నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1


(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం “ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కేరళ వాసి. భారత రాజకీయ ముఖచిత్రాన్ని తన సంచలనాత్మక విశ్లేషణలతో, పదునైన విమర్శతో గేలి చేయగల సాహసి. తన భావాలను ముక్కుసూటిగా, భయం లేకుండా వెల్లడించగల అరుదైన భారతీయ మహిళ. ఈమె పది రోజుల క్రితం రాసిన ఈ వ్యాసాన్ని “ది హిందూ” పత్రిక ప్రచురించింది. అన్నా హజారే వెంట భారత పట్టణ బుద్ధి జీవులు పరుగులు పెడుతున్న ఈ సమయంలో ఈ వ్యాసం అందరికీ అందవలసినది. రచయిత్రిపై వ్యక్తిగత విమర్శలు లేకుండా సద్విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేయగలరని మనవి. -విశేఖర్)
—-

మనం టివిలో చూస్తున్నది నిజంగానే విప్లవం ఐతే, అది ఇటీవల కాలంలో సంభవించిన ఇబ్బందికరమైన, తెలివిహీనమైన విప్లవం అయి ఉండాలి. ఇప్పటివరకూ (ఆగస్టు 21, 2011) చూస్తే జన్ లోక్‌పాల్ బిల్లుని గురించి ఏ ప్రశ్నయినా మీరు వేయండి, మీకు సమాధానంగా వచ్చే వీలున్నవి: (ఎ) వందే మాతరం (బి) భారత్ మాతా కి జై (సి) ఇండియా ఈజ్ అన్నా అన్నా ఈజ్ ఇండియా (ఇండియాయే అన్నా, అన్నాయే ఇండియా) (డి) జై హింద్.

పూర్తి భిన్నమైన కారణాలవలన, పూర్తి భిన్నమైన పద్ధతుల ద్వారా జన్ లోక్ పాల్ బిల్లు, మావోయిస్టులు ఒక అంశాన్ని ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారిద్దరూ భారత రాజ్యాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. ఒకరు సాయుధ పోరాటం ద్వారా, ప్రధానంగా పేదలలోకెల్లా పేదలైన ఆదివాసీ సైన్యం ద్వారా, వ్యవస్ధలో అట్టడుగున ఉన్న జనంలో పని చేస్తున్నారు. మరొకరు పైనుండి కిందికి, రక్త రహిత గాంధియన్ కుట్ర ద్వారా, తాజాగా ముద్రించబడ్డ సాధువు నాయకత్వంలో, పట్టణాల్లోని ఎంతో కొంత స్ధితిమంతులైన సైన్యంతో చేస్తున్నారు. (ఇందులో, తనను తాను కూలదోసుకోవడానికి సాధ్యమైన పనులన్నింటిని చేయడం ద్వారా, ప్రభుత్వమే వారితో కుమ్మక్కవుతుంది).

గత ఏప్రిల్ నెలలో అతి పెద్ద అవినీతి కుంభకోణాల నుండి బైడ పడడానికి దారులు వెతుక్కుంటున్న పరిస్ధితిలో, ఆ కుంభకోణాలవలన తన విశ్వసనీయత మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్ధితిలో ప్రభుత్వం ఉన్నది. ఆ సమయంలో “పౌర సమాజం” గ్రూపు, తానుగా ఎన్నుకున్న బ్రాండ్ నేమ్ “టీమ్ అన్నా” పేరుతో, అప్పటికే కొన్ని రోజుల నిరాహార దీక్ష చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వం నూతన అవినీతి వ్యతిరేక చట్టం కోసం డ్రాఫ్టు తయారు చేయడంలో భాగం కమ్మంటూ టీమ్ అన్నాను ఆహ్వానించింది. కొద్ది నెలల అనంతరం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని తానే రద్దు చేసుకుని తన సొంత బిల్లుని పార్లమెంటుముందుకు తెచ్చింది. అదెంత పనికిరాని బిల్లంటే, దీనిని సీరియస్ గా తీసుకోవడం అసాధ్యం.

అనంతరం, ఆగస్టు 16న రెండవ “ఆమరణ నిరాహార దీక్ష” ప్రారంభం అయ్యే దినాన, ఉదయం పూటే అన్నా హజారే తన దీక్షను ప్రారంభించక మునుపే లేదా చట్టబద్ధమైన నేరం ఏమీ చేయకుండానే అన్నా హజారేను ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో వేసింది. జన్ లోక్ పాల్ బిల్లును అమలుకోసం మొదలైన పోరాటం ఇప్పుడు నిరసన హక్కుకోసం పోరాటంగా, ‘ప్రజాస్వామ్యం కోసం’ పోరాటంగా మారిపోయింది. “రెండవ స్వాతంత్ర్య పోరాటం” ప్రారంభం అయిన గంటలలోనే అన్నాను విడుదల చేశారు. హజారే చాలా తెలివిగా జైలునుండి విడుదల కావడానికి నిరాకరించాడు. కాని గౌర ప్రదమైన అధితిగా తీహార్ జైలులోనే కొనసాగాడు. బహిరంగ ప్రదేశంలో నిరాహరదీక్ష చేసుకునే హక్కుని కోరుతూ అన్నా జైల్లోనే నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రజా సమూహం, టీ.వీ ఛానెళ్ల కెమెరాలు బైట వేచిఉండగా, దాదాపు అన్ని జాతీయ ఛానెళ్ళలోను ప్రసారం కావలసిన అన్నా హజారే వీడియో సందేశాలను ‘టీం అన్నా’ మొస్తూ మూడు రోజుల పాటు జైలు లోపలికి బైటికి విశ్రాంతి లేకుండా తిరిగారు. (ఇంతటి విలాసాన్ని ఇంకెవరు అనుభవించగలరు?)

ఈ లోగా ఢిల్లీ మునిసిపాలిటీకి చెందిన 250 మంది ఉద్యోగులు 15 ట్రక్కులు, 6 ఇతర ఎర్త్ మూవర్ల (మట్టిని పెకలించడం, చదును చేయడం లాంటివి చేసే పెద్ద యంత్రాలు) తో వారాంతపు అద్భుత దృశ్యం కొసం బురదతో నిండిన రాంలీలా మైదానాన్ని సిద్ధం చేయడానికి రాత్రింబవళ్ళు శ్రమించారు. కాళ్ళు చేతులపై నిలబడి నినాదాల హోరుతో వేచి చూసిన సమూహాల సాక్షిగా, క్రేన్ లపై మొహరించిన కెమెరాలు చూస్తుండగా, ఇండియాలోని అత్యంత ఖరీదైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పుడు అన్నా హజారే ‘ఆమరణ నిరాహార దీక్ష’ మూడో దశ ప్రారంభం అయ్యింది.

ఆయన పద్ధతులు గాంధీ సూత్రాల ప్రకారం ఉండొచ్చు గానీ, ఆయన డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా గాంధీ తరహావి కావు. అధికారాన్ని వికేంద్రీకరించాలన్న గాంధీ భావాలకు వ్యతిరేకంగా, జన్ లాక్ పాల్ బిల్లు ఓ రాక్షస స్వభావం కలిగిన అవినీతి వ్యతిరేక చట్టం. దాని ప్రకారం, జాగ్రత్తగా ఎన్నుకోబడిన వ్యక్తులు, వేలమంది ఉద్యోగులతో కూడిన అతి పెద్ద బ్యూరోక్రసీతో, ప్రధాని నుండి న్యాయవ్యవస్ధ, పార్లమెంటు సభ్యులు, మొత్తం బ్యూరోక్రసీలతో పాటు కింది స్ధాయి ప్రభుత్వాధికారి వరకూ అందరిపైనా విచారణ చేయగల అధికారాన్ని కలిగి ఉంటారు. లోక్ పాల్ కి పరిశోధన చేసే అధికారం, నిఘా పెట్టే అధికారం, ప్రాసిక్యూట్ (విచారణ) చేసే అధికారం అన్నీ ఉంటాయి. సొంతానికి జైళ్ళు మత్రమే తక్కువ తప్ప సర్వ స్వతంత్రంగా వ్యవహరించే ఈ లోక్ పాల్ వ్యవస్ధను, మనకిప్పటికే ఉన్న లెక్క చూపని అవినీతితో నిండి ఉన్న బ్యూరోక్రట్ వ్యవస్ధకు వ్యతిరేకంగా మొహరించడానికి ఉద్దేశించారు. కొద్ది మందితో కూడిన ఒక గుంపు పరిపాలన స్ధానంలో రెండు గుంపుల పరిపాలన అన్నమాట!

అది పనిచేయగలదా లేదా అన్నది మనం ఏ దృక్పధంతో అవినీతిని చూస్తున్నామన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అవినీతి అనేది కేవలం చట్టబద్ధత, ఆర్ధిక అక్రమాలు, లంచాలకు సంబంధించిన విషయమేనా, లేక అతి కొద్ది మంది ఇంకా అతి కొద్దిమంది గల మైనారిటీ సమూహం చేతుల్లో అధికారం ఎప్పటిలాగానే కేంద్రీకరించబడి ఉండే మోసపూరితమైన అసమాన వ్యవస్ధలో జరిగే సామాజిక లావాదేవీలకు సంబంధించినదా? ఉదాహరణకు షాపింగ్ మాళ్ళతో కూడిన ఒక నగరాన్ని ఊహించండి. ఆ నగర వీధుల్లో లాగుడుబండ్లపై వ్యాపారాలు చేసుకోవడం నిషేధం. షాపింగ్ మాళ్ళలోని అధిక ధరల సరుకుల్ని కొనగల స్తోమత అందరికీ ఉండదు. స్ధానిక బీటు కానిస్టేబుల్ కో, మున్సిపాలిటీకి చెందిన చిన్న అధికారికో నిషేధ చట్టాన్ని అతిక్రమిస్తున్నందుకు కొద్దిపాటి డబ్బు చెల్లించి, అటువంటి వారికి తన సరుకుల్ని ఒకావిడ అమ్ముతుంది. అదేమన్నా అంత భయంకరమైనదా? భవిష్యత్తులో ఆమె, స్ధానికంగా ఉండే లోక్ పాల్ ప్రతినిధికి కూడా మూమూళ్ళు చెల్లించవలసి ఉంటుందా? సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వ్యవస్ధాగత అసమానతలలో ఉంటుందా, లేక ప్రజలు నెత్తిన కూర్చునే మరొక అధికార వ్యవస్ధను సృష్టించడంలో ఉంటుందా?

ఈ లోగా అన్నా విప్లవానికి వస్తున్న కొరియోగ్రఫీ, కలహశీల (అగ్రెసివ్) జాతీయవాదం, జెండా ఊపుడు మద్దతు ఎక్కడిది? అవన్నీ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలనుండీ, ప్రపంచ కప్ విజయానంతర ఆనందోత్సాహ సంరంభాలనుండీ, అణ్వస్త్ర పరీక్షలపై జరిగే ఉత్సవాలనుండీ అరువు తెచ్చుకున్నవే. నిరాహార దీక్షకు మద్దతు తెలపకపోతే మనం ‘నిజమైన భారతీయులం’ కాదని వాళ్ళు మనకు సూచిస్తారు. యావత్ దేశంలో అంతకంటే విలువైన వార్తలేవీ లేవని ఇరవై నాలుగు గంటల వార్తా ఛానెళ్ళు నిర్ణయించేశాయి.

నిరాహార దీక్ష అంటే మణిపూర్ రాష్ట్రంలో విధించబడిన “సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం” (ఆర్మడ్ పవర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ – ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) కి వ్యతిరేకంగా పది సంవత్సరాల నుండి “ఇరోమి షర్మిల” చేసున్నది కాదన్నమాట! (ఆమెకిప్పుడు బలవంతంగా ద్రవాహారాల్ని ఎక్కిస్తున్నారు). మణిపూర్ లో కేవలం అనుమానతోనే ఎవరినైనా చంపగల అధికారం సైనికుడికి ఈ చట్టం ఇచ్చింది.  నిరాహార దీక్ష అంటే కూడంకుళం లో అణు కర్మాగారం నిర్మాణానికి వ్యతిరేకంగా పదివేల మంది గ్రామస్ధులు ఇప్పటికీ సాగిస్తున్న రిలే నిరాహార దీక్ష కాదన్నమాట! “ప్రజలు” అంటే “ఇరోమి షర్మిలా” నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చే మణిపురి వాసులు కాదు!  జగత్ సింగ్ పూర్ లేదా కళింగ నగర్, లేదా నియంగిరి లెదా బస్తర్ లేదా జైతాపూర్ లలో సాయుధ పోలీసులనూ, మైనింగ్ మాఫియాకు ఎదురొడ్డి పోరాడుతున్న వేలమంది కూడా కాదు! భోపల్ గాస్ లీక్ బాధితులు కాదు! నర్మదా లోయలో తమ భూములు, ఇళ్ళనుండి గెంటివేయబడ్డవారూ కాదు! నొయిడా రైతులు, పూనే లోనో, హర్యానా లోనో లేదా మరొకచోటో తమ భూముల్ని లాక్కోవడాన్ని ప్రతిఘటిస్తున్నవారు కూడా ప్రజలు కాదు!

….తరువాయి రెండో భాగంలో

19 thoughts on “నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1

 1. Dont quite understand your stand here Sekhar.

  అన్నా అనవసరంగా దీక్ష చేస్తున్నరని మీ అభిప్రాయమా?
  ఆయన తన స్వార్ధ్హ ప్రయోజనాలకోసమే మొదలు పెట్టరని మీ ఉద్దేశమా?
  ఆయన దీక్షకి వేరే priority(backwardness etc) ఎంచుకోవలిసిందని మీ అభిప్రాయమా?

 2. People ni emotional arrest ki guri chesi chesthunna vunmaadam idi…….dictators laaga nenu cheppinde bill anatam, enti….Its againest the parliamentary system…..asalu oka MP anukonnade jaragataani ki ledu majority vunte thappa……..ee jandaallu pattukonna vaalla ki bill lo emundo teleedu…..avineeti ki vyatirekam anthe bill gurinchi telisindhi……..kaneesam bill ayinaaa correct vundaa ante .no….repu loakpal team critical situation lo apposition to kummakai Gov instabilize cheste em chestaaru………..Pedda vyvasta lo chinna thappulunna ok………kaani oka chinna vyavasta……intha pedda desa rakshananu…stability ni oka chinna team cheti lo pedite adi pedda thappe avuthundhi…………

 3. Repu inko gaandeyavaadi…inko rule ni dictacte chestaaru……….em chestaaru paapam …ee emotional people Vote bank kaapadukotaani ki …gov anniti ki ok antundhi………ledante anna gaari haani jarigite…..enni votes loss………

 4. Naa abhiprayam…….anna prajalni chaitanya parachatam good………Anni offices lo e pani ki entha time paduthundhi..everu responsible ani boards petaali………..ilaantivi good…….ilaati vaati kosam poraadatam abhinandaneeyam……china maarpu ni testay…….evi aacharanamo avi vunchatam good…………kaani oka team tayaaru chesi…….oke okkadu cinema laago…baharateeyudu cinema laago cheyaali ante kudaradu kadaa………

  Pedda maarpu kosam systems ni automate cheyaali manual intervention ni thagginchi…….every manual intervention ni monitor system to atatch cheyaali…….deeni valana saamanya praja la ki daily ibbandulu thapputhai……andaroo samtrupti chendutaaru

  Inkaa pedda andaroo harshinchedi raavali ante…Joak pal laa gaa kakaundaa……..lokpal ne pedda vyavsta gaa(with Lokayuktas) possible systems integration and rules oka vyavasta gaa teesukuraavali…..oka team laa kakaundaa

  athi pedda maarpu kosam citizens ni child hood nunchi teerchukovalai…bharata desam lo andaroo garva padaali ante……

 5. ఆర్థిక అసమానతలు పెద్ద సమస్యా లేదా అవినీతి పెద్ద సమస్యా? శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని కార్మికుల నెల జీతం 3500. ఇదే జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగుల జీతం నెలకి 40 వేలు వరకు ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల నెల జీతం కేవలం 2500. అది బ్యాంక్ ఉద్యోగి కట్టే ఇంటి అద్దె కంటే తక్కువ. శ్రీకాకుళం పట్టణంలో అపార్ట్‌మెంట్‌లలో అద్దె 5000 ఉంటుంది. వైజాగ్‌లో అది 9000 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ లాంటి ప్రాంతాలలో 13000 వరకు ఉంటుంది. పల్లెటూరులో పెంకుటిల్లు 1000 రూపాయలకి అద్దెకి దొరుకుతుంది, మేడిల్లు 1500 అద్దెకి దొరుకుతుంది. ఆర్థిక అసమానతలు, జీవన ప్రమాణాలు (standard of living) గురించి మాట్లాడకుండా కేవలం అవినీతి గురించి మాట్లాడితే అది ప్రగతి పథం అవుతుందా?

 6. when the parliamentary system fails, this is inevitable. perhaps we should look at genuinity of the cause and can provide suggestions rather than simply saying he is wrong. he never said that corruption can be completely abolished with janlokpal. but this act has been under discussion since last 43 years and why the people who claim them self as supreme could not do anything for that? if one wants to question someone, it is to question the law makers rather than questioning anna if he is correct or not. why all these people who are comparing with sharmila are not able to bring this into agitation or at least raise the voice constantly. why they are bringing this issue only when anna is on fast. before this also they could have brought this issue constantly so that people do not forget that if they are so critical on issues. i think all these things are raised now just to dilute the issue just like what the congress claimed future prime minister was talking in parliament yesterday.

 7. one should not wait for anna to raise these issues. can take him as inspiration and start agitation on what they believe strongly. infact anna did something in his village to bring equality. may be people who talk about these should try to get inspiration from his model village. I am sure this is difficult for many of us (almost all of us) as we are not prepared to give up properties and live in temple.

 8. మురళీధర్ గారూ, అరుంధతీరాయ్, స్వామి అగ్నివేశ్ లాంటివారు ఇప్పుడు కొత్తగా మాట్లాడడం లేదన్న సంగతిని ముందు మీరు తెలుసుకోవాలి. ఇరోమి షర్మిలా, కాశ్మీరు లో భద్రతా బలగాల భీభత్సం, మణిపూర్ లో పారామిలట్రీ రేప్ లు, నియంగిరి, పోస్కో తదితర సమస్యలపై వీరు చాలా చురుకుగా పని చేశారు. కాకుంటే మీడియా అటువంటి వాటిని కవర్ చేయడానికి ఇస్టపడదు. ఎందుకంటే మీడియా మొత్తం కార్పొరేటీకరణ అయ్యాక వాటి ప్రయోజనాలు కంపెనీల ప్రయోజలతో పెనవేసుకుపోయాయి. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వారి ప్రయోజనాలు ఉన్నందున ప్రజలకోసం జరిగే ఉద్యమాలు వారి ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. అందుకే ప్రజా ఉద్యమాలను అవి పట్టించుకోవు. కొన్ని మీడియా సంస్ధలు ఒక్కోసారి ప్రజల ఉద్యమాలపై వ్యతిరేక వార్తలు కూడా రాస్తాయి.

  అన్నా హజారే ఉద్యమాన్ని మీడియా కవర్ చేస్తున్నది కదా, అనవచ్చు. అక్కడే మనం కొంత అలోచించవలసి ఉంటుంది. ఎప్పుడూ ప్రజల ఉద్యమాలను కవర్ చేయకుండా వదిలివేయడమో, లేదా వ్యతిరేకంగా రాయడమో చేసే మీడియా అన్నా ఉద్యమానికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తోంది? అన్నా ఉద్యమంలో అవి తమ ప్రయోజనాలను చూసుకోగలుగుతున్నాయి గనక ఆయనకంత ప్రాధాన్యం. అన్నా ఉద్యామనికంటే ముందునుండీ పోస్కో ఉద్యమం సాగుతోంది. మొత్తం గ్రామాలనే సౌత్ కొరియా కంపెనీకి ఇచ్చేశారు. పోస్కో కంపెనీ వలన పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతుంది. వాస్తవానికి పోస్కోకి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిని నిరాకరించింది. మన ప్రధాని ఓసారి సౌత్ కొరియా వెళ్ళినపుడు ఆ ప్రభుత్వం ఆయనను ప్రభావితం చేసింది. ప్రధాని పోస్కో బాధ్యత నెత్తిన వేసుకుని ప్రారంభ అనుమతులు ఇప్పించాడు (చట్టాలను ఉల్లంఘిస్తూ). కాని పర్యావరణ అనుమతి గత నెలవరకూ రాలేదు. గత నెలలో రాష్ట్రపతి సౌత్ కొరియా సందర్శించింది. ఆమెనూ ప్రభావితం చేసేసరికి ఆమె లాబియింగ్ చేసి పర్యావరణ మంత్రి రమేష్ ఇష్టానికి వ్యతిరేకంగా పోస్కోకి అనుమతి ఇచ్చారు.

  విదేశీ బహుళజాతి సంస్ధల ప్రయోజనాలని నెరవేర్చడానికి హామీ ఇచ్చి ఆ హామిలను ఒక పరువు సమస్యగా తీసుకుని దేశీయ చట్టాలను ఉల్లంఘించి దేశ ప్రజలను వారి ఊరినుండి వెళ్ళగోట్టే ప్రాజెక్టుకి ప్రధాని, రాష్ట్రపతిలు అనుమతులు ఇప్పించారు. వీళ్లు దేశానికి ప్రధాని రాష్ట్రపతులా? లేక సౌత్ కొరియాకో, పోస్కోకో మాత్రమే ప్రధాని రాష్ట్రపతులా? దేశ ప్రభుత్వంలో అత్యున్నత పదవులను అలంకరించిన ఇద్దరు వ్యక్తులు పది పదిహేను గ్రామాల ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటే అంతకంటే ముఖ్యమైన సమస్య, దారుణమైన అవినీతి ఉంటుందా? అందుకే ఆ సమస్యలు కూడా పట్టించుకొండి అనేది. అక్కడ గిరిజనులు, ఆదివాసీలు తమలపాకు తోటలపై ఆధారపడి బతుకుతున్నారు. అది తప్ప వారికి బతుకు లేదు. కాని పోస్కో కంపెనీ ప్రవేటు సైన్యాలు తమలపాకుల తోటల్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వమూ మాట్లాడలేదు. పోలీసులు మాట్లాడలేదు. పౌరసమాజమూ పట్టించుకోలేదు. అది కూడా అవినీతే కదా?

  ఇలాంటి ఉద్యమాలు దేశం నిండా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లొ జరుగుతున్నాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టుల వలన నిర్వాసితులైన వారికే నష్టపరిహారం అందలేదు. ఇప్పుడు కూడా ముందు ఖాళీ చేయండి నెమ్మదిగా నష్టపరీహారం ఇస్తామంటారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వెళ్ళి ఎలా బతుకుతారు, ఇవేవీ ప్రభుత్వాలకి పట్టవు. ఇంత దారుణ మైన అవినీతి దేశంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ల పేరిట ప్రభుత్వంలోని మంత్రులే స్వయంగా పాల్పడుతుంటే అవెందుకు పౌర సమాజానికి కనపడవు? అరుంధతీ రాయ్ వేస్తున్న ఒక ప్రాధమిక ప్రశ్న ఎందుకు గమనించరు? ఇప్పటికే ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న బ్యూరోక్రసీ ఉంటే, ఆ బ్యూరోక్రసీ అవినీతిని అరికట్టడానికి మరొక బ్యూరోక్రసీని అది కూడా మరిన్ని అధికారాలతోటి (అంటే మరింత నిరంకుశమైనదని అర్ధం) నిర్మిస్తే అది పరిష్కారమా అని ఆమె అడుగుతోంది. ఇక్కడా అన్నా గొప్పతనమో, అరుంధతీరాయ గొప్పతనమో కాదు దేశానికి కావలసింది. వారి వాదనల్లో మెరిట్ ని డీమెరిట్ ని చూడాలి. రెండింటిపైనా చర్చించుకోగలగాలి. తద్వారా మనం కూడ సరైన జ్ఞానాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించాలి.

  నిజానికి అన్నా హజారే సీజనల్ ఉచ్యమకారుడు. ప్రస్తుత అవినీతి ఉద్యమం ముగిస్తే ఇక ఆయన కనపడడు. కానీ అరుంధతీరాయ్, స్వామీ అగ్నివేశ్, ఆర్.ఎస్.శర్మ, హరగోపాల్ తదితర ప్రముఖులు నిరంతరం ఏదో ఒక ప్రజా ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటున్నారు. ముందు చెప్పినట్లు పత్రికలకు వాటిని కవర్ చేయడానికి ఇష్టపడవు. మనం చూడదలుచుకుంటే గనక ఏదో రూపంలో వారు పాల్గొంటున్న ఉద్యమాలు కనపడతాయి. మీరు భావించినట్లు అన్నా ఉద్యమానికి అరుంధతి లాంటివాళ్ళు కాదు అడ్డం. అన్నా హజారే లాంటి వారు గిరిగీసుకుని చేసే పరిమిత ఉద్యమాలే ప్రజ ఉద్యమాలకు అడ్డంగా వస్తాయి. అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమం ముగిశాక ఇక అవినీతి గురించి ఇతరులు ప్రశ్నించే అవకాశం ఉండదు. జన్ లోక్ పాల్ తెచ్చాం గదా అని ప్రభుత్వం అంటుంది. మరి పోస్కో, నియంగిరి, ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టం తదితర అవినీతి సమస్యలు అన్నా గారి జన్ లోక్ పాల్ లో స్ధానం లేదు. అవి కొనసాగుతాయి. అన్నా ఉద్యమం పర్యవసానం అది.

  ప్రభుత్వాలకి అన్నా చెబుతున్న పరిష్కారం పెద్ద కష్టం కాదు. అందుకే అన్నాకి అంత ప్రాధాన్యత. జైలులో కూడా సౌకర్యవంతగా గడిపి, జైలులో ఉంటూనే పత్రికలు ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వగల సౌకర్యం ప్రభుత్వాలకి వ్యతిరేకించే ఉద్యమకారులకి ఉంటాయా? ఉండక పోగా చీకటి గదుల్లో పడేసి చిత్రహింసలు పెడతారు. అరుంధతిరాయ్, ఇంకా ముగ్గురి పైన రాజద్రోహం నేరం కేసు నమోదు చేశారు. అరుంధతిరాయ్ కి కూడా విస్తృతమైన ప్రజా మద్దతు వస్తుంది. కాకపోతే వారంతా పట్టణాల్లోని మధ్యతరగతివాళ్ళు కాదు. వాళ్ళు ఆదివాసిలు, దళితులు, ఇంకా కటిక పేదలు. ఎందుకింత తేడా? దేశంలో జరుగుతున్న ఉద్యమాల గురించి ముందు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అవి తెలియకపోతే ఒక్క అన్నా తప్ప ఇంకెవ్వరూ ఉద్యమించడం లేదని మీరు భావించినట్లుగా భావించే ప్రమాదం ఉంది. హింసకు పాల్పడకండి అని అన్నా అంటున్నాడు. ఎలాంటి హింసా చేయకపోయినా పోలీసులు ఉద్యమకారుల్ని కాల్చి చంపుతున్నారు. ప్రజలు ఉద్యమించినచోటల్లా నగ్జలైట్లో, తీవ్రవాదులో ఉన్నారని సాకు చూపి కాల్చి చంపుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న హత్యలేనని కొద్ది రోజుల క్రితమే సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తలంటింది.

  అన్నా ఉద్యమాన్ని ఒకరు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు మురళీ గారూ, చూస్తూ ఉండండి. జన్ లోక్ పాల్ ఆమోదించినా, అవినీతి ఏమాత్రం తగ్గదు. మరింత మందికి అవినీతికి పాల్పడగల అవకాశాలు విస్తరిస్తాయి అంతే. అన్నా దీక్ష విరమించాక జన్ లోక్ పాల్ గురించి తలచుకునే వారే ఉండరు. జెండాలు ఊపుతూ భారత్ మాతాకి జై అని ఇప్పుడు నినదిస్తున్నవారంతా దీక్ష ముగిసాక ఇక ఏ ఉద్యమాల్లోనూ కనపడరు.. ఈ ఉద్యమంలో కొత్తగా పేరు సంపాదించినవారెవరైనా ఉంటే వారు కాంగ్రెస్ లోనో, బి.జె.పి లోనో రాజకీయ నాయకులుగా మారతారని బల్ల గుద్ది చెప్పొచ్చు. జయ ప్రకాష్ నారాయణ్ సాగించిన ఉద్యమంతో పోలిస్తే అన్నా ఉద్యమం సోదిలోకి కూడా రాదు. కాని జె.పి ఉద్యమంలో ఒక్క వెలుగు వెలిగిన వారంతా రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. వారు కొందరు కొత్త పార్టీలు పెడితే మరికొందరు అటు కాంగ్రెస్ లోనూ, ఇటు బి.జె.పి లోనూ కలిసి పోయారు. అన్నా అనుచరులూ అంతే. లేకుంటే యధావిధిగా జీవితాలు వెళ్లబోస్తూ గడుపుతారు. మళ్లీ ఉద్యమం అని అనడం మాత్రం అరుదుగా జరిగేదే. ఇదంతా జరిగిన, జరుగుతున్న, జరగనున్న చరిత్ర.

 9. I am not supporting corruption or not against lokpal…just against Joakpal and the way of dictating the guidlines of the Joakpal………..people should think the consequences…keepinga single team of 9 people for such big functionality………Also supported the really required things” Like Displaying the office chapter at very gov office”..
  Thanks
  Vara

 10. “దేశంలో జరుగుతున్న ఉద్యమాల గురించి ముందు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అవి తెలియకపోతే ఒక్క అన్నా తప్ప ఇంకెవ్వరూ ఉద్యమించడం లేదని మీరు భావించినట్లుగా భావించే ప్రమాదం ఉంది. హింసకు పాల్పడకండి అని అన్నా అంటున్నాడు. ఎలాంటి హింసా చేయకపోయినా పోలీసులు ఉద్యమకారుల్ని కాల్చి చంపుతున్నారు. ప్రజలు ఉద్యమించినచోటల్లా నగ్జలైట్లో, తీవ్రవాదులో ఉన్నారని సాకు చూపి కాల్చి చంపుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న హత్యలేనని కొద్ది రోజుల క్రితమే సుప్రీం కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తలంటింది.

  అన్నా ఉద్యమాన్ని ఒకరు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉండండి. జన్ లోక్ పాల్ ఆమోదించినా, అవినీతి ఏమాత్రం తగ్గదు. మరింత మందికి అవినీతికి పాల్పడగల అవకాశాలు విస్తరిస్తాయి అంతే. అన్నా దీక్ష విరమించాక జన్ లోక్ పాల్ గురించి తలచుకునే వారే ఉండరు.”

  చాలా ఆలస్యంగా మీ కథనం చూస్తున్నాను. అరుంథతీరాయ్ వ్యాసంపై వ్యాఖ్యలకు మీ ప్రతిస్పందన మరింత చక్కగా ఉంది. ఇక్కడ ప్రస్తావించిన మీ స్పందన భాగం పట్ల జాతి మొత్తం తనకు తాను ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పుకోవలసిన అవసరముంది. పాలకవర్గాల, కార్పొరేట్ సంస్థల కనుసన్నుల్లో మెదులుతున్న మీడియా పదే పదే ఒక విషయాన్ని ఊదరగొడుతోందంటే ఆ విషయం పట్ల చాలా అనుమానంగా చూడవలసిన అవసరముంది.

  గాంధేయవాదం లాగే అన్నా హజారే ఉద్యమంలోని డొల్లతనాన్ని పచ్చింగా చూపించడమే అరుంథతీరాయ్ వ్యాసం ఘనత. అప్పుడే టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి కార్పొరేట్ ముద్దుల పత్రికలలో ఆమె మీద విషపు రాతలు మొదలైపోయాయి

  ‘జీవన ప్రమాణాలు (standard of living) గురించి మాట్లాడకుండా కేవలం అవినీతి గురించి మాట్లాడితే అది ప్రగతి పథం అవుతుందా’ ఈ కథనానికి ప్రవీణ్ శర్మ గారి ఈ వ్యాఖ్య హైలెట్.

  అన్నా వ్యక్తిగత ఆదర్శ జీవితం పట్ల, నిరాడంబర వ్యక్తిత్వం పట్ల, సాధుజీవనం పట్ల అపరిమిత గౌరవాభిమానాలు ప్రదర్శిద్దాం. నిజమే.. తనకున్న కొద్ది ఆస్తులను కూడా వదులుకుని ఆలయంలో జీవించడం ఈ దేశంలో నిజంగా ఒక మహనీయ ఘటన. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో కూడా నిస్సందేహంగా ఆయన జీవించి చూపారు. కోట్లాది మందిని ఒక పిలుపుతో ఆకర్షించారు. కేంద్రప్రభుత్వాన్ని ఇటీవలికాలంలో ఎన్నడూ లేనంతగా చేష్టలుడిగేలా చేశారు.

  కాని ఆయన చేపట్టిన దీక్ష అంతిమ ఫలితాలు ఎలా ముగియనున్నాయో గ్రహిస్తున్న కొద్దీ భయమేస్తోంది. గత ఇరవయ్యేళ్లుగా ఆయన ముంబై కుంభకోణాలనుంచి మొదలుకుని ఎన్నోసార్లు వార్తలకెక్కారు. చాలాసార్లు ప్రభుత్వాల తల వంచారు కూడా. ఆయన పోరాటం, విజన్ నిజంగా సమాజంపై ప్రభావం వేసి ఉన్నట్లయితే దేశంలో అవినీతి, అనీతి ఒక్కశాతమైనా తగ్గి ఉండాలి. ఎవరయినా దీనికి దాఖలా చూపగలరా…?

  ఒక్క మాటలో చెప్పాలంటే గౌరవనీయ అన్నా… అపరగాంధేయవాది అన్నా.. ఆస్తి పట్ల, స్వంత జీవితం పట్ల ఎలాంటి వ్యామోహం లేని అన్నా.. ఈ దేశపు నిజమైన భాగ్యహీనుల పట్ల ఆవేదనతో లేరు. ఈ వ్యవస్థ రక్కసి కోరల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సమూహాల పట్ల అన్నాకు విజన్ లేదు. ఆయన సెజ్‌లను వ్యతిరేకించలేరు. కార్పొరేట్ ప్రభువులను వ్యతిరేకించలేరు. ఈ దేశంలో అన్ని రకాల అవినీతులు నయవంచనలకు పాల్పడుతున్న అసలైన పెద్ద తలకాయల్లో ఒక్కరికి కూడా శిక్ష పడేలా చేయలేరు.

  ఈ జెండావందనాలు, భారత్ మాతాకు జై పిలుపులూ, బుగ్గలపై త్రివర్ణ పతాకాలు.. యువత ఫ్యాషన్ పోరాటాలు ఏవీ రేపు మిగలవు.

  ఈ గొప్ప ఉద్యమం సాధించబోయేదీమీ లేదు…. ఇది నిరాశా వాదం కాదు. 64 ఏళ్లుగా చూస్తున్నాం. రేపు ఇలాగే చూస్తాం. ఈ దేశపు నిజమైన పేదల ఆక్రందనలను పట్టించుకోని, గుర్తించని రకం దీక్షలు, ఉద్యమాలు అవెంత గొప్పవైనా.. అవెంత గొప్పగా ప్రదర్శించబడుతున్నవైనా అవి అంతిమ ఫలితాలను ఇవ్వలేవు.

  ప్రజాస్వామ్యమనే బూటకపు నాటకరంగం మీద అన్నాహజారే ప్రస్తుత ప్రదర్శన ఒక చారిత్రక అభాస మాత్రమే. అందుకే రేపటిని తల్చుకుంటే భయమేస్తుంది. అన్నాను గుర్తు తెచ్చుకుంటే బాధేస్తుంది.

 11. విశేఖర్ గారూ! అరుంధతీ రాయ్ వ్యాసాన్ని తెలుగులో శ్రద్ధగా అందించినందుకు అభినందనలు! అన్నా హజారే చిత్తశుద్ధిని గౌరవిస్తూనే ఆయన ఉద్యమ పరిమితులను గ్రహించటం అవసరం. అరుంధతీరాయ్ తన వ్యాసంలో చెప్పిన విషయాలు నిష్పాక్షికంగా ఆలోచించదగ్గవి.
  ఈ టపాలో మీ వ్యాఖ్య, రాజశేఖరరాజు గారి వ్యాఖ్య ఈ ఉద్యమం మంచిచెడ్డలపై భిన్న కోణాల చర్చనీయాంశాలను బయటపెట్టాయి.
  అన్నా ఉద్యమానికి వచ్చిన కీర్తిలో భాగం కోసం అవినీతిపరులైన రాజకీయ నాయకులు కూడా పోటీ పడుతున్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని పట్టించుకోనివారు కూడా ఇప్పుడు అభిమానగణంలో చేరిపోయారు. అన్నా ఇప్పుడు పెద్ద బ్రాండ్ నేమ్. నగరాల్లో వ్యాపార సంస్థల ప్రకటనలూ, హోర్డింగులూ అన్నా పేరిట శిరసెత్తుకుని నిలబడుతున్నాయి, గమనించారా?

 12. Rallabhandy Ravindranath (http://www.facebook.com/rnral02)
  I am not feared about the outcome of his agitation but about the results after agitation as some more people may follow Hazare for their illegal demands like Kasab may agitatate or Raja may go on indefinite fast for his relaease or Jagan may take procession of 1.00 lakh people (they will be paid hefty amounts from his booty) in front of parliament to declare him an innocent person etc. Hazare (he does not deserve to be called Anna) showed and argued that the opinion of majority people is greater than parliament.

 13. కానీ అరుంధతీరాయ్, స్వామీ అగ్నివేశ్, ఆర్.ఎస్.శర్మ, హరగోపాల్ తదితర ప్రముఖులు నిరంతరం ఏదో ఒక ప్రజా ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటున్నారు. !!!

  I think స్వామీ అగ్నివేశ్ is stripped of his innocence!

 14. నిజానికి స్వామి అగ్నివేశ్ నేను ప్రస్తావించిన ఇతరులతో పోలిస్తే “ఆడ్ మేన్ అవుట్” లాంటివాడు. స్వామి అగ్నివేశ్ ను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు మద్యవర్తిగా ఉండాలని కోరింది. అందుకు ఆయన అంగీకరించి మావోయిస్టులతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాడు. మావోయిస్టుల నాయకుడు ఆజాద్ తో సంబంధాలు పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పంపిన ఓ ఉత్తరానికి సమాధానంగా మావోయిస్టు పార్టీ రాసిన ఉత్తరాన్ని ఆజాద్ తీసుకుని స్వామి అగ్నివేశ్ ను కలవడానికి వస్తుండగా పోలీసులు వెంటాడి పట్టుకుని ఎ.పి కి తెచ్చి కాల్చి చంపారు. దానికి ఎన్ కౌంటర్ అని పేరు పెట్టారు.

  ఈ ఘటన పట్ల స్వామి అగ్నివేశ్ నిజాయితీగా పతిస్పందించాడు. కేంద్ర ప్రభుత్వంపై అజాద్ మరణంపై వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆ విచారణ సందర్భంగా ఇటీవలే సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా తప్పు పట్టింది. బూటకపు ఎన్ కౌంటర్లన్నీ సర్కారు చేస్తున హత్యలేనని చెప్పింది. ఆజాద్ హత్య పైన విచారణ జరగడానికి అగ్నివేశ్ పట్టుదలగా ఉన్నాడు. అందుకని ఆయనకి వ్యతిరేకంగా ప్రభుత్వం కత్తిగట్టింది.

  స్వామి అగ్నివేశ్ సల్వా జుడుం పైన కూడా పోరాడాడు. పోలీసులు చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల వేట పేరుతో గిరిజన గ్రామాలను చుట్టుముడితే వారికి అన్న పానీయాలు తీసుకెళ్ళాడాయన. అప్పుడు స్పెషల్ పోలీసులు ఆయన కాన్వాయ్ ని చుట్టుముట్టి ఆహార పదార్ధాల్ని నేలపాలు చేశారు. దీనిపైన ఆయన కోర్టు కెళ్ళి అనుమతి తెచ్చుకుని గిరిజనులకి అన్నం అవీ తీసుకెళ్ళాడు. ఇవన్నీ అగ్నివేశ్ తరపునుండీ చూస్తే చాలా ధైర్యంతో చేసిన చర్యలు. అలాంటి వ్యక్తి అన్నా హజారె దీక్షపై అలా వ్యవహరిస్తాడనడం నమ్మశక్యం గా లేదు.

  తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధాలనీ, వీడియో డాక్టర్డ్ అని అగ్నివేశ్ అంటున్నాడు. వీడియో నిజమే అయితే, అది సమర్ధనీయం కాదు.

 15. ఇక్కడ ఒక మూర్ఖురాలు దేశద్రొహి అయిన ….. (ఎడిట్ చేయబడింది)

  వ్యాఖ్యాత, రచయిత్రి వ్యాసంపైన స్పందించే బదులు వ్యక్తిగతంగా దూషిస్తూ రాసినందున ఈ కామెంటును తొలగించాను. -విశేఖర్.

  (వ్యక్తిగత దూషణలకు నా బ్లాగ్ లో స్ధానం లేదు. కనుక మిత్రులు గమనించి అటువంటి వ్యాఖ్యలను ఇక్కడ పోస్ట్ చేయవద్దని విన్నవిస్తున్నాను. -విశేఖర్)

 16. agreed completely with your argument. my only concern is how far it is good to say anna is nothing compared to others when these people are fighting on different issues which have their uniqueness. it true that unless people change them self, it is difficult to bring change (may be impossible as well). anna just started something in that direction. it will succeed or not depends on several factors. infact anna as an individual tried to work at gross root level in his village and showed some results. i’m not sure if the movement is infact lead by anna as many people think. anna just got involved in this and started to work actively unlike many who just say few words rather than showing it in action. it is fault of people who made him leader rather than anna who is trying to do something rather than saying.

 17. ఏమీ చేయకుండా పండిత చర్చలతో సరిపెడుతూ కూర్చున్న అనేక మంది కంటే అన్నా హజారే చాలా బెటర్. అందులో అనుమానం అనవసరం. అరుంధతీ రాయ్ గానీ, లేదా ఆమెలాగా విమర్శలు చేస్తున్న మరొకరికి గానీ అన్నా హజరే తో మౌలిక విభేదం ఒకటుంది. అవినీతిని చూసే దృక్పధంలొనే ప్రధానంగా ఆ తేడా ఉంది. అన్నా హజారే కూడా మాటల్లో అంగీకరించే వాదన “వ్యవస్ధ మారితే కానీ అవినీతి పూర్తిగా అంతం కాదని”. అరుంధతీ రాయ్ లాంటివారు చెబుతున్నది అదే. కాకుంటే అన్నా మాటలతో సరి పెడితే అరుంధతి రాయ్ కాకపోయినా అటువంటి దృక్పధం ఉన్నవారు చాలామంది చేతలలో ప్రయత్నిస్తున్నారు, వ్యవస్ధ మార్పు కోసం. అన్నా నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, ఆయన మాటల్తో సరిపెట్టడం ఏమిటి? అనవచ్చు. ఆయన అవినీతి వ్యతిరేక చట్టం కావాలని దీక్ష చేశాడు కానీ, అవినీతికి మూల కారణమైన వ్యవస్ధ మార్పు కోసం ఏమీ ఉద్యమం చేయలేదు. వ్యవస్ధ మార్పు కోసం ఆయన కార్యాచరణ ప్రారంభిస్తే, అరుంధతీ రాయ్ లాగా దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటాడు. లేదా మావోయిస్టులకు ప్రభుత్వాలు చేస్తున్న మర్యాదే ఆయనకీ చేస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s