పాకిస్తానే కాదు అవసరమైతే ఏదేశంపైనైనా దాడి చేస్తాం! -ఒబామా

అమెరికా మరోసారి తన అహంభావాన్ని బైట పెట్టుకుంది. అధ్యక్షుడు ఒబామా నోటి ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు బుద్ధి మరోసారి బైట పడింది. అంతర్జాతీయ చట్టాలు తనకు పూచిక పుల్లతో సమానమని చాటి చెప్పుకుంది. టెర్రరిస్టు ఉన్నాడని తెలిస్తే పాకిస్ధాన్ పై మరోసారి అక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేస్తామని ఒబామా ప్రకటించాడు. అసలు పాకిస్ధానేం ఖర్మ, తాను చంపదలుచుకున్న వాళ్ళెవరైనా ఉన్నాడని తెలిస్తే ఏ దేశంపైనైనా దాడి చేస్తామని ప్రకటించాడు. తమకు కావలసింది అమెరికా ప్రజల…

తన హత్యకు ముందు అమెరికా శరణు వేడిన బేనజీర్ భుట్టో -వికీలీక్స్

డిసెంబరు 2007లో పాకిస్ధాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణంగా హత్యకు గురయ్యింది. అమెరికా, బ్రిటన్‌ల మధ్యవర్తిత్వంతో ప్రవాస జీవితం విడిచి పాకిస్ధాన్‌లో అడుగు పెట్టగలిగిన బేనజీర్ కొద్ది రోజులకే తనను చంపడానికి ముషార్రఫ్ ప్రభుత్వంలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలియడంతో నేరుగా అమెరికాని రక్షణ కోరిన విషయం వికీలీక్స్ బైటపెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది. బేనజీర్ భుట్టో విన్నపాన్ని అమెరికా నిర్ద్వంద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా, “ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో అమెరికా సెక్యూరిటీ…