అమెరికా అప్పు ఎంతో తెలుసా?


debt-ceilingప్రపంచం లోని దేశాలన్నింటికంటే అమెరికాకి అప్పు ఎక్కువ ఉందని బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ అప్పు ఇంత అని అంకెల్లో చెప్పేయడం కంటే వివిధ కోణాల్లో వివిధ అంశాలతో పోల్చి చూస్తే దాని పరిణామం ఇంకా బాగా అర్ధం అయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1,000 డాలర్ల బిల్లుల్ని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అది 67 మైళ్ళ ఎత్తు ఉంటుందని అంచనా వేశాడు. అప్పట్లో అది ఫేమస్ పోలిక. అయితే అది 1981 నాటి సంగతి. అప్పటినుండి అమెరికా అప్పు పెరుగుతూ పోయి ప్రస్తుతం 14.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు దాని వార్షిక జిడిపితో సమానం. రీగన్ పోలికతో చూస్తే (వెయ్యి డాలర్ల బిల్లుల్ని పేరిస్తే) ఆ మొత్తం ఇప్పుడు 900 మైళ్ళకంటే ఇంకా ఎత్తే ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ తేల్చింది. అదే 1 డాలర్ బిల్లుల్ని పేరిస్తే గనక దాని ఎత్తు చంద్రుడి దగ్గరికి పోయి తిరిగి రావడమంత పొడవుతో సమానమట! రాయిటర్సే చెప్పింది.

గత సోమవారానికి అమెరికా అప్పు 14.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా కాంగ్రెస్లో ఇంతకు ముందు చేసిన చట్టం ప్రకారం అమెరికా 14.3 మిలియన్ డాలర్లకు మించి అప్పు తెచ్చుకోవడానికి లేదు. అంతకు మించి అప్పు చేయాలంటే మళ్ళీ కాంగ్రెసే మరో చట్టం చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఒబామా, రిపబ్లికన్ పార్టీలు సిగపాట్లు పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రముఖుడొకరు అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గించే బిల్లును తయారు చేసి ఉంచాడు. అప్పు పరిమితి పెంచాలంటే ముందా పొదుపు బిల్లుని ఆమోదించాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. పొదుపు బిల్లులో ప్రజలపైన పన్నులు బాదుతూ, అదే చేత్తో సంపన్నులకు పన్నులను మరిన్ని తగ్గిస్తూ ప్రతిపాదనలు ఉన్నాయి. అది ఆమోదం పొందితే అధ్యక్ష పదవికి మళ్ళీ ఎన్నికవ్వాలన్న ఒబామా ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ బిల్లుపై పునరాలోచించాలని ఆయన రిపబ్లికన్^లని  కోరుతున్నాడు. అక్కడ మడత పేచీ పడింది. ఈ విషయం దీనికి ముందు రాసిన పోస్టుల్లో వివరించడం జరిగింది.

సరే మనం అసలు విషయానికి వద్దామ్! అమెరికా అప్పునీ వివిధ అంశాలతో పోలిస్తే దాని అసలు పరిణామం అర్ధం అవుతుందని అనుకున్నాం కదా! అవేంటో చూద్దాం.

  • అమెరికా ట్రెజరీ సెక్రటరీ అమెరికా నెలకు 125 బిలియన్ డాలర్ల చొప్పున అప్పు తీసుకుంటోందని చెప్పాడు.
  • ఆ డబ్బుతో అమెరికా 300 మిలియన్ల మందికి పైగా ఉన్న తన జనాభాలో ప్రతి ఒక్కరికీ ఒక యాపిల్ కంపెనీకి చెందిన ఐపాడ్ కొనవచ్చు.
  • అలాగే, 31 రోజులు గల నెలలో రోజుకు అమెరికా 4 బిలియన్ల డాలర్ల చొప్పున అప్పు చేస్తున్నదని అర్ధం.

  • రోజుకు చేస్తున్న అప్పుని పది సెంట్ల విలువ గల నాణేలకింద మార్చి భూమి చుట్టూ పేరిస్తే భూమిని ఒకసారి చుట్టి రావచ్చు. ఇంకొన్ని నాణేలు మిగులుతాయట కూడా.
  • అలాగే ఒక గంటకి అమెరికా 168 మిలియన్ల డాలర్ల చొప్పున అప్పు చేస్తున్నట్లు అర్ధం. ఆ మొత్తం 1867 లో అలాస్కా రాష్ట్రాన్ని కొనడానికి పెట్టిన మొత్తం తో సమానమట, ఇప్పటి డాలర్లతో మారిస్తే.
  • రెండు గంటలకి అమెరికా చేసే అప్పు, అది 1803 సంవత్సరం నాటి లూసియానా కొనుగోలులో ఇప్పటి ఆర్కన్^సాస్, మిస్సోరీ, లోవా లతో పాటు ఇతర ప్రాంతాన్ని కొన్నదానితో సమానమట.
  • అమెరికా ప్రతి సెకనుకు 40,000 డాలర్ల అప్పు చేస్తున్నది. అది సంవత్సరానికి అనేక యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు, రూమ్, బోర్డింగ్ లకు చెల్లించవలసిన మొత్తం కంటే ఎక్కువ.
  • జార్జి డబ్ల్యూ బుష్ కాలంలో వైట్ హౌస్ ఛీఫ్ ఎకనామిస్టుగా పని చేసిన డగ్ హోల్ట్జ్-ఏకీన్ రాయిటర్స్ కి పంపిన ఈ-మెయిల్ లో “నాకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రతి పది సెకన్లకి అమెరికా చేసే అప్పు వారికోసం నేను నా జీవితకాలంలో చెల్లించే డబ్బుకి సమానం” అని చెప్పాడట.
  • 2011 కోశాగార సంవత్సరంలో అమెరికా ఎదుర్కొనబోయే బడ్జెట్ లోటు 1.4 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు తెలుపుతోంది. అంటే ఈ సంవత్సరాంతానికి మొత్తం అప్పుకి మరో అంత కలవబోతోందని అర్ధం.
  • బిల్ గేట్స్ మొట్ట సంపద 56 బిలియన్ డాలర్లు. ఇది బడ్జెట్ లోటుని ఓ పదిహేను రోజులవరకి పూడ్చడానికి సరిపోతుంది. ఫెడరల్ బడ్జెట్ కి విధాన పరమైన భాధ్యుడైన జాసన్ పీక్వెట్ ఆ సంగతి తెలిపాడు. వారెన్ బఫెట్ ఆస్తి దాదాపు 50 బిలియన్ డాలర్లు. అది 13 రోజుల లోటు పూడ్చడానికి సరిపోతుంది.

అదండీ సంగతి!

2 thoughts on “అమెరికా అప్పు ఎంతో తెలుసా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s