అమెరికా సైనికుల బూట్లు పాక్ నేలను తాకడానికి వీల్లేదు -సి.ఐ.ఏ తో పాక్ ఆర్మీ
సి.ఐ.ఏ గూఢచారులను 2/3 వంతు మందిని పాకిస్ధాన్ నుండి పంపించడంతో, ఆ విషయం చర్చించడానికి సి.ఐ.ఏ అధిపతి లియోన్ పెనెట్టా చెప్పా పెట్టకుండా పాకిస్ధాన్‌కి విచ్చేశాడు. పాక్ మిలట్రీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం పాకిస్ధాన్ లో మొత్తం 135 మంది సి.ఐ.ఏ గూఢచారులు ఉండగా వారిలో 90 మందిని అమెరికాకు తిప్పి పంపారు. పాకిస్ధాన్ భూభాగంలో రక్షణ పొందుతున్న ఆల్-ఖైదా, తాలిబాన్ స్ధావరాలపై డ్రోన్ దాడులు జరపడానికి పాకిస్ధాన్ లో నియమించబడిన సి.ఐ.ఏ గూఢచారులు అందించే…