అమెరికా తూర్పు తీరాన్ని ‘ఇరెనె’ పెను తుఫాను వణికిస్తొంది. అమెరికా ప్రభుత్వం ఈ పెను తుఫాను తాకిడిని తట్టుకోవడానికి అసాధారణ ఏర్పాట్లు చేసింది. తూర్పు తీరాన ఉన్న న్యూయార్క్ నగరాన్ని కూడా ఇది తాకింది. ఇరెనె ను నాసా కేంద్రం తన ఉపగ్రహం నుండి తీసిన ఫోటో, పెను తుఫాను స్వరూపాన్ని తెలియజెపుతుంది. ఫొటోను బిబిసి ప్రచురించింది.
పెద్ద బొమ్మ కోసం ఫొటోపై క్లిక్ చేయండి
—
దయచేసి ఇంగ్లీష్ పదాలను, వాళ్ళెలా పలుకుతారో అలాగే వ్రాయండి, లేదంటే, ఇదే మాటలు ఫాలో అయ్యి, వేరే వాళ్ళతో మాట్లాడితే నవ్వుతారు… ఇది ఇరేనే కాదు… ఐరీన్.. ఇంగ్లీష్ పేర్లను కూడా తెలుగైజ్ చెయ్యాల్సిన అవసరం లేదు…
అంత నవ్వుకోవాల్సింది ఏముంది ఇందులో? వాళ్ళెలా పలుకుతారో నాకు తెలియకే అలా రాశాను. తెలియని విషయం తెలియజెప్పాలి గాని తమరిలా ఎగతాళి చెయ్యడం సరైంది కాదు. గమనించుకోండి కొంచెం. ఎగతాళి చేస్తూనే ఎలా పలకాలో చెప్పారు గదా, అందుకు ధేంక్స్ (ఈ పదాన్ని ఇంగ్లీషులో పలికిన విధంగానే ఎలా రాయాలో కూడా చెప్పండి. నాకు తెలియదు మరి.)
డైరెక్టర్ ని డిరెక్టర్ అనే వాళ్ళూ ఉన్నారు. ఇంగ్లీషు వాళ్ళు కూడా. హాలీవుడ్ సినిమాల్లో “ఐ డోన్ట్ నో నధింగ్” అంటున్నారు. కాని అది గ్రమేటికల్ ఎర్రర్ కదా? వాళ్లకి లేని అడ్డాలు, అభ్యంతరాలు మనకెందుకులెండి! విషయం అందితే నాకదే చాలు. మీకు నవ్వుగా ఉంటే నవ్వుకోవచ్చు కూడా. నవ్వు మంచిదే కదా? మరక మంచిదే లాగా!
ఇరాక్ ని అమెరికాలో ఐరాక్ అంటారు అందుకని మనము వాళ్ళను చూసి మార్చుకోవలసిన అవసరం లేదు. భావం తెలుస్తోంది కదా. విశేఖర్ గారూ బాధ పడవోకండి.
బాబు తెలుగొ(డ్డు)డు eenadu కూడ ఇరెనే అంటుంది కాదా.
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm
విశెఖర్ గారు మీరు బాగా వ్రాస్తారు సార్ మంచి మంచి వార్తలతొ కంటిన్యూ అవ్వండి.
ఈ తుంటరి కెలుకుడు గాళ్ళు అమెరికా బూట్లు నాకుతుంటారు లెండి.
ఇక అమెరికా ప్రజలకు ఈ తుపాను నుండి త్వరగా విముక్తి కలగాలని, ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని ప్రార్థిద్దాం
కృతజ్ఞతలు సీను గారూ. మీలాంటి వారి మద్దతు, ఇలాంటివారి చేతులు (టైపకుండా) కట్టేస్తాయి.
మన తెలుగు పేర్లను వాళ్ళు ఖూనీ చేసి మాట్లాడితే, మనకు చిరాగ్గా ఉంటుంది. నవ్వుకుంటాం. సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. అలాగే వాళ్ళ పేర్లను, వాళ్ళు పలికే రీతిలో పలకమనడం, ఎగతాళి చేసినట్టెందుకనిపించిందో మీకు. నేను క్రమం తప్పక అనుసరించే బ్లాగ్స్ లో మీదొకటి (నా ఫేవరెట్స్ లో ఉంటుంది). ప్రత్యేకంగా, అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు బాగా నచ్చుతాయి. అలాకాని పక్షం లో, ఎవడేం వ్రాసుకుంటే, నాకేంటి అని అనుకునుండేవాణ్ణి. ఇప్పటిదాకా, మీ బ్లాగ్ లో నేను ఏ కామెంట్ పోస్ట్ చెయ్యలేదు. ‘దయచేసి ‘ అన్న పదం తో మొదలెట్టినా కూడా, మీకు ఎగతాళి గా అనిపించిందంటే, not sure, where I was wrong. But, i am sorry. Once again, it was a sincere suggestion. ఎగతాళి ఏ కోశానా లేదు.
సీను బాబు! మీరెవరివి నాకుతారో నాకు తెలియదు కాని, ఈనాడు వ్రాశాడు అని, నేను కూడా ఇలాగే అంటాను, మారను అనుకుంటారా.. మీ ఇష్టం…మీ విచక్షణ కు ఒదిలేస్తాను.
తెలుగోడు గారు, మీరు “దయచేసి” అంటు మొదలు పెట్టినా ఆ తర్వాత భాగం ఎగతాళిగానే ఉన్నట్లుగా నాకు తోచింది. బహుశా మీకా ఉద్దేశ్యం లేదు కాబట్టి ఎగతాళి ధ్వనించలేదేమో కానీ, చదివిన వెంటనే మొదట ఎగతాళి ధ్వనిస్తోంది. నేను మీ వ్యాఖ్యను రెండు మూడు సార్లు పరిశీలించాను. కావాలని అలా రాయలేదేమో ననీ, నిజంగా చెప్పడానికి ప్రయత్నించారేమోనని. కాని ఎగతాళికి రాసినట్టుగానే అనిపించింది.
ఎగతాళి కాదని మీరు స్వయంగా చెప్పాక ఇంకా అదేనని నేను భావించడం సరికాదు. కనుక మీరు చెప్పిన విషయాన్ని సరిగా అర్ధం చేసుకోనందుకు క్షంతవ్యుడ్ని. అనేక దూషణల వ్యాఖ్యల మధ్య అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోవడం కష్టమైపోతోంది. తెలుగు బ్లాగర్లకు ఈ పరిస్ధితి తెచ్చిపెట్టిన వారికి, అందువలన వచ్చే ఫలితం ఏంటో అర్ధం కాని విషయం.
పోతే ఆంగ్ల పదాలను పలకడంలో మనం పెద్దగా తప్పులు ఎంచుకోవాల్సిన అవసరం లేదని నాకనిపిస్తుంది. అఫ్కోర్స్! తప్పుగా పలికినపుడు రైటేమిటో చెప్పడంలో తప్పు లేదు. కాని దానికి మరొకరు నవ్వుతారని భావించడం అవసరం లేదని భావిస్తాను. ఎందుకంటే ఇంగ్లీషు వాళ్ళకి ఉన్నది ఇరవై ఆరు అక్షరాలే అయినందున ఒకే పదాన్ని భిన్నంగా పలికి భిన్న అర్ధాలని చెబుతుంటారు. వారి పదాల్ని మనకి అర్ధం అయ్యెలా చెప్పుకుంటే చాలని నా భావన.
తమరింత నిస్సిగ్గుగా అబద్ధాలు రాస్తుంటే అవతలివాళ్ళు ఎగతాళిచెయ్యడంలో తప్పేమీ లేదు. కంత తగ్గ బొంత అంతే. మీ ఒకొక్క అబద్ధాన్నీ, సగం నిజాన్నీ బయటపెడతాను. ప్రచురించే దమ్ము ధైర్యం తమకున్నాయా?