ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్


2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని అడుగుతున్నారు?” అని ఎదురు ప్రశ్నించి, “అదే మేం సాధించింది. అర్ధం కాలేదా?” అంటోంది. “మీరెందుకూ పనికిరారు” అంటూ తన ఛేష్టలతో ఇన్నాళ్ళు గేలి చేసిన లండన్ సమాజానికి ఇలా సమాధానం చెబుతోంది.

లండన్ ఒలింపిక్ జ్యోతి వెలగడానికి ముందే వెలిగిపోతున్న లండన్ నగర పరిస్ధితిపై ఈ కార్టూన్.

Olympic fire of London

లండన్ నగర గొప్ప వెలుగు

 • కార్టూనిస్టు: లీహై, బ్రిస్బేన్ ఆస్ట్రేలియా
 • తొలి ప్రచురణ: ది కొరియర్ మెయిల్
 • మలి ప్రచురణ: ఫస్ట్ పోస్ట్

6 thoughts on “ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

 1. పనికిరాని సంక్షేమ పధకాల దుష్ఫలితమిది. అర్హత ఉన్నా లేకపోయినా ప్రతివాడికి కట్టబెడితే జరిగే నిదర్శనం. పందుల్లాగ unemployment benefits భోంచేసి ఇప్పుడు అవి దూరమవుతాయేమో అని చేస్తున్న అల్లర్లు.

  దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత – this is only partially true.

  These are planned and organized riots.

 2. I’m sorry Sanjay. I do not agree with you. There may be planned riots. But there cannot be spontaneous planned riots.

  “పందుల్లాగ unemployment benefits భోంచేసి…” నిరుద్యోగ భృతి అనగానే ఏ ప్రభుత్వమూ ఉత్తి పుణ్యానికి, సొంత సొమ్ముని ఇవ్వాలనుకుని ఇచ్చేది కాదని గుర్తించాలి. కార్మికులు, ఉద్యోగులు, రైతులు (వీరి పిల్లలే తొట్టేన్ హామ్ అల్లర్లలో పాల్గొంటున్నవారు) శ్రమ చేసి ఉత్పత్తి చేస్తుంటే వారి శ్రమపైన పారాసైట్లలాగ పడి తింటున్నవారు దేశాల్ని ఏలుతున్నారు. బ్రిటన్ కూడా అలాగే. బ్రిటన్ బిలియనీర్లు దోచినదానిలో భారత దేశ సంపద పెద్ద మొత్తంలో ఉన్నదని గమనించాలి. అది కూడా వారి సొమ్మే అంటారా? పందుల్లాగా మేసి అహంకారంతో కొట్టుకుంటున్న జాతి ఏలుతోంది గనకనే బ్రిటన్ లో అసమానతలు తీవ్రమై ఈ అల్లర్లకు దారితీస్తోంది.

  అల్లర్లకు పాల్పడడం సమర్ధనీయం కాదు. కానీ అల్లర్ల కోసం చేస్తున్న అల్లర్లు కాదు ప్రస్తుతం జరుగుతున్నవి. కన్సర్వేటివ్ ప్రభుత్వాల అసమానతల పాలనలో అసంతృప్తిలను ఎలా వెళ్లగక్కాలో, అది కూడా గద్దె పైన కూచున్నవారికి వినిపించేలా ఎలా చెప్పాలో తెలియక, ప్రయత్నాలు విఫలమై నిస్పృహతో చేస్తున్న కార్యాలివి. ఇదే యువత కొన్ని నెలల క్రితం రెండు వేలమంది శాంతియుతంగా ఊరేగింపు తీస్తే ఒక్క పత్రికా పట్టించుకోలేదు. అసహాయత, నిరాదరణ, నిస్పృహలకు గురైనవారు అల్లర్లలో తమ అధికారాన్ని వెతుక్కుంటున్నారు. అది ఒక్క రాత్రికే నిలిచేదయినా వారి అసంతృప్తిని తాత్కాలికంగానైనా సంతృప్తి పరుస్తుంది.

  వందల బిలియన్ల డాలర్లు బెయిలౌట్లు సుష్టుగా భోంచేసి త్రేన్చిందెవరు? ఆర్ధిక వ్యవస్ధని సర్వనాశనం చేసింది గాక శిక్షలు ఎదుర్కోవడానికి బదులు బెయిలౌట్లు భోంచేసి దాన్ని అప్పుగా ప్రభుత్వం నెత్తిన మోపింది ఎవరు? ఆ అప్పుని భోంచేసిన వారు కాకుండా ప్రజల మీద రుద్దుతున్నది ఎవరు? పన్నుల సొమ్ముని భోంచేసి, అప్పులన్నీ భోంచేసీ కూడా ఆర్ధిక వ్యవస్ధ సాగడానికి ఉద్యోగాలు కల్పించకుండా సుఖభోగాల్లో కులుకుతున్న దొంగలెవరు? వారందర్నీ వదిలి, నిరుద్యోగ భృతిని ఎంగిలి మెతుకుల్లా విసిరితే అది పెద్ద బెనిఫిట్టైనట్లు ఎలా మాట్లాడగలుతున్నారు?

  ఆర్ధిక సంక్షోభం తెచ్చిన టూ బిగ్ టు ఫెయిల్ కంపెనీలే లాభాలు సరిపోక, సంక్షోభంలో దారి తెన్నూ తెలియక మళ్ళీ వారిని పన్నులతో మేపిన ప్రజలపైనే పొదుపు ఆర్ధిక విధానాలు రుద్దుతున్నారు. ఆ బడా పందులు తింటుంటే ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టరేం? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధనే కుదేలు చేశారే? వారినేమీ ప్రశ్నించరే? Very pathetic!

 3. no sekhar garu. we need to see the other side of the coin.

  కార్మికులు, ఉద్యోగులు, రైతులు (వీరి పిల్లలే తొట్టేన్ హామ్ అల్లర్లలో పాల్గొంటున్నవారు) – కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను.

  పందుల్లాగా మేసి అహంకారంతో కొట్టుకుంటున్న జాతి ఏలుతోంది గనకనే బ్రిటన్ లో అసమానతలు తీవ్రమై ఈ అల్లర్లకు దారితీస్తోంది. – I completely agree. వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు.
  కాని ఒకింత సమాజపు బాధ్యతా రాహిత్యం ఉండబట్టే పెద్దవాళ్ళా పని సులువు అవుతోంది అన్నది కూడా నిజమే.

  ఇక western countries విషయానికి వస్తే ఒకప్పుడు తమ “C” class పనులు చెయ్యటానికి పనికివచ్చిన వాళ్ళు ఇప్పుడు సమానావకాశాల కోసం పోటీ పడటం జీర్ణించుకోలెకపోతున్నారు అన్నమాటా నిజం.

  నేను సామన్య ప్రజలని ఇబ్బంది పెట్టే బందులు రాస్తారోకోలని ఎలా నిరసిస్తున్నానో ఇది కూడ అంతే.

  ఇలా రోడ్ల మీద పడి దోచుకుంటున్న వారందరు నిజంగా బాధిత ప్రజలు కాదు.

  నేను ఇంతకుముందు కూడా అన్నాను. బాధలు పడేవాళ్ళు అందరూ అమాయకులు కారని.

  Trust me i have been there and seen it.

  1. The working class guys have to pay huge amounts of taxes
  2. There are so many high school drop outs, even though there are opportunities to pursue studies.
  4. Even graduates wont mind working in super stores at bill counters.
  5. On the same hand, many guys produce fake id’s, fake passports, to gain the unemployment benefits. This is not 10 or 20% but above 50%.
  6. Most of the ppl don’t even have an eligible passport to be in UK
  7. All this they do to enjoy drugs and indulge in anti social activities.
  8. Some of these guys would never have even tried for jobs.
  9. And this is not my fiction but a ground truth i was made aware by many people.
  10. మీకు అనుమానముంటె ఒకసారి మీకు తెలిసిన వారు ఎవరైనా eastham/southall/tottenham దగ్గర ఉన్నరేమో అడగండి. నల్ల జాతి యువకులంటే అందరికి భయం. యువకులు మాత్రమే అని గమనించండి. ముందు తరాల వారు doctors గా professors etc గా గౌరవప్రదంగా బ్రతుకుతున్నారు.
  11. Actually if anybody has to revolt, it has to be the graduates who after working hard are unemployed and unable to find jobs. And these are NOT the ones who are rioting right now.

  చివరిగా నేను చెప్పదలుచుకున్నది.

  పెద్ద గద్దలు దోచుకుంటున్నాయి కదా అని మేము కూడా దొరికిన దుకాణం మీద పడి దోచుకుంటాం అనడం హర్షణీయం కాదు.

  ఇప్పుడు దోపీడీలకి తెగబడుతున్నవాళ్ళు అందరూ అమాయకులు ఏమీ కాదు.

  ఒక తరం పౌరులని బాధ్యతాయుతులుగా , కర్తవ్యోన్ముఖులుగా చెయ్యడంలో ఆ సమాజం ఫైల్ అయింది.

  తేరగా కూర్చుని వచ్చే డబ్బుని వదులుకోలేక, అందిన కాడికి దోచుకుంటున్నారు.

  నిజమైన ఆవేదనతో ఉద్యమించేవాళ్ళని, వాళ్ళ ఉద్యమాన్ని ఇలాంటి వారు భ్రష్టు పట్టిస్తారు.

  అందరూ కాకపోయినా majority section of youth are like this. just refer to any reliable source on the dropouts from schools.

 4. నేను ప్రజోద్యమాలని మనస్ఫూర్తిగా సమర్ధ్హిస్తాను. కాని ఆ ముసుగులో అరాచకత్వాన్ని , విచ్చలవిడితనాన్ని ఒప్పుకోలేను. ఇప్పుడు ఉద్యమాలకి కావలిసినది బలమైన నిజాయితి ఉన్న నాయకులు. అందుకే ఉద్యమాలు దారి తప్పుతున్నాయి.

  ఒక రకంగా చెప్పలంటే ఏ పెట్టుబడిదారుల మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే ప్రజలకి తెలియకుండా వాటిని తప్పుదారి పట్టిస్తున్నారు.

 5. మీరు చెప్పినది వాస్తవం. కొన్ని అరాచకాలని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అవి అరాచకాలే అయినా వ్యవస్ధలో ఉన్న అసమానతలు, భావాల వ్యక్తీకరణకి తక్కువగా ఉన్న అవకాశాలు, ఎల్లెడలా ఎదురయ్యే ఛీత్కారాలూ అన్నీ కలిసి సరైన తీరులో ఛానెలైజ్ కాని స్ధితిలో ఒక్కో మారు గతి తప్పి ఇలా వ్యక్తీకరించబడతాయి. మనం ఆ కారణాలని గమనించి వాటిని వ్యక్తీకరించే బాధ్యతని చేపడితే ఉపయోగం. ఇలా తలెత్తే ప్రతిచర్యలలో స్వార్ధపర శక్తులు తప్పకుండా జొరపడతాయి. వాటిని ఎంచి ఫోకస్ చేస్తే దాని వెనక ఉన్న అసలు కారణాలు మరుగునపడతాయి. అంతే కాక ఆ పేరుతో న్యాయమైన ఉద్యమాలని కూదా అదే గాటన కట్టి అణిచివేయడానికి అవకాశం ఇచ్చినవాళ్ళం అవుతాము. ఇది నా అభిప్రాయం.

 6. ఇంతకీ ఇప్పుడు political response చూడాలి. అమెరికా వాడు యుద్ధ్హంలో ఖర్చు పెట్టిన డబ్బు సంక్షోభం రాగానే మర్చిపోతారు అనుకుంటున్నట్టు వీళ్ళు ఏ గిమ్మిక్కులు చేస్తారో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s