అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -2


గత పోస్టు తరవాయి భాగం…

3. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు

 • వాస్తవ నిరుద్యోగం అధికారిక అంచనాల కంటె చాలా అధికంగా 20 శాతం పైనే ఉంది. (ఇది అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). ఆహారం, ఇంధనం, వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు తదితర ధరలు అధికారిక లెక్కల్లో చాలా తక్కువచేసి చూపడం వలన వాస్తవ ద్రవ్యోల్భణం 10 శాతం పైనే ఉంటుంది. (ఇది కూడా అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ).
 • జీవనానికి పడుతున్న వాస్తవ ఖర్చు ప్రభుత్వ అంచనాలకంటే ఉండడంతో దారిద్ర్యంలో ఉన్నవారి సంఖ్య అమెరికా సెన్సస్ బ్యూరో అధికారిక అంచనాలకంటే రెట్టింపు ఉన్నది.
 • ఫుడ్ స్టాంప్స్ మీద బ్రతుకుతున్న వారి సంఖ్య రికార్డు స్ధాయిలో నమోదవుతోంది. ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడం సమస్యగా మారింది. వీరుకాక మరిన్ని మిలియన్ల మంది ఆహార భద్రత లేకుండా ఉన్నారు. ఇతరులు చాలమంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే పూట భోజనం ఏలానా అని చూస్తున్న వారు పెరుగుతున్నారు.
 • నివాసానికి ఇళ్ళు లేకపోవడం తీవ్రంగా పెరుగుతోంది. జాతీయ స్ధాయిలో అనేక వందల వేల మంది నివాసం లేకుండా ఉన్నారు.
 • ఆరోగ్య భీమా లేని వారి సంఖ్య 50 మిలియన్లు దాటింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు నవంబరు 2010 లో వెల్లడించిన నివేదిక ప్రకారం, 16 నుండి 64 సం.ల మధ్య వయసు గల అమెరికన్లలో 22 శాతం వారికి ఆరోగ్య భీమా లేదు. కాలిఫోర్నియాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదు.

4. జాతి వివక్ష

 • ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. ప్రజల సామాజిక జీవితాలను అన్ని విధాలుగా దెబ్బతీస్తున్నా దాని గురించి ఎప్పుడో తప్ప మాట్లడరు. మే 2010 లొ ఎ.పి మరియు యూనివిజన్ వారి సర్వేలో 61 శాతం హిస్పానిక్కులు, 52 శాతం నల్ల జాతీయులు జాతి వివక్షను ఎదుర్కొన్నారని తేలింది. అక్టోబరు 28, 2010 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక 60 శాతం మంది లాటినోలు జాతి వివక్ష ‘ముఖ్య సమస్య’గా మారిందని భావిస్తున్నట్లు చెప్పింది.
 • అమెరికాలో మైనారిటీలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిమిత రాజకీయ హక్కులు, అధిక నిరుద్యోగం, తక్కువ ఆదాయాలు, పరిమిత సదుపాయాలు, అధిక దరిద్రం, విద్యలొ అసమానతల పెంపు ఇవన్నీ వారికి సమస్యలే.
 • వారికి సరైన వైద్య సంరక్షణ లేదు. చట్టాల అమలు న్యాయ కల్పనలో వివక్షను ఎదుర్కొంటున్నారు. తరచుగా విద్వేషపూరిత దాడులకు దిగుతున్నారు.
 • లాటినోల వలస హక్కులు తీవ్రంగా ఉల్లంఘనలకు గురవుతున్నాయి. అన్యాయపూరిత డిటెన్షన్లు, విచారణా హింస, మెక్సికన్లుగా, లాటిన్ అమెరికన్లుగా, దేశీయ ఇండియన్లుగా కనిపించినందుకు లక్ష్యంగా ఎంచుకోబడుతున్నారు.

5. స్త్రీలు, పిల్లల హక్కులు: లింగ వివక్ష సర్వ వ్యాపితం

 • ఆగస్టు 2010 లో లండన్ డెయిలీ మెయిల్ అమెరికాలోని 90 శాతం స్త్రీలు పనిస్ధలాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని వెల్లడిస్తుంది.
 • ఫార్చూన్ 500 సి.ఇ.ఓల జాబితాలో కేవలం 3 శాతం మందే మహిళలు
 • పురుషులతో సమానమైన ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ సగటున పురుషుడి సంపాదనలో 3/4 వంతు మాత్రమే స్త్రీ సంపాదించగలుగుతోంది.
 • వాల్-మార్ట్ లాంటి కంపెనీలకు అప్రతిష్టాకరమైన లింగ వివక్షా చరిత్ర ఉంది.
 • మిలియన్ల మంది మహిళలు లైంగిక దాడులు, హింసలకు గురవుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జస్టిస్, అక్టోబరు 2010 లో వెలువరించిన నివేదిక మేరకు ప్రతి సంవత్సరం 20 మిలియన్ల మంది స్త్రీలు రేప్ బాధితులుగా ఉన్నారు.
 • జైళ్ళలో ఉన్న స్త్రీలు అత్యంత తేలికగా రేప్‌లకు గురవుతున్నారు. జైలు సిబ్బంది, అధికారులు వారిని రేప్ లకు గురి చేస్తున్నారు.
 • 25 శాతం మంది స్త్రీలు కుటుంబ హింసకు గురవుతున్నారు.
 • స్త్రీల ఆరోగ్య హక్కులకు సరైన రక్షణ లేదు, ముఖ్యంగా కలర్ స్త్రీలకు.
 • పిల్లల్లో దారిద్ర్యం తీవ్ర స్ధాయిలో ఉంది. అమెరికా వ్యవసాయ శాఖను ఉటంకిస్తూ నవంబరు 21, 2010 తేదీన వాషింగ్టన్ పోస్టు పత్రిక 25 శాతం మంది పిల్లలు ఆకలితో భాధపడుతున్నారు.
 • 60 శాతం మంది పబ్లిక్ స్కూల్ టీచర్లు తమ తరగతుల్లోని పిల్లలు ఆకలి బాధలకు గురవుతున్నట్లు చెప్పారు.
 • పిల్లలపై హింస విస్తృతంగా వ్యాపించింది. ‘లవ్ అవర్ ఛిల్డ్రన్ యు.ఎస్.ఎ’ సంస్ధ ప్రకారం సంవత్సరానికి 9 మిలియన్ల మంది పిల్లలు హింసకు గురవుతున్నారు.
 • నిర్లక్ష్యం, హింస, లైంగిక హింస, పిల్లలపట్ల చూపే సామాజిక నిర్లక్ష్యం… ఇవన్నీ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలు అభద్రతలో ఉన్నాయి.

6. ఇతర దేశాలపై అమెరికా మానవహక్కుల ఉల్లంఘనలలు

 • ఇతర దేశాలపై అమెరికా అమానుష కృత్యాలకు లెక్కేలేదు. గత రెండు దశాబ్ధాలలోనే అమెరికా యుద్ధాలు, ఆంక్షలు, ఇరాన్ ఆఫ్టనిస్ధాన్ ల దురాక్రమణల వలన మిలియన్లమంది చనిపోయారు. మానవ జాతిని అవి తీవ్ర కష్టనష్టాలకు గురిచేశాయి. ముఖ్యంగా పౌరుల్లోని పురుషులను, ష్త్రీలను, పిల్లలను భాధితులుగా మిగులుస్తున్నాయి. పైగా ఇరాక్, ఆఫ్ఘన్ రెండు దేశాలల్లో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నది. తరచుగా వారు పక్కా హత్యలకు గురవుతున్నారు.
 • ఉదాహరణకి సెప్టెంబరు18, 2010 తేదీన వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రకారం 5వ స్ట్రైకర్ కంబాట్ ‘కిల్ టీము’ పౌరులను లక్ష్యం చేసుకుని అమానుష హత్యలకు పూనుకుంది. శవాల అవయువాలను వేరు చేసి వారి ఎముకలను ట్రోఫీలుగా చూపుతూ సంబరం చేసుకున్నారు.
 • నిరంతరం డిటెన్షన్ లో ఉంచి టార్చర్ కి గురి చేయడం సర్వ సాధారణం. మే 2010 లో యు.ఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, స్పెషల్ రేపోర్చర్ ల ఉమ్మడి నివేదిక “టెర్రరిజం వ్యతిక పోరాట నేపద్యంలో రహస్య డిటెన్షన్లకు సంబంధించిన ప్రపంచ ఆచరణల ఉమ్మడి అధ్యయనం” అన్న పేరుతో నివేదిక తయారు చేశాయి. దాని ప్రకారం:
 1.    అసాధారన రెండిషన్లలు
 2.    మాయం చేయడం
 3.    రహస్య డిటెన్షన్లు
 4.    టార్చర్ తదితర హింసలు, అమానవీయ పద్ధతుల్లో చూడటం
 5.    ఒళ్ళు గగుర్పొడిచే హత్యలలు
 6.    వివిధ రకాల మానవతా వ్యతిరేక నేరాలలు
 • గ్వాంటనామో జైలు మూసివేస్తానని హామీ ఇచ్చినా ఒబామా ఆద్వ్యర్యంలో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుష్ తరహాలోనే మానవహక్కుల హరణ కొనసాగుతోంది.
 • నిజానికి అనేక దేశాల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఉదాహరణకి క్యూబాను అర్ధ శతాబ్దం పాటు అష్ట దిగ్బంధనం కావించారు. ఫలితంగా అక్కడి పౌరుల సంక్షేమం ఘోరంగా దెబ్బతిన్నది. అక్టోబరు 26, 2010 తేదీన యు.ఎన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానన్ని అత్యధిక మెజారిటీతొ ఆమోదించింది. “క్యూబాపై అమెరికా విధించిన ఆర్ధిక, వాణిజ్య, ద్రవ్య పరమైన ముట్టడిని 19 వసారి కొనసాగించడాన్ని తిరస్కారిస్తూ, దిగ్బంధనాన్ని ఎత్తివేయాల్సిన అవసరం ఉందని” ఆ తీర్మానం పేర్కొన్నది. అమెరికా, ఇజ్రాయెల్ లు మాత్రమే ఆ తీర్మానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
 • ఐక్యరాజ్య సమితి “హత్యాకాండ (జీనోసైడ్) సదస్సు ఆర్టికల్ – II” ప్రకారం అమెరికా నేరస్ధురాలు. గాజాపై అదే రకమైన దిగ్బంధనం విధించిన ఇజ్రాయెల్ కూడా నేరస్ధురాలు. ఈ రెండు దేశాలు పదే పదే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, స్వార్ధపూరితంగా విస్మరిస్తున్నాయి.
 1. అమెరికా ఏనాడూ ఆమోదించని అంతర్జాతీయ చట్టాలు
 2. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందం
 3. మహిళలపై అన్ని రకాల వివక్షలని నిర్మూలించేందుకు సదస్సు ఒప్పందం
 4. శారీరక సామర్ద్యాలు లేని వ్యక్తుల హక్కుల సంరక్షణా సదస్సు ఒప్పందం
 5. పిల్లల హక్కుల సంరక్షణా సదస్సు ఒప్పందం
 • నవంబరు 5, 2010 తేదీన యు.ఎన్ యూనివర్సల్ పీరియాడికల్ రివ్యూ (యుపీఅర్) అమెరికా తీవ్ర స్ధాయిలో ఉల్లంఘించిన మానవ హక్కుల జాబితాను తయారు చేసింది. అందులోని అంశాలు:
 1.    కీలక మానవ హక్కుల సదస్సు ఒప్పందాల ఆమోదించడంలో వైఫల్యం
 2.    తెగల మైనారిటీలు, దేశీయ మూలవాసుల హక్కులు
 3.    జాతి వివక్ష
 4.    గ్వాంటనామో లాంటి విదేశీ టార్చర్ జైళ్ళు నిర్వహించడం
 • ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ తో పాటు అనేక దేశాలు ఈ అమెరికా విధానాలను తీవ్రంగా ఖండించాయి. మానవ హక్కుల నామ మాత్ర గౌరవం ప్రకటిస్తూ ఆ హక్కులనే అమెరికా తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదని దుయ్య బట్టాయి.
 • అదే సమయంలొ ప్రపంచ దేశాలను వేలెత్తి చూపుతూనే, దురహంకారంతో, పచ్చిగా, స్వవంచనతో తన ఉల్లంఘనల ను పట్టించుకోదు.
 • ఫలితంగా అమెరికా తీవ్రమైన దుర్మార్గ చర్యలను ఇంటా బయట అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది. మెజారిటీ మీడియా, సినిమాలు, అకడమీషియన్లు ఇంకా ఇతర అనేక వర్గాల వారు అభివర్ణించే ఊహాత్మక చిత్రణకు భిన్నమైన దృశ్యం అమెరికాలో నెలకొని ఉంది.

కూర్పు: స్టీఫెన్ లెండ్‌మేన్

2 thoughts on “అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -2

 1. ఈ ఆర్టికల్ లో కలర్ మనుసులు అంటే ఏమిటి? బ్లాక్ కలర్ మనుషులు అనా?

 2. కాదు. బ్లాక్స్ ని బ్లాక్స్ అనే అంటారు. కాని ఇండియన్లతో పాటు కొన్ని దేశాల వాళ్ళు పూర్తి నలుపు కాకుండా వివిధ రంగుల్లో ఉంటారు. అందుకని వారిని వైట్ లో కలపడం ఇష్టం లేక కలర్ ప్యూపుల్ అంటారు. అంటే ఇతరులు తెల్లగా ఉన్న వారిని వైట్ అంటే తమలో కలుపుకున్నట్లుంటుందని కలర్ అంటున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s