టర్కీ ప్రధాని ‘ఎర్డోగాన్’ ద్విపాత్రాభినయం


టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈయన 2003 నుండి ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. మూడోసారి కొంత మెజారిటీ తగ్గినా ప్రభుత్వం ఏర్పరచడానికి తగిన మెజారిటీ సంపాదించగలిగాడు. రెండో సారి అధికారానికి వచ్చినప్పటినుండి ఈయన పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ కి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ముస్లింల ప్రయోజనాలు కాపాడే ఛాంపియన్ గా టర్కీని నిలపడానికి బాగా ప్రయత్నిస్తూ వచ్చాడు. పశ్చిమాసియాలో ప్రాంతీయంగా ఇరాన్ తో పోటీపడి ప్రభావవంతమైన దేశంగా టర్కీని నిలపాలని ఆయన ప్రయత్నం. కానీ టర్కీ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ కి గల ఏకైక ముస్లిం మిత్రదేశంగా ఇప్పటివరకూ వెలుగొందింది. ఎర్డోగాన్ పైకి పాలస్తీనాకి మద్దతు ఇస్తున్నట్లు నటిస్తూనే అంతర్గతంగా ఇజ్రాయెల్ తో వ్యాపార, రాయబార సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన ద్విపాత్రాభినయాన్ని విప్పిచూపే కార్టూన్ ఇది.

recep_tayyip_erdogan

ముందు పాలస్తీనాతోపై ప్రేమ, వెనక ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు (క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s