మూడో వంతు లిబియా ఆయిల్ ఫ్రాన్సు కైవశం, మిగిలింది బ్రిటన్, ఇటలీ, అమెరికాలకు?


ఫ్రాన్సు కష్టానికి ఫలితం దక్కుతోంది. లిబియాలో తిరుగుబాటు ప్రారంభమైన మరుసటిరోజే తూర్పు పట్టణం బెంఘాజీ కేంద్రంగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని లిబియాకు అసలైన ప్రభుత్వంగా ఫ్రాన్సు మొట్టమొదటిసారిగా గుర్తించింది. అందుకు తగిన విధంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) బదులు తీర్చుకుంటోంది. లిబియా ఆయిల్ వనరుల్లో మూడోవంతు భాగాన్ని ఫ్రాన్సు ఆయిల్ కంపెనీ టోటల్ కి అప్పజెప్పడానికి ఫ్రాన్సు లిబియాతో ఒప్పందం సంపాదించింది. ఫ్రెంచి డెయిలీ పత్రిక లిబరేషన్ ఈ మేరకు గురువారం వార్తను ప్రచురించింది. లిబియా ప్రభుత్వం ఈ మేరకు ఖతార్ ఎమిర్ కు లేఖ రాసిందని లిబరేషన్ ని ఉటంకిస్తూ మోర్నింగ్ స్టార్ పత్రిక తెలిపింది.

లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఫ్రాన్సు గుర్తించిన కొద్ది రోజులకు బ్రిటన్, ఖతార్ లు గుర్తించాయి. ఇక అప్పటినుండి ఫ్రాన్సు, బ్రిటన్ లు టి.ఎన్.సి అసలైన లిబియా ప్రభుత్వంగా గుర్తించాలని కాలికి బలపం కట్టుకుని తిరిగాయి. ఇ.యు దేశాలన్ని గుర్తించడానికి దాని సమావేశాల్లో తీవ్రంగా లాబీయింగ్ జరిపాయి. జర్మనీ లాంటి దేశాలు లిబియా వ్యవహారానికి దూరంగా ఉండాలని తలపెట్టడంతో ఫ్రాన్సు, బ్రిటన్‌ల లాబీయింగ్ పని చేయలేదు. టి.ఎన్.సికి గుర్తింపును తేవడం ద్వారా లిబియా ప్రభుత్వం పేరిట యూరోపియన్ బ్యాంకుల్లో ఉన్న దాదాపు 30 కి పైగా బిలియన్ల డాలర్లను తిరుగుబాటుదారులకు అప్పజెప్పాలనీ, తద్వారా యుద్ధ ఖర్చులను తిరిగి లిబియా పైనే వేయాలని తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే అమెరికాకి లిబియాలో వాటా తక్కువ వచ్చే అవకాశం ఉండడంతో అది అందుకు ఆసక్తి చూపలేదు. యూరప్ లో ప్రధాన దేశం జర్మనీ, మరోపక్క అమెరికాలు మొదటా సుముఖంగా లేకపోవడంతో ఎన్.టి.సి గుర్తింపు లేటయ్యింది.

ఏప్రిల్ 3 తేదీతో ఎన్.టి.సి నుండి ఒక లేఖ ఖతార్ ఎమిర్‌ కు ఈ విషయమై సమాచారం అందిస్తూ లేఖ రాసింది. “ఫ్రాన్సు, ఎన్.టి.సి ని శాశ్వతంగా, పూర్తిగా గుర్తిస్తున్నందుకు గానూ లిబియా క్రూడ్ ఆయిల్ లో 35 శాతం ఫ్రాన్సుకు కేటాయించడానికి ఒప్పందం కుదిరింది” అని లేఖ పేర్కొంది. లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం చేజిక్కించుకున్నారని భావిస్తున్న ఎన్.టి.సి కి ఇంకా ప్రపంచ వ్యాపిత గుర్తింపు సాధించడానికి ఫ్రాన్సు ప్రపంచ నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సదరు సమావేశాన్ని ప్రాన్సే తమ భూభాగంపైన నిర్వహిస్తున్నది. “ఫ్రెండ్స్ ఆఫ్ లిబియా” పేరుతో కాన్ఫరెన్సుకు ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ లు ఆతిధ్యం ఇస్తున్నారు. 60 దేశాలనుండి అధికారులు హాజరవుతున్నారని తెలుస్తోంది. లిబియా తిరుగుబాటు ముగిసినట్లుగా ఈ కాన్ఫరెన్సు ప్రకటించవచ్చునని కూడా తెలుస్తోంది.

పనిలో పనిగా యూరోపియన్ యూనియన్ లిబియాపై విధించిన ఆంక్షలను ఒక్కటొక్కటిగా ఎత్తివేస్తోంది. ఇ.యు విదేశాంగ విధాన అధిపతి కేధరిన్ ఆష్టన్, లిబియా నౌకాశ్రయాలు, బ్యాంకులు, ఎనర్జీ కంపెనీలపైన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఆరు నౌకాశ్రయాలు, డజనుకు పైగా అయిల్, గ్యాస్ కంపెనీలు, అనేక బ్యాంకులు ద్రవ్య సంస్ధలు, నేషనల్ ఎయిర్ లైన్ కంపెనీ మొదలైన కంపెనీలపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఇ.యు అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు 29 తేదీన ఇటలీ ఆయిల్ కంపెనీ “ఇ.ఎన్.ఐ” లిబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. తిరుగుబాటుతో ఆగిపోయిన దాని కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఈ ఒప్పందం కుదిరింది. లిబియానుండి మధ్యధరా సముద్రం గుండా ఇటలీకి వేసినా ఆయిల్ పైపు లైన్ ను తిరిగి తెరుస్తున్నారు.

ఇదిలా ఉండాగా గడ్డాఫీ సొంత పట్టణం సిర్టే లో 20,000 మంది సాయుధ యువకులు తమ పట్టణాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సైఫ్ ఆల్-ఇస్లాం గడ్డాఫీ టెలిఫోన్ మెసేజ్ లో తెలిపినట్లుగా పత్రికలు తెలుపుతున్నాయి. మౌమ్మర్ గడ్డాఫీ ఎడారిలో రక్షణ పొందుతున్నట్లుగా ధృవపడని వార్తలు చెబుతున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s