అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన ఎయిడ్ ప్యాకేజి తదుపరి వాయిదా ఇవ్వడానికి వెనకాడుతున్నందునా, ఫిచ్ రేటింగ్స్ అందోళన వ్యక్తం చేసింది. గ్రీసు ఉన్న పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకే ఐ.ఎం.ఎఫ్, ఇ.యు లు నాటకాలాడుతున్నాయనీ, గ్రీసు డిఫాల్టు కావడానికి అవి నిజానికి అనుమతిస్తే వాటికే నష్టమనీ కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూన్నారు.