పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే. అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు. సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ, అను బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలిగిగాడు. ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు.
బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని డబ్బులుగా మార్చుకోవడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రెడీ. అమ్మని ఇష్టపడని వారెవ్వరు? ఆ పేగు బంధాన్నిప్పుడు “మదర్ డే” పేరుతో వ్యాపారీకరించారు. పుట్టిన రోజుకి ఎన్ని కేకులు, ఎన్ని హోటళ్ళు, ఎన్ని కంపెనీలు, మరెన్ని పార్టీలు?! ఫాదర్స్ డే, లవర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్స్ డే… అన్ని దినాలూ వ్యాపారాదాయాలను పెంచేవే.
ఆ కోవలోకే చేరింది 9/11 దుర్ఘటన. జంట టవర్ల బొమ్మలతో అనేక వస్తువులు, సారీ… సరుకులు అమ్ముడవుతున్నాయి. పుస్తకాలు, పోస్ట్ కార్డులు, ఫ్లవర్ వాజ్లు, మెమెంటోలు, రిప్లికలు, లోహపు బొమ్మలు, పేపర్ వెయిట్లు, యాష్ ట్రేలు, క్యాలెండర్లు, దుప్పట్లు, టాయిలెట్ పేపర్లు, షోకేసు బొమ్మలు, సావనీర్లు, రగ్గులు చివరికి కండోమ్లు కూడా. చూడండి మీరే:
ఫోటోలు: బ్లూం బర్గ్ వెబ్సైట్
—