ఆఫ్రికా కరువు గాధలకు అంతే ఉండదు. అంతులేని కధల సమాహారమే అఫ్రికా కరువు గాధ. కరువు, దుర్భిక్షం, యుద్ధం… ఇవి మూడూ అఫ్రికా దేశాలకు శనిలా దాపురించాయి. కనుచూపు మేరలో పరిష్కారం కనపడక శనిపై నెపం నెట్టేయడమే కాని ఆఫ్రికా కరువు మానవ నిర్మితం. లాభాల దాహం తప్ప మానవత్వం జాడలు లేని బహుళజాతి కంపెనీలు ఒకనాటి చీకటి ఖండంపై రుద్దిన బలవంతపు యుద్ధాలే ఈ అంతులేని కరువుకి మాతృకలు. లాభాల దాహం దోపిడికి తెగబడితే దాన్ని ప్రతిఘటిస్తూ పుట్టే తిరుగుబాట్లను ఆల్-ఖైదా టెర్రరిజంగా, ముస్లింల వెనుకబాటుతనంగా ముద్ర వేసి కంపెనీలమీదికి నేరం మళ్లకుండా జాగ్రత్త వహించే కార్పొరేట్ పత్రికలు నిత్యం నిజాలు గడపదాటకుండా పహారా కాస్తూనే ఉంటాయి.
జడలు విప్పిన కరువు ఇప్పుడు ఆఫ్రికా కొమ్ము సోమాలియా, కీన్యా, ద్జిబౌటి దేశాలను పట్టి పల్లారుస్తోంది. వెన్నుని వణికిస్తూ, ఒంటిని జలదరింపజేస్తున్న ఈ దృశ్యాలను ఫోటోలుగా యాహూ న్యూస్ వెబ్ సైట్ అందించింది.
- ఓ సోమాలి తండ్రి తన కూతురితో కలిసి కీన్యాలోని దగహాలే వద్ద శరణార్ధుల రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద క్యూలో ఎదురు చూస్తున్న దృశ్యం ఇది. దక్షిణ సోమాలియానుండి తరిమివేయబడ్డ ఈ కుటుంబం కరువు రక్కసి బారిన పడిన 37లక్షల మందిలో ఒకటి మాత్రమే.
- రెండేళ్ళ ఏడెన్ సలాద్ దగహాలే లోని ‘డాక్టర్స్ వితౌట్ బౌండ్రీస్’ ఆసుపత్రి వద్ద తల్లి చేత స్నానించబడుతున్న దృశ్యం. పోషకారలోపంతో ఆసుపత్రిలో చేర్చారు. కరువుబారిన పడిన సోమాలియా ప్రపంచంలో అత్యంత భయానకమైన వైపరీత్యమని అక్కడి డాక్టర్ చెప్పాడు.
- స్కూలు పిల్లలు ఆహారం కోసం క్యూలో నిలబడ్డ దృశ్యం. దక్షిణ సోమాలియాలోని 12 మిలియన్ల మందిని ఆకలిచావుల నుండి రక్షించడానికి దాతలు సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది.
- దగహాలే శరణార్ధి శిబిరంలో బాలుడు సేద తీరుతున్నట్టుంది. కీన్యాలోని దడాబ్ శరణార్ధి సెటిల్మెంట్లో ఒక భాగం ఇది. కీన్యాలొ సోమాలియా సరిహద్దు వద్ద ఇది ఉంది. 90,000 మందికి ఉద్దేశించిన ఈ శిబిరంలో దానికి నాలుగురెట్లు ఉన్నారని యు.ఎన్ తెలిపింది. దక్షిణ సోమాలియాలొని సివిల్ వార్ వలన 12 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారని యు.ఎన్ తెలిపింది.
- నీటితో నిండి ఉన్న ప్లాస్టిక్ పాత్రనుండి దాహం తీర్చుకోవడానికి ఈ బాలుడు విఫల ప్రయత్నం చేస్తున్నాడు.
- బౌద్ధ భిక్షువు కాదు. కరువు నోటికి చిక్కి మృత్యు రహదారిలో పయనమై వెళుతున్న దుర్భిక్ష బాధితుడు/రాలు
- శరణార్ధి శిబిరానికి కొత్తగ వచ్చిన సోమాలియా శరణార్ధులు తాత్కాలిక గృహాల (?) ముందు నిలుచున్నారు. వేలమంది సోమాలీలు పొరుగున ఉన్న కీన్యా, ఇధియోపియాలకు పారిపోయారు.
- సోమాలీ కుటుంబాలకు ఆహార సరఫరాలు అందించడానికి యు.ఎన్ మరింత అంతర్జాతీయ సహాయం కోసం వరుస ప్రకటనలు జారీ చేస్తున్నా స్పందన తక్కువగానే ఉందని చెబుతోంది.
- 67 సం.ల సోమాలియా శరణార్ధి కదిజా ఇబ్రహీం యూసఫ్ హగదేరా శరణార్ధి శిబిరంలో తాత్కాలిక గుడిశెలో శరణు పొందుతున్నాడు. వీరు రంజాన్ ఉపవాసాలు ప్రత్యెకంగా చేయనవసరం లేదు. సుదీర్ఘ ఉపవాసాలు వారి దేవుడిని కదిలించడం లేదా?
- ద్జిబౌటి దేశ మహిళలు కరువుబారిన పడిన దిఖిల్ వద్ద రెడ్ క్రాస్ తో తమ సమస్యలను చర్చిస్తున్న దృశ్యం.
- దగహాలే శిబిరంలో ఓ సోమాలి మహిళ ఇంటి నిర్మాణం కోసం మట్టి సేకరిస్తోంది. 16,000 మంది శరణార్ధులు ఖాళీ లేక శిబిరాల బైట ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు.
- సోమాలియా శరణార్ధి శిబిరంకోసం లెట్రిన్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు.
- దగహాలే వద్ద సోమాలియా శరణార్ధులు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యం
- సోమాలీ శరణార్ధులు నీటిని సేకరించుకుని వెనక్కి వస్తున్న దృశ్యం
- ఓ సోమాలియా దేశీయుడు గాడిద బండితో నీటిని తెచ్చుకుంటున్న దృశ్యం. సోమాలియా దుర్భిక్షం కీన్యా, ఇధియోపియా అంతటా వ్యాపిస్తుందని భయపడుతున్నారు.
- సోమాలియా శరణార్ధులు తమను శిబిరాల దగ్గరకు తీసుకెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం
- మట్టి తుఫానును తప్పించుకోవడానికి పరుగెడుతున్న సోమాలీ శరణార్ధులు
- కీన్యా-సోమాలియా సరిహద్దులో సహాయ అధికారి ఒకరు ఆవు శవం దృశ్యాన్ని తన ఐ-ప్యాడ్ లో బంధిస్తున్న దృశ్యం.
- కీన్యా-సోమాలియా సరిహద్దు వద్ద గల దడాబ్ శరణార్ధి శిబిరంలో అతి కష్టంతో ముగిసిన మరొక రోజు
చాలా బాధగా ఉంది. ఈ పరిస్ధితికి కారణం గ్లోబలైజేషనా?
అనుమానం ఎందుకు?
avunu
what is the link between famine and globalisation?