తేనెటీగల దండు వస్తుంటేనే చూసి పారిపోతాం మనం. అవి మన శరీరంలో నాటే కొండీలు యమ బాధని కలిగిస్తాయి. కాని చైనాలో ఏకంగా తమ శరీరాలనే తేనెతుట్టెలుగా మార్చే పోటీ జరగడం విశేషం. చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోటీ దృశ్యాలను చూసి తీరవలసిందే మరి.
చైనా లోని హూనాన్ రాష్ట్రంలో “షావో యాంగ్” ఊరిలో ఈ తేనెటీగల్ని ఆకర్షించే పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొనేవారు తాము పెంచుకున్న రాణి తేనెటీగల్ని వొంటికి అతికించుకుని మగ తేనెటీగల్ని ఆకర్షిస్తారు. ఎవరు ఎక్కువ బరువుగల తేనెటీగల్ని ఆకర్షించగలరో వారు పోటీలో గెలిచినట్లు లెక్క. పోటీ ప్రారంభం నుండి పోటీదారుడు ఒక బరువు తూచే యంత్రంపై నిలబడి ఉంటాడు. నిర్ధిష్ట సమయం తర్వాత బరువులో వచ్చిన తేడాను చూసి ఎవరు ఎక్కువ తేడాని చూపించగలిగితే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు.
20 సంవత్సరాల ఎల్.వి.కాంగ్ జియాంగ్, వాంగ్ దాలిన్‌తో పోటీ పడ్డాడు. ఒక్క షార్ట్స్ మినహా మరేవీ ధరించకూడదు. పోటిలో ఒక గంట సమయంలో 26 కి.గ్రా ల తేనెటీగల్ని ఆకర్షించిన వాంగ్ దాలిన్ గెలిచినట్లు ప్రకటించారు. అతని ప్రత్యర్ధి కాంగ్ జియాంగ్ 22.9 కి.గ్రా ల తేనెటీగల్ని మాత్రమే ఆకర్షించగలిగాడు. బరువు సంగతేమో కాని అసలు తేనెటీగల్ని ధైర్యంగా వొంటిమీదికి ఆకర్షించడం అంటేనే అదోలా ఉంది. వీళ్ళెలా తట్టుకున్నారో మరి?!
ఓడిపోయిన కాంగ్ జియాంగ్ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.