళకి అయినకాడికి అమ్మేశాఖ. దానికి ఆయన మంత్రి. అంటే అధికారికంగా స్కాంలు చెయ్యడమే బాబూ అది. ఆ స్కాముల మంత్రి స్కాముల మీద పోరాటమా బాబూ? వారు పోరాడుతుంటే మిగతావాళ్ళు పోటీపడాలా బాబూ?

  ఇంతకీ ఎర్ర మేధావులు అంటే ఏంటి బాబూ? ఎర్రగా ఉంటారా? మనుషుల్లా ఉండరా? వాళ్ళు అన్నం తినరా? అందరు మనుషుల్లా అవయవాలు ఉండవా? ఎర్ర మేధావులు కాకుండా ఇంకా ఏమేమి రంగుల మేధావులున్నారు బాబూ తమరి డిక్షనరీలో? కాషాయం మేధావులు కూడా ఎవరైనా ఉన్నారా బాబూ? అరుణ్ శౌరి ఏ రంగు మంత్రి బాబూ? లేదా ఏ రంగు రాజకీయ నాయకుడు బాబూ?

  వినాయక్ సేన్ గురించి తమరికేమైనా తెలుసా బాబూ? ఆయన్ని ఎందుకు అరెస్టు చేసారో తెలుసాబాబూ?
  ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసినవారు రెండు సంవత్సరాలు తప్పనిసరిగా గ్రామాల్లో వైద్యం చేయాలని ఎ.పి ప్రభుత్వం ప్రతిపాధిస్తే, మన మెడికోలంతా తీవ్రంగా నిరసించి ఆ ప్రతిపాదనను రద్దు చేయించారు బాబూ.
  వినాయక్ సేన్ తన వైద్య జీవితం అంతా ఎటువంటి సౌకర్యాలు లేని గిరిజనుల గ్రామాల్లో పనిచేశాడు బాబూ.
  ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా గిరిజనుల గ్రామాలకు వెళ్లలేదు బాబూ. కేవలం డాక్టరుగా వెళ్ళి అక్కడ గిరిజనులపైన సాగుతున్న దౌర్జన్యాలు చూశాకే పౌర హక్కులసంఘంలో పని చేయడం ప్రారంబించాడు బాబూ.
  గిరిజనుల దౌర్భాగ్యం చూశాకే ఆయన వాళ్ల హక్కుల గురించి అడగడం మొదలు పెట్టాడు బాబు.
  వాళ్ళ జీవితాలు, ఆశయాలు తమరి లాంటివారికి ఎంత చెప్పినా అర్ధం కాదు బాబూ.
  ఎరుపు, నలుపు, తెలుపు, కాషాయం రంగులు తప్ప జనాల బతుకుల్ని చదివే దమ్ముందా బాబూ వీళ్ళకి?
  జనాల్ని అధ్యయనం చేస్తే అప్పుడు తమరు, తమరిలాంటివారి అసలురంగు తెలిసిపోతుంది బాబూ.

  సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు కావలసింది. రంగులూ రాజకీయాలూ కూడా కాదు. వాటన్నింటికి అతీతంగా నిజాలు మాట్లాడుకుందామంటే సరే. మేం రెడీ. వాళ్ళెంత? మీరెంత? అది తెలుసా? ఇది తెలుసా? అది ఎర్రది, ఇది పచ్చది, ఏంటిదంతా? ఏమన్నా అర్ధం ఉందా? తమరెవరని తమరితో వాదానికి దిగాలి? ఎంత సేపటికి ఏం తప్పు రాస్తారా? ఎక్కడ కంతలున్నాయా? ఏ కంతలో వేలు పెడదామా? ఇదేనా తమరి నెట్ బతుకంతా? అసహ్యం వెయ్యడం లేదా? నాకైతే పరమరోతగా ఉంది.

  ఏమైనా విషయాలు చెప్పదలుచుకుంటే చెప్పడం, చర్చించ దలుచుకుంటే చర్చించడం, నిజాలు నిగ్గుదేల్చుకోవడం.. ఇది జరుగుతుంటే ఎంతైనా రాసుకోవచ్చు. చర్చించవచ్చు. ఈ పనికిమాలిన రాతలకి ఎన్నిసార్లు సమాధానం ఇవ్వాలి?

  ఇక నుండి ఏ వెధవైనా ఎర్ర, పచ్చ, తెల్ల అని కూశాడంటే, వాళ్ళ విమర్శలో ఎంత అర్ధం ఉన్నా దాన్ని ప్రచురించేది లేదు.

  ఓ పక్క అమెరికా ప్రజాస్వామ్యం అంటూ రంకెలేస్తారు. మరొక పక్క తోటి బ్లాగరు తమకి నచ్చిన భావాల్ని రాసుకోవచ్చన్న కనీస ప్రజాస్వామిక హక్కుని గౌరవించడం చేతకాదు, దద్దమ్మలకి. ధూ!

 4. చిదంబరం భార్య వేదాంత రిసోర్సెస్ అనే బహుళజాతి కంపెనీలో డైరెక్టర్. ఒరిస్సాలో మావోయిస్టులు వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కనుక చిదంబరం తన భార్య ప్రయోజనాల కోసం మావోయిస్టులని అణచివేస్తాడని చిదంబరానికి హోమ్ మంత్రి పదవి ఇచ్చారు. మన ఆంధ్ర ప్రదేశ్‌లో జలగం వెంగళరావు భూస్వామ్య కుటుంబానికి చెందినవాడు కావడంతో 1970ల టైమ్‌లో మావోయిస్టులని తీవ్రంగా అణచివేశాడు. చిదంబరం భార్య బహుళజాతి కంపెనీలో పార్ట్నర్ అంటే ఆవిడ భూస్వాముల కంటే చాలా ధనవంతురాలయ్యుండాలి. ఆవిడ ప్రయోజనాల కోసం ఆవిడ భర్త మావోయిస్టులపై ఉక్కు పాదం మోపడంలో విచిత్రం లేదు. దేశాన్ని సామ్రాజ్యవాదులకి తాకట్టు పెట్టే పాలక వర్గ పార్టీలకి చిదంబరం లాంటి బహుళజాతి కంపెనీల ఏజెంట్లే బాగా ఉపయోగపడతారు.

 5. ఇదీ ఫస్ట్ క్లాస్ కామెంట్. నచ్చిందేదో చెప్పారు. నచ్చనిది నచ్చలేదని నేరుగా చెప్పేశారు. ఎందుకు నచ్చలేదో కొంతమంది చెప్తారు. వారితో చర్చ సాధ్యమవుతుంది. లేదా ఎవరి అభిప్రాయాలకి వాళ్ళు కట్టుబడి ఉంటాం.

  అహ, ఇది కాదు, ఈ దద్దమ్మలకి. (రఘు గారు మిమ్మల్ని కాదు. ఎవర్నో మీకీపాటికి అర్ధం అయి ఉంటుంది లేండి) ఏదో తెలుసునని తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం. లేదా తమలాంటోడితో ఆ సర్టిఫికెట్లు ఇప్పించుకోవడం. అదే లోకంలో పడి కొట్టుకుంటూ తమకు తెలిసిందానికి భిన్నంగా ఏదైనా రాస్తే, అది ఎంత నిజమైనా సరే, పరమ చెత్త రాతలు రాయడం, ఎగతాళి చేయడాన్కి ప్రయత్నించడం. అది చాతకాక, వర్కవుట్ కాక, బ్లాగులు పెట్టుకుని నాసిరకం రాతలు రాసుకుని శునకానందం పొందటం.

  అబ్బెబ్బే. ఎన్నాళ్లు బతుకుతారు ఈ దరిద్రపు బతుకులు?

 6. *శ్రీరాంబాబూ, ఈ పనికిమాలిన వెధవలు స్కాంలు చేస్తా కూచుంటే వాటిమీద పోరాడుతూ కూర్చోవాలా? సంవత్సరానికి ఎన్ని స్కాంలు జరిగితే, ఎన్ని పోరాటాలు చెయ్యాలి బాబూ?
  *

  బాగా వుంది మీవాదన ఎన్ని స్కాంలు జరిగితె అన్నిటి మీద పోరాటం చేయాలా అని అడిగిన మీరే రోజు స్కాం లో ఇరుకొన్న చిదంబరం,2 జి మీద రోజు కోర్టో లేక ఎదైనా మీడీయా లో వచ్చిన పుడు వెంటనే టపా మటుకు రాస్తున్నారు. అదే విధం గా షేఈర్ మార్కేట్ మీద కూడా కుప్ప కూలింది, మదుపుదారుడి నడ్డి విరిగింది అని. స్వామి లాంటి వారు పోరాడటం వలన కోర్టు లో జరిగే చర్చ మీద మీలాంటి మేధావులు పేపర్లో,బ్లాగుల్లో రాసుకొంట్టు జీవితం గడిపేస్తున్నారు. ఎర్ర రంగు వారు స్వతహా గా స్వామిలాగా వొంటరిగా బరిలోదిగి పోరాడే యోధులు గారు. స్వయంప్రకాశాలు కారు. పరాన్న జీవులు. ఒకసారి బ్లాగులు చూడు 2జి మీద ఎర్ర పార్టి వారు రోజు ఎదో ఒకటి రాస్తూ వుంటారు. ఈ పనికిమాలిన వెధవలు స్కాంలు చేస్తా కూచుంటే వాటిమీద పోరాడలేని వారు, వారి తిడుతూ రాసి ప్రపంచానికి ఎదో తెలియనిది చెప్పినట్టు భావించవలసిన అవసరం ఎముంది?

 7. *జనాల్ని అధ్యయనం చేస్తే అప్పుడు తమరు, తమరిలాంటివారి అసలురంగు తెలిసిపోతుంది బాబూ. *

  మీరు చేసి మాలంటి వారికి చెప్పండి. కాని మీరు జనాల సంగతి దేవుడేరుగ ఎంత సేపటికి చిదంబరం స్కాం లీలలు, ఇంకొకడి రాసలీలలు, షేర్ మార్కేట్ చెత్త గురించి ఎక్కువగా రాసేది మీరే. జనాల గురించి మిగత బ్లాగర్లు మీకన్నా ఎక్కువగా ఎంతో మంది రాస్తున్నారు. చూడబోతే మీకు బి పి వున్నట్లు వుంది,ఆఫీసులో ఫ్రషేషన్ ని బ్లాగులో చూపిస్తున్నారు. ప్రశ్నించినవారి మీద విరుచుకు పడటం చూస్తే నిజమనిపిస్తున్నాది. చిన్న ప్రశ్నకి ఇంత అశాంతికి గురి అయితే పెద్ద మార్పులను సమాజంలో ఎలా మీరు తీసుకు రాగలరు?

 8. అబ్బ, ఛా! నాడి పట్టకుండా బి.పి సంగతి భలే పట్టేశారే? (చప్పట్లు). తమర్ని చదవమని ఎవరో బతిమిలాడినట్లు. అవసరమైనవారు చదువుకుంటారు. లేనివాళ్ళు వదిలేస్తారు. తమరిలాగా సంస్కారం వదిలేసి ఎర్ర, పచ్చ అని అర్ధం లేని చెత్త కామెంట్లు రాయమని ఎవరు అడిగారు తమర్ని. నీకు నచ్చిన బ్లాగుల్ని చదువుకో. ఇక్కడకొచ్చి నా బి.పి పెంచడం ఎందుకుటా, టెలి వైద్యుడుగారూ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s