పునరద్భవిస్తున్న … … -(3)


(ఈ భాగాన్ని ఆగష్టు 16 న ప్రచురించినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్)

పెట్టుబడిని కట్టడి చేసేదిపెట్టుబడే

పెట్టుబడిసంచయానికి సంబంధించిన చైనా నమూనా కొన్ని నిర్ధిష్ట అంశాలపైన ఆధారపడి ఉంది.అతి పెద్ద కార్మిక శక్తిని నిర్ధాక్షిణ్యంగా దోపిడి చేయడం; సహజ వనరులనుపెద్ద ఎత్తున కొల్లగొట్టి తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడం; కీలకమైన పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లకు విస్తృతంగా ఎగుమతులు చేయడంపైఆధారపడిన ఆర్ధిక వృద్ధి నమూనా కలిగి ఉండడం… ఇవి ఆ నిర్ధిష్ట అంశాలు. ఈఅంశాలలో ఏవీ కూడా మధ్య కాలికంగానే పనికొస్తాయి తప్ప అంతకు మించి పనికిరావు.

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఆర్ధిక స్తంభనకు గురై ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకాఅనేక సంక్షోభాలను ఎదుర్కొంటాయి. అటువంటి దేశాలకు జరుగుతున్న ఎగుమతులపైనఆధారపడుతూ, చైనా ఆర్ధిక వ్యవస్ధ విస్తరణ చెందజాలదు. పైగా, చైనా చాలా అతిగాపెట్టుబడులు పెట్టడం వలన దాని ఉత్పత్తి సామర్ధ్యం అవధులు లేకుండాపెరిగిందని విస్తృంగా గుర్తించబడింది. శక్తి (ఎనర్జీ) కోసం వనరుల కోసంస్ధిరంగా కొనసాగడానికి వీలులేని డిమాండ్ పుట్టడానికి అది దోహద పడింది. (ఉత్పత్తికి తగిన డిమాండ్ రావాలంటే వినియోగదారుల కొనుగోలు శక్తి ఉత్పత్తిపెరిగిన తరహాలోనే పెరగాల్సి ఉంటుంది. కాని ఎంత ధనిక దేశంలోనైనావినియోగదారుల కొనుగోలు శక్తి అనంతంగా పెరుగుతూ ఉండడం జరగదు. ఎక్కడో ఒక చోటదానికి పరిమితి విధించబడుతుంది.

ఉదాహరణకిదేశంలో వంద కుటుంబాలు ఉన్నాయను కుంటే, టి.వి ఉత్పత్తిదారులు వంద టి.వీలనుతయారు చేసి అమ్మగలరు. ఎంత ధనికుడైనా హాల్ లొ ఒక టి.వి, బెడ్రూం లో ఒక టి.వికిచెన్ లో ఒక టి.వి అలా కొనరు. ఒక వేళ కొన్నా ఆ ఇంట్లోని గదులవరకే పరిమతమైకొనగలడు తప్ప డబ్బులున్నాయని ప్రతి టి.వి మోడల్ ని కొని ఇంట్లోపెట్టుకోలేడు. ఆవిధంగా ఉత్పత్తుల డిమాండ్‌కి ఎక్కడో ఒక చోట పరిమితిఉంటుంది. అలాగే ఇతర సరుకులు. -అనువాదకుడు). పెట్టుబడిపైన వచ్చే లాభాల శాతంతరిగిపోతున్నప్పుడు అది అంతిమంగా పెట్టుబడి కూలిపోవడానికి దారి తీస్తుంది. ఆపరిస్ధితి అతి పెద్ద పెట్టుబడిదారీ సంక్షోభానికి దారి తీస్తుంది. కనుకచైనా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ, దేశీయ వినియోగాన్ని పెంచుకోవడం ద్వారాతనను తాను మళ్ళీ సమతూకం (రీ బ్యాలెన్స్) చేసుకోవలసి వస్తుంది. కాని చైనాపెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా (పక్కకు నెట్టి)అదెలా సాధ్యమవుతుంది?

ప్రస్తుతంచైనా మొత్తం జిడిపిలో కుటుంబాల వినియోగం 40 శాతం ఉంది. అలాగే, ప్రభుత్వవినియోగం పది శాతం, వాణిజ్య మిగులు ఐదు శాతం, పెట్టుబడులు 45 శాతం ఉన్నాయి.కార్మికులు, గ్రామీణ రైతుల వేతనాలు జిడిపిలో 40 శాతం ఉంటాయి. కనుక కార్మికవర్గ వేతనాలు కుటుంబాల వినియోగంతో దాదాపుగా సరిపోతుంది. “మొత్తంపెట్టుబడిదారీ లాభాల”లో ప్రబుత్వ పెట్టుబడిని భాగంగా తీసుకున్నట్లయితే, అప్పుడు “మొత్తం పెట్టుబడి లాభాలు” (జిడిపి లోనుండి వేతనాలు, ప్రభుత్వవినియోగాన్ని తీసివేసినట్లయితే వచ్చేది మొత్తం పెట్టుబడి లాభాలు – గ్రాస్కేపిటలిస్ట్ ప్రాఫిట్) దాదాపు జిడిపిలో 50 శాతంగా తేలుతోంది. స్ధిరపెట్టుబడి క్షీణత (యంత్రాలు, భవనాల రూపంలో ఉండే స్ధిరపెట్టుబడి సరుకులు, కాలం గడిచే కొద్దీ మనుషుల్లాగానే జీవన కాలం కోల్పోతుంటాయి. దానిని క్షీణతలేదా డిప్రీషియేషన్ అంటున్నాం) ను తీసివేశాక నికర పెట్టుబడి లాభాలుజిడిపిలో దాదాపు 35 శాతం గా తేలుతోంది. ఈ అత్యధిక పెట్టుబడి లాభాలే (లేదాఅత్యధిక అదనపు విలువ రేటు) చైనాలో వేగంగా పెరుగుతున్న పెట్టుబడి సంచయానికిరాజకీయ-ఆర్ధిక పునాదిగా ఉన్నది.

ఇప్పుడుచైనా, దేశీయ వినియోగం ఆధిక్యత వహించే ఆర్ధిక వ్యవస్ధగా తనను తాను రీబ్యాలెన్స్ చేసుకోవాలనుకుందాం. చైనా పెట్టుబడిదారీ విధానం రీ బ్యాలెన్స్చేసుకోవడానికి అందుబాటులో ఉన్న రెండు ప్రత్యామ్నాయ పద్ధతులు టేబుల్ 1 లోఇవ్వబడ్డాయి.  ప్రతి పద్ధతిలోనూ చైనా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధనుస్ధిరంగా ఉంచడానికి (పడిపోతున్న లాభాల రేటు కాకుండా, స్ధిరంగా ఉండే లాభాలతోకూడిన స్ధిరత్వం) అవసరమైన నిర్ధిష్ట షరతులతో కూడిన సెట్ ఉంది. ఉదాహరణకిచైనా ఆర్ధిక వృద్ధి సంవత్సరానికి ఏడు శాతానికి పడిపోవాలనుకుంటే, అపుడుపెట్టుబడి-ఉత్పత్తి నిష్పత్తి ని స్ధిరంగా ఉంచడానికి పెట్టుబడులు జిడిపిలో 36 శాతానికి పడిపోవలసి ఉంటుంది. (టేబుల్ 1లో ఇది 35 శాతానికి కి రౌండ్చేయబడింది). భవిష్యత్తులో చైనా ఇంధనం, ముడిపదార్ధాల దిగుమతి స్ధిరంగాపెరుగుతూ ఉండగానే దాని ఎగుమతి మార్కెట్లు (అమెరికా, యూరోపియన్ యూనియన్)ప్రతిష్టంభనకు గురైనాయని భావించినట్లయితే, చైనా వాణిజ్య ఖాతా తిరిగిసమతూకానికి వచ్చినట్లు భావించవలసి ఉంటుంది. అంటే అటు మిగులు లేకుండా ఇటులోటు లేకుండా ఎగుమతులు ఎంత ఉంటే దిగుమతులు అంతే ఉండడం అన్నమాట. ఇదిజరగాలంటే కుటుంబాల వినియోగం (వేతనాలు), ప్రభుత్వ వినియోగం రెండు కలిపితేజిడిపిలో 65 శాతంగా ఉండవలసి ఉంటుంది. “మొత్తం పెట్టుబడి లాభాలు” జిడిపిలో 35 శాతానికి పడిపోయి నికర పెట్టుబడి లాభాలు 20 శాతానికి పడిపోవాల్సిఉంటుంది.

కనుక ఈ ఉదాహరణలో జిడిపిలో 15 శాతాన్ని పెట్టుబడిదారుల లాభాలనుండి తీసుకొనికార్మికుల వేతనాలకు చేర్చడం ద్వారానో లేదా సామాజిక కార్యక్రమాలకు ఖర్చుచేయడం ద్వారానో చైనా ఆర్ధిక వ్యవస్ధను తిరిగి సమతూకానికి తీసుకురావాల్సివస్తుంది. ఎంత ఆదర్శవంతమైన రాజకీయ పరిస్ధితులు ఉన్నప్పటికీ, అంత పెద్దమొత్తంలో ఆదాయాన్ని పునఃపంపిణీ చేయడం ఎలా సాధ్యమవుతుంది? తమ వర్గానికిచెందిన ఉమ్మడి ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీ వర్గంలోనుండి ఏపెట్టుబడిదారుడు తన ప్రయోజనాలను త్యాగం చేయడానికి ముందుకొస్తాడు? చైనాపెట్టుబడిదారులు చట్ట విరుద్ధంగా, అవినీతికి పాల్పడి తమ పెట్టుబడినిపోగేసుకున్నారన్న సంగతిని దృష్టిలో ఉంచుకుంటే, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపెట్టుబడిదారీ వర్గ ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చడానికినిర్ణయించుకున్నప్పటికీ, ఆ విధమైన పెట్టుబడిదారీ వర్గ ఉమ్మడి ప్రయొజనాలనుఅది ఎలా అమలు చేయగలుగుతుంది? నిర్వచనం రీత్యానే అవినీతి వనరుల ద్వారాసంపాదించిన సంపదలపై పన్నులు వేయడం సాధ్యం కాదు.

ఒకవిధంగా చూస్తే, పెట్టుబడిదారీ చరిత్రలో గతంలోని మరే పరిస్ధితిలోపోల్చినప్పటికీ, ప్రస్తుత చారిత్రాత్మక సందర్భం మౌలికంగానే భిన్నంగా ఉంది.కొన్ని వందల సంవత్సరాల నుండి తెంపు లేకుండా పెట్టుబడిదారీ సంచయం (పెట్టుబడిపోగుబడే ప్రక్రియ) జరిగిన ఫలితంగా, ప్రపంచ పర్యావరణ వ్యవస్ధ కూలిపోవడానికిసిద్ధంగా ఉంది. ఇప్పుడు అభివృద్ధి దశలో ఉన్న ప్రపంచ పర్యావరణ సంక్షోభం, మానవ నాగరికతను 21 వ శతాబ్దంలోనే నాశనం చేయగల స్ధాయిలో భయకంపితులనుచేస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఇంధనాన్ని వినియోగిస్తున్న దేశంగా, అత్యధికంగా కర్బన వాయువులను వెలువరిస్తున్న దేశంగా చైనాయే ప్రపంచ పర్యావరణవైరుధ్యాలకు కేంద్రంగా ఉన్నది.

చైనాతన ఇంధన వినియోగం కోసం 75 శాతం బొగ్గుపైనే అధారపడి ఉంది. 1979-2009 కాలంలోచైనా బొగ్గు వినియోగం సగటున సంవత్సరానికి 5.3 శాతం చొప్పున పెరుగుతూపోయింది. చైనా ఆర్ధిక వ్యవస్ధ సగటున సంవత్సరానికి 10 శాతం చొప్పున వృద్ధిచెందుతూ పోయింది. అయితే చైనా బొగ్గు ఇంధన వినియోగం చివరి దశాబ్దంలో మాత్రంఅంటే 1999-2009 కాలంలో సంవత్సరానికి సగటున 8.9 శాతం చొప్పున పెరుగుతూపోయింది. సాధారణ బొటన వేలు సూత్రం ద్వారా భవిష్యత్తులో చైనా ఆర్ధిక వృద్ధిరేటు, భవిష్యత్తులో చైనా బొగ్గు ఉత్పత్తి రేటు ప్లస్ ఐదు శాతం ఉండగలదనిఅంచనా వేయవచ్చు. (భవిష్యత్ ఆర్ధిక వృద్ధి రేటు = భవిష్యత్ బొగ్గు ఉత్పత్తిరేటు + 5 శాతం). చైనా ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం చైనాలోఇప్పుడు 190 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అధికారికరిజర్వుల అంచనా మొత్తాన్ని భవిష్యత్తులో బొగ్గుగనులను తవ్వి ఉత్పత్తిచేస్తారని భావిస్తూ, చైనా చారిత్రాత్మక బొగ్గు ఉత్పత్తిని భవిష్యత్తులోఅంచనా కట్టిన బొగ్గు ఉత్పత్తితో చార్ట్ 1 లో పోల్చడం జరిగింది.

2026 నాటికి చైనాలో బొగ్గు ఉత్పత్తి ఉచ్ఛ దశకు చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. అప్పటి ఉత్పత్తి స్ధాయి 4.7 బిలియన్ మెట్రిక్ టన్నులకుచేరుకోగలదని అంచనా. 2009-2020 కాలానికి బొత్తు ఉత్పత్తి సగటున సంవత్సరానికి 3.5 శాతానికి తగ్గిపోగలదని అంచనా వేస్తున్నారు. అదే విధంగా బొగ్గుఉత్పత్తి 2020-2030 కాలంలో 0.4 శాతానికీ, 2030-2040 కాలంలో –2.5 శాతానికీ, 2040-2050 కాలంలో –4.8 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. దానిప్రకారం చైనా ఆర్ధిక వృద్ధి 2010 లలో (2010-20) 8.5 శాతం, 2020 లలో 5.5 శాతం, 2030 లలో 2.5 శాతం, 2040 లలో 0 శాతం ఉంటుంది.

కనుక 2020ల నాటికి చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధ స్ధిరత్వాన్ని సాధించాలంటేజిడిపిలో 20 శాతం భాగాన్ని నికర లాభాల నుండి కార్మికుల వేతనాలకు తరలించడంద్వారా పునఃపంపిణీ చేయవలసి ఉంటుంది. (టేబుల్ 1 చూడండి). 2030 ల నాటికిపెట్టుబడిదారీ నికర లాభాలు జిడిపిలో పది శాతానికంటె తగ్గిపోవలసి ఉంటుంది.ఇక ఆ తర్వాత ఆదాయాల పునః పంపిణీకి అవకాశం లేదు.

చైనాఎదుర్కొంటున్న పర్యావరణ వైరుధ్యాలలో రానున్న ఇంధన సంక్షోభం కేవల ఒక్కటిమాత్రమే. చార్టింగ్ అవర్ వాటర్ ఫ్యూచర్సంస్ధ ప్రకారం 2030 నాటికి చైనా 25 శాతం నీటి లోటును ఎదుర్కోనుంది. వ్యవసాయం, పరిశ్రమలు, నగరాల పెరుగుదలఇవన్నీ పరిమిత నీటి వనరుల నుండే అధికంగా నీటిని డిమాండ్ చేయడం వలన ఆపరిస్ధితి తలెత్తనుంది.  చైనాలో ఇప్పుడు జరుగుతున్న నేల కోతను అదుపుచేయనట్లయితే 2030-2050 కాలానికి 14 నుండి 18 శాతం వరకూ ఆహార కొరతనుఎదుర్కోనుంది. పర్యావరణ మార్పులు, నిటి లభ్యత పడిపోతుండడం వలన 2040ల నాటికిధాన్యం ఉత్పత్తి 9 నుండి 18 శాతం వరకూ పడిపోవచ్చు.

కార్మికవర్గ విజయం?

మానవతఇప్పుడు కీలకమైన కూడలిలో నిలబడి ఉంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఈవిధంగానే కొనసాగినట్లయితే బిలియన్ల కొద్ది ప్రజలను శాశ్వత దారిద్ర్యంలోకిగ్యారంటీగా నెట్టడంతో పాటు, మానవ నాగరికతను దాదాపు ఖచ్చితంగా సర్వ నాశనంచేస్తుంది. ఇది అత్యవసరంగా ప్రపంచ చారిత్రాత్మక ప్రశ్నను లేవనెత్తుతుంది. 21వ శతాబ్దంలో ప్రపంచ విప్లవం సాధించడానికి మానవత ఏ శక్తిపైన ఆశలుపెట్టుకొని, తద్వారా సోషలిజం, పర్యావరణ సుస్ధిరతలను సాధించవచ్చు?

కార్మికవర్గమేపెట్టుబడిదారీ విధానానికి సమాధులను తవ్వుతుందని కారల్ మార్క్స్ అంచనావేశాడు. వాస్తవ ప్రపంచ చరిత్ర క్రమంలో పశ్చిమ దేశాల పెట్టుబడిదారులు పరిమితసామాజిక సంస్కరణల ద్వారా కార్మికవర్గం నుండి ఎదురయిన సవాళ్ళనుఅధిగమించగలిగారు. ఉపరితలంలో కార్మికవర్గ ప్రజలను అత్యధిక స్ధాయిలో దోపిడిచేయడం (సూపర్-ఎక్స్‌ప్లాయిటేషన్), ప్రపంచ సహజ వనరులను, పర్యావరణ సమతుల్యతనుతీవ్ర స్ధాయిలో దోపిడి చేయడంలపై ఆధారపడి, ప్రధాన పెట్టుబడిదారీ వర్గాలు, కార్మిక వర్గంతో తాత్కాలిక రాజీని సాధించగలిగారు. ఈ రెండు పరిస్ధితులుఇప్పుడు అంతిమ దశకు చేరుకున్నాయి. రానున్న ఒకటి లేదా రెండు దశబ్దాలలోప్రపంచ జనాభాలో వేతన శ్రామికుల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించనున్నది.కారల్ మార్క్స్ అంచనా వేసినట్లుగానే, ఆసియాలో కార్మికవర్గం పెద్ద ఎత్తునవేతన శ్రామికీకరణ చెందండంతో, ప్రపంచ చారిత్రక పరిస్ధితులు అంతిమంగా శ్రామికవర్గం విజయం సాధించడం, బూర్జువా వర్గం కూలిపోవడం అన్న లక్ష్యాలు సాకారంఅయ్యే దశను సమీపిస్తున్నాయి.

ప్రపంచంలోఅత్యధిక మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా, అలాగే అత్యధిక ఇంధనవినియోగం జరుపుతున్న దేశంగా చైనా అంతకంతకూ పెట్టుబడిదారీ వైరుధ్యాలకుకేంద్రంగా ముందుకు వస్తున్నది. 2020 తర్వాత ఆర్ధిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సంక్షోభాలన్నీ చైనాలో కేంద్రీకృతమవుతాయని పై విశ్లేషణసూచిస్తున్నది.

చైనావిప్లవ వారసత్వం నేపధ్యంలో చైనాలో నెలకొన్న చారిత్రక విషయగత పరిస్ధితులు, చైనాలోని వైరుధ్యాలకు విప్లవకర సోషలిస్టు పరిష్కారం లభించేలా దోహద పడవచ్చు.సోషలిస్టు చైతన్యంతో ప్రభావితమై ఉన్న ప్రభుత్వ రంగ కార్మికులు చైనాకిచెందిన కీలక ఆర్ధిక రంగాలను స్వాధీనం చేసుకుని రానున్న విప్లవ పోరాటాలలోనాయకత్వ పాత్రను పోషించగల అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ కార్మికులు, వలసకార్మికులు, వేతన శ్రామికీకరణ చెందిన పెట్టీ బూర్జువా వర్గాల మధ్య విశాలమైనవిప్లవకర ఐక్య సంఘటన ఏర్పడడానికి అవకాశం ఉంది.

ప్రపంచపెట్టుబడిదారీ వ్యవస్ధలో చైనా కేంద్ర స్ధానాన్ని ఆక్రమించి ఉన్న నేపధ్యంలోఅక్కడ సోషలిస్టు విప్లవం విజయవంతం అవుతుందని చెబితే అది అతిశయోక్తికాబోదు. అది ప్రపంచ పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి గొలుసునంతటినీతెంచివేయగలదు. ప్రపంచ వేతన శ్రామిక వర్గానికి అనుకూలంగా ప్రపంచాధికారసమతుల్యతను ప్రభావితం చెయ్యగలుగుతుంది. ఇరవై ఒకటవ శతాబ్దం లోని ప్రపంచసోషలిస్టు విప్లవానికి అది దారులు వేస్తుంది. అంతేకాక మానవ నాగరికతసంరంక్షించబడే విధంగా రానున్న ప్రపంచ సంక్షోభాన్ని పరిష్కరించడానికి గలఅవకాశాలను మరింతగా పెంచుతుంది.

చైనా, ప్రపంచ కార్మిక వర్గాలు తమ విప్లవ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడేదీ లేనీదీ చరిత్రే నిర్ణయిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s