“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి ఆయన పెయింటింగ్ లను చించివేశారు. హిందూ మత దేవతలను నగ్నంగా చిత్రించడాన్ని వారు మహా నేరంగా పరిగణీంచారు. హిందూ మతస్ధుల మనోభావాలు గాయపరచడం తన ఉద్దేశ్యం కాదని చెబుతూ ఆయన బహిరంగంగా రెండు మూడు సార్లు క్షమాపణ చెప్పినప్పటికీ మతోన్మాదుల దాడులు ఆగలేదు. దానితో ఎం.ఎఫ్.హుస్సేన్ తనకు తానుగా ప్రవాసం విధించుకున్నారు.
మక్బూల్ ఫిడా హుస్సేన్ 95 సంవత్సరాల వయసులో చనిపోయారు. హుస్సేన్‌తో 40 సంవత్సరాలుగా స్నేహం నెరిపిన మున్నా జవేరి ఆయన మరణించిన విషయాన్ని తెలిపారు. “ఈరోజో రేపో ఇంటికి వస్తాడని భావిస్తున్నాం. కాని ఆయన పరిస్ధితి క్షీణించింది” అని ఆయన రాయిటర్స్ కు తెలిపాడు తన పెయింటింగ్‌ల ద్వారా హుస్సేన్ భారత ఖ్యాతిని ప్రపంచంలో వ్యాప్తి చెందించాడు. ఆయన పెయింటింగ్‌లు కొన్ని మిలియన్ల డాలర్లకు అమ్ముడు పోయేవి. 2010లో ఆయన ఖతార్ దేశ పౌరసత్వం తీసుకున్నారు. రెండు బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించిన హుస్సేన్ బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను బాగా అభిమానించేవారు. తాను జీవించిన కాలమంతా విస్తరించిన తరాలకు చెందిన పెయింటింగ్ కళాకారులందర్నీ ఆయన ప్రభావితం చేశారు. సామాజిక ఫంక్షన్ లలో ఆయన చెప్పులు లేకుండా ప్రత్యక్షమయ్యేవారు.
హుస్సేన్ పెయింటింగ్ శైలి క్యూబిజం, భారతీయ ప్రాచీన శైలిల మిళితమని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. ఆధునిక భారతీయ చిత్ర కళ హుస్సేన్ ద్వారా ప్రపంచ స్ధాయిలో నిలిచిందని చెప్పవచ్చు. ఆయన చిత్ర ప్రదర్శనలపైనా, ఆయన ఇంటిపైనా జరిగిన దాడులు భారత దేశంలో ప్రజాస్వామిక భావాలకు చోటు లేదా అన్న ప్రశ్నను మిగిల్చాయి. చివరికి ఆయన ఖతార్ పౌరసత్వాన్ని అంగీకరించేలా పరిస్ధితిని తీసుకోచ్చిన వారు ప్రజాస్వామ్య సంస్కృతిపైన అవగాహన పెంచుకోవలసిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది.
భారతీయ ఆర్టిస్టులలో అగ్రగామిగా ఉన్న ‘అంజోలీ ఎలా మీనన్’ మాటల్లో చెప్పాలంటే హుస్సేన్ గారి విస్తారమైన పెయింటింగ్‌ల మొత్తం శ్రమ పికాసో మొత్తం శ్రమకు పోల్చదగినది. హుస్సేన్ ఎప్పుడూ వయసు మీరినట్లుగా కనపడలేదు. ఆయన శక్తి, హాస్యం, అద్భుతమైన ఆయన పని సామర్ధ్యం చివరి వరకూ ఆయనతోనే ఉన్నాయి. విశ్రాంతి ఎరుగని వ్యక్తి. తనకు పడుకోవడానికి బెడ్‌రూం అనేది లేదని తరచూ చెబుతుండేవారు. ఆయన దేశ ద్రిమ్మరి, జిప్సీ లాంటివారు” అని ఆమె హుస్సేన్ గురించి బిబిసితో మాట్లాడుతూ అన్నారు. చిత్ర కళా విమర్శకుడు ఎస్. కాళిదాసు హుస్సేన్ చనిపోవడానికి రెండు వారాల ముందువరకు పెయింటింగ్ వేస్తూనే ఉన్నారని తెలిపాడు. నిండు జీవితాన్ని ఆయన గడిపారని కాళిదాసు కొనియాడాడు.
“ఆయన ఎక్కడైనా పెయింటింగ్ వేయగలడు. రోడ్లపైన, స్టూడియోలో. ఎక్కడైనా. ఆయన మనసూ, శరీరమూ ఎప్పుడూ కలర్‌ఫుల్ గా వేగంగా ఉండేవారు. చాలా వేగంగా ఆలోచించగలరు. వేగంగా పెయింటింగ్ వేయగలరు. అంత వేగంగా పెయింటింగ్ వేయగలిగినవారిని నేనెన్నడూ చూడలేదు” అని కాళిదాసు హుస్సేన్ గురించి వివరించాడు. హిందూ దేవతలను నగ్నంగా చిత్రించడంతో ఆయన చుట్టూ వివాదాలను కమ్ముకున్నాయి. పెయింటింగ్ లో నగ్నత్వం సర్వసాధారణమన్న సంగతి హిందూ సంస్ధల కార్యకర్తలకు బహుశా అర్ధం అయి ఉండకపోవచ్చు. నగ్నత్వం కోసం నగ్నత్వాన్ని చిత్రించడానికీ కళకు సంబంధించిన నగ్నత్వానికి తేడా తెలియనివారు ఆయన పెయింటింగ్ లను నగ్నచిత్రాలుగా పొరబాటుపడడంలో ఆశ్చర్యం లేదు.
భారత మాతను నగ్నంగా చిత్రించినందుకు ఆయన 2006 లో బహిరంగంగా క్షమాపణ కోరాడు. ఓ నగ్న స్త్రీ మోకాళ్ళపై నేలపై కూర్చుని ఇండియా పటాన్ని చిత్రిస్తున్నట్లుగా హుస్సేన్ తన పెయింటింగ్ లొ చిత్రించారు. ఆయన పెయింటింగ్ శైలి అది నగ్న చిత్రమని భావించేలా కనపడదు. అయినప్పటికీ ఆయన చిత్రాల్లో నగ్నత్వాన్ని చూడగలిగినవారు ఉన్నారంటే ఆశ్చర్యమే. 2008లో సుప్రీం కోర్టు హుస్సేన్ పై క్రిమినల్ చర్యలకు అనుమతించడానికి తిరస్కరించింది. ఆయన పెయింటింగ్‌లు అసభ్యం కావనీ భారత ఐకొనోగ్రఫీ (ఆదర్శనీయ వ్యక్తుల ఆరాధన?) లోగానీ చరిత్రలో గానీ నగ్నత్వం సర్వసాధారణమేననీ సుప్రీం కోర్టు ఆ సందర్భంగా పేర్కొన్నది.
ఒక మంచి చిత్రకారుడిని కోల్పోయాము. ఇది చాలా బాధాకరమైన వార్త.
పెయింటింగ్ లో నగ్నత్వం సర్వసాధారణమన్న సంగతి హిందూ సంస్ధల కార్యకర్తలకు బహుశా అర్ధం అయి ఉండకపోవచ్చు భారత ఐకొనోగ్రఫీ (ఆదర్శనీయ వ్యక్తుల ఆరాధన?) లోగానీ చరిత్రలో గానీ నగ్నత్వం సర్వసాధారణమేననీ సుప్రీం కోర్టు ఆ సందర్భంగా పేర్కొన్నది అన్నారు
పెయింటింగ్లో నగ్నత్వం సాధారణం అని అర్ధం ఐనా కేవలం హిందూ దేవతల్నే ఎందుకు నగ్నంగా వేశారో అర్ధం కాక వారు అలా ప్రవర్తించి ఉంటారు. చాలా మంది అన్నట్టు హిందూ శిల్పకళలో నగ్నత్వం ఉంది కానీ కాళీ రూపాన్ని నగ్నంగానో అర్ధనగ్నంగానో చెక్కిన శిల్పకారులు.. సరస్వతి రూపాన్ని చెక్కిన దాఖలాలు లేవు. మరి వెరైటీ కోసం ఎమ్మెఫ్ సాబ్ సరస్వతిని వేసారు. పాపం ఆయా సంఘాల వాళ్లకి ఈ వెరైటీ అర్ధం కాకపోయి ఉండొచ్చు.
ఆయన చిత్ర ప్రదర్శనలపైనా, ఆయన ఇంటిపైనా జరిగిన దాడులు భారత దేశంలో ప్రజాస్వామిక భావాలకు చోటు లేదా అన్న ప్రశ్నను మిగిల్చాయి. చివరికి ఆయన ఖతార్ పౌరసత్వాన్ని అంగీకరించేలా పరిస్ధితిని తీసుకోచ్చిన వారు ప్రజాస్వామ్య సంస్కృతిపైన అవగాహన పెంచుకోవలసిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది.
ఇప్పటికీ నాకు కొన్ని విషయాలు అర్ధం కావడం లేదు. కచ్చితంగా ఆయన చిత్రాలకు హిందువులు బాధపడ్డారు. మరి అంతమంది మనోభావలను గాయపరిచే హక్కు ఆయనకెవరిచ్చారు. సరస్వతీ దేవి బొమ్మను నగ్నంగా వేస్తే హిందువుల మనస్సులు గాయపడతాయని తెలియదా హిందువులే కదా అని లైట్ తీస్కున్నారా
హిందూ దేవతలే ఎందుకు అన్న ప్రశ్న ఎం.ఎఫ్ హుస్సేన్ ముస్లిం అయినందువల్లే వచ్చిందా అన్న అనుమానం కూడా లేక పోలేదు.
ఫలానా వ్యక్తి అధ్లెట్ అంటే ఆ పక్కన ఉన్నతను సోంబేరు అనా? అని కొట్టొస్తే సమాధానం చెప్పడం కష్టం. హిందూ దేవతలకు ఒక రూపం ఇచ్చే ధోరణి బహుశా అందుకు ప్రేరణ కావచ్చు. (ఇది నా అంచనా మాత్రమే. అది తప్పయి ఉండోచ్చు) అయినప్పటికీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించాక ఆయన క్షమాపణలు కోరాడు. ఆ తర్వాత కూడా ఆయనపైన విధ్వేష ప్రచారం మాన లేదు.
తస్లీమా నస్రీన్ ఇస్లాంకి వ్యతిరేకంగా రాస్తే ఆహ్వానించగలిగినప్పుడు ఎం.ఎఫ్. హుస్సేన్ ని గూడా ఆహ్వానించగల సహనం మనకు ఉంటుందని కోరుకోవడంలో తప్పు లేదు కదా. హుస్సేన్ నగ్నత్వ చిత్రణ హిందూ దేవతలకే పరిమితం కాలేదు. ఇతర మతాలపై అటువంటిది లేక పోవచ్చు గానీ నగ్నత్వ చిత్రణ అయితే చాలా పెయింటింగ్ లలో కనిపిస్తుంది. ఆయన భారతీయుడు. ఆయన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణమే ఆయన్ని అధికంగా ప్రేరేపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇస్లాంలో కూడా వ్యక్తుల రూపాలు ఉంటే వారి పైనా హుస్సేన్ దృష్టి పడేదేమో (ఇదీ నా ఊహే).
అమెరికాలో ఇలా జరిగితే ఇది ఫ్రీ కంట్రీ, స్వేచ్ఛకే ప్రధమ ప్రాధాన్యం అని సమర్ధనలు అన్ని వైపులనుండీ వస్తాయి. జీసస్, మేరీ లపై అక్కడ కేవలం నగ్నం మాత్రమే కాక చాలా అసభ్య ధోరణులు మనకు కనిపిస్తాయి. హుస్సేన్ ఆ ధోరణులకు చెందిన వాడు కాడు. కళాత్మక చిత్రణే అతని ధోరణి. అందులో నగ్నత్వం అన్నదానికి చోటు లేదు. బైటి నుండి చూసే వారికి నగ్నత్వం కనిపించవచ్చు గానీ కళా ధోరణిలో ఉన్నవారికి నగ్నత్వం అన్న ధ్యాస ఉండదు (నేనూ ఓ చిన్నపాటి ఆర్టిస్టునులెండి). ఆ ధోరణి నుండి బైటపడి అది బాధిస్తుంది అన్న తెలివిడి అయనకు వచ్చాక ఆయన క్షమాపణలకి సిద్ధపడ్డారు. అది మనం గుర్తించాలి కదా సంతోష్ గారూ.
ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాల్లో కొ ట్టొచ్చినట్టు కనపడే లక్షణాలు… ఈజ్, సాధికారత! ఆయన గుర్రాల బొమ్మలు చూసినపుడు పికాసో ‘గెర్నికా’ స్ఫురణకొస్తుంది. రోడ్లమీదా, స్టూడియోల్లో పెయింటింగ్స్ వేయగలిగిన కళాకారుడిగా హుస్సేన్ అభినందనీయుడు. ఆయన పెయింటింగ్స్ మిలియన్ డాలర్లకు అమ్ముడవటంలో మాత్రం కళాభిరుచి కంటే మించి సంపన్నవర్గాలు తమ అహం సంతృప్తిపరుచుకునే కారణాలున్నాయనిపిస్తుంది.
మత విషయంలో ఒకప్పుడున్న సహిష్ణుత (tolerance) బాగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో హుస్సేన్ విచక్షణతో వ్యవహరించి వివాదాస్పద చిత్రాలు వేయకుండా ఉండాల్సింది. ఆయన ధోరణి కళాత్మక చిత్రణే అయినప్పటికీ అది అర్థమయ్యేది ఎందరికి? ఇలాంటి విషయాల్లో అపార్థాలు దావానలంలా వ్యాపిస్తాయి. తర్వాత క్షమాపణలు చెప్పటం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అయింది. ఏమైనా వివాదాస్పద చిత్రణలతో, వ్యక్తిగత జీవిత సంచలనాలతో తన చరమాంకంలోనూ చర్చనీయాంశమైన విభిన్న చిత్రకారుడు హుస్సేన్!
నేను హిందువుని . నన్ను హుస్సేన్ చిత్రాలు ఏమాత్రం బాధించలేదు . హిందువులందరి తరఫున గుత్తాధిపత్యం వహిస్తున్నామంటున్న ఫాసిస్ట్ మత శక్తులు .. కేవలం హుస్సేన్ ముస్లిం మతస్థుడయినందుకు అతనిపై దాడి చేశాయి . ఇది పూర్తిగా రాజకీయ వ్యవహారం . ఈ బాపతు మత పిచ్చగాళ్ళకి పెయింటింగ్స్ అర్ధం కావు . ఫలానా ఇతర మతం గాళ్ళు మూర్ఖంగా ఉంటున్నారు . మేం మాత్రం తక్కువ తిన్నామా అనే మూస ధోరణి . ఈ బాపతు అఖండ భారత దేశభక్తిగాళ్ళు బ్లాగుల్లో బాగానే ప్రచారం కలిపించుకుంటున్నారు .
హుస్సేన్ గారికి అసలు చేతులు కాలుతున్న సంగతే తెలియలేదు వేణు గారూ.
అమెరికాలో స్ధిరపడి అమెరికా ఆధిపత్య ధోరణులనీ, దురాక్రమణ ధోరణులనీ సమర్ధిస్తూ, వాటిని వ్యతిరేకిస్తున్న స్వభాషీయులను సైతం ధూషించడానికి కూడా సిద్ధపడుతున్నవాళ్ళు అక్కడి స్వేచ్ఛా వాతావరణానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చిత్రంగా వీళ్ళే హిందూ దేవతలంటూ తాము నమ్మే వ్యక్తులు లేదా పాత్రలపై తన ధోరణిలో పెయింటింగ్ వేసుకున్న హుస్సేన్ పైకి ఆయన కళా స్వేచ్ఛను హరించడానికి సైతం సిద్ధపడతారు. ఒకవైపు అమెరికాలోని విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛపేరుతో ఆరాధించడం, మరోవైపు కనీస ప్రజాస్వామిక హక్కులను సైతం మతం పేరుతో నిరాకరించడం ఇలాంటివారికే చెల్లుతుంది కాబోలు!
నాదే గొప్ప అని గొప్పతనాన్ని విడదీసుకుంటూ పోయేవారు ఆ విడదీయడాన్ని ఒక్క మతం తోనే ఆపరు. నా మతం అన్నవారు, నా కులం అంటారు. నా ప్రాంతం అంటారు. నా ప్రాంతంలో నాకులం అనీ, నా కులంలో నా ప్రాంతం అనీ అంటారు. [నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉండగా సరిగ్గా ఈ ధోరణులు కనిపించేవి. కుల భావనతో ఉన్నవారు ఆ కులంలోనే ప్రాంతాలుగా (గుంటూరు ప్రాంతం, ప్రకాశం ప్రాంతం, గోదావరి ప్రాంతం ఇలా…) విడిపోయి కొట్టుకునేవారు.] చివరికి నా కుటుంబం దాకా వెళ్ళి నా అన్న తమ్ముడు అని కూడా అనుకోలేని స్ధితికి వెళ్ళడం కద్దు.
జాతీయవాది కానివాడు నిజమైన అంతర్జాతీయవాది కాలేడని లెనిన్ అంటారు. అలాగే సాటి మనిషిని మనిషిగా గుర్తించలేనివాడు ఎన్ని విభజనలైనా అయిపోవడానికి సిద్ధపడతారు. అటువంటి సంకుచిత ధోరణులకు హుస్సేన్ బలయ్యాడు తప్ప నిజానికి క్షమాపణ చెప్పడం ఆయన గొప్పతనమే తప్ప తక్కువ తనం మాత్రం కాదని నా అభిప్రాయం.
మీరు MF హుస్సేన్ గారి గురించి రాసినా ఈ పోస్టుతో నాకెటువంటి విభేదం లేదు .
కాని ఆయనని వ్యతిరేకంచే వారిని వ్యతిరేకించే వారిని మీరు మీ కామెంట్ లో చెప్పినట్లు సాటి మనుషులు గా మీరు గుర్తిస్తున్నారా ? మీకు వాళ్ళ మీద చూపించిన వ్యతిరేకత , వాళ్ళు MF హుస్సేన్ మీద చూపిస్తే మీకు ఎందుకు తప్పు పడుతున్నారు ? మీకు అచ్చని వాటి గురించి చెప్పేట్లు మీకు ఉన్న హక్కు వేరే వాళ్లకు ఉండదా ?
రమణ గారూ,
నమస్తే. నేను హిందువుని నన్ను హుస్సేన్ చిత్రం ఏ మాత్రం బాధించలేదన్నారు. బాగుంది. చాలా మంది హిందువులకు తమ మతంపై ఎవరైనా అవమానకరంగా కళాఖండఖండాలు రూపొందిస్తే బాధించదు. అంత మాత్రాన మత సెంటిమెంట్లు గాయపడితే ఎవరూ బాధపడరని కాదు కదా ఆ మిగిలిన వారికోసమైనా ఆయన పరిణామాలు అనుభవించాలి.
నేను ఎవ్వరినీ అవమానకర భాష వాడి ఇబ్బంది పెట్టలేదు. కానీ మీరు నన్ను(పరోక్షంగా) మతపిచ్చగాడన్నారు. సంతోషం. హుస్సేన్ సాబ్ ని ఆయన కళనీ గౌరవించగల మీరు తోటి బ్లాగర్లను గౌరవించలేరంటే విచిత్రంగా ఉంది. సెలవు.
శ్రావ్య గారు మీ పదబంధం నాకు అర్ధం కాలేదు. హుస్సేన్ గార్ని వ్యతిరేకించేవారు అంటే ఆయనపై దాడి చేసిన హిందూ మత సంస్ధల కార్యకర్తలు. ఆ కార్యకర్తలని వ్యతిరేకించేవారు అంటే నాలాంటివారు. నన్ను నేను సాటిమనిషిగా గుర్తించడం లేదంటున్నారా మీరు?
బహుశా మీ రెండో పేరాలో మొదటి వాక్యం ఇలా ఉండాలేమో
“కాని ఆయనని వ్యతిరేకించేవారిని మీరు మీ కామెంటులో చెప్పినట్లు సాటి మనుషులుగా గుర్తిస్తున్నారా?” అని.
మీ ఉద్దేశ్యం పై వాక్యమే అయితే, నేను వారిని మనుషులుగా గుర్తించడం లేదని మీకు అనుమానం ఎక్కడ వచ్చింది? వివరించగలరు.
రెండో విషయం: హుస్సేన్ గార్ని వ్యతిరేకించిన వారిని నేనెందుకు తప్పుపడుతున్నాను? వారు హుస్సేన్ గార్ని వ్యతిరేకించినందుకు వారిని తప్పు పట్టడం లేదని గమనించాలి. వారు హుస్సేన్ గార్ని వ్యతిరేకించిన పద్ధతిని మాత్రమే తప్పు పడుతున్నాను. ఆయన ఇంటిపైన దాడులు చెయ్యడం, ఆయన పెయింటింగ్ ప్రదర్శనలపై దాడి చేసి చింపెయ్యడం… ఇలా భౌతిక దాడులు చేయడం కేవలం వ్యతిరేకత అని భావించాలా? వ్యతిరేకత, నిరసన, అసమ్మతి వంటివాటిని తెలియజేయడానికి నాగరిక పద్దతులున్నాయి. ఆ పద్ధతుల్ని వదిలేసి అనాగరిక పద్ధతుల్లో వ్యతిరేకత వ్యక్తం చెయ్యడం పైనే నా అభ్యంతరం.
హుస్సేన్ గారు ఇండియాకి తిరిగి రాలేక పోవడం పట్ల చాలా వేదనని అనుభవించాడు. తాను పుట్టిన గడ్డపైన స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్ధితి తలెత్తడం, మాతృ భూమిని గౌరవించే వారికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి కష్టాన్నే ఆయన అనుభవించాడు. వ్యతిరేకతను లేదా నిరసనను దాడుల్లో వ్యక్తం చేస్తే అది కేవలం నిరసనో, వ్యతిరేకతో మాత్రమే అవుతుందా?
నిజానికి హిందూ మత కార్యకర్తలది ప్రధానంగా తప్పు కాదు. వారికి ఆవిధంగా ‘దాడులు చేసినా తప్పులేదు, అది న్యాయమే’ అని బోధించిన వారిదే తప్పు. అలా బోధించడం వెనక వారి రాజకీయ ప్రయోజనాలున్నాయి తప్ప వారు చెప్పుకునే దేశ భక్తి మాత్రం అసలే లేదు. దేశ భక్తి అనేది భారత మాతకు రూపం ఇచ్చి పూజలు చేయడం కాదు. లేదా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఇండియా గెలవాలని పూజలు చేయడం, మూడు రంగుల జెండా పట్టుకుని ఊరేగడమూ కాదు. దేశంలో ప్రజలందర్నీ ప్రజలుగా గౌరవించగలగడమే అసలు దేశ భక్తి అని నా అభిప్రాయం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్… ఇలా ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన గౌరవం అందేలా శ్రమించడమే నిజమైన దేశ భక్తి. భారత దేశంలో పుట్టిన హుస్సేన్ కి కేవలం ఆయన వేసిన కొన్ని పెయింటింగ్ లు కొంతమందికి నచ్చకపోవడం వల్లనే భారత దేశంలొ ఎటువంటి భయాలు లేకుండా బతికే అవకాశం లభించకపోవడం చాలా అన్యాయం కదా శ్రావ్య గారు. అదే నేను చెబుతున్నా తప్ప సాటి మనిషిగా గుర్తించనట్లుగా నేనెప్పుడూ రాయలేదని భావిస్తున్నా. అలాంటివి రాసినట్లు మీకు తోస్తే ఎక్కడ ఆ అర్ధం వచ్చిందో చెప్పండి, పరిశీలించి తొలగించడానికి నాకు అభ్యంతరం లేదు.
ముందు గా ధన్యవాదాలు నేను రాసిన తప్పులు అర్ధం చేసుకున్నందుకు .
మీ ఉద్దేశ్యం పై వాక్యమే అయితే, నేను వారిని మనుషులుగా గుర్తించడం లేదని మీకు అనుమానం ఎక్కడ వచ్చింది? వివరించగలరు.
వారు హుస్సేన్ గార్ని వ్యతిరేకించినందుకు వారిని తప్పు పట్టడం లేదని గమనించాలి. వారు హుస్సేన్ గార్ని వ్యతిరేకించిన పద్ధతిని మాత్రమే తప్పు పడుతున్నాను
——————————-
మీ రెండు ప్రశ్నలకు సమాధానం మీరు క్రింద రాసిన ఈ కామెంట్
————————————————————————–
అమెరికాలో స్ధిరపడి అమెరికా ఆధిపత్య ధోరణులనీ, దురాక్రమణ ధోరణులనీ సమర్ధిస్తూ, వాటిని వ్యతిరేకిస్తున్న స్వభాషీయులను సైతం ధూషించడానికి కూడా సిద్ధపడుతున్నవాళ్ళు అక్కడి స్వేచ్ఛా వాతావరణానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చిత్రంగా వీళ్ళే హిందూ దేవతలంటూ తాము నమ్మే వ్యక్తులు లేదా పాత్రలపై తన ధోరణిలో పెయింటింగ్ వేసుకున్న హుస్సేన్ పైకి ఆయన కళా స్వేచ్ఛను హరించడానికి సైతం సిద్ధపడతారు. ఒకవైపు అమెరికాలోని విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛపేరుతో ఆరాధించడం, మరోవైపు కనీస ప్రజాస్వామిక హక్కులను సైతం మతం పేరుతో నిరాకరించడం ఇలాంటివారికే చెల్లుతుంది కాబోలు!
——————————————————————————
హుస్సేన్ గారు ఇండియాకి తిరిగి రాలేక పోవడం పట్ల చాలా వేదనని అనుభవించాడు. తాను పుట్టిన గడ్డపైన స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్ధితి తలెత్తడం, మాతృ భూమిని గౌరవించే వారికి చాలా కష్టంగా ఉంటుంది.
—————————————–
ఇక్కడ హుస్సేన్ గారి బాధని అర్ధం చేసుకోగలిగిన మీరు దేశం మీద, లేదా వాళ్ళు గౌరవించే దేవతల మీద స్వంత గడ్డ పైన జరిగే దాడిని చూసి బాధ పడే మామూలు జనాల (అంటే మీరు icnography అర్ధం చేసుకోలేని ) జనాల బాధ మీరు అర్ధం చేసుకోలేకపోతునట్లు నాకు అనిపించింది .
‘దాడులు చేసినా తప్పులేదు, అది న్యాయమే’ అని బోధించిన వారిదే తప్పు. అలా బోధించడం వెనక వారి రాజకీయ ప్రయోజనాలున్నాయి
————————-
కరెక్టు అదే రకం గా హుస్సేన్ గారిది తప్పు కాదు ఆయన చేసిన పనికి, ఆయన క్షమాపణ చెప్పాక కూడా నానారకాల అర్ధం చెప్పి పొగిడే వాళ్ళది తప్పు.
తప్ప సాటి మనిషిగా గుర్తించనట్లుగా నేనెప్పుడూ రాయలేదని భావిస్తున్నా
———————————
ఈలాంటి కామెంట్లు మీ బ్లాగులోనే పాత పోస్టుల కామెంట్లలోనే చాల కనపడతాయి .
ఆడదాన్ని బొమ్మని నగ్నంగా వేసి సొమ్ము చేసుకోవడమే తప్పు. అది దేవత బొమ్మా లేదా సాధారణ స్త్రీ బొమ్మ అనేది ఇక్కడ fundamental question కాదు. నగ్న చిత్రాలు వేసి డబ్బులు సంపాదించేవాడ్ని కళాకారుడు అనుకోవడం సిగ్గు సిగ్గు.
శ్రావ్యగారూ మీ లాజిక్ నాకు అర్ధం కాలేదు. దాన్నలానే ఉండనివ్వండి.
http://www.koumudi.net/gollapudi/110209_voice_of_illiterate.html
చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారు ప్రముఖులు. సాయిబుగారు. మనదేశంలో మనం ముస్లింలను గౌరవించి నెత్తిన పెట్టుకున్నట్టు ముస్లిం దేశాలే చేస్తున్నట్టు కనిపించదు. ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హస్సన్ పాకిస్థాన్ లో అనారోగ్యంతో డబ్బులేక ఆస్పత్రిలో ఉన్నాడని పేపర్లో చదివాను. మన దేశంలో బిస్మిల్లా ఖాన్ భారతరత్న. జకీర్ హుస్సేన్, ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్, అబ్దుల్ కలాం గారలు మనకు గౌరవనీయులైన అద్యక్షులు. అబ్దుల్ కలాంగారు భారతరత్న.
ఈ హుస్సేన్ గారినీ మన ప్రభుత్వం పద్మభూషణ్ యిచ్చి గౌరవించింది. వీరి ప్రతిభా పాటవాల్ని మెచ్చుకునే అభిమానులూ, intelellectuals ఈ దేశంలో వున్నారు. మంచిదే. 94 ఏళ్ళ ఈ చిత్రకారులు- సరస్వతి, లక్ష్మి, భారతమాతలను నగ్నంగా చిత్రించారు. పోనీ, వీరికి ఆడవాళ్ళు బట్టలిప్పుకుంటే సరదాయేమో అని సరిపెట్టుకుందామనుకుంటే- వాళ్ళమ్మ, మదర్ ధెరిస్సా, ఇందిరా గాందీలకు బట్టలుంచారు. ఈ దేశంలో కోట్లమందికి లక్ష్మి, సరస్వతి తల్లికంటె ఎక్కువని ఈ పద్మభూషణులకు తెలియదనుకోవడం తెలివితక్కువతనం.
డేనిష్ పత్రికలలో అల్లా గురించి రాస్తేనే (నేనా పత్రికలు చూశాను. అవి ఎందుకు ఆక్షేపణీయాలో నాకయితే అర్ధం కాలేదు) వాటిని చూడని, చదవడమయినా రాని చాలామంది ప్రపంచంలో ఎన్నో దేశాలలో కార్లు తగలెట్టారు. ఇళ్ళు ధ్వంసం చేశారు. ఊరేగింపులు చేశారు. అప్పుడు ఈ ఉద్యమకారులను గర్హించే పెద్దలు ఏమయారు? అప్పుడు నోరెత్తితే వీరి ఇళ్ళూ కూలుతాయని వీరికి బాగా తెలుసు. “బాబూ, ముస్లిందేవుళ్ళ పాటి చెయ్యరా మా దేశంలో మా లక్ష్మీ సరస్వతులు. పోనీ. మతం ఓ పార్టీ సొత్తు అనుకుంటే. మా భారతమాత?’’ అని ఒక్కరయినా హుస్సేన్ సాహెబ్ గారిని అడగరేం?