సర్ఫరాజ్ షా అనే పేరుగల యువకుడిని పాకిస్ధాన్ పారామిలట్రీ రేంజర్స్ కి చెందిన పోలీసులు, అతను ఓ వైపు దీనంగా బతిమాలుతున్నప్పటికీ క్రూరంగా కాల్చి చంపిన దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. పోలీసులకి, సైనికులకి అధికారం అప్పగిస్తే ప్రజలు ఏం అనుభవించాల్సి వస్తుందో ఈ వీడియో తెలియజెప్పుతోంది. పాక్ ప్రధాని యధావిధిగా, విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మినవారెవరూ లేరని పత్రికలు ఘోషిస్తున్నాయి.