
అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీ 2011 ఛాంపియన్ 'సుకన్య రాయ్'
వరుసగా రెండో సంవత్సరం భారత దేశానికి చెందిన బాలిక అమెరికా స్పెల్లింగ్ ఛాంపియన్ పోటీల్లో విజయం సాధించి భారత ప్రతిష్టను చాటించి. బెంగాల్‌కి చెందిన “సుకన్య రాయ్” ‘cymotrichous’ పదానికి ఖచ్చితంగా స్పెల్లింగ్ చెప్పడం ద్వారా 2011 అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది. ఎనిమిదో క్లాసు గానీ 15 సంవత్సరాల వయసుగానీ దాటని వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. పెన్సిల్వేనియాలో “అబింగ్టన్ హైట్స్ మిడిల్ స్కూల్” లో సుకన్య ఎనిమిదవ గ్రేడు చదువుతొంది. ప్రతి సంవత్సరం వేసవిలో ఇండియా వచ్చే సుకన్య అంతర్జాతీయ సంబంధాలలో తన కెరీర్ ను కొనసాగించాలని కోరుకుంటోంది. 2010 లో కూడా భారత్ సంతతికి చెందిన న్యూజిలాండ్ బాలిక “అనామిక వీరమణి” ఈ ట్రోఫిని గెలుచుకోవడం విశేషం.
ట్రోఫితో పాటుగా సుకన్య 30,000 డాలర్ల క్యాష్ గెలుచుకుంది. ఇంకా 2,500 విలువ గల అమెరికా సేవింగ్స్ బాండు, పూర్తి రిఫరెన్సు లైబ్రరీ, 5,000 డాలర్ల స్కాలర్షిప్, 2,600 డాలర్ల విలువ గల రిఫరెన్సు వర్క్స్ ఇంకా అనేక బహుమతులు గెలుచుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. పోటీలో 275 మంది పాల్గొన్నారు. అమెరికా, అమెరికా ఆధీనంలోని భూభాగాలు, బహమాస్, కెనడా, చైనా, ఘనా, జమైకా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాల నుండి విద్యార్ధులు పాల్గొన్నారు. 1925 లో ప్రారంభమైన ఈ పోటీలు ప్రపంచంలో ఉత్తమ విద్యారంగ పోటీల్లో ఒకటిగా పేరు పొందింది.
ట్రోఫీ గెలుచుకున్న అనంతరం సుకన్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. “నా గుండే వేగంగా కొట్టుకుంటోంది. నేనిది నిజంగా నమ్మలేకపోతున్నాను” అని విజయానంతరం విలేఖరులతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. Cymotrichous పదానికి అర్ధం having wavy hair అని అర్ధం అని తెలుస్తోంది. “నేను దాన్ని సరిగ్గా పలకాలని అనుకున్నా. నాకది తెలుసు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తప్పుగా పలకకూడదని నిర్ణయించుకుని చెప్పాను” అని సుకన్య సంతోషంతో చెప్పింది. సుకన్య లక్ష్యం అంతర్జాతీయ సంబంధాలలో కెరీర్ ను నిర్మించుకోవడం. ఆ బాలిక లక్ష్యాన్ని చేరుకోవాలని మరస్ఫూర్తిగా కోరుకుందాం!
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…