లిబియా జోక్యం చట్టవిరుద్ధం -అమెరికా కాంగ్రెస్ సభ్యుడు


లిబియా జోక్యం చట్ట విరుద్ధమని అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు, న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. లిబియా మరో ఇరాక్ కానున్నదని జోస్యం చెప్పాడు. అమెరికా తదితర పశ్చిమ దేశాలతో సహకరిస్తే మిగిలేది నాశనమేనని అవి తమ వినాశకర జోక్యం ద్వారా నిరూపిస్తున్నాయని నిరసించాడు. ఓహియో నుండి ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ నుండి ఎన్నికయిన డెన్నిస్ జె. క్యుసినిచ్, మంగళవారం పత్రికకు రాసిన లేఖ న్యూయార్క్ టైమ్స్ పత్రిక బుధవారం ప్రచురించింది.

ఆగష్టు 29 తేదీన న్యూయార్క్ టైమ్స్ లిబియా యుద్ధంపై ఒక విశ్లేషణ ప్రచురించింది. లిబియా యుద్ధం ముగిసిన తీరుపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పశ్చిమ దేశాలు చేసే ఇటువంటి ప్రయత్నాలకు లిబియా జోక్యం ఒక మోడల్‌గా ఉంటుందని వ్యాస రచయితలు హెలిన్ కూపర్, స్టీవెన్ లీ మేయర్స్ పేర్కొన్నారు. లిబియా ప్రజలను రక్షించే పేరుతో, తమ తొత్తు సంస్ధ ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలితో తీర్మానం చేయించుకుని ఆ దేశంలో వినాశకరమైన జోక్యం చేసుకున్న పద్ధతి విశ్లేషకులను ఆకట్టుకుంది.

అమెరికా బధ్రతకు నేరుగా ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ తన దౌత్య ప్రయోజనాలను (ఆర్ధిక,రాజకీయ ప్రయోజనాలకు మరో పేరు) కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికి కొత్త సిద్ధాంతం అమెరికా లిబియా యుద్ధం ద్వారా కనుగొన్నదని వ్యాస రచయితలు పేర్కొన్నారు. (1) పెద్ద ఎత్తున హత్యకాండ జరగకుండా ఆపడానికి అమెరికాపైన బాధ్యత ఉందనీ, (2) కానీ అమెరికా భద్రత ప్రమాదం లేనప్పుడు ఒంటరిగా కాకుండా ఇతర (ఉదా: నాటో) దేశాలతో కలిసి జోక్యం చేసుకుంటుందనీ రెండు సూత్రాల ఒబామా డాక్ట్రిన్ గా వారు అభివర్ణించారు. ఆఫ్ఘన్‌పై దాడి చేయడానికి జంట టవర్లపై టెర్రరిస్టుల దాడి సాకుగా దొరికింది. ఇరాక్‌పై దాడికి ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు’ సద్దాం వద్ద ఉన్నాయని అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇలా ప్రాణ నష్టం, అబద్ధాలు చెప్పవలసిన అగత్యం లేకుండానే తమ మాట వినని దేశాలపై దాడులు చేయడానికి అనువైన సిద్ధాంతం దొరికిందని వ్యాస రచయితలు పరోక్షంగా పేర్కొన్నారు.

ఈ వ్యాసంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డెన్నిస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలు లేఖ రాశాడు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.


ఎడిటర్ గారికి:రిఫరెన్స్: “U.S. Tactics in Libya May Be a Model for Other Efforts” (news analysis, Aug. 29):

ఇక్కడ చట్ట రహిత జోక్యందారీ విధానం రూపుదిద్దికుంటోంది. అది అమెరికాను పునర్నిర్వచిస్తున్నది. లిబియాలో సాకు ఏమిటంటే: హత్యాకాండ జరగొచ్చని. ప్రజలను రక్షించడానికి చేయబడిన ఐక్యరాజ్య సమితి తీర్మానం, ప్రభుత్వాన్ని కూలదోయడానికి సాధనంగా మారింది. అమెరికా, నాటోలు లిబియాపై దాడి చేసిన తర్వాతే అక్కడ పౌరుల మరణాలు పెరిగాయి.

నాటో ద్వారా, అమెరికా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. లిబియా సంపదను కొల్లగొట్టడానికి అక్కడి ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను అడ్డం పెట్టుకుని అమెరికా, నాటోలు (ఉమడి ఆయిల్ ప్రయోజనాల కోసం) నిజాలను విస్మరించాయి. మనం ఇరాక్‌లో చేసింది ఇదే కాదా?

పశ్చిమ రాజ్యాలను సంతృప్తి పరచడానికి లిబియా సి.ఐ.ఎ కు సహకరించింది. 2004లో తన వద్దనున్న సామూహిక విధ్వంసక మారణాయుధాలను వదులుకుంది. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటీకరణ కావించింది. తద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని చవి చూస్తున్నది.

ఇటువంటి జోక్యందారీ నమూనా, ఇరాన్‌కి ఏ సందేశం పంపుతుంది? సహకరించి నాశనానికి గురికావాలనా?

మన వినాశకరమైన జోక్యాందారి విధానానికి సవాలు ఎదురుకాకుండా ఉండటానికి మనం ఎలా మారిపోయాము? ఇది కల్నల్ మౌమ్మర్ ఎల్-గడ్డాఫీ గురించి కాదు. ఇది మన గురించే. మనం ఎవరము?

డెన్నిస్ జె. క్యుసినిచ్


3 thoughts on “లిబియా జోక్యం చట్టవిరుద్ధం -అమెరికా కాంగ్రెస్ సభ్యుడు

  1. అమెరికా, నాటోల దుర్నీతి ఎంత పరాకాష్టకు పోయిందో ఇతరులు చెపితే మనం వినడం, అంగీకరించడం, వ్యతిరేకించడంతో పనిలేకుండా అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడే తేల్చి చెప్పేశాడు. ఒకరకంగా చెప్పాలంటే అమెరికాను అమెరికా లోపలనుంచే కుళ్లబొడిచిన వార్త ఇంది. అమెరికా తప్పుడు చర్యలను వేలెత్తి చూపితే గయ్ మని లేచే తెలుగు బ్లాగర్లూ… అమెరికన్లను మనం ఎవరం అంటూ సాక్షాత్తూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడే దునుమాడాడీ కథనంలో. ఇప్పుడేమంటారు? సత్యాన్ని, కళ్లముందు కనబడుతున్న వాస్తవాన్ని గ్రహించడానికి ఏ రంగు కళ్లద్దాలూ కూడా అవసరం కాదనుకుంటాను.
    సకాలంలో మంచి వ్యాసం ప్రచురించినందుకు అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s