కరుణానిధి నిరాహార దీక్ష ఒఠ్ఠి నాటకం -దయానిధి మారన్


Karunanidhi, on a day-long hunger strikeశ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న కాల్పులను విరమింప జేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 2008 లో చేసిన ఒక రోజు నిరాధార దీక్ష, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బెదిరించడం, వాస్తవానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆడిన నాటకం అని కేంద్ర మాజీ ఐ.టి మంత్రి దయానిధి మారన్ అమెరికా రాయబార కార్యాలయ అధికారులతో చెప్పిన విషయం వికీలీక్స్ బైట పెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది. దయానిధి మారన్ కరుణానిధి పార్టీ ఐన ‘డి.ఎం.కె’ తరపున కేంద్రంలో మంత్రిగా పని చేస్తున్నాడు. కరుణానిధి సోదరుడి తనయుడైన దయానిధి మారన్, మారన్ కరుణానిధి కుటుంబాల మధ్య వచ్చిన విబేధాల వలన 2007లో ఐ.టి మరియు టెక్నాలజీ శాఖా మంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చింది. అతని తాత కరుణా నిధి ఆదేశాల మేరకే దయానిధి రాజీనామా చేశాడు. 2008లో మళ్ళీ సంబంధాలు బాగుపడ్డాక మళ్ళీ కేంద్రమంత్రిగా నియమితుడయ్యాడు.

2008లో మళ్ళీ డి.ఎం.కె శిబిరం లోకి వెళ్ళడానికి కొన్ని రోజుల ముందు దయానిధి అమెరికా అధికారులతో మాట్లాడినట్లు కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. తమిళనాడులో ఏర్పడిన అధికార సంక్షోభాన్నుండి ప్రజల దృష్టిని మళ్ళించడం కరుణానిధి ప్రధాన ఉద్దేశమని దయానిధి చెప్పినట్లుగా నవంబరు 3, 2008 తేదీన రాసిన కేబుల్ లో అమెరికా రాయబారి రాశాడు. “ముఖ్యమంత్రి రాజీనామా బెదిరింపు నిజానికి అప్పటి ఘటనలతో సంబంధం లేనిదని దయానిధి అంగీకరించాడు. అది కరుణానిధి ఆడిన డ్రామా అని తెలిపాడు. తానుకూడా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం ఆయన గుర్తు చేశాడు. అధికారం కోసం కరుణానిధి కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవలపై ప్రజలకు ఆగ్రహం వచ్చింది. కరుణానిధి ప్రతిష్ట ఎన్నడూ లేనంతగా దిగజారింది. దానితో శ్రీలంక తమిళులపై దాడి రంగం మీదికి వచ్చిందని దయానిధి వివరించాడు” అని కేబుల్ లో రాసారు.

“కరుణానిధి బ్లాక్ మెయిల్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సోనియా గాంధీని ఇరకాటంలో పెట్టింది. కరుణానిధి పై అసంతృప్తి ఉన్నప్పటికీ బహిరంగంగా ఆయనకు మద్దతు పలికే దయానిధి, కాంగ్రెస్ ఈ ఘటనను గుర్తుంచుకుంటుందనీ, సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందనీ చెప్పాడు. కాంగ్రెస్ ఆగ్రహానికి గుర్తుగా దయానిధి, డి.ఎం.కె ఎం.పి కనిమొళిని కలవడానికి సోనియా గాంధీ అప్పయింట్^మెంటు ఇవ్వకపోవడాన్ని సూచించాడు. కాంగ్రెస్ పార్టీలోని ఒక గ్రూపు, రాహుల్ గాంధీతో సహా, తమిళ టైగర్ నాయకుడు ప్రభాకరన్ చావుని కోరుకుంటోందనీ, రాజీవ్ గాంధీ హత్యకు ప్రతీకారమే దానికి కారణమనీ దయానిధి తెలిపాడు. అందుకే శ్రీలంక విషయంలో కాంగ్రెస్ కీ, డి.ఎం.కె కీ మధ్య అభిప్రాయ భేధాలున్నాయి” అని రాయబారి రాశాడు.

అమెరికా రాయబారి దయానిధి మారన్ తో పాటు మరో కాంగ్రెస్ నాయకుదూ ఆల్ఫన్స్ దగ్గర్నుండి సేకరించిన సమాచారాన్ని తన కేబుల్ లో పొందుపరిచాడు. వారు చెప్పిందే కాకుండా తన వైపు నిర్ధారణలను రాశాడు. అక్టోబరు 14, 2008 తేదీన తమిళనాడు ఎం.పిలు సమావేశం అయ్యారు. అక్టోబరు 28 లోగా తమిళ టైగర్లపై కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వాన్ని ఒప్పించలేని పక్షంలో తామంతా రాజీనామా చేస్తామని తీర్మానం చేశారు. ఐతే గడువుకు రెండు రోజుల ముందు విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మద్రాసు వెళ్ళడంతో పాటు, శ్రీలంక రాయబారిని పిలిపించి హెచ్చరించడం, తమిళులకు మానవతా సాయం పంపడానికి అంగీకరింకడంతో కరుణానిధి చల్లబడి పోయాడు. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి అంగీకరించాడు. “ఈ సమస్య 40 సంవత్సరాలనాటిది. నాలుగురోజుల్లో పరిష్కరించడం కుదరదు. శ్రీలంక తమిళుల విషయంలో మాకూ కాంగ్రెస్ కీ విభేదాలు లేవు” అని ఆయన ప్రకటించాడు. కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫన్స్ డి.ఎం.కె తమ ఎం.పిలతో మద్దతు ఉపసంహరించుకోవడానికి ధైర్యం చేసేవాడు కాదని అమెరికా రాయబారికి చెప్పాడు. తమిళనాడులో కరుణానిధికి కాంగ్రెస్ మద్దతు అవసరమనీ, కేంద్రంలో డి.ఎం.కె ఎం.పిల మద్దతు కాంగ్రెస్ కు అవసరమనీ కనుక ప్రమాదం జరిగే అవసరం ఎప్పుడూ లేదని ఆయన చెప్పాడు.

“అయితే కరుణానిధి బెదిరింపు కాంగ్రెస్ పార్టీపైనా, సోనియా గాంధీపైనా ఒత్తిడిని పెంచింది. రాజీవ్ హత్యకు ప్రతీకారంగా తమిళుల ఊచకోతను కాంగ్రెస్ అనుమతింస్తోందన్న ప్రచారం కరుణానిధి బెదిరింపులవలన జరిగింది. తమిళనాడులోని కొన్ని చిన్న పార్టీల కోసం కరుణానిధి కాంగ్రెస్ తో సంబంధాలను బలిపెట్టడం కాంగ్రెస్ కు నచ్చలేదు. ఆయన తమిళ టైగర్స్ పట్ల మెతకదనం చూపడమూ నచ్చలేదు” అని కేబుల్ లో రాసినట్లు వెల్లడయ్యింది.

అయితే ఆల్ఫన్స్, దయానిధిలు ఏమి చెప్పినా అమెరికా రాయబారి తన కేబుల్ లో చేసిన విశ్లేషణ సరైందేనని తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి. “రెండు పార్టీలు తమ స్వప్రయోజనాల రీత్యా ఒకరిని మరొకరు వదల లేరు. కరుణానిధి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కాంగ్రెస్ కావాలి. కేంద్రంలో ప్రభుత్వం నిలవాలంటే డి.ఎం.కె మద్దతు కావాలి. అందుకే కరుణానిధి కోసం కొన్ని చర్యలు తీసుకోవడంతో అతని రాజీనామా డ్రామా ఇరువురికీ అంగీకారయోగ్యంగా ముగిసింది. శ్రీలంక తమిళులకు మద్దతు ఇచ్చే విషయం ప్రధాన సమస్యగా లేదు. రాజీవ్ గాంధీ హత్య ఇంకా తమిళుల మనసుల్లో మెదులుతున్నందున అది సాధ్యమైంది” అని రాయబారి తన కేబుల్ లో వివరించాడు.

దానితో పాటు దయానిధి చెప్పినట్లుగా కాంగ్రెస్ తన ప్రతీకారం 2జి కుంభకోణం ద్వారా తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. డి.ఎం.కె మంత్రి రాజా జైలుపాలు కావడం, కరుణానిధి గారాల పట్టి కనిమొళి సైతం జైలులోనే ఉండడం దయానిధికి జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బ కావచ్చు. అయితే ఇందులో కాంగ్రెస్ పాత్ర నామమాత్రం. సుప్ర్తీమ్ కోర్టు చొరవ వలన ఈ మాత్రమైనా దర్యాప్తు జరుగుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s