“నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంద”ని సామెత. రెండో ప్రపంచ యుద్ధంలో గోబేల్స్ సాగించిన దుష్ప్రచారం గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి నిజంగా మార్చే కళ గోబెల్స్ రుజువు చేశాడని పాఠాలు తీస్తాం. కాని గోబెల్స్ వద్ద నేర్చుకున్న పాఠాల్ని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు, వాటి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న కార్పొరేట్ పత్రికలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే గోబెల్స్‌కే పాఠాలు నేర్పేవిధంగా తయారయ్యారు.
“లిబియా యుద్ధంలో మొట్టమొదటి క్షతగాత్రురాలు నిజం” అని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. అదెంత నిజమో వృత్తి ధర్మానికి నిబద్ధులైన కొన్ని వార్తా పత్రికల ద్వారా ఇప్పుడు తెలుస్తోంది. తిరుగుబాటుదారులు లిబియా ప్రజలపై సాగించిన అకృత్యాలు, కార్పొరేట్ పత్రికలు గడ్డాఫీపై సాగించిన దుష్ప్రచారం అన్ని ఒక్కటొక్కటిగా బైటికి వస్తున్నాయి. కౌంటర్ కరెంట్స్, కౌంటర్ పంచ్, మంత్లీ రివ్యూ లాంటి పత్రికలు ఈ నిజాల్ని ప్రచురిస్తున్నాయి. పశ్చిమ దేశాల ముద్దుల అనుచరుడు ఖతార్ ఆధారంగా ఉన్న అరబ్బు ఛానెల్ ఆల్-జజీరా కార్పొరేట్ పత్రికలు స్ధానాన్ని అరబ్బు భాషలో సమర్ధవంతంగా పోషిస్తోంది. ఖతార్ పాత్రకు అనుగుణంగానే తాను లిబియా యుద్ధంపై అబద్ధాలని పదే పదే వల్లె వేస్తూ నిజాలుగా మార్చడానికి శతధా ప్రయత్నించింది. సి.ఎన్.ఎన్, బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ తదితర ప్రఖ్యాత పత్రికలకు దీటుగా దుష్ప్రచారాన్ని సాగించింది. ఆల్-జజీరా ఛానెల్ వార్తలను ప్రోయోజిజతం చేసినదెవరో వెల్లడించే కార్టూన్:
సి.ఎన్.ఎన్, ఆల్-జజీరాతో: నువ్వు మంచి బాలుడివి సుమా!
—