స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), ఫిఛ్, మూడీస్… ఈ మూడు సంస్ధలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ ఉన్న “రేటింగ్ ఏజన్సీలు.” ఇవి వివిధ దేశాల, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీని చేపట్టిని దేశాల సావరిన్ అప్పులకు రేటింగ్ ఇస్తాయి. సావరిన్ అప్పులనే ట్రెజరీ బాండ్స్ అంటారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మార్కెట్ నుండి, అంటే ప్రవేటు పెట్టుబడిదారులనుండి అప్పులు సేకరించడం కోసం ట్రెజరీ బాండ్లు జారీ చేస్తాయని తెలుసుకున్నాం. వివిధ దేశాల ట్రెజరీ బాండ్లలో తమ పెట్టుబడిని మదుపు చేసుకోవచ్చా లేదా అని తేల్చుకోవడానికి ప్రవేటు మదుపుదారులకు రేటింగ్ సంస్ధలు ఇచ్చే రేటింగ్‌లు ఉపయోగపడతాయని చెబుతారు. కానీ ఆచరణలో ద్రవ్య మార్కెట్లొ స్పెక్యులేషన్ నియంత్రణకు అందకుండా పెరిగిపోవడం, అతి పెద్ద ద్రవ్య కంపెనీలు తమకు లాభాల వచ్చే రీతిలో రేటింగ్ లు ఇచ్చేలా రేటింగ్ సంస్ధలను ప్రభావితం చేస్తుండడంతో రేటింగ్ సంస్ధల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.
రేటింగ్ ఏజన్సీ: “దయచేసి తప్పుగా అనుకోవద్దు. కాని నీకు భవిస్యత్ లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు కొంతమంది నాకు డబ్బు లిస్తున్నారు. అర్ధం చేసుకోండి. ప్లీజ్”
గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పటివరకూ బాగానే ఉన్నా, లేకుంటే బాగానే ఉన్నట్లు కనిపించినా, రెటింగ్ సంస్ధలు డౌన్ గ్రేడ్ చేసినదగ్గర్నుండే తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి. తాజాగా ఇవి అమెరికా రేటింగ్‌ని కూడా తగ్గిస్తామని హెచ్చరిస్తుండడంతో అమెరికా అధికారులు వాటితో ఘర్షణకు దిగుతున్నారు. సంక్షోభంలో ఉన్న యూరప్ దేశాల అప్పులపై వాల్‌స్ట్రీట్ కంపెనీలు మార్కెట్లో ఊహాగానాలు సృష్టించి లబ్ధి పొందాయి. ఇపుడు అమెరికా అప్పుపై కూడా లాభం పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. తోకను ఆడించాల్సిన కుక్క శరీరం తోకకు లోంగిపోయి తానే నాట్యం చేస్తున్న పరిస్ధితి దాపురించిందన్నమాట. `దేశంలో ఉన్న కంపెనీలు ఎంత పెద్దవైనా ప్రభుత్వానికి లోబడి ఉండి, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి. కాని మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలలో స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతం పేరు చెప్పి, దేశ ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసే పనికిమాలిన బడా కంపెనీలకు అన్ని అవకాశాలు కల్పించడంతో అవిప్పుడు ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. ప్రభుత్వాల స్ధిరత్వాన్ని అవి శాసిస్తున్నాయి.
కార్టూనిస్టు: జువాన్ రామోన్ మోరా, బార్సిలోనా, స్పెయిన్