టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా


భయపడిందే జరిగింది. నెలల పాటు రుణ పరిమితి పెంపు కోసం, బడ్జెట్ లోటు తగ్గంపు కోసం సిగపట్లు పట్టుకుని చివరిదాకా తేల్చలేకపోయినందుకు అమెరికా ట్రెజరి జారీ చేసే రుణ బాండ్ల (సావరిన్ డెట్ బాండ్లు) రేటింగ్‌ను స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ తగ్గించింది. అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు తగ్గించింది. ప్రపంచ దేశాలు జారీ చేసే ట్రెజరీ బాండ్లలో అమెరికా బాండ్లకే అత్యధిక రేటింగ్ ఉంది. ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా వివిధ దేశాలకు అప్పు ఇచ్చే పెట్టుబడిదారులు సురక్షితమైన చోట తమ పెట్టుబడులను ఉంచదలుచుకుంటే అమెరికా “ట్రెజరీస్’ లో పెట్టడానికే మొదట ఆసక్తి చూపుతారు. అమెరికాకి అప్పు ఇస్తే అది అణా పైసాతో సహా తిరిగొస్తుంది అన్న నమ్మకంతోనే వారా పని చేస్తారు.

కానీ రుణ పరిమితి పెంపుపై రిపబ్లికన్లు, డెమొక్రట్ల సుదీర్ఘ యుద్ధం అమెరికా ట్రెజరీస్ పై నమ్మకం సడలేలా చేసింది. పాత ట్రెజరీస్ పై వడ్డీ చెల్లింపులు చేయడానికి కొత్త బాండ్లు జారి చేసి అప్పు సేకరించవలసి ఉండగా అప్పటికే రుణ పరిమితిని చేరడంతో అమెరికా ట్రెజరీ అలా చేయలేకపోయింది. మళ్ళీ అప్పు తేవాలంటే కాంగ్రెస్, సెనేట్ ల ఆమోదం అవసరం.

కానీ రిపబ్లికన్లు కాంగ్రెస్ లో మెజారిటీ ఉన్నందున రుణ పరిమితిని పెంచడానికి వారు వెంటనే ఒప్పుకోలేదు. కొత్త అప్పులు అవసరం లేదు, ఆదాయం పెంచుకుని ఖర్చులు తగ్గిద్దాం అని వారు ఒక బిల్లు ప్రతిపాదించారు. ప్రజలమీద కొత్త పన్నులు వేయడం, ఉన్న పన్నుల్ని పెంచడం ద్వారా ఆదాయం పెంచుకుందామనీ, కార్మికులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు, వృద్ధులకు ఇచ్చే సదుపాయాలను, మెడికేర్, మెడిక్‌ఎయిడ్ ఖర్చులను తగ్గించడం ద్వారా ఖర్చు తగ్గిద్దామని వారు ప్రతిపాదించారు. రెండో ఎన్నికపై కన్నేసిన ఒబామా, డెమొక్రట్లు దానికి అంగీకరించలేదు. మెడికేర్, మెడిక్‌ఎయిడ్ లనుగానీ, ఇతర సంక్షేమ సదుపాయాలను గానీ కొద్దిగానే తగ్గిద్దామనీ కంపెనీలు, ధనికులకు జార్జి బుష్ ఇచ్చిన పన్ను రాయితీలను తగ్గిద్దామనీ ఒబామా, డెమొక్రట్లు కోరారు. వారి ప్రతిపాదన వీరికి, వీరి ప్రతిపాదన వారికి, రాజకీయ కారణాల రీత్యా, నచ్చలేదు. ఇరువురూ ఏకాభిప్రాయానికి రావడానికి వీలుగా ఉమ్మది ఒప్పందానికి వద్దామని చర్చలు ప్రారంభించి గడువు తేదీ ఐన అగష్టు 2కి ముందు రోజు దాకా చర్చలు కొనసాగించారు.

సుదీర్ఘ చర్చల వలన మార్కెట్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం సడలింది. భవిష్యత్తులో కూడా అమెరికా పరిస్ధితి ఇలాగే ఉంటే దానికి ఇచ్చే అప్పు తిరిగి వస్తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఆర్ధిక పరిస్ధితి బాగుండి, ఆర్ధిక వృద్ధి తగినంతగా ఉంటేనే ఏ దేశమైన అప్పులు తీర్చగలుగుతుంది. ఆర్ధిక వృద్ధి సరిగా లేనట్లయితే అప్పులు తీర్చడాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాయి. అలా అప్పు చెల్లింపులు వాయిదా వెయ్యడం, చెల్లింపులు చేయలేకపావడాన్నే అప్పు డిఫాల్ట్ అవ్వడం అంటారన్నది తెలిసిందే. అమెరికా రుణ పరిమితి చర్చలు తెగేదాక లాగారు. డిఫాల్ట్ అవుతుందేమో అన్న భయాలు కలిగేలా చేశారు. దీనితో అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను (అమెరికా ట్రెజరీ జారీ చేసే క్రెడిట్ బాండ్లకు ఇచ్చే రేటింగ్‌ను) ఎస్ & పి సంస్ధ తగ్గించివేసింది.

రేటింగ్ వ్యవహారం ఒక విష వలయం లాంటిది. రేటింగ్‌లూ ఆర్ధిక వ్యవస్ధ పనితీరూ పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఒక దేశ క్రెడిట్ రేటింగ్ తగ్గించినపుడు ఇన్‌వెస్టర్లు ఆ దేశ క్రెడిట్ బాండ్లపై వడ్డీ ఎక్కువ డిమాండ్ చేస్తారు. వడ్డీ ఎక్కువ చెల్లించవలసి వస్తే ఆర్ధిక ఆదాయంలో అధిక భాగం అప్పులకే పోతుంది. దాంతో మరిన్ని అప్పులు తెచ్చుకోవాలి.  మరిన్ని అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఆర్ధిక వ్యవస్ధ బలహీనతకు సంకేతం కనుక రెటింగ్ సంస్ధలు ఇంకా రేటింగ్ తగ్గిస్తాయి. మళ్ళీ అప్పులు చెల్లింపుల మొత్తం పెరుగుతుంది. అది మళ్ళీ కొత్తా అప్పులకి దారి తీయడం…. ఇలా ఈ క్రమం సాగుతూ ఉంటుంది. దాన్నుండి బైటపడలేని పరిస్ధితి వస్తుంది.

వ్యక్తులూ అంతే, దేశాలూ అంతే. వ్యక్తల్లో పిరికివాళ్ళు, మర్యాద గలవారు అప్పులవారి భాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు దిగుతారు. మరికొందరు చావడం నచ్చక మోసాలకి దిగుతారు. కొద్దిమంది మాత్రమే తన ఆర్ధిక పరిస్ధితి మెరుగుచుకుని అప్పులు తీర్చడానికి సిన్సియర్ కృషి చేస్తారు. కానీ సిన్సియర్లకు సమాజంలొ తక్కువ చోటు ఉన్నందున చావులూ, మోసాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దేశాల పరిస్ధితీ ఇదే. పెట్టుబడిదారీ సమాజంలొ సంక్షోభం తీవ్రమై దివాలా తీయడం ఒక దేశానికి చావులాంటిదే, కొత్త అప్పులు పుట్టవు గనక.

ఎస్&పి సంస్ధ అమెరికాకి సంబంధించిన దీర్ఘకాలిక రేటింగ్ ని తగ్గించడం మరింత ఆసక్తికర విషయం. షార్ట్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే కొద్దికాలం అయ్యాక మళ్ళీ కోలుకుంటుందని నమ్మకం ప్రకటించడమే. అంటే రేటింగ్ తగ్గింపు తాత్కాలికమే అని చెప్పడం అన్నమాట. కానీ ఎస్&పి దీర్ఘ కాలిక క్రెడిట్ రేటింగ్‌ని తగ్గించింది. అంటే అమరికా ఆర్ధిక వ్యవస్ధ దీర్ఘకాలంలో కూడా కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయన్నమాట. క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో, అమెరికాకి అప్పు ఖర్చులు పెరుగుతాయి. అమెరికా బ్యాంకులకీ, సంస్ధలకీ, కంపెనీలకీ, ప్రజలకీ కూడా అప్పులపై వడ్డీ ఎక్కువ చెల్లించవలసి వస్తుంది.

నిజానికి అమెరికా బడ్జెట్ ఖర్చులను కనీసం 4 ట్రిలియన్ డాలర్లు తగ్గించాలని ఒప్పందానికి ముందు ఎస్ & పి అంచనా వేసింది. అది 2.1 ట్రిలియన్ డాలర్లే ఉండడంతో ఎస్ & పి సంస్ధ క్రెడిట్ రేటింగ్ తగ్గించేసింది. అమెరికా కూడా అప్పుల విషయవలయంలో కూరుకుపోనున్నదనడానికి, యూరప్ స్ధాయి అప్పు సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చనడానికీ ఎస్ & పి సంకేతాలు వెలువరించిందని చెప్పుకోవచ్చు.

2 thoughts on “టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా

  1. Your are right Sanjay. Credit rating firms added fuel to the world financial crisis of 2008 by giving top rating to toxic securities built with sub-prime housing loans. Many investors believed them and invested billions of dollars in toxic housing loan securities. Now they are over reacting and creating unwanted emergency situations like Greece, Ireland and Portugal. They are causing baseless rumours to be spread over sovereign debt bonds of Eurozone countries. I don’t mean to say that Eurozone countries are not actually in crisis situations. But I can say that without the well advanced prior warnings of these credit rating firms’ down grading, those these countries could be able to cover the costs without going for bailouts of IMF and EU. Heads of those three countries issued so many requests to these ratings firms urging them not to over react for the benefit of Wall Street companies. But they were simply ignored. Greece even urged the President of the USA to stop Wall Street companies from betting on its sovereign debt, but to no avail.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s