మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం


కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9, 2009 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు ఏలూరు ఎం.పి. కావూరు సాంబశివరావు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ తర్వాత ఆయన చేస్తూ వచ్చిన దురహంకార పూరిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ట ఎంత నేలబారుదో వెల్లడి చేశాయి.

కొద్ది నెలల క్రితం తెలంగాణ లాయర్లు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినపుడు పోలీసులు సృష్టించిన హడావుడి ఉద్రిక్తతకు దారితీసింది. అప్పుడు కావూరివారు “రెండు కాకపోతే జిల్లాకొక రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి” అంటూ దురహంకార పూరితంగా వ్యాఖ్యానించాడు. ‘రాష్ట్రం కావాలంటే రాజీనామా ఎందుకు చెయ్యరు?’ అని కాంగ్రెస్ ఎం.పిలను రెచ్చగొట్టి వారి చేత పార్లమెంటులో నినాదాలు చేయించాడు. అది తెలంగాణ ప్రజాప్రతినిధులు నిర్ణయాత్మకంగా ఆలోచించడానికి దోహదపడింది, అది వేరే విషయం.

బుధవారం కావూరి సాంబశివరావు మళ్ళీ తన అహంకారాన్ని బయటపెట్టుకున్నాడు. “రాష్ట్రాన్ని కోరే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది” అని మొదలు పెట్టాడు. ఈ ప్రారంభం తెలంగాణ రాష్ట్రాన్ని కోరే హక్కుని గుర్తిసూ చేసినది కాదు. ప్రజల హక్కులను గుర్తించే మంచి బుద్ధి ఆయనకి ఉంది కాబోలు అనుకునే లోపుగానే, “మొన్ననే గిరిజనులకు ఒక రాష్ట్రం కావాలని డిమాండ్ ముందుకు వచ్చింది” అని ఆగారు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్ర దేవ్ శ్రీకాకుళం నుండి మహబూబ్ నగర్ వరకూ గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన చేశాడు. కిషోర్ చంద్రదేవ్ ప్రకటననే ఆయన ఉద్దేశిస్తున్నాడని అర్ధమయ్యింది. “రేప్పొద్దున షెడ్యూల్ కేస్టు వాళ్ళు కూడా తమ కొక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయవచ్చు. ఆ తర్వాత…” అని కొనసాగిస్తుండగానే సదరు ఛానల్ వారు కట్ చేసి తదుపరి వార్తలోకి వెళ్ళీపోయారు.

కావూరిగారి గొప్ప పరిశీలనలో రెండు అంశాలను గుర్తించాలి. ఒకటి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పట్ల ఆయనకున్న చులకన భావం. రెండవది షెడ్యూల్ తెగలు, కులాల వారి పరిస్ధితి పట్ల ఆయనకున్న ఏహ్య భావం. వారు లేకుండా కావూరివారు ఒక్క రోజైనా ప్రాతఃకాల ఉభయ శంకలు సక్రమంగా తీర్చుకోగలరో లేదో అనుమానమే. కిశొర్ చంద్ర దేవ్ లాంటి స్వజాతీయుల వెనుకబాటుతనాన్నే సొంత అభివృద్ధికి నిచ్చెనగా వేసుకొనగలిగిన పారాసైట్ల కడుపునిండిన మాట కావూరికి అక్కరకు వచ్చి ఉంటే వచ్చి ఉండొచ్చుగాక! అందుకని “రేపు షెడ్యూల్ కులాల వారు తమకొక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయవచ్చు” అని కూయవచ్చా?

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై కావూరిగారికి ఉన్న చులకన బుద్ధి షెడ్యూల్ కులాలు, తెగల వారి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల పై కూడా విస్తరించాలన్నమాట! ఈయన ఆస్తుల విస్తరణకి హాని కలిగించేది ఏదైనా ఈయనకి చులకనే. అది నాలుగు కోట్ల మంది కాకపోయినా అందులో సగం మందైనా లేదా పావుమందైనా మూకుమ్మడిగా చేస్తున్న తెలంగాణ డిమాండ్ అయినా సరే ఈయనకి చులకనే. వీళ్ళకి శ్రమజీవులని గౌరవించే గొప్పబుద్ధి ఎప్పుడూ ఉండదు సరే. కనీసం తోటి పెట్టుబడిదారుల డిమాండ్ ని కూడా గౌరవించలేడా ఈయన?

పైగా గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే హక్కు ప్రతి ఒక్కరినీ ఉంటుంది. అని గిరిజనుల హక్కును గుర్తిస్తున్నట్లు ఒక సిగ్గులేని ఫోజు ఒకటి. తెలంగాణ ఊళ్లన్నీ కదిలి అడుగుతున్నా తెలంగాణ డిమాండ్ ని అంగీకరించడం తర్వాత సంగతి, కనీసం గౌరవించలేని వారు, జనాభాలో 8 శాతం ఉన్న గిరిజనుల రాష్ట్ర డిమాండ్ ని, 15 శాతం ఉన్న షెడ్యూల్ కులాల డిమాండ్ ని గుర్తిస్తారా? ఒఠ్ఠి మాట!

తెలంగాణ రాష్ట్రం రావడం అంటే గోదావరి నీటిని కృష్ణాకి మళ్ళించే ప్రాజెక్టులు ఆగిపోతాయి. కావున ఈ భూస్వామి పొలాలకి నీరు రావడం కష్టం కనుక తెలంగాణ రాకూడదు. హైద్రాబాదులో కట్టుకున్న ఇళ్ళూ, పెట్టుకున్న ఫ్యాక్టరీలూ, పెందుకున్న ఆస్టులూ… ఏమైపోవాల? కనుక తెలంగాణ డిమాండ్ అర్ధం లేనిది. అరవై ఏళ్లనుండి నీటి సౌకర్యం పొందని తెలంగాణ జిల్లాలు, అది కూడా గోదావరి, కృష్ణాలు తమ జిల్లాల మీదుగానే పోతున్నా ఆ నీటిని పొందలేని తెలంగాణ జిల్లాలు ఇకనుండైనా పొందవచ్చన్న ఆశతో రాష్ట్రం కోరుతున్నారు. ముందా ఆశని గుర్తించాలి, ప్రజాప్రతినిధి అనిపించుకోవాలంటే. గుర్తించగలిగితే తెలంగాణ రాకపోయినా ఆ ఆశ తీరే మార్గం ఉంది అని చెప్పగలగాలి. అలా అని చెప్పే తెలంగాణని కలుపుకుని ఆ ఆశని ఆశలాగే ఉంచడం వల్లనే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కావాలంటున్నారని కావూరి అర్ధం చేసుకోగలడా? మరో ఏడు జన్మలైనా….. ఎందుకులెండి.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ సందర్భంగా కూడా షెడ్యూల్ కులాలు, తెగల వారిని చులకన చేయాలన్న ఉబలాటం కావూరి తీర్చుకోదలిచారా? తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ని అడ్డుకోవడానికి అదుగో గిరిజనులు కూడా అడుగుతున్నారు, వారికీ (ఆ వెధవలకీ) ఇస్తారా? షెడ్యూల్ కులాలోళ్ళు అడుగుతారు, (ఆ బడుద్ధాయిలకీ) ఇస్తారా? ఇంకా బి.సి వోళ్ళు అడుగుతారు ఇస్తారా? వాళ్ళంతా వెనకబడ్డవాళ్ళే కదా? వెనకబడ్డామని చెబుతున్న తెలంగాణ వాళ్ళ అడగంగా లేనిది వేల సంవత్సరాలనుండి నిజంగానే, అసలైన వెనకబడ్డోళ్ళు ఎస్సీలు, ఎస్టీలకి రాష్ట్రం ఎందుకివ్వగూడదు? అని దిక్కుమాలిన లాజిక్కులు లాగి ఇహ్హిహ్హి అని ఇకిలించడానికి తప్ప కావూరి గారికి ఎస్సీ, ఎస్టీ ల వెనకబాటుతనం పట్లా, వారి అభ్యున్నతి పట్లా అంత బాధ, బాధ్యత ఏడ్చిందా అని?

వెనకబడ్డవారి పట్ల అంత దయ, సానుభూతి ఉన్నట్లయితే తెలంగాణ వాళ్ళు ‘మేము వెనకబడ్డాం’ అన్నపుడు అలాగా అని అడిగి ఎక్కడ అని విచారించి, నిజమేనా అని నిర్ధారించుకుని అవునో కాదో చెప్పి తదనుగుణంగా మాటా, చట్టమో, ఒప్పందమో చేసుకోవడానికి ప్రయత్నించి ఉండే వాళ్ళు. ఈయనగారి ఊర్లో, పక్కన ఉన్న పట్టణంలో, చుట్టూ ఉన్న జిల్లావాసుల్లో ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారని తెలిసే ఉంటుంది. వారూ వెనకబడ్డోళ్లేనని కూడా తెలిసే ఉంటుంది. వారికోసం, వారిని ముందు వేయడానికోసం కావూరి సాంబశివరావుగారు ప్రజా ప్రతినిధిగా, మోతుబరిగా, అసలు కనీసం మనిషిగా ఏమన్నా చేశారోలేదో చెప్పగలిగితే చాల ఉపయోగం.

అసలు ఎంతసేపూ సొంత ఆస్తులు ఏమైపోతాయోనన్న దుగ్ధే తప్ప అవతలి వాడి కడుపు గురించి ఆలోచించే బుద్ధి వీళ్ళకి ఎప్పుడొస్తుందో గదా?!

(ఇది కేవలం కావూరి గారినీ, వారి అహంభావం గారినీ మాత్రమే ఉద్దేశించినది. మరింకెవ్వరినీ కాదు)

8 thoughts on “మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం

 1. Avi annee KCR ni adagandi….. Dalithunni CM ni chesta antaadu….vaadi ahankaaram chudandi….KCR chese devudu….dalithulemo KCR daggira adukkune vallaa…..ee udyamaalloo naaaykulu antha OC le kada……SC, ST, BC lu antha only suicide chesukotaanike gaani…leaders ga paniki raraa……mundu…avi kadukkondi….tharuvatha…kavuri garidi kadagochhu…

 2. మీరు ఆ పేరు వాడకుండా ఉండాల్సింది. సినిమా టైటిళ్ళకు అతికినట్లుగా సంబోధించడానికి బాగోదేమో.

  కె.సి.ఆర్ గురించి, టి.ఆర్.ఎస్ గురించి నా అవగాహన రెండు మూడురోజుల క్రితం రాశాను. కె.సి.ఆర్ చేసే ఉద్యమంపై ఆయన చెప్పుకునే అభిప్రాయం నాకు లేదు. తెలంగాణ ఉద్యమంలో నేను ప్రధానంగా ప్రజల్నే చూస్తున్నాను తప్ప నాయకులను వారి అడ్డదిడ్డమైన ప్రకటనలనూ, సీమాంధ్ర ప్రజలపై వారి అడ్డమైన కూతలను నేను అంగీకరించడం లేదు. పైగా ఇంతకు ముందు రాతల్లో విమర్శించాను.

  మీ వ్యాఖ్యలో చివరి పదాలు మీ గురించి వివరాలు తెలియజేస్తున్నాయి. కావూరి దురహంకారాన్ని ఇంకా పచ్చిగా ధ్వనింపజేస్తున్న మీకు, ఇండియన్ అనే పదాన్ని ఐ.డిగా పెట్టుకునే నైతిక అర్హత అసలు ఉన్నదా? లేక ఇండియన్లే కదా కులవ్యవస్ధని అమలు చేస్తున్నది అన్న ధైర్యంతో ఆ పేరు పెట్టుకున్నారా?

  మరొక సంగతి తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించగలవారంతా తెలంగాణవారే కానక్కర్లేదు. అలాగే కుల దురహంకారాన్ని వ్యతిరేకించేవారంతా దళితులే కానక్కరలేదు. మనిషిగా మానవత్వం కలిగి ఉంటే చాలు. ఎటువంటి అన్యాయాన్నైనా గుర్తించి వ్యతిరేకిస్తారు. అది గుర్తించగలిగితే మీకు చాలా ఉపయోగం.

  ఇంకొక ముఖ్య విషయం. తమరు పసివాడుగా ఉన్నపుడు తమరిది కడిగింది మీ అమ్మగారన్న సంగతి మరిచిపోయారా? మీ అమ్మగారికి నా క్షమాపణలు, ఇలా రాయవలసి వచ్చినందుకు.

 3. కావురి కి శరద్ పవర్ కి గల అవినాభావ సంబంధం పై మీకు ఎమైనా వివరాలు తెలిసి ఉంటే రాయండి. ఇతను శరద్ పవర్ కాంగ్రేస్ తరపున పోటీ చేశాడు. అసలికి అతనొక లీడరా? మొన్న ఒక వీడీయో లో సుబ్రమణ్య స్వామి షాహిద్ బల్వా అసలు రంగు గురించి చెప్పాడు. మీలాంటివారికి 2జి లో ఉండేవారి సంగతి అంతా తెలిసే ఉంట్టుంది. మళ్ళి చెప్పనవసరం లేదు. తెలంగాణ ఉద్యమం కన్న ముందర తెలుగు ప్రజలు సమైఖ్యంగా ఈ పచ్చ వర్గాన్ని, దాని పది తలల అసత్య ప్రచారాలను అడ్డుకొని, ఇంటికి సాగనంపాలి.

 4. ఆలోచించకండి. ఆరోగ్యం చెడకుండా ఉంటుంది.

  తమరి తలా తోకా లేని ఆర్గ్యుమెంట్‌కి సమాధానం రాశాను. సరిగ్గా చదవండి.

  నేను రాసింది కావూరి దురహంకారం గురించి. ఆ దురహంకారానికి వత్తాసు వచ్చి, కె.సి.ఆర్ కి లేదా అని అడగడం అర్గ్యుమెంటటండీ? దురహంకారం ఎవడికున్నా వాడు అహంకారే.

  పేరెంట్స్ గురించి కాదు నేను రాసింది. కడిగేది తమరనుకునే కిందికులాలోళ్ళే కాదు, మనకి కావలసినవాళ్ళు కూడా. కడగడం బట్టి స్ధాయిని నిర్ణయిస్తే తమరి అస్తిత్వానికు కూడా స్ధాయి ఉండదని చెప్పాను. అర్ధం చేసుకోండి.

 5. meeru evaro baga baaga rastuna ani over confident ga feel avutunnaremo aniputndi . kavuri anna danilo SC ‘s ni anta chinna chuputo matladindi emundo maku ardham kaledu ,already MRPS leader manda krishna kuda T state gurchi alane matladatunnadu kada.
  Obviously these comments u will take negetive way … endukante me overconfidence level alantidi

 6. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వాదన నాకు అర్ధం కాలేదు. ఎవరైనా తాము రాసేది సరైందని నమ్ముతూనే రాస్తారు. నేనూ అలాగే.

  కావూరి అన్నదానిలో ఎస్.సిలను చిన్నచూపుతో చూస్తూ మాట్లాడినట్లు మీకు అనిపించలేదని మీరు చెప్పదలిచారు. అది నాకర్ధం అయింది. నా పోస్టు లోనే ఆ విషయం వివరించాను.

  పోనీ తెలంగాణ డిమాండ్‌ని కావూరి అవహేళన చేస్తున్న సంగతిని అంగీకరిస్తారా? అదీ అంగీకరించకపోతే బహుశా మనం చర్చించుకోనవసరం లేదనుకుంటా.

  తెలంగాణ డిమాండ్ ని ఆయన హేళన చేస్తున్నాడని మీరు అంగీకరిస్తే… అదే అవహేళన భావన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారిపైనా ఆయన తెచ్చిన పోలికలొనే వ్యక్తమవుతోంది. కిశోర్ చంద్రదేవ్ శ్రీకాకుళం నుండి మహబూబ్ నగర్ వరకూ అని గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని ఉదహరిస్తూ గిరిజనులకు మన్యసీమ రాష్ట్రం కావాలని అన్నాడు. ఆయన ప్రస్తావించిన జిల్లాలన్నీ గిరిజనులకు ఆవాసాలు. ఏజన్సీ ప్రాంతం. వాటికి భౌగోళికంగా కంటిన్యుటీ ఉంది. కనుక ఆ డిమాండ్‌‌లో భౌగోళిక సాధ్యత ఉంది. రాజకీయంగా, ఆర్ధికంగా సాధ్యమో కాదో ఎవరూ అధ్యయనం చేయని డిమాండ్ అది. కేవలం సీమాంధ్ర రాజకీయనాయకులు తెలంగాణ డిమాండ్‌కి పోటీగా తెచ్చిన డిమాండ్ అది.

  ఎస్.సిలు ఏ ప్రాంతాలతో రాష్ట్రం కావాలని కోరతారని అయన అభిప్రాయపడ్డారో మీకు అర్ధమయ్యిందా? ఎస్.సిలు ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో ఊరవతల పాడుల్లో (ఊరు కాదు) నివసిస్తుంటారు. ఆ పాడులకి ఓకదానికొకటి కలుపుతూ భూమార్గాలేమీ ఉండవు. అలాంటి పాడుల్ని రాష్ట్రం అంతా కలిపి మరొక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తారా? భౌగాళికంగా అది సాధ్యమేనా? ఆ సూచనలో ఏమన్నా అర్ధం ఉందా అసలు? ఫలనా వాళ్ళు ఫలానా అర్ధం లేని డిమాండ్‌ని చేస్తారు. అది వారి హక్కు. అని అనడంలో మీకు చిన్న చూపు గానీ అవహేళనగానీ ఏమీ కనిపించడం లేదా? ఒరే……డా అంటేనే అవమానించినట్లా? చిన్నచూపు చూసినట్లా? అహంకారం ఒలకబోసినట్లా? అవమానం ఎన్ని రూపాల్లో వ్యక్తం చేస్తారో తెలియాలంటే ఆ అవమానం పొందేవారిలో ఒకడిగా ఉన్నపుడే తెలుస్తుందని కొందరంటే కాదని వాదించేవాడ్ని. మీ వాదన చూస్తే అది నిజమేనేమో అన్న అనుమానం కలుగుతోంది.

  నా పై నెగిటివ్ కామెంట్ పడేసి దానికి నేను నెగిటివ్ గానే స్పందిస్తానని కూడా భలే సరిగ్గా అంచనా వేసారు. పాజిటివ్ క్లాప్స్! అయినా, మీరన్నట్లు నా రాతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ధ్వనిస్తున్నదేమో పరిశీలిస్తాను. ఉంటే సవరించుకోవడానికి ప్రయత్నిస్తాను.

  మంద కృష్ణ తెలంగాణ గురించి ఏమన్నా అది ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయాన్నే ఎస్.సిలు అంతా అనుసరిస్తారని భావించడం -కావూరిని అంటే తమరు ఉలిక్కిపడ్డట్లు- సరికాదు. (మాకు అర్ధం కాలేదు అంటున్నారు కదా. అందుకని ఉలిక్కిపడ్డారని అంటున్నాను) మంద కృష్ణ సామాజిక తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ కాదు అని డిమాండ్ చేసినట్లు నాకు గుర్తుంది. దానర్ధం ఎస్.సిలకు ఒక రాష్ట్రం కావాలని ఆయన కోరాడని మీకు అర్ధం అయిందన్నమాట! ఆయన చేయని డిమాండ్ మీకు అర్ధం అయింది కాని, కావూరి అహంకారం మాత్రం అర్ధం కాలేదు మీకు.

 7. over confidence mamulugu ga ledu veediki…. (ఈ కామెంటు చాలా అసభ్యంగా రాసినందున ఎడిట్ చేయబడింది. గతంలో అసభ్యంగా రాసినవాళ్ళలో ఒకడే పేరు మార్చుకుని మళ్ళీ మొదలు పెట్టారు.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s