
20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు.
దాడిలో భారీ ఆయుధాలు ఏవీ వాడకపోవడాన్ని బట్టి మిలిటెంట్లు పెద్ద ఎత్తున నష్టం చేయడానికి యాక్షన్ చేయలేదని స్పష్టమవుతోందని అమెరికా అధ్యయన సంస్ధ స్ట్రాట్ఫర్ చెబుతున్నది. అమెరికా ఎంబసీ, ఆఫ్ఘన్ సైనిక, పోలీసు కార్యాలయాలూ, నాటో ప్రధాన కార్యాలయమూ మొదలైఅన్ ముఖ్య కార్యాలయాలు ఉన్న ప్రాంతంపైన తాలిబాన్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ప్రాంతం కాబూల్లో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ప్రాంతం. దీనిని ‘హై సెక్యూరిటీ జోన్’ గా పిలుస్తారు. అటువంటి జోన్ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనేడ్ లాంటి ఆయుధాలతో సహా ఇతర ఆయుధాలతో జొరబడి ఒక భవంతిని అదుపులోకి తీసుకొని దాడి చేయగలగడమే ఇక్కడ ముఖ్యమైన సంగతి.
శతృ దుర్భేధ్యమైన ఏరియాలోకి, నిత్యం పహారా ఉండే ప్రాంతంలోకి తాలిబాన్ మిలిటెంట్లు జొరబడడానికి ఆ సంస్ధ ఒక్క దాని వల్ల అయ్యే పని కాదు. అందుకు ఖచ్చితంగా స్ధానికంగా ఉండే భద్రతా బలగాల సహకారం ఉండి తీరాలి. ఆఫ్ఘన్ భద్రతా బలగాలు అన్నింటిలోకి తాలిబాన్ చొచ్చుకు వెళ్ళడంతో అది ఈ విధమైన దాడులను చెయ్యగలుతున్నదని స్ట్రాట్ఫర్ అభిప్రాయపడింది. స్ట్రాట్ ఫర్ ఇంకా ఇలా పేర్కొంది:
పదిమంది మిలిటెంట్లతో కూడిన బృందం, ఆటోమేటిక్ రైఫిళ్ళు ధరించి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్తో సెప్టెంబరు 13న కాబూల్లో ‘హై సెక్యూరిటీ జోన్’ గా పరిగణించే అమెరికా ఎంబసీ తదితర కార్యాలయాలపై దాడికి దిగారు. వారిలో కనీసం నలుగురు అత్మాహుతికి సిద్ధమై వచ్చారు. దాడి చేస్తుండగా వారు తమను తాము పేల్చుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవంతిని మిలిటెంట్లు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ కార్యాలయాలు, పశ్చిమ భద్రతా బలగాల కార్యాలయాలు, నాటో కేంద్ర కార్యాలయం మున్నగు ముఖ్య కార్యాలయాలున్న ప్రాంతంలోకి మిలిటెంట్లు జొరబడగలిగారు.
కాబుల్లో గతంలో కూడా అనేక దాడులు జరిగాయి. ప్రస్తుత ఘటన మాత్రం అరుదుగా జరిగేవాటిలో ఒకటి. నగరంలోని పశ్చిమ దేశాల మిలట్రీ, గూఢచార సంస్ధల అధికారులు నిత్యం తిరుగాడే చోటుకి అత్యంత సమీపంలోకి రాగల సామర్ధ్యం తమకు ఉన్నదని ఈ దాడి ద్వారా తాలిబాన్ చాటి చెప్పింది. అనేకమంది మిలిటెంట్లు, పేలుడు పధార్ధాలు భారీ తుపాకులు చేతబట్టి ఈ ప్రాంతంలోకి తాలిబాన్ మిలిటెంట్లు రాగలిగారంటే, ఆఫ్ఘనిస్ధాన్ భద్రతా బలగాల సహాయం లేకుండా ఇటువంటి హై సెక్యూరిటీ జోన్ లోకి రావడం సాధ్యం కాదు. దాడు చేసినవారు పెద్దగా నష్టం చేయడానికి వీలు కాదు. వారిని కొద్ది సమయంలోనే అదుపులోకి తీసుకోగల అవకాశాలున్నాయి. ఈ విషయం ముందుగానే తెలిసి కూడా మిలిటెంట్లు దాడి చేసారు.
తేలికాపాటి ఆయుధాలతో గట్టి భద్రత ఉండే అమెరికా ఎంబసీకి నష్టం చేసే అవకాశం లేదని వారికి తెలుసు. కనుక ఈ దాడి భౌతిక యుద్ధంగా కంటే మానసిక యుద్ధానికి సంబందించిన ఆపరేషన్ గానే చూడాలి. ఇది హకాని గ్రూపు పని అయిఉండవచ్చు. సీనియర్ తాలిబాన్ నాయకత్వంతో చర్చలు జరపడానికి అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ ప్రయత్నాలను నిరాశపరచడానికే ఈ దాడి జరిగింది.
(అమెరికా ప్రయోజనాల కోసం అధ్యయనం చేసి పెట్టే స్ట్రాట్ఫర్ చేసిన విశ్లేషణ ఇది. స్ట్రాట్ఫర్లో ఈ బ్లాగర్కి బంధువులెవ్వరూ లేరు. ఈ బ్లాగర్ కోసం వాళ్ళు అధ్యయనాలు చెయ్యరు. అమెరికా కోసమే చేస్తారు. అనుకూలమైనా, వ్యతిరేకమైనా ఘటనలపైన వాస్తవ విశ్లేషణ చెయ్యడమే వారిపని. కనుక దీనిని అమెరికా కోవర్టులు కూడా నమ్మవచ్చు.)

తాలిబాన్లు అంటేనే భూమ్మీద పుట్టుకొచ్చిన నూతన రాక్షసుల్లాగా భావిస్తున్న వారికి మీ వ్యాసం బహుశా అర్థం కాకపోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిని ఎంత చిన్న స్థాయిలో అయినా సరే దెబ్బతీయడం సాధ్యం అనే భావన ఇలాంటివారికెప్పటికీ జీర్ణం కాకపోవచ్చు.
మనలో మనమాట. ” దీనిని అమెరికా కోవర్టులు కూడా నమ్మవచ్చు” మెత్తటి కత్తితో పొడిచే తరహా ఈ అసామాన్య వ్యంగ్యం మీకు ఎలా అలవడిందో చెప్పండి. నవ్వకూడని సమయంలో కూడా నవ్వు తెప్పించే పంచ్ వాక్యం ఇది.
Vesekhar garu, oka panch dialogue enti, emina cheya galaru. Thanks for posting this kind of articles
Cheers,
Subhas
Hi Subhas, Thanks for the support.