
ఢిల్లీ కోర్టులో ఎ.రాజా అభిమానులకి అభివాదం (నిందితుడిగా అభిమానం అందుకునే భాగ్యం ఇండియాలోనే సాధ్యమనుకుంటా)
ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు. ఆ లెక్కన ఎ.రాజా అడ్డదిడ్డంగా 2జి లైసెన్సుల్ని పందేరం పెడుతుంటే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా లైసెన్సులను వేలం వేస్తే బాగుంటుంది అని సూచన చేసినట్లుగా కూడా గతంలో కాంగ్రెస్ పెద్దలు వెల్లడించారు. అయినా ఎ.రాజా ఆ పని చేయలేదు. వేలం వేయకపోయినా మన్మోహన్ చూస్తూ ఊరకున్నాడు కనక సంతోష్ హెగ్డే గారి నిర్ధారణ ప్రకారం ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రిగా ఆమోద ముద్ర వేసిన పి.చిదంబరం కూడా దోషులే. దోషులు అన్నది పెద్ద పదం అవుతుందనుకుంటే బాధ్యులే అందాం! అదిగో ఎ.రాజా కూడా అదే కోర్టులో చెప్పాడని ఎన్.డి.టి.వి చెప్పింది.
“ఎక్కడుంది నేరం? ఎక్కడుంది కుట్ర? ‘యూనిటెక్ వైర్లెస్’ కంపెనీలో ‘టెలినార్’ కంపెనీ వాటాలు కొనుగోలు చేసింది; ‘డి.బి.రియాలిటీ’ కంపెనీలో ‘ఎటిసలాట్’ కంపెనీ వాటాలు కొనుగోలు చేసింది; ఇవన్నీ కార్పెరేట్ చట్టం ప్రకారం చట్టబద్ధమైనవే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సమక్షంలో ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ఈ కొనుగోళ్ళు, అమ్మకాలకు ఆమోదముద్ర వేశాడు. ప్రధాన మంత్రి అది అబద్ధమని చెప్పమనండి!” అని మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కోర్టులో అన్నట్లుగా, ఆయనని ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి ఛానెల్ తెలిపింది. 2జి స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలన్నింటిలో మన్మోహన్, పి.చిదంబరం ల పాత్ర ఉందనీ, కనుక తననొక్కడినే అవినీతికి సంబంధించిన కేసులో నిందితుడిగా పేర్కొనజాలరని ఆయన వాదించాడని తెలుస్తోంది.
ఎ.రాజా ప్రారంభంలోనే ప్రధాన పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. మన్మోహన్, పి.చిదంబరం లు ఉన్న చోటే తాను ఉండాలని ఆయన వాదిస్తున్నాడు. ప్రధాని, ఆర్ధిక మంత్రిల ప్రమేయం లేకుండా తానొక్కడె నిర్ణయం తీసుకున్నానని చెప్పడంపైన తన డివెన్సును ఆధారం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎ.రాజా వాదన ప్రకారం ఆయన జైలులో ఉండవలసినవాడే అయితే మన్మోహన్ సింగ్, పి.చిదంబరంలు కూడా అక్కడే ఉండాలనీ, వారింకా పదవుల్లోనే ఉన్నారు కనక తానూ పదవిలో ఉండతగినవాడినని వాదిస్తున్నాడు. ఇందులో వాస్తవాలు లేకపోలేదు. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం సమిష్టి బాధ్యత వహించవలసి ఉంటుంది. మంత్రివర్గంలో ప్రతి మంత్రి తీసుకునే ప్రతి నిర్ణయానికీ, ప్రతి మంత్రీ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎ.రాజా తీసుకున్న నిర్ణయాలు అవినీతికి దారితీయడం వలన ఆయన దోషి అయితే, ఆయన నిర్ణయాలను ఆమోదించిన ప్రధాని, ఆర్ధిక మంత్రి అందుకు బాధ్యత వహించకుండా తప్పించుకోగలరా అన్నదే ఎ.రాజా సంధించిన ప్రశ్న. ఇది బిలియన్ డాలర్ల ప్రశ్నేనా? తేలవలసి ఉంది.
ఎ.రాజా ఇంకా ఇలా వాదించాడు. “నేను టెలికం కంపెనీలకు స్పెక్ట్రం లైసెన్సులు ఇచ్చిన తర్వాత వాళ్ళేమి చేసేదీ నా పరిధిలోకి రాదు” అని కోర్టుకు తెలిపాడు. తానేమీ నేరం చేయలేదని చెబుతూనే ఆయన భాధ్యతను ఎన్.డి.ఎ ప్రభుత్వం మీద కూడా వేశాడు. తన ముందరి టెలికం మంత్రులు అనుసరించిన విధానాలనే తాను అనుసరించాను తప్ప అదనంగా చేసిందేమీ లేదని ఆయన కోర్టుకు విన్నవించుకున్నాడు. ఎ.రాజా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ సుశీల్ కుమార్, వాదిస్తూ “నేను అనుసరించిన విధానమే తప్పైతే, 1993 నుండీ టెలికం మంత్రులుగా పని చేసిన వారంతా నాతో (రాజా) పాటు జైలులో ఉండవలసిన వాళ్ళే” అని అన్నాడు.
రాజ్యాంగ సంస్ధ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి), 2జి స్పెక్ట్రం లైసెన్సులను అర్హతలేని కంపెనీలకు ఉదారంగా అతి తక్కువ ధరలకు కేటాయించడంతో ప్రభుత్వ ఖజానాకి 1.76 లక్షల కోట్లు నష్టం చేకూరిందని తన నివేదికలో తెలపడంతో మాజీ టెలికం మంత్రి ఎ.రాజా మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.

As per Dr. Subramanya Swami
2G Scam
1) Total revenue loss was 1.76 Lakh Crores
2) Total corruption was 70 Thousand Crores
2.a) Sonia and her sister got 36 Thousand Crores
2.b) DMK & Karunanidhi got 16 Thousand Crores
2.c) Chidambaram got 10 Thousand Crores
2.d) Raja got 6 Thousand Crores
2.e) Others got ??