అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు. కారణం ఆ దేశాల అప్పు పెద్ద మొత్తంలో పేరుకుపోయి , బడ్జెట్ లోటు సాధారణ స్ధాయి అయిన 3 శాతానికి మించి రెండు రెట్లూ, మూడు రెట్లూ నమోదవుతోంది.
ఈ నేపధ్యంలో స్పెయిన్, ఇటలీ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని తెలియజేస్తూ వేసిన కార్టూన్.
జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్: అమ్మో, ఏమిటదీ?!?
ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ: ఆ, ఏ ఇటలీనో, స్పెయినో అయ్యుంటుందిలే. లేక రెండూనా!?
కార్టూనిస్టు: ష్రాంక్, డుబ్లిన్, ఐర్లండ్
తొలి ప్రచురణ: సండే బిజినెస్ పోస్ట్
మలి ప్రచురణ: ఫస్ట్ పోస్ట్
–