రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం


48-hour bandh

పోలీసులపై రాళ్ళు రువ్వుతున్న విద్యార్ధులు

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు. బందు గురించి విస్తృత ప్రచారం జరగడంతో ప్రజలు కూడా దాదాపు ప్రయాణాలు పెట్టుకోలేదనే చెప్పాలి. ప్రయాణం పెట్టుకున్న కొద్దిమంది ఇబ్బందులకు గురయ్యారు.

బస్సులు లేకపోవడం వలన ఆటోలు, ఇతర ప్రవేటు వాహనాలు ప్రయాణీకులకు కొంత సహాయం అందించాయి. ప్రభుత్వ కార్యాలయాలు కొద్దిమంది సిబ్బందితోనే పని చేశాయని ‘ది హిందూ’ తెలిపింది. జె.ఎ.సి లో ప్రభుత్వ ఉద్యోగులు తదితర సెక్షన్ల ప్రజానీకం కూడా భాగం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పని చేశాయి. కోర్టుల పనికి అంతరాయం కలిగించడానికి కార్యకర్తలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా రాజీనామా చేయని మంత్రులు, ఎం.ఎల్.ఏ ల ఇళ్ళను చుట్టుముట్టడానికి కార్యకర్తలు కార్యకర్తలు ప్రయత్నించారు. ఇవి మినహా బందు ప్రశాంతంగ సాగుతోందని వార్తా సంస్ధల ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Telangana bandhఐతే ఐ.టి రంగంపై బంద్ ప్రభావం కనిపించలేదని తెలుస్తోంది. సైబరాబాద్ లోని ఐ.టి సంస్ధలన్నీ యధావిధిగా పనిచేస్తున్నాయని ది హిందూ అనుబంధ వాణిజ్య పత్రిక ‘బిజినెస్ లైన్’ తెలిపింది. జి.ఇ, ఏ.డి.పి, ఇన్ఫోసిస్, మహీంద్రా సత్యం, ఇన్ఫో టెక్ లాంటి కంపెనీలు ఏదో విధంగా బంద్ వలన ప్రభావితమైనప్పటికీ స్మార్ట్ ఫోన్ల ద్వారా పోలీసులు ఏర్పాటు చేసిన నెట్ వర్క్ లవలన వారి కంపెనీల వ్యాపారాలు నడిచాయని ఆ పత్రిల తెలిపింది. ఐ.టి కంపెనీల వాహనాలు బంద్ కార్యకర్తలు ఆపిన వెంటనే కంపెనీల యజమానులకు, పోలీసులకూ సమాచారం అందేవిధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత వాహనం ఆగిన చోటికి వెళ్ళీ దాన్ని విడిపించడం, ఆ వాహనం గమ్య స్ధానానికి చేరుకోవడం ఈ రెండురోజులూ జరిగిందని ఆ పత్రిక తెలిపింది. గత సంవత్సరం వచ్చిన అనుభవాలతో పోలీసులు నాస్కామ్, సి.ఐ.ఐ, ఐ.టి.ఎస్.ఎ.పి లాంటి సంస్ధలతో పోలీసు ఐ.టి విభాగం సంప్రదించి వారి వ్యాపారాలు సజావుగా సాగడానికి ‘ఇన్ఫో షేరింగ్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారని ఆ పత్రిక వివరించింది.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు బందు మొదటి రోజైన జులై 5న ఊరేగింపు తీయడానికి ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. యధావిధిగా పోలీసులు లాఠీ ఛార్జీ, భాష్ప వాయు ప్రయోగానికి దిగడంతో విద్యార్ధులు

T bandh and IT comapnies

ఐ.టి కంపెనీలపై బంద్ ప్రభావం లేదు -బిజినెస్ లైన్

రాళ్ళను మళ్ళీ తమ ఆయుధాలుగా చేసుకున్నారు. తెలంగాణ రాస్ట్రం కోసం ప్రజా ఉద్యమాలు ప్రారంభమైనప్పటినుండీ పోలీసులు తీసుకున్న అతి జాగ్రత్తలు తెలంగాణ ఉద్యమానికి సహాయకారిగా పని చేశాయని చెప్పవచ్చు. ప్రారంభదశలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరాహార దీక్షలు మొదలైనప్పుడు విద్యార్ధులపై పోలీసులు అనవసరంగా బలప్రయోగానికి దిగి ఆందోళనకు బహుళ ప్రచారం కల్పించారు. అప్పటినుండి తెలంగాణ కోసం ఉద్యమం వేడెక్కినప్పుడల్లా పోలీసుల చర్యలు విద్యార్ధులు మరింత తెగించడానికీ, లాయర్లు వారికి మద్దతుగా మిలిటెంట్ పోరాటానికి సిద్ధపడడానికీ, తద్వారా ఉద్యమం మరింత ఊపందుకోవడానికీ దోహదం చేశాయి. పోలీసులకు ఒక విధంగా తెలంగాణ ఉద్యమకారులు ఋణపడి ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!

జులై 5న ఊరేగింపు జరపడానికి వీలు కాకపోవడంతో జులై 6 తేదీనైనా జరపాలని విద్యార్ధులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. బంద్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు మొదలైన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే 48 గంటల బంద్ కు రాజకీయ జె.ఎ.సి పిలుపిచ్చింది. బంద్ అనంతరం జులై 8, 9 తేదీల్లో రైల్ రోకోలు నిర్వహించాలని కూడా జె.ఎ.సి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా రాజీనమా చేసిన  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని ప్రజాప్రతినిధుల సంఖ్య 100కు చేరుకుంది.

2 thoughts on “రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

  1. t idiots are creating hell for common people. i have seen that most of telengana people are also hating this bandh. govt. should keep in jail without bail those who call bandh.

  2. Common people do have so many other problems too. Let’s also worry about them. I think some of such unsolved problems for years have pushed Telanganites to seek separate state. The State and Central governments have ignored valuable opportunities to comply with the legitimate demands of Telengana people, due to which they are only left with a hallowed box of ideas to answer the queries of the people of those ten districts. Even for last one or two years also they’ve lost some opportunities, it seems. These political people are looking for political mileage.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s