భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు


Krittika Biswas

పత్రికా విలేఖరుల ముందు భోరున విలపిస్తున్న కృత్తికా బిశ్వాస్

అమెరికా ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఇతర తెల్ల మేధావులు భారత అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి భారత మహిళా రాయబారి నుండి బాలివుడ్ హీరో షారుఖ్ ఖాన్ వరకు విమానాశ్రయాలలో తనిఖీలు ఎదుర్కొన్న ఘటనలు మనకు తెలుసు. సిక్కు మతస్ధుడైన భారత రాయబారిని అతని మత సాంప్రదాయన్ని అవమాన పరుస్తూ, పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని అనుమానిస్తూ తలపాగా విప్పించిన ఘటనలు పత్రికల్లో చదివాం. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ రోధమ్ క్లింటన్ భారత మహిళా రాయబారిని చీర ధరించిన పాపానికి క్యూలోంచి బైటికి లాగి వళ్ళంతా తడిమి చెకింగ్ చేసినందుకు క్షమాపణ చెప్పిన మరుసటి రోజే మరొక అవమానకర ఘటన జరిగిన సంగతిని మనం చూశాం. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉప రాయబారిగా పనిచేస్తున్న భారత అత్యున్నత అధికారి కూతురిని ఆమె చేయని నేరానికి అరెస్టు చేసి, పోలీసు స్టేషన్ లో ఘోరంగా అవమానించడమే కాక నెల రోజూల పాటు స్కూల్ నుండి సస్పెండు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత జాతీయుల పట్ల అమెరికన్ దేశీయులకు ఉన్న గౌరవం ఏమిటో ఈ ఘటన మరోసారి పచ్చిగా రుజువు చేసింది.

న్యూయార్గ్ నగరంలో మనహట్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో దేబశిశ్ బిశ్వాస్ వైస్ కాన్సల్ గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు కృత్తికా బిశ్వాస్ న్యూయార్క్ నగర ప్రభుత్వం పైనా, ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ పైనా, పోలీసుల పైనా 1.5 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. కృత్తిగా చదువుతున్న “క్వీన్స్ జాన్ బ్రౌన్ హైస్కూల్” లొ జేమీ కిక్ రాస్ అనే టీచర్ ని బెదిరిస్తూ, అసభ్యకర ఈ-మెయిల్స్ పంపిందని ఆరోపిస్తూ ఆమెను ఒక రోజంతా పోలీసు స్టేషన్ లో నిర్బంధించారు. స్కూల్ నుండి నెలరోజులపాటు సస్పెండ్ చేశారు. నేరం ఒప్పుకొమ్మని పోలీసులు బెదిరించారు. చివరికి ఈ-మెయిల్ పంపింది ఆమె కాదని స్కూల్ వాళ్ళే తెలుసుకుని ఆమె మీద ఫిర్యాదులు ఉపసంబరించుకున్నారు. ఎందుకు ఉపసంహరించుకున్నదీ కూడా ఆమెకు తెలియజేయలేదు. తనపైన సాక్ష్యాలు లేకుండా అకారణంగా నేరం మోపినందుకుగానూ, స్కూల్ నుండి సస్పెండు చేసినందుకు గాను, పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కృత్తికా కేసు దాఖలు చేసింది. ఆమె తరపున లాయర్ రాజీవ్ బాత్రా కేసు వాదించనున్నాడు.

107 వ ప్రెసింక్ట్ పోలీసు స్టేషన్ లో కృత్తికా ను అనేకమంది ఇతరులు ఉన్న లాకప్ సెల్ లో పడేశారనీ, నేరం ఒప్పుకోమని పోలీసులు బలవంతం చేశారని కృత్తికా పత్రికల ముందు చెప్పింది. నేరం అంగీకరించనట్లయితే వేశ్యలు, హెచ్.ఐ.వి పాసిటివ్ రోగులు ఉన్న లాకప్ గదిలో నిర్బంధించవలసి ఉంటుందని పోలీసులు బెదిరించారని ఆమె తెలిపింది. ఆమెను లేడీస్ బాత్రూంకి వెళ్ళడానికి అనేక గంటలపాటు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చివరికి కృత్తికా ఆ సెల్ లోనే ఓ మూలన ఉన్న టాయిలెట్ ను అక్కడ ఉన్న అందరి ముందూ ఉపయోగించవలసి వచ్చింది. బహిరంగంగా బాత్రూంకి వెళ్ళవలసి రావడం భారతీయ అమ్మాయికి ఎంత అవమానకరమో అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలను కృత్తికా పత్రికలవారికి వివరిస్తూ జరిగిన అవమానం తలుచుకుని భోరుమని విలపించింది. మరింత ఘోరమైన విషయం ఏంటంటే కృత్తికా అరెస్టు అయిన సంగతి పోలీసు అధికారులు అతని తల్లి దండ్రులకు గానీ, భారత రాయబార కార్యాలయానికి గానీ ఎటువంటి సమాచారమూ అందజేయలేదు.

ఘటనల క్రమం

డిసెంబరు 21 తేదీన కృత్తికా, మరొక విద్యార్ధిని స్కూలు యాజమాన్యం పిలిచి ప్రశ్నించింది. ఆ స్కూల్‌లో పని చేస్తున్న ఇద్దరు టీచర్లు రాస్, ఇవాన్ కోహిల్ (జిమ్ ఇన్‌స్ట్రక్టర్) లకు బెదిరిస్తూ ఈ-మెయిల్ పంపారని యాజమాన్యం ఆరోపించింది. స్కూలు అధికారులు ప్రకారం రెండు బెదిరింపు ఈ-మెయిళ్ళకు చెందిన ఐ.పి అడ్రస్ లు కృత్తికా, మరొక విద్యార్ధి నివసిస్తున్న గృహ సముదాయానికి చెందినవిగా

గుర్తించారు. అది తప్ప వేరే సాక్ష్యం లేదు. “ఈ మెయిళ్ళు పంపిన కంప్యూటర్ కి చెందిన ఐ.పి అడ్రస్ లు ఎర్త్ లింక్ నెట్‌వర్క్ తో సరిపోలాయి. కాని అవి కృత్తికాకి సంబంధించిన కంప్యూటర్ ఐ.పి.అడ్రస్ తో సరిపోలలేదు. అదీ కాక వీరు నివసిస్తున్న భవనంలో 270 అపార్టుమెంట్లు ఉన్నాయి. అందువలన కృత్తికాని అనుమానించడం అసలు వీలుకాదు” అని కృత్తికా లాయర్ బాత్రా తెలిపాడు. డిసెంబరు 22 న ఇద్దరు విద్యార్ధుల తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించారు. ఈ మెయిళ్ళలీని కొన్ని భాగాలు ఫ్రెంచి భాషలో ఉన్నాయనీ, కృత్తికాకి ఫ్రెంచి భాష తెలుసనీ అందువలన కృత్తికా ప్రధాన అనుమానితురాలని స్కూల్ అధికారులు ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుండీ ఆ అంశాన్ని పోలీసులు చూసుకుంటారని కూడా వారికి స్కూలు అధికారులు తెలిపారు.

Krittika Biswas in press meet

కృత్తికా బిశ్వాస్

ఫిబ్రవరి 6 తేదీన ఆ టీచర్లకు మళ్లీ బెదిరింపు ఈ మెయిళ్ళు వచ్చాయి. వాటికి కూడా బాధ్యురాలిని చేస్తూ ఫిబ్రవరి 8 న కృత్తికాను అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఆఫీసుకి పిలిచారు. అక్కడ అప్పటికే పోలీసు అధికారులు వచ్చి ఉన్నారు. ఆఫీసుకి వెళ్ళిన వెంటనే కృత్తికాను పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు. నేరాన్ని అంగీకరించమనీ లేదంటే పోలీసు స్టేషన్ లో వేశ్యలతోటీ, హె.ఐ.వి పాజిటివ్ రోగులతోటీ గడపవలసి ఉంటుంది అని బెదిరించడం ప్రారంభించారు. “ఆ రోజు (అసిస్టెంట్ ప్రిన్సిపాల్) గదిలో చేతులకు బేడీలతో కూర్చుని ఉన్నా. ఆ బేడీలు ఎంత టైట్ గా ఉన్నాయంటే అవి టార్చర్ పెట్టడానికి సాధనాలనిపించింది నాకు” అని కృత్తికా విలేఖరులతో చెప్పింది. ఫిబ్రవరి 8 న పోలీసులు కృత్తికాను పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళారు. దాదాపు 24 గంటలకు పైనే స్టేషన్ లొ ఉంచారు. ఈ అరెస్టు అంతర్జాతీయ చట్టాలకు, అమెరికా ఫెడరల్ చట్టానికీ, న్యూయార్క్ రాష్ట్ర చట్టానికీ, నగర చట్టానికీ కూడా వ్యతిరేకం అని లాయర్ రాజీవ్ బాత్రా తెలిపాడు. దానితో పాటు రాయబారి కూతురిగా కృత్తికాకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ కింద అరెస్టు మినహాయింపు ఉంది. కానీ అమెరికా అధికారులు అటువంటి మినహాయింపు రాయబారి కుటుంబ సభ్యులకు వర్తించదని తెలిపినట్లుగా కాన్సల్ జనరల్ చెప్పాడని లాయర్ బాత్రా వివరించాడు. ఈ విషయంలో అసలు వాస్తవమేమిటో తెలియరాలేదు.

అయితే ఆ తర్వాత బెదిరింపు ఈ మెయిళ్ళు పంపింది కృత్తికా కాదని స్కూల్ యాజమాన్యం నిర్ధారించుకుంది. అసలు దోషి దొరికిన తర్వాత కృత్తికాను మళ్ళీ స్కూల్ కి అనుమతించారు. “వాళ్ళు మౌలికంగా ఆధార రాహిత్యంపైనే అధారపడి నన్ను అరెస్టు చేశారు” అని కృత్తికా తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు దోషిని స్కూలు వాళ్ళు సస్పెండ్ చేయలేదు. పోలీసులు కూడా అరెస్టు చెయ్యలేదు. “అసలు దోషిన ఎందుకు అరెస్టు చెయ్యలేదో నాకు తెలియదు. ప్రిన్సిపాల్ నన్ను అరెస్టు చేయవలసిందిగా తీవ్ర ఒత్తిడి తెచ్చారు” అని కృత్తికా తెలిపింది. అసలు దోషి చైనా దేశీయుడని తర్వాత తెలిసింది. మార్చి 15 తేదీన స్కూలు ప్రిన్సిపాల్ కృత్తికాకి ఈ-మెయిల్ పంపాడు. దానితో పాటు తమ ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు గా లెటర్ ని అటాచ్ చేశాడు. “అయినా, ఆ లెటర్‌లో గానీ, ఈ మెయిల్ లో గానీ అసలు దోషి దొరికిన సంగతిని ప్రిన్సిపాల్ తెలియజేయలేదు. వారా నిజాన్ని నానుండి దాచారు” అని 18 సంవత్సరాల కృత్తికా మే 24న విలేఖరులకు వివరించింది.

పాకిస్ధాన్‌లో గత మార్చిలో జరిగిన ఘటనను ఈ సందర్భంగా ఖచ్చితంగ ప్రస్తావించుకోవాలి. రేమండ్ డేవిస్ అనే సి.ఐ.ఏ అధికారి పాక్ లో ఇద్దరు పౌరులను కాల్చి చంపేశాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని పట్టుకుంటుండగా అమెరికా రాయబార కార్యాలయం నుండి మరో కారు వేగంగా వచ్చి ప్రజలమీదికి పోనివ్వడంతో మరొకరు చనిపోయారు. ఇద్దర్ని కాల్చి చంపిన అమెరికా గూఢచారిని ఏ నేరం మోపకుండా అప్పగించాలని అమెరికా అధికారులు డిమాండ్ చేశారు. అతనికి రాయాబారులకు అందించే “అరెస్టు నుంచి మినహాయింపు” సౌకర్యం ఉందనీ కనక అరెస్టు చేయరాదని దబాయించారు. అయితే ఘటన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో డేవిస్ ని అరెస్టు చేసి జైలుకి పంపారు. జైలులో డేవిస్‌ని విచారణ చేస్తున్నారని తెలిసి ఒబామా నేరుగా పాక్ ప్రభుత్వాన్ని సంప్రదించి డేవిస్ ని విడుదల చేయమని డిమాండ్ చేశాడు. పాక్ అధికారులు ఓ మార్గం కనిపెట్టారు. తామేమి చేస్తున్నదీ బైటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుని చనిపోయినవారి కుటుంబాలను డేవిస్‌ని విచారించే కోర్టుకి రప్పించారు. ఆ కుటుంబాలకు కొన్ని మిలియన్ల డాలర్లను చెల్లించి నేరస్ధుడ్ని క్షమించినట్లుగా లేఖలు తీసుకున్నారు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం చనిపోయినవారి కుటుంబ సభ్యులు నేరస్ధుడిని క్షమించినట్లయితే అతనిని విడుదల చేయచ్చు. ఆ విధంగా డేవిస్‌ని కోర్టు విడుదల చేయడం, నిమిషాల్లోనె విమానం ఎక్కె అమెరికా చెక్కెయ్యడం జరిగిపోయింది. కాల్పులకు గురై చనిపోయినవారి కుటుంబాల అచూకి ఇప్పుడెవ్వరికీ తెలియదు. వారికి అమెరికాలో ఆశ్రయం ఇచ్చినట్లు కొన్ని పత్రికలు రాశాయి. కాని నిజం ఎవరికీ తెలియదు.

కృత్తికా బిశ్వాస్, రేమండ్ డేవిస్ ల ఉదాహరణలను పోల్చి చూస్తే మనకు చాలా అంశాలు అర్ధం అవుతాయి. అమెరికా ద్వంద్వ విధానాలని అనుసరిస్తుంది. అమెరికన్లకి ఒక న్యాయం, అమెరికన్లుకాని వారికి మరొక న్యాయం. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉన్న కృత్తికాను నిరాటంకంగా అరెస్టు చేసి అవమాన పరుస్తారు. కృత్తికాను కుటుంబ సభ్యురాలు అనుకుంటే మన మాజీ రాష్ట్రపతి కలాంను, భారత రాయబారులనీ వళ్ళంతా తడిమి ఒకర్ని, తలపాగా విప్పి ఇంకొకరిని, బట్టలు విప్పించి మరికొందరినీ అమెరికా అవమాన పరుస్తుంది. డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ లేని డేవిస్ ని ఉందని అబద్ధాలు చెప్పి అమెరికా అధ్యక్షుడే స్వయంగా విడుదల చేయమని డిమాండ్ చేస్తాడు. ఇంతకీ రేమండ్ డేవిస్ పాస్‌పోర్టు ప్రకారం అతను పాకిస్ధాన్ లో ఉండడానికి గడువు అంతకు నెలరోజుల ముందే ముగిసింది. అయినా చట్టవిరుద్ధంగా పాక్‌లో ఉంటూ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడంటే తనకేమీ కాదని ధైర్యం ఉంటే కదా. పాక్ చట్టాలను తేలిగ్గా ఉల్లంఘించవచ్చన్న నమ్మకం ఉండబట్టే గదా. పట్టుబడినా విడుదలకావచ్చని నమ్మకం ఉండబట్టే కదా.

చైనా అమెరికాకి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు అప్పు ఇచ్చింది. అమెరికా కంపెనీలు చాలా వరకు చైనా లో ఉన్నాయి. అవన్నీ ఇండియాలో వలే కాకుండా చైనా చట్టాలకు లోబడే ఉండాలి. చైనాలో తయారయ్యే సరుకులు చాలా అమెరికాకే ఎగుమతి కావాలి. అమెరికాతో చైనాకు ప్రతి నెలా కొన్ని పదుల బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంటుంది. ఈ అంశాలన్నీ చైనా జాతీయుడు బెదిరింపు ఈ మెయిళ్ళు పంపినా అతన్ని స్కూల్ నుండి సస్పెండ్ చేయక పోవడానికీ, పోలీసులు అరెస్టు చేయకపోవడానికీ కారణంగా పని చేసిందా? అవుననడానికి చాలా అవకాశమ్ ఉంది. చైనా తన దేశీయుల పట్ల చాలా భాద్యతగా ఉంటుంది. గత సంవత్సరం ఒక చైనీయుడి పడవ అదుపు తప్పి జపాన్ సముద్ర కాపలా పడవకు డీకొట్టడంతో ఇద్దరు జపనీయులు చనిపోయారు. చైనీయుడిని జపాన్ అరెస్టు చేస్తే చైనా గొడవ గొడవ చేసింది. వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేసించి. విడుదల చేయకపోతే వ్యాపార సంబంధాలు తెంచుకోవాల్సి ఉంటుందని బెదిరించింది. చైనాతో జపాన్ వ్యాపారం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. చచ్చినట్టు చైనీయుడిని జపాన్ గౌరవంగా ఇంటికి పంపింది. కానీ ఇండియా పాలకులకి ఆ దమ్ము లేదు. ముంబైలో 160 మందిని చంపిన హేడ్లీ, రాణాలను అమెరికా వెళ్లి విచారించడానికి కూడా అనుమతి సంపాదించలేకపోయింది. అత్యున్నత రాయబారి కూతురిని జైలులో అక్రమంగా నిర్బంధిస్తే, అన్యాయంగా స్కూల్ నుండి సస్పెండ్ చేస్తే ఏమీ చేయక చేష్టలుడిగి చూసింది.

ఇండియా పాలకులకు (ప్రజలకు కాదు) వెన్నెముక లేదు. ఇండియా పాలకులంటే ఇండియా పెట్టుబడిదారులు, భూస్వాములే. వారికి కనీసం “ఇండియా సంపదలను మేమే దోచుకోవాలి, పరయి దేశం వాడు దోచుకోవడానికి వీల్లేదు” అన్న పట్టుదల కూడా లేదు. అన్నీ బహుళజాతి సంస్ధలకు అప్పజెప్పి వారు విసిరే నాలుగు కాసులకే సంతృప్తి పడతారు. అమెరికా ప్రయోజనాల కోసం మంత్రివర్గంలో మార్పులు చేస్తారు. వాళ్ళ కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి అమ్మమంటే అమ్మేస్తారు. ప్రవేటీకరణ చెయ్యమని ఒత్తిడి తెస్తే లొంగి పోతారు. జపాన్ లొ ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత దేశాలన్నీ తమ అణు విధానాన్ని సమీక్షించుకుని అణు విద్యుత్ కేంద్రాల స్ధాపనకు వెనకడుగు వేస్తే భారత ప్రధాని అమెరికా కంపెనీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి “అణు విద్యుత్ కేంద్రాలను స్ధాపించి తీరతాం” అని ప్రకటించేస్తాడు. ఫుకుషిమా చూసి ఇండియా అణు విద్యుత్ నుండి వెనక్కి తగ్గనవసరం లేదని అమెరికా నిపుణులు కంపెనీలు ప్రకటిస్తే అవునవునని తలలూపుతారు.

వీళ్ళా మన పాలకులు?!

5 thoughts on “భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు

 1. I can’t understand what you mean actually.
  Do you mean to say that Sonia is the culprit for the abusive behavior of the authorities of the school in question and the police personnel?

  The school authorities and the police of the biggest democratic state in the world have to possess some decency, equal respect irrespective of the cast and creed, sense of reason and at least some respect towards their own legal system, IRRESPECTIVE OF WHO RULES INDIA.

  Is there any principle for the U.S. of respecting people of other countries based upon the rulers of those countries? I think there could be none.

  It seems an attempt is being made to find a scape goat for the mis-behavior of the American culprits. Is it so?

 2. 1) Are you aware that all people are not treated equally (in practice)? There are biases based up on their nationality or race or religion or caste or class.

  2) Are you aware various people were treated differently based up on their economy or ruling status?

  3) Are you aware people form some countries or religions or nationalities get first class treatment than other people?

  If you agree to at least one of the above, then it is possible to have a meaningful discussion with you. Else it is a waste of time to discuss with you.

  Note: Do you know why Indians were barred from entering into USA until 1947? in some extent that continued until 1960’s?
  Answer: Indians were slaves under British (India ruled by British). So they were treated as a 3rd class citizens every where.

  The same is true now. A Billion people imported a Italian to rule them. shame.

 3. Well, your three questions are same in nature. It’s about disparities among different sections of the people in any country. And, my writings in this blog should have told you whether I’m aware of those pointed by you.

  Having said that, I still do not understand how do you relate the bad behavior of the American officials to the rule of an Italian? Moreover, it’s not the rule of an Italian. It’s the rule of a political alliance or a political party whose leader is an Italian by birth but settled in India for the remaining part of her life due to her marriage. I think that doesn’t support your argument. You can take the US, the UK or Australia. There are Indian rulers in some states in the US, and the UK and Oz. Does it mean that people of those countries bare certain shame? I think not.

  Those officials behaved bad, because they are bad. Their racial supremacy is because they believe that their race is supreme which is actually not. Their bad behavior relates with the taboos that exist in the US. It, in no way relates with an Italian or Indian ruler. Mere Indian nationality of a ruler doesn’t imply that such ruler works for the interests of the Indian masses, which is well manifested throughout the time since the day of independence.

  Finally, the existence of a taboo doesn’t sanctify that taboo.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s