నాటో బలగాలు నాయకత్వం వహించిన “లిబియా తిరుగుబాటు” పూర్తయ్యిందని అమెరికా ప్రకటించింది. ఇన్నాళ్లూ లిబియా ఆయిల్ వనరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలిపోయినట్లుగా పత్రికలు ప్రకటించాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఇన్నాళ్ళూ నేరుగా కుట్రలకు పాల్పడి, ప్రభుత్వాధిపతుల ఇళ్లపై బాంబులు జారవిడిచి తమ అనుకూల ప్రభుత్వాలను నిలబెడుతూ వచ్చిన అమెరికా, యూరప్ దేశాలు లిబియాలో వినూత్న పద్ధతిని అవలంబించాయి. “తిరుగుబాటు” అని ప్రచారం చేసి అది లిబియా అంతర్గత వ్యవహారంగా నమ్మించాయి. పౌరుల రక్షణ పేరుతో లిబియా మౌలిక సదుపాయాలన్నింటినీ బాంబులతో సర్వనాశనం చేస్తూ వెన్నుచూపిన తిరుగుబాటు బలగాలని ముందుండి నడిపించింది. అంతిమంగా తిరుగుబాటుదారుల విజయం ప్రకటించింది తిరుగుబాటు నాయకులు కాదు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి, ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ లు గడ్డాఫీపై విజయాన్ని ప్రకటించాయి. దానితోనే అర్ధమైంది, లిబియాలో తిరుగుబాటు పేరుతో లిబియా ప్రభుత్వంపై యుద్ధం చేసినదెవరో.
ఇక ప్రతీకార చర్యలు ప్రారంభం అవుతాయి. ఆయిల్ వనరులను టోకుగా యూరప్, అమెరికాల కంపెనీల చేతుల్లో పెడతారు. గడ్డాఫీ అమలు చేసిన సామాజిక సంక్షేమ పధకాలు రద్దవుతాయి. ప్రభుత్వ రంగ సంస్ధలు ప్రవేటు వాళ్లకి ఇచ్చేస్తారు. ప్రజల అవసరాలన్నీ తీర్చే బాధ్యతనుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. ఇప్పుడిక లిబియా సంపంద సంపూర్ణంగా ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలదే. ఆరునెలల ఎడతెగని బాంబుదాడుల్లో విగతులైన లిబియా పౌరుల దేహాలపై నాటో ఎగురవేసిన విజయ పతాక లిబియా భవిష్యత్తుని భయానంకా విప్పి చూపుతోంది.
Exactly. It is America’s and NATO’s conspiracy which is a part of their aggression policy.