మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో


మిత్రులు కొణతం దిలీప్ గారి బ్లాగ్ నుండి సంగ్రహించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు తమను తాము దహించుకుంటున్న రోజుల్లో 28 ఏప్రిల్, 2010 తేదీన అటువంటి ఒక యువకుడి ఆత్మాహుతి పట్ల నిరసన తెలుపుతూ జరిగిన సభలో శంకరుడినే ప్రశ్నిస్తున్న కళాకారుడి హృదయం ఈ పాట. కొన్ని వందల తల్లుల కడుపు శోకానికి అక్షర రూపం ఈ పాట. అంతమంది తల్లుల గర్భశోక ధ్వని రూపం కూడా ఈ పాట. పాషాణ హృదయులనైనా కరిగించగల శక్తిని సంతరించుకున్నది ఈ పాట.

నీ ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా, ఈ తల్లి నుదుటిపై ఏల రాశావీ రాత అని శంకరుడిని సైతం ప్రశ్నించగల సత్తా ఒక్క కళాకారునికే ఉంటుంది. నీ భార్యకి గణపతిని ఇచ్చావు, ఈ తల్లికి శోకం ఇచ్చావా అని శంకరుడ్ని నిలదీస్తుందీ పాట. గర్భశోకం ఎలాంటిదో నీ అర్ధ దేహాన్నే అడగమని తీవ్రంగా నిరసిస్తున్న ఈ కవి హృదయం పాషాణ హృదయుడిని సైతం కదిలించక మానగలదా?

<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/ws_17vQYTmg?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>

One thought on “మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో

  1. ఈ కవి హృదయం పాషాణ హృదయుడిని సైతం కదిలించక మానగలదా?….kadalincha ledu anna vishayam mana nayakula teeru chooste teliyadam ledaa?vaalla hrudayale kadilinchi unte udayaanne levagaane o.u ki enduku parigedataaru?pillalani enduku reccha gotti rodla meedaku laagutaaru…ninna koodaa aatma hatya chesukunna reddy bavuthika kaayaanni naluguriki pradarsinchi marrini aathma hatyalu jarigelaa paristhitini teesuku povadaaniki prayatnincha ledaa…..raajakeeyanaayakulu paristiti egadoyadaanike prayatnistaaru..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s