భారత షేర్ మార్కెట్‌కు హెవీ వెయిట్ గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను వాల్‌స్ట్రీట్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తగ్గించేసింది. పెట్టుబడి ఎక్కువ చేసి చూపిందని ఆరోపణ ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చుట్టూ ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న కెజి బేసిన్ లో అనుకున్నంత స్ధాయిలో నిల్వలు లేవన్న అనుమానాలు తలెత్తాయి. సమీప భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీట్ కంపెనీకి అనుకూలంగా పనిచేసే పరిణామాలేవి సంభవించవని మోర్గాన్ స్టాన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు అంచనా వేస్తోంది. వాల్యుయేషన్ సంబంధించిన ఆరోపణలు ఎలా ఉన్నా అనుకూలంగా పనిచేసే ట్రిగ్గర్ లు లేకపోవడం రేటింగ్ తగ్గింపుకు కారణమని అది తెలిపింది.
ఇప్పటివరకూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి “ఓవర్ వెయిట్” రేటింగ్ (అసలు విలువ కంటే ఎక్కువ ప్రతిస్పందన కలిగి ఉండడం?) ఉండగా దానిని “ఈక్వల్ వెయిట్” (అసలు విలువకు తగిన స్పందన కలిగి ఉండడం?) కు తగ్గించింది. టార్గెట్ ధర రు.1206లు ఉండగా దానిని రు.956 కు తగ్గించింది. టార్గెట్ ధర తగ్గుదల దాదాపు 20 శాతం ఉండడం గమనార్హం.
