ప్రకృతిపై మనిషి సాగించిన పోరాటంలో మనిషిదే అంతిమ విజయం. విజయంతో సంతృప్తి చెందిన మనిషి ధన ధాహంతో ప్రకృతి వినాశనానికి పూనుకుంటున్నాడు. దానితో జనారణ్యం సహజారణ్యంలోకి చొచ్చుకెళ్తోంది. ఫలితంగా జంతువులకు తమ సహజ నివాసంలో జాగా లేక జనారణ్యంలోకి రాక తప్పడం లేదు.
రియల్ ఎస్టేట్ రంగ కాసుల దాహం కావచ్చు, అడవుల్లో దొరికే సహజ ఖనిజ వనరులపై బిలియనీర్ల కన్నుపడటం వలన కావచ్చు, అడవుల్లో జంతుజాలానికి నిలవ నీడ లేకుండా పోయింది. ఖనిజాల కోసం, గనుల కోసం, కలప కోసం నాగరీక మానవుడు అడవుల్ని నరికివేయడం పెరుగుతుండడంతో అడవులే ఆవాసంగా బతికే జంతువులకి నీరు, ఆహారం దొరకడం గగనమైపోయింది. దానితో జనారణ్యంలో అసలు స్ధానమేలేని క్రూర జంతువులు సైతం దాహం తీర్చుకోవడానికో, ఆకలి తీర్చే వేట కోసమో తమకే మాత్రం పరిచయం లేని జనారణ్యంలోకి చొరబడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్ జిల్లాలో సిలిగురి శివార్లలో సలుగరా దగ్గర ఉన్న ప్రకాష్ నగర్ గ్రామంలోకి మంగళవారం మధ్యాహ్నం చొరబడింది. ఒక మహిళ, ఇరువురు పురుషులను గాయపరిచిన చిరుతను మత్తులో ముంచి పట్టడానికీ లేదా వల విసిరి పట్టడానికి ఫారెస్టు గార్డులు ప్రయత్నిస్తుంతలోని వారిపైకి లంఘించడంతో వారు కాల్పులు జరిపి అనంతరం మత్తు ఇచ్చి తరలించారు. ఆ దృశ్యాలను చూపించే ఫోటోలివి: