యూరప్ అప్పు సంక్షోభం యూరప్ దేశాలకు శాపంగా మారింది. ఖచ్చితంగా చెప్పాలంటే యూరప్ అప్పు సంక్షోభం యూరప్ ప్రజలకు శాపంగా మారింది. అప్పు కొండలా పేరుకు పోయి మార్కెట్ నుండి ట్రెజరీ బాండుల ద్వారా తేలికగా అప్పు సేకరించలేని పరిస్ధితిని అప్పు సంక్షోభంగా పిలుస్తున్నారు. ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాల ప్రజలు దీని బారిన పడి నిరుద్యోగం, ఉద్యోగాల కోత, పెన్షన్ల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు లాంటి అనేక సమస్యలతో అల్లాడుతున్నారు. స్పెయిన్ కార్టూనిస్టు ఎనెకో, తన బ్లాగ్ లో తమ దేశంలో ఉద్యోగాలు ఎంత దృఢంగా ఉన్నాయో తెలుపుతూ ఈ కార్టూన్ గీశాడు. స్పెయిన్ ని ఉద్దేశించి గీసినా ఇది యూరప్ లోని దాదాపు అన్ని దేశాలకూ, అమెరికాకూ కూడా వర్తిస్తుంది. ఇండియాకి కూడా వర్తిస్తుందని వేరే చెప్పాలా?