రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు


రెండు యుద్ధాలు

అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్‌ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు.

మూడు ఫోటోలు

A boy killed in suicide bombing in Nazaf

ప్రజాస్వామ్యం నిర్మిస్తానని ఇరాక్‌పై అమెరికా చేసిన దండయాత్ర అనంతరం ఆ దేశం తెగలు, ఉప ఉపమతాల కొట్లాటలకు కేంద్రంగా మిగిలింది. చీలికలు, పేలికలుగా చినిగి ముక్కలవుతున్న ఇరాక్ రాజధానిలో ఆత్మాహుతి దాడిలో ఆహుతి ఐన కుటుంబం సభ్యుడైన నాలుగేళ్ళు కూడా నిండని బాలుడి శవం

Aftermath of Iraq war in Baghdad

ఒక స్వతంత్ర దేశం ఇరాక్‌పైన అమెరికా, ఐరోపా దేశాలు జరిపిన దురహంకార దురాక్రమణ దాడి అనంతరం స్మశానాన్ని తలపిస్తున్న బాగ్దాద్ లోని యూదుల ప్రాంతం

American soldiers killed in Afghanistan

ఎక్కడ పుట్టి, ఎక్కడ పెరిగి, ఆఫ్ఘనిస్ధాన్‌కి ఎందుకొచ్చారు? ఎవరి కోసం ప్రాణాలొదిరారు? --అమెరికా పాలకుల సామ్రాజ్యవాద దండయాత్రలో పావులు, సమిధలు ఈ అమెరికన్ సైనికులు--

కొన్ని వాస్తవాలు:

అమెరికా, దాని మిత్ర రాజ్యాలు టెర్రరిజంపై యుద్ధం పేరుతో సాగించిన నరమేధంలో ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లో జరిగిన ధన ప్రాణ నష్టం పూర్తిగా ఎంతో ఇంకా తేలలేదు. బహుశా తేలదేమో కూడా. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయన సంస్ధ బొమ్మల్లో చెప్పిన కొన్ని యుద్ధ వాస్తవాలు చూడండి.

Countries that hold US detainees

"టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం" చేయడానికి అమెరికా ప్రపంచం నిండా డిటెన్షన్ సెంటర్లు తెరిచింది. చిత్ర హింసల కొలిమిలను నిర్మించింది. అమానవీయంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది. అమెరికా దారుణ కృత్యాలకు తమ నేలను అప్పగించిన దేశాలివి

Pentagon war appropriations is less than hidden costs of the wars

అమెరికా యుద్ధ ఖర్చు పైకి చెబుతున్నది కొద్ది మొత్తమే. వివిధ పేర్లుగల బడ్జెట్లలో తొక్కి పెట్టిన వాస్తవాలు అంతకు రెండింతలు

One thought on “రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s