ఔట్‌లుక్ ఇంటర్వూ: బి.జె.పిలో సుష్మా, జైట్లీ ల ఆధిపత్య పోరు

బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఔట్‌లుక్ వార పత్రిక తాజా సంచికకు ఇంటర్వూ ఇస్తూ ఇనప ఖనిజ అక్రమ తవ్వకాల్లో వేల కోట్లు కాజేసిన గాలి బ్రదర్సుకి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవులిచ్చి పైకి తేవడానికి బాధ్యతను బి.జె.పిలోని మరో నాయకుడు, రాజ్యసభలో బి.జె.పి నాయకుడూ ఐన అరుణ జైట్లీ పైకి నెట్టేసింది. బి.జె.పి పార్టీకి భావి నాయకులుగా భావిస్తున్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా బహిరంగంగా వేలెత్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గాలి…

కొత్త సర్వీసు కోసం ‘పేపాల్’ వ్యాపార రహస్యాలను దొంగిలించిన ‘గూగుల్’?

గూగుల్ పాపాల జాబితాలో మరొక పాపం చేరింది. శిశుపాలుడి పాపాలను శ్రీ కృష్ణుడు వందవరకే అనుమతించాడు. గూగుల్ పాపాలకు మాత్రం అంతూ పొంతూ ఉండడం లేదు. ప్రమాద వశాత్తూ బిలియనీర్ అయిన కంపెనీల్లో ఒకటిగా మొదట పేరు పొందిన గూగుల్ ఆ తర్వాత నియమ నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తూ, ఒక మాదిరి కంపెనీలన్నింటినీ అక్విజిషన్ల ద్వారా మింగివేస్తూ అనతి కాలంలోనే అతి పెద్ద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో…

ఐదు రోజుల వ్యవధిలో 32 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో సేనలు

లిబియా పౌరుల్ని చంపాడంటూ గడ్దాఫీపై  అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా అరెస్టు వారెంటు జారీ చేయించిన అమెరికా తదితర పశ్చిమ దేశాల నాటో కూటమి ఆఫ్ఘనిస్ధాన్‌లో పౌరులను చంపడం నిరాకటంకంగా కొనసాగిస్తూనే ఉంది. గత బుధవారం 18 మందినీ పొట్టన బెట్టుకున్న అమెరికా సేనలు ఆదివారం 14 మందిని చంపేశాయి. ఆదివారం చనిపోయినవారిలో ఇద్దరు స్త్రీలు కాగా మిగిలినవారంతా పిల్లలే. చనిపోయినవారిలో 2 సం.ల పసిపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఇవి మానవతకి వ్యతిరేకంగా జరిగిన నేరం.…

ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే

భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని…