సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా


హ్యాకింగ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. హ్యాకింగ్ లాంటి సైబర్ దాడులకు అసలు కారకులు అమెరికా, ఇండియాలేనని చైనా ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలనుండి ప్రపంచంలోని అనేక ప్రభుత్వాల వెబ్‌సైట్లు, ప్రముఖుల ఈ మెయిళ్ళు పెద్ద ఎత్తున హ్యాకింగ్ కి గురయ్యాయని మెకేఫీ సైబర్ సెక్యూరిటి సంస్ధ వారం క్రితం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, ఏసియాన్, ఐ.ఒ.సి, తదితర 72 సంస్ధలు హ్యాకింగ్ కి గురయ్యాయని చెబుతూ, దీని వెనుక ఒక ప్రభుత్వమే లేనట్లయితే ఇంత పెద్ద ఎత్తున వ్యక్తులు హ్యాకింగ్ కి పాల్పడటం అసాధ్యం అని తెలిపింది. ఆ వార్తను ఇదే బ్లాగ్‌లో ఇక్కడ చూడవచ్చు.

ప్రపంచ స్ధాయి హ్యాకింగ్ దాడులకు చైనా సూత్రధారిగా ప్రచారం చేయడం వెనుక అమెరికా, ఇండియాల కుట్ర ఉందని ఒక చైనా అధికారిక నివేదిక ఆరొపించింది. చైనా ప్రభుత్వ వెబ్ సైట్లపై జరిగిన 493,000 సైబర్ దాడుల్లో సగం విదేశాలనుండి వచ్చినవేననీ, అందులోనూ ముఖ్యంగా అమెరికా, ఇండియాలనుండి వచ్చినవేననీ అది ఆరోపించింది. వినాశకరమైన “త్రోజాన్ హార్స్” సాఫ్ట్‌వేర్ రూపంలో ఈ దాడులు ఉన్నాయని నివేదిక తెలిపింది. 14.7 శాతం దాడులు అమెరికన్ ఐ.పి అడ్రస్ లు కలిగి ఉండగా, 8 శాతం దాడులు ఇండియా ఐ.పి అడ్రస్ ల నుండి వచ్చినవనీ తెలిపింది. 4635 ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు మొత్త 35000 వెబ్ సైట్లు ఈ దాడులకు గురైనవాటిలో ఉన్నాయనీ ఇది గత సంవత్సరం కంటే 67.6 శాతం అధికమనీ తెలిపింది.

చైనాకి చెందిన ప్రధాన కంప్యూటర్ భద్రతా నెట్ వర్క్ ను పర్యవేక్షించే “నేషనల్ కంప్యూటర్ నెట్ వర్క్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోఆర్డినేషన్ సెంటర్” ఈ నివేదికను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచ వ్యాపితంగా ఐదు సంవత్సరాలపాటు సాగిన సైబర్ దాడులపై సైబర్ సెక్యూరిటీ సంస్ధ మెకేఫీ విచారణ ప్రారంభించిన నేపద్యంలో ఈ చైనా నివేదిక వెలువడింది. దాడులు జరిగిన సమయం, దాడులకు గురైన లక్ష్యాల స్వభావం లను గమనించిన సెక్యూరిటీ సంస్ధలు చైనాను వేలెత్తి చూపుతున్నారు. కాని మెకేఫే కంపెనీ మాత్రం అధికారికంగా చైనా పేరు చెప్పలేదు. ఇతర వ్యక్తిగత విశ్లేషకులు, ముఖ్యంగా అమెరికా విశ్లేషకులు చైనాపై ఆరోఫణలు గుప్పించారు. కాని వారు చేసిన వాదనలలో ఏ మాత్రం పసలేదని అర్ధం అవుతోంది.

జూన్ నెలలో చైనా ప్రభుత్వం గూగుల్ ఈమెయిళ్ళున్న మానవ హక్కుల కార్యకర్తల మెయిళ్ళను హ్యాకింగ్ చేసిందని గూగుల్ ఆరొఫించింది. చైనా విదేశాంగ శాఖ ఈ ఆరోపణలన్నింటినీ తిరస్కరించింది. తాను కూడా హ్యాకింగ్ బాధితురాలినేనని గుర్తు చేసింది. చైనాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారం లేదని చెప్పింది. సైబర్ దాడులనేవి అమెరికా, చైనాల మధ్య ఆర్ధిక ప్రయోజనాలు, వివాదాల సెటిల్మెంట్లకు సాధానాలుగా మారాయి. ఎవరు ఎవర్ని హ్యాక్ చేస్తున్నారో ప్రజలకైతే అర్ధం కావడం లేదు. చైనాపై అమెరికా చేస్తున్న ఆరోపణల్లో అత్యధిక వాటిల్లో కనీస ఆధారం లేకుండా కేవలం అంచనాలపైనె ఆధారపడి ఉంటాయి. అదేపనిగా ఆరోపణలు చేస్తుండడంతో చైనా కూడా ప్రతిదాడికి దిగినట్లు కనిపిస్తోంది.

9 thoughts on “సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా

 1. హాయ్ రోహన్, ఈ ధీమ్ వర్డ్ ప్రెస్ వాళ్ళది. దీనిలో ఫాంట్ సైజ్ పెంచే అవకాశం ఇవ్వలేదు. ఎడిటర్ లో కూడా లేదు. మీరు Ctrl + షార్ట్ కట్ ఉపయోగించి ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. నాకు ఇంకేమైనా మార్గాలు అందుబాటులో ఉన్నాయేమో చూస్తాను.

 2. చైనా విదేశాంగ శాఖ ఈ ఆరోపణలన్నింటినీ తిరస్కరించింది. తాను కూడా హ్యాకింగ్ బాధితురాలినేనని గుర్తు చేసింది. చైనాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారం లేదని చెప్పింది.

  This we all know.This is as good as Pakistan saying we are also effected by terrorism. ఒక పక్క విద్వేషాన్ని ఎగదోస్తూ ఉగ్రవాదులకి రక్షణ ఇస్తూ మొసలికన్నీరు కార్చుతుంది. చైనా కూడా తక్కువ ఏమీ కాదు.

  Nobody know what happens behind the iron doors.

 3. ఈజిప్ట్ లో అల్లర్లు మొదలవగానే twitter, facebook block చెయ్యటం, communications మీద భారీ నిఘా పెట్టడం తెలిసిందే కద.

 4. “ఈజిప్టులో అల్లర్లు” అనడం సరైంది కాదు. ముప్ఫై సంవత్సరాల నియంతృత్వానికీ, అమెరికా-ఇజ్రాయెల్ లకు చేసిన ఊడిగానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అది. అదీ కాక ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ఈజిప్టు ఉద్యమం జరిగిందనడం కూడా వాస్తవం కాదు. అది అసాధ్యం.

  ఈ విషయమై ఈరోజే ఒక టపా రాస్తున్నాను.

 5. “ఈజిప్టులో అల్లర్లు” అనడం సరైంది కాదు. – I agree that word should have been framed differently.
  అదీ కాక ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ఈజిప్టు ఉద్యమం జరిగిందనడం కూడా వాస్తవం కాదు. They are only one of the mediums used. Without the people on ground it is obviously not possible.
  But the context i am talking is different.
  This is about the measures taken by chin to avert/suppress any kind of revolution.
  What i am trying to say was, democracy/opinion of people is just a lofty word used everywhere but practiced nowhere.

 6. అవును సంజయ్ మీరు చెప్పింది నిజం. చైనా ప్రభుత్వానికి ఏక పార్టీ వ్యవస్ధ బాగా కలిసొచ్చింది.

  తమ ట్విట్టర్, ఫేస్ బుక్ కంపెనీలు ప్రజాస్వామిక ఉద్యమాలకు దోహదపడుతున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్లింటన్ చెబుతూ ప్రచారం చేసుకుంటోంది. ఈ అంశంపై రాయాలని చాలా రోజుల క్రితం అనుకున్నాను. మీరు దాన్ని గుర్తు చేశారు. రాసి పోస్ట్ కూడా చేశాను.

 7. తమ ట్విట్టర్, ఫేస్ బుక్ కంపెనీలు ప్రజాస్వామిక ఉద్యమాలకు దోహదపడుతున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్లింటన్ చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
  hahaha!

  మీ పుణ్యమాని కాస్సేపు నవ్వుకున్నాను!
  అమెరికా ఏం చెప్పినా అందరూ నమ్మెయ్యాలి 🙂

  మరి వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైతే లేదా వీటిని ఉగ్రవాదులు వాడుకుంటున్నరని తెలిస్తేనో అప్పుడు ఇవి కూడా మా వల్లే అని ఒప్పుకుంటారా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s