యెడ్యూరప్పపైన కర్ణాటకకు చెందిన ఇద్దరు లాయర్లు సిర్జిన్ భాషా, కె.ఎన్.బాలరాజ్ గత జనవరిలో ఐదు అవినీతి కేసులను దాఖలు చేశారు. గవర్నరు హెచ్.ఎన్.భరద్వాజ ముఖ్యమంత్రిపై కేసులు దాఖలు చేయడానికి ఇరువురు లాయర్లకు అనుమతి ఇచ్చాక వారు సి.ఎం పైనా, ఆయన కుమారులు అల్లుడు పైనా, ఇతరులపైనా కేసులు దాఖలు చేశారు. యెడ్యూరప్పతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ఆయన కుమారులు బి.వై.రాఘవేంద్ర, బి.వై.విజయేంద్ర, అల్లుడు సోహన్ కుమార్, ఇంకా ఇతరులు కాగా వారిలో రాఘవేంద్ర లోక్ సభ సభ్యుడు.
యెడ్యూరప్ప అల్లుడు సోహన్ కుమార్, లాయర్లు దాఖలు చేసిన ఐదు కేసులపై విచారణ చేయడానికి పోలీసులను కింది కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో ట్రయల్స్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె.ఎన్.కేశవ నారాయణ గత మార్చి నెలలో స్టే మంజూరు చేశాడు. గురువారం ఆయన తాను విధించిన స్టేను ఎత్తి వేస్తూ తీర్పు చెప్పాడు. యెడ్యూరప్ప, ఆయన కుమారులు, అల్లుడు, తదితరులపై విచారణ కొనసాగించవచ్చని తీర్పు చెప్పాడు. కొన్ని అవినీతి ఆరోపణలు, అక్రమ భూ పంపకాల కేసుల్లో ఆరోపణలు యెడ్యూరప్ప తదితరులపై లాయర్లు కేసులు దాఖలు చేశారు. ప్రస్తుతం యెడ్యూరప్ప విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన వస్తే కర్ణాటకలో రాజకీయా మార్పులు వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ మార్పులు తాత్కాలిక సర్దుబాటు కోసమే ఉద్దేశిస్తాయి తప్ప, మిన్నేమీ విరిగి నేల బడేటంతటి పరిణామాలేవీ సంభవించవు. తాత్కాలిక సర్దుబాట్లనే శాశ్వత పరిష్కారాలుగా ప్రచారం చేయడానికి పత్రికలు, ఛానెళ్ళు ఎలాగూ ఉన్నాయి.

ఎడ్యూరప్ప తక్కువేం తినలేదు, అలాగని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అవినీతి పరుడు ఇతనొక్కడే కూడా కాదు, మరి ఏ “గ్రహాల” ఆగ్రహమో కానీ ఎద్యూరప్పకు దిన దినమూ గండాలే, మరి నూరేళ్ళ ఆయుష్షు సంగతి కాలమే తేల్చాలి మరి..!!!