జానకి విముక్తి – కమ్యూనిస్టులు – కమ్యూనిస్టు ఆచరణ


(గమనిక: ఈ బ్లాగ్ లో ‘జానకి విముక్తి’ నవలపై ఇంతక ముందు రాసిన “రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం” అన్న పోస్టుపై జరిగిన చర్చలో ఇచ్చిన సమాధానం ఇది. దాన్ని పోస్టుగా మార్చాలని ఇచ్చిన సూచన మేరకు కొన్ని మార్పులు చేసి పోస్టు చేయడమైనది)

ఒక నవలనుగానీ, పుస్తకాన్ని గానీ చదివినవారు ఎవరైనా అందులో తమకు ఇష్టమైనంతవరకే లేదా అర్ధమైనంతవరకే స్వీకరిస్తారు. నమ్ముతారు కూడా. తమ ఆలోచనా పరిధిలో తర్కించుకుని ‘ఇది బాలేదు’ అనిపిస్తే ఇంకొంతమంది అందులోని అంశాలపై చర్చకు దిగుతారు. ఎక్కువమంది వదిలేస్తారు. రంగనాయకమ్మగారు రాసిన జానకి విముక్తి నవలను చదివి అందులో మార్క్సిజం గురించి ఎక్కువ రాశారు అని భావించి చర్చకు దిగారనుకుందాం. “మీ పరిధి ఇంతే. అందుకే రంగనాయకమ్మగారు రాసింది అర్ధం కాలేదు” అని వ్యంగ్యంగా సరైన పద్ధతిలో చెప్పకుండా ఎద్దేవా చేస్తే అది పద్ధతికి విరుద్ధం. చేతనైతే మనకు తెలిసి నమ్ముతున్న విషయాన్ని తెలియజెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాలి తప్ప వెటకారం చేస్తే అసలు విషయం పైనే వ్యతిరేకత వస్తుంది. మార్క్సిజం తెలుసు అనుకుంటున్నవారు చాలామంది ఇలా చేస్తున్నారు. అది సవరించుకోవలసిన విషయం.

మార్క్సిజం మనుషుల్ని ఒక్కసారిగా గొప్పవారిని చేస్తుందా? లేదు, మార్క్సిజం ఒక్కసారిగా ఎవర్నీ మరింత గొప్పవాళ్ళను చేయడం అసాధ్యం. ముందు మార్క్సిజం అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకుంటున్న క్రమంలోనే సమాజానికీ మార్క్సిజానికీ ఉన్న సాపత్యాన్ని అర్ధం చేసుకోగలగాలి. ముఖ్యంగా సామాజిక సంబంధాల విషయంలో మార్క్సిజం చెబుతున్నది వాస్తవమా, కాదా అన్న విషయంలో ఒక అంగీకారానికి రావాలి. అపుడు మాత్రమే మార్క్సిజం మనుషుల్ని మార్చగలుగుతుంది. అయితే మార్క్సిజం అర్ధం అయిన తర్వాతే మార్పు మొదలవుతుందని కాదిక్కడ. మార్క్సిజం అర్ధం చేసుకుంటున్న క్రమంలో నెమ్మదిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది నిజాయితీ పరుల విషయంలోనే వాస్తవం అన్నది ముఖ్యంగా గమనించాలి.

ఎందుకంటే, మార్క్సిస్టులం అని తమను తాము చెప్పుకునే వారు రక రకాలుగా ఉంటారు. పైన చెప్పుకున్న నిజాయితీపరులు కొందరైతే, మార్క్సిజాన్ని కొంతవరకే అర్ధం చేసుకుని తమకది పూర్తిగా తెలుసనుకునే వారు చాలమంది ఉన్నారు. అలా కొంతవరకే తెలుసుకున్నవారు అసలు తెలియని చాలామంది ముందు తెలిసీ తెలియని జ్ఞానాన్ని ప్రదర్సిస్తారు. వీరికి సహజంగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్ధితిలో ఉంటారు. “జవాబు చెప్పలేను, నేనంతగా అర్ధం చేసుకోలేదు” అని చెప్పడానికి బదులు, తమకు తెలిసిన పరిధిలోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది వాస్తవానికి మార్క్సిజంతో సంబంధం లేనిదై ఉండవచ్చు. వీరి వలన మార్క్సిజం అసలు తెలియని వారికి అర్ధ సత్యాలు, పూర్తి అసత్యాలు అంది మార్క్సిజం పైనే వ్యతిరేకత ఏర్పడ్డానికి కారణమవుతోంది.

ఉదాహరణకి రంగనాయకమ్మగారి పెట్టుబడి పరిచయం పుస్తకం వెనక అట్ట మీడ రంగనాయకమ్మగారు రాసిన “ఒక మంచి డాక్టరు కావాలంటే వారు ముందు మంచి కమ్యూనిస్టు అయి ఉండాలి. ఒక మంచి భర్త కావాలంటే ముందు మంచి కమ్యూనిస్టు అయిఉండాలి” అన్న అంశాన్నే తీసుకుందాం. “అవును, ఆవిడ చెప్పింది ముమ్మాటికీ కరెక్టే. మంచి డాక్టరు కావాలంటే అతను మార్క్సిస్టు కావాల్సిందే. మార్క్సిజం అంత గొప్పది మరి. మార్క్సిజం గురించి మీకేమీ తెలియదు” అని చెప్పేస్తే అవతలి వారు అంతే కటువుగా తమకు కరెక్టనుకున్న దాన్ని చెప్పేస్తారు. దాంతో పాటు మార్క్సిజం పట్ల కూడా ఆటోమేటిక్ గా కొంత నెగిటివ్ ఆలోచన వారిలో నాటుకుంటుంది. అలాంటివారు మరో నలుగురు ఎదురైతే చాలు. మార్క్సిజంపై పూర్తి వ్యతిరేకత పెంచుకోవడానికి.

కొంతమంది మార్క్సిజం పూర్తిగా, లేదా తగినంతగా అర్ధం చేసుకున్నా, వారి వ్యక్తిగత లోపాల వలన, అసమర్ధత వలన మర్క్సిజంపై తప్పు అభిప్రాయాలు ఏర్పడ్డానికి కారణమవుతారు.

ఇకపోతే మార్క్సిస్టు పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా ఉన్న సంస్ధల్లో పని చేస్తున్నవారు. అలా చెప్పుకుంటున్న పార్టీలన్నీ కమ్యూనిస్టు పార్టీలు కాదని గమనించాలి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు వల్లిస్తూ, జీవితంలో ఏ క్షణంలో కూడా అది చెప్పే అంశాల్ని పాటించకుండానే వీరు కమ్యూనిస్టులుగా  చెలామణి అవుతుంటారు. ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలేవీ మార్క్సిజం చెప్పిన సూత్రాలేవీ పాటించడం లేదు. కనీసం పాటించడానికి కూడా ప్రయత్నించడం లేదు. వారి వలన ఇండియాలో మార్క్సిజానికి రావలసినంత చెడ్డపేరు వచ్చింది.

“మేము/నేను కమ్యూనిస్టులం/ని” అని చెప్పుకునే వారంతా కమ్యూనిస్టులు కాదు. మార్క్సిజం అనేది ఒక ఆచరణీయ సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి నిజాయితీ, నిబద్ధత ఉండాలి. దానికోసం పని చేయాలి. తాము కమ్యూనిస్టులమని చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా ఆ సూత్రాల ప్రకారం నిజాయితీగా పనిచేస్తున్నవారు తప్పని సరిగా సమాజం నుండి ప్రశంసలు పొందుతారు. అందులో అనుమానం లేదు.

కాని కమ్యూనిస్టులం/మార్క్సిస్టులం అని చెప్పుకుంటున్నవారు పాటించేదంతా కమ్యూనిజం కాదని గ్రహించడానికి జనం దగ్గర ఉపకరణాలేవీ లేవు. అందువలన కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్నవారు చేసిందే మార్క్సిజంగా చెలామణి అవుతోంది. పుస్తకాలు (ఏవైనా సరే) చదివి జ్ఞానం పొందిన వారు సహజంగా మేధావులుగా చెలామణి అవుతుంటారు. కాని “జ్ఞానం పొందటంతో పాటు దాన్ని సమాజానికి ఉపయోగం లో పెట్టగలిగిన వారే నిజమైన మేధావి” అని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో అంటాడు. అది  సంపూర్ణంగా నమ్మదగిన నిజం. మార్క్సిజం కూడా అంతే. మార్క్సిజం చదివి అర్ధం చేసుకొని, అది నచ్చి, నమ్మడంతోనే మార్క్సిస్టులు/కమ్యూనిస్టులు ఐపోరని గమనించాలి. నమ్మినవారు ఆచరించడానికీ, పదిమందికీ ఉపయోగపెట్టడానికీ ఏదోమేరకు ప్రయత్నించాలి. అప్పుడే వారు మార్క్సిస్టులు/కమ్యూనిస్టులుగా చెప్పుకోవడానికి అర్హులు.

మనకు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ తిరిగేవారు చాలా మంది ఎదురవుతుంటారు. వారిలో చాలమంది దగ్గర అటువంటి లక్షణాలు కనపడవు. “గుండు చేయించుకుంటున్న వారంత భక్తులు కానట్టే, మార్క్సిస్టులుగా చెలామణి అవుతున్నవారంతా మార్క్సిస్టులు కాదు. అదే కాకుండా చెడ్డవాళ్ళెవరూ మార్క్సిస్టులు అసలే కాదు” అని గమనించాలి. ఈ బ్లాగరుకు తెలిసి రంగనాకయమ్మ గారిని తీవ్రంగా అభిమానిస్తూ నిజ జీవితంలో గూండాయిజం చేస్తూ, లిటిగెంటుగా డబ్బు సంపాదిస్తున్నవారు ఉన్నారు. మార్క్సిజం తరపున అతను చేసే వాదన కూడా గూండాయిజం తో చేస్తుంటాడు. అటువంటి వారు అసలు మార్క్సిస్టులు కానే కారు. అనుభవాలనుండే ఎవరైనా ఏ విషయంపైనైనా ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ‘ఇది మార్క్సిజం, ఇది మార్క్సిజం కాదు’ అని విడమరిచి చెప్పే పరిస్ధితి ఇప్పుడు సమాజంలో లేదు. కమ్యూనిస్టులుగా ఉన్నవారు సైతం అలా వివరించేందుకు ఉదాహరణలు గా లేరు. అందువలన మార్క్సిస్టులుగా అనుకుంటున్న నిజాయితీపరులు ఓపిగ్గా పనిచేయడమే చేయగలిగింది.

ఓ సిద్ధాంతం గొప్పదని చెప్పినంతలోనే గొప్పదైపోదు. అది ఆచరణలో రుజువైతేనే గొప్పదవుతుంది. మార్క్సిజం-లెనినిజం అలా ఆచరణలో రష్యా, చైనాల్లో రుజువైంది. కాని కొంతకాలమే. అది కూడా చాలా లోపాలతో అమలయ్యింది. లోపాలు సవరించుకుని సరైన పద్ధతిలో అమలు చేసేలోపే ఆ దేశాల్లొ రాజకీయ మార్పులు సంభవించాయి. రష్యాలో స్టాలిన్ మరణం తర్వాత, చైనాలో మావో మరణం తర్వాత సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఆగిపోయి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి వెనక్కి ప్రయాణం కట్టారు. ఇప్పుడు చైనాలో ఉన్నది కమ్యూనిస్టు పార్టీ కాదు, సోషలిస్టు వ్యవస్ధా కాదు. ఆ ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ మాత్రమే. చైనా ప్రజల్లో ఇంకా మావో పట్ల అభిమానం పోలేదు. అందువలన రష్యాలాగా కమ్యూనిజాన్ని బహిరంగంగా త్యజించడానికి వెనకాడుతున్నారు.

ప్రజా కోర్టులు సరైనవేనా అన్న ప్రశ్న ఒకటుంది. ‘జానకి విముక్తి’ నవల్లో సత్యం ప్రజాకోర్టులో విచారించి వెంకట్రావుని షూట్ చేయాలని భావిస్తాడు. అది విచారణ లేకుండా శిక్ష వేసినట్లు అర్ధం వస్తుంది. కానీ కేసు, కోర్టు అన్నీ “ప్రజా కోర్టు” అన్నదాన్లోనే వచ్చేశాయని గమనించాలి. ఇప్పుడు మావోయిస్టులు అనుసరిస్తున ప్రజాకోర్టులు మార్క్సిస్టు సిద్ధాంతంతో సంబంధం లేనివి. అవి మార్క్సిజం అని వారు నమ్మినా, చెప్పినా అవి మాత్రం మార్క్సిజం కానే కావు. అలా ఏకపక్షంగా చంపేయమని ఎవరూ చెప్పలేదు. చైనాలో విప్లవం వచ్చాక గూడా భూస్వాముల భూములు వశం చేసుకోవడం పార్టీ గైడెన్స్ లో జరిగిన చోట వెనువెంటనే మొరటుగా జరగలేదు. భూస్వామిలో క్రమంగా మార్పు రావడానికి కొన్ని సంవత్సరాలు వేచి చూసిన ఉదాహరణలు ఉన్నాయి. దానితో పాటు స్ధానిక నాయకులకు అవగాహన లేని చోట మొరటుగా లాక్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రారంభ దశల్లో అప్పటికీ సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి సంబంధించిన అనుభవం లేనందున రష్యా, చైనాల్లో చాలా తప్పులు దొర్లాయి. అవి ఉద్దేశ్య పూర్వకంగా జరగలేదని గమనించాలి.
రంగనాయకమ్మ గారు ‘జానకి విముక్తి’ నవలద్వారా చదువరులను మార్క్సిజం వైపుకు మళ్ళేలా చేయాలని ప్రయత్నించడం  బాగాలేదని కొంతమంది భావించవచ్చు. మార్క్సిస్టు సిద్ధాంతాల భోధన పంటికింద రాయిలా తోస్తుంది. అయితే “మార్క్సిజం వైపు మళ్ళేలా చేయడం” నేరం కాదని గమనించాలి. “మార్క్సిజం మంచిది. వెలుగునిస్తుంది” అని నమ్మి రంగనాయకమ్మ గారు ఆ ప్రయత్నం చేశారు. నవలనుండి ఎవరికి కావలసినంత వారు స్వీకరించవచ్చు. మార్క్సిజంతో కలిపి జానకి విముక్తిని స్వీకరించిన వారు (ఈ బ్లాగర్కు తెలిసి తక్కువేననుకోండి) కూడా ఉన్నారని గమనించండి. మార్క్సిజం గ్రహించకపోయినా, తనకు అర్ధం అయిన మేరకు తన జీవితాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నించిన వారూ ఒకరిద్దరు ఈ బ్లాగరుకు తెలుసు. జానకి విముక్తి చదివి అర్జెంటుగా మార్క్సిస్టులు కావాలని రంగనాయకమ్మ గారు కూడా అనుకుని ఉండరు. మార్క్సిజం గురించిన పరిచయం ఇవ్వడం ద్వారా ఆ ఇజం గురించి ఆలోచించేలా ప్రేరేపించడానికి ఓ ప్రయత్నం చేస్తే తప్పు కాదు కదా!

జావకి విముక్తి నవల చదివిన వారికి మార్క్సిజం ఓ బోనస్సు లాంటిదని ఓ ఫ్రెండ్ సూచించారు. మార్క్సిజం పై ఆసక్తి పెంచగలిగితే అది నిస్సందేహంగా బోనస్సే. అసక్తి కలిగించకపోయినా నష్టం లేదు. జానకి విముక్తితో మార్క్సిజంతో సంబంధం లేకుండా ప్రేరేపణ పొందగలిగనా ఉపయోగమే. పది రూపాయల వలన కొంత ఉపయోగం. ఇరవై రూపాయల వలన మరింత ఉపయోగం. మార్క్సిజంపై ఆసక్తి పెంచగలిగితే జానకి విముక్తి ఉపయోగపు విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అదే రంగనాయకమ్మ గారి ప్రయత్నం. దాన్లో తప్పులేదని గమనించాలి.

ఓ మిత్రుడు “మార్క్సిజం ‘ఇలా ఉంటే బాగుండును’ అనుకోవడానికి పనికొస్తుంది” అన్నారు. అది మార్క్సిజానికి ఆయన ఇచ్చిన సర్టిఫికేట్. మార్క్సిజం మంచి చెబుతుంది అని ఆయన రూఢి పరిచారు. అయితే ఆచరణీయమా కాదా అన్నదగ్గరే కొంతమంది విభేదిస్తున్నారు. ఆ అంశం నిజానికి సాపేక్షికం. చైనా, రష్యా విప్లవాల గురించి చదివితే వారి అభిప్రాయం మారవచ్చునేమో. ఆ విప్లవాల గురించి మీరు చదివి ఉండరని భావిస్తూ ఇలా అనవలసి వస్తోంది. చదివి కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తే అది చర్చనీయాంశం. మానవ ప్రవృత్తి అని మిత్రుడు చెప్పింది కూడా సాపేక్షమైనదే. గతంలో బానిస, భూస్వామ్య సమాజాల్లో మానవ ప్రవృత్తిగా కనిపించింది ఇప్పుడు మానవ ప్రవృత్తికి వ్యతిరేకంగా మారింది. బానిస సమాజంలో బలహీనుల్ని బానిసలుగా చేసుకోవచ్చు. కాని ఇప్పుడు వెట్టి చాకిరి చట్ట విరుద్ధం. అలానె మార్క్సిజం ప్రతిపాదించే సిద్ధాంతాలు మానవ ప్రవృత్తికి వ్యతిరేకం అని శివరాం అంటున్నారు గాని, అవి మానవ సమాజానికి అత్యవసరం అని చెబుతున్నావారూ ఉన్నారు కదా? సమాజాన్ని మనం అర్ధం చేసుకున్న దృక్పధాన్ని బట్టే ఏ అంశానాన్నైనా చూస్తాం. మార్క్సిజాన్ని కూడా అలానే చూసి ప్రకృతా, వికృతా అన్నది తేల్చేసుకుంటాం. కానీ మానవ సమాజానికి ఏది మంచిది అన్న ప్రశ్నకు విశ్వజనీనన మైన సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని చూడగలగడమే ఇక్కడ కావలసింది.

మరో మాట. జానకి విముక్తి రంగనాయకమ్మ గారి ఒక్కరి గొప్పతనమేనా? కాదనే చెప్పాలి. “కాలం గర్భంతో ఉండి మార్క్సును కన్నది” అని మార్క్సు గురించి అతని ఆప్త మిత్రుడు ఎంగెల్సు అంటారు. అంటే మార్క్సు కాలానికి మార్క్సిజం పుట్టడానికి అవసరమైన సిద్ధాంతాలన్నీ అభివృద్ధి చెంది ఉన్నాయనీ, వాటి ఆధారంగానే మార్క్సిజం తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలిగాడనీ అర్ధం. అలాగే సమాజంలో జానకిలు చాలామంది ఉన్నారు కనకనే ‘జానకి విముక్తి’ నవల అంత పాపులర్ అయింది. అందులో అనుమానం లేదు. అయితే సంఘంలో స్త్రీలపై ఉన్న కుటుంబ హింస, అణచివేతలను సరైన దృక్పధంతో చూడగలిగినప్పుడే అంత ప్రతిభావంతంగా ఆకట్టుకునేలా రాయగలరు. రంగనాయకమ్మగారికి అటువంటి దృక్పధాన్ని మార్క్సిజం ఇచ్చిందని గమనించాలి. ఈ విషయం వెంటనే ఒప్పేసుకొమ్మని ఎవరినీ ఈ బ్లాగరు కోరడం లేదు. వీలైతే, మార్క్సిజాన్ని చదవగలిగితే, వారికి మార్క్సిజం గొప్పతనం తెలుస్తుందని ఈ బ్లాగరు నమ్మకం.

మార్క్సిజం అంటే ఏవి చదవాలి? తెలుగులో ఉన్న పుస్తకాలు:

 1. పెట్టుబడి పరిచయం: మార్క్సు రాసిన “దాస్ కేపిటల్” కి ఇది సంక్షిప్త పరిచయం. ఒట్టి పరిచయమే కదా అని తీసి పారెయ్యకండి. కేపిటల్ సారాంశాన్ని ఆవిడ అద్భుతంగా అర్ధమయ్యే రీతిలో చక్కగా రాశారు. గతంలో ఇది నాలుగు భాగాలుగా రాశారు. ఇప్పుడది ఒకే భాగంగా తెచ్చారనుకుంటా.
 2. గతితార్కిక భౌతిక వాదం: ఇది మార్క్సిస్టు తత్వ శాస్త్రం. దీనిపై  మావో రాసిన పాఠాలు సులభంగా అర్ధమవుతాయి.
 3. చారిత్రక భౌతిక వాదం: గతితార్కిక భౌతిక వాదం వెలుగులో సామాజిక పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తే వచ్చేది చారిత్రక భౌతిక వాదం. ఈ పేర్లు చూడ్డానికి అదోలా ఉన్నా చదివితే చాలా ఆసక్తిగా ఉంటాయి.

పైన మొదటి  రెండు చదివితే చాలు మార్క్సిజం గురించిన ఓనమాలు వచ్చేస్తాయి.

73 thoughts on “జానకి విముక్తి – కమ్యూనిస్టులు – కమ్యూనిస్టు ఆచరణ

 1. విశేఖర్ గారూ! మార్క్సిజం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుందనీ, డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందనీ … ఇలా ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రభావం తోనో, చుట్టూ కనపడే కమ్యూనిస్టుల ద్వంద్వ ప్రవృత్తుల వల్లనో ఆ సిద్ధాంతం గురించి తెలుసుకోడానికి చాలామంది అనాసక్తి చూపుతున్నారు. కొందరైతే వ్యతిరేకత కూడా పెంచుకుంటున్నారు.

  ఇలాంటి పరిస్థితుల్లో- చెప్పదల్చినదాన్ని సంయమనం కోల్పోకుండా వివరంగా చెప్పటమే సరైన మార్గం. మీ టపాలో ఇదే కనపడింది. I appreciate your wisdom and the way of presentation! అంతర్జాతీయ వార్తలతో పాటు మార్క్సిజం ప్రత్యేకత గురించీ, దానిలోని మౌలిక విషయాల గురించీ కూడా మీరు టపాలు రాయాలని ఆశిస్తున్నాను.

 2. వేణుగారూ, ధన్యవాదాలు. మీ కోరికను అనుసరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.

  మీ బ్లాగ్ లో కర్ణుడు, వాలి చర్చ ఇప్పుడే చదివాను. చర్చ బాగా జరిగిందనిపించింది.

 3. మార్క్స్ ఆర్థిక అంశాల గురించి ఎక్కువగా మాట్లాడడంలో తప్పేమీ లేదు. వస్తు అనుభవం ప్రధానమైన సమాజంలో డబ్బు గురించి & ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడకపోతే సమాజం గురించి అర్థం కాదు.

 4. “…ఓ మిత్రుడు “మార్క్సిజం ‘ఇలా ఉంటే బాగుండును’ అనుకోవడానికి పనికొస్తుంది” అన్నారు….”

  అవును అంతే. అంతకంటే ఆచరణకు అసాధ్యం. మీరు చెప్పే రష్యా చైనాలలో ఆరేడు దశాబ్దాలలో కుదరని పని మరెక్కడన్నా కుదురుతుందా. ఇలాంటి ఉటోపియన్ సిద్ధాంతాలు ఎన్నైనా ప్రతిపాదించవచ్చు. సమాజంలో ఉండే వాళ్ళు మానవ మాత్రులే కాని ఎక్కడనుంచో దిగి రారు. మానవ సహజమైన పోటీ తత్త్వం , స్వాతంత్ర్య పిపాస, వ్యక్తీ స్వేచ్చ వంటివి తీసేసి ఎలాంటి సిద్దాంతాన్ని అమలు పరచాలని ప్రయత్నించినా అది వికటిస్తుంది. అసలు ఒక సిద్దాంతాన్ని “అమలుపరచాలి” అని అనుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ సిద్దాంతం అందరూ ఆమోదించలేదు అనే కదా. లేకపోతె “అమలు పరచాలి”, “ప్రవేశపెట్టాలి” “విప్లవం” అనే మాటలు రావు. అందరికీ ఇష్టమైతే ఎటువంటి విప్లవాలు లేకుండానే సిద్ధాంతాలు సమాజ నిర్మాణానికి పునాదులు అవుతాయి. మనిషి తను ఎలా బతకాలి అని కాలక్రమేణా పురోభివృద్ది సాధిస్తూనే ఉన్నాడు, ఇటువంటి అసహజ సిద్దంతాల అవసరం లేకుండా అనేక సమాజాలు హాయిగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఒకళ్లో ఇద్దరో వచ్చేసి మాకు ఈ సిద్దాంతం (థియరీ) అద్భుతంగా ఉన్నది మీరూ వినండి, అమలుచేద్దాం అంటే, వినటానికి కొందరు వస్తారేమో కాని అమలు కాదు. విప్లవం పేరిట బలవంతాన అమలుచేస్తే కొంతకాలం ఉండవచ్చు కాని ఆతరువాత తిరస్కరించబడుతుంది తప్ప ఎల్లకాలమూ నిలబడే మానవ సమాజ నిర్మాణానికి పునాది ఎప్పటికీ కాలేదు. కారణం మానవ సమాజ పరిణామ క్రమంలో కాలమనే గీటురాయి మీద నిగ్గు తేలలేదు కాబట్టి. .

  విప్లవం విప్లవం అని కేకలేసుకుంటూ , తమకు నచ్చినదే మిగిలిన వాళ్ళు అనుసరించి తీరాలి అని దురుసుగా వాదిస్తూ, ఎప్పుడు చూసినా కొన్ని పడి కట్టు మాటలను వాడుతూ, ఎదుటి వారి అభిప్రాయాలను ఎద్దేవా చేస్తూ, వాళ్ళను ఎప్పటికప్పుడు డిఫేన్సులోకి నెడుతూ వాదన గెలవవచ్చేమో కాని, అసలుకే మోసం ఏర్పడి, ఈ మార్క్సిస్ట్ “భక్తులు” చెబుదామనుకున్నా విషయం మీద అందరికీ ఏవగింపు కలిగిస్తున్నారు. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సిధ్ధంతం విఫలమయ్యి ప్రజలు తిరస్కరించారు అక్కడా ఇక్కడా ఉన్నా మార్క్సిజం పేరిట నడుస్తున్న కుటుంబ పాలనా నియంతృత్వ ప్రభుత్వాలే(క్యూబా లో అంతటి మార్క్సిస్టూ తన తమ్ముడికే పట్టం కట్టాడు మరి! క్యూబాలో మరొక మార్క్సిస్టు దొరకలేదా లేక ఎన్నికలు పెడితే ఎవరు గెలిచి ఏమిచేస్తారో అని భయమా?)

 5. మీ ఈ పోస్ట్ మన బ్లాగర్లలో ఎంత మంది చదువుతారో తెలీదు కానీ చదివిన వారికి తప్పక మార్క్సిజం పట్ల ఆసక్తి పెరుగుతుంది.. కమ్యూనిజమంటే మన బివి రాఘవులు, నారాయణల, బుద్ధదేవ్ ల వ్యవహారం చూసి ఇలాగే వుంటుందన్న గుడ్డి నమ్మకంతో చాలా మంది వ్యతిరేకంగా అసలు దాని పట్ల అవగాహన లేకుండా తయారవుతున్నారు. సి.పి.ఐ., సి.పి.ఎం.పార్టీలు వాటి అనుబంధ సంస్థల వ్య్వహారం, వాటి ఎన్నికల అవకాశ వాద పొత్తులు చూసి కమ్యూనిస్ట్ పార్టీలంటే ఏవగింపు కలిగివున్నారు., అసలు కమ్యూనిస్టు ఆచరణ ఎంత కష్ట సాధ్యమో ఎంత నిబద్ధ వ్యవహారమో తెలీకుండా ఈ మధ్య కాలం వీళ్ళు భ్రష్టు పట్టించారు. అదేదో సమాజానికి దూరంగా వున్న బ్రహ్మ పదార్థంలా పిడివాదంలా ప్రచారం చేసారు. కావున మరింత విస్తృత చర్చ జరగాల్సిన అవసరం వుంది..

 6. శివరాం గారు, మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏమిటి? హిట్లర్ కూడా తాను గొప్ప స్వేచ్ఛావాదినని చెప్పుకున్నాడు. స్వేచ్ఛ అనేది ఎవరికి అని సందేహం వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛే గొప్పది అనుకుంటే సామాజిక స్వేచ్ఛ గొప్పది కాదు అనుకోవాలి.

 7. శివరాం గారూ, మార్క్సిజం మంచే చెబుతుంది అని మళ్ళీ ధృవ పరిచారు. సంతోషం.

  ఆరేడు దశాబ్దాల్లో కుదర్లేదని నేనెప్పుడు చెప్పానండీ? కుదిరింది, కాకుంటే కుట్రల వలన కూలింది అని చెప్పాను. మీరు కూడా ఒక సిద్ధాంతం ప్రతిపాదించండి ఆచరణ సాధ్యమయితే అంతా ఆలోచిస్తారు. ఎన్నో ప్రతిపాదించొచ్చు అని కాకుండా ప్రతిపాదించడానికి ప్రయత్నించండి.

  పోటీతత్వం: ఇది చర్చనీయాంశం. అర్ధ శాస్త్రానికి ఆడమ్ స్మిత్ ని పితామహుడుగా చెబుతారు. మీకు తెలిసే ఉంటుంది. పోటీ గురించి మొదట చెప్పింది ఆయనే. ఆర్ధిక వ్యవస్ధలో పెట్టుబడిదారులు పోటీపడితే సరకుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో వస్తాయని ఆయన ఊహించారు. అంటే ఒకే సరుకును వివిధ పెట్టుబడిదారులు పోటీ పడి తక్కువధరకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారనీ, అలా తక్కువకు ప్రజలకు అందుతాయని ఆయన నమ్మారు. ఒక ప్రాసెస్ లోనే కాకుండా మరింత చౌకైన వేరొక ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసి తక్కువ ధరకు తయారు చేస్తారని ఆయన ఊహ. ఆరోగ్యకరమైన పోటీ జరుగుతుందని ఆయన నమ్మారు. కాని వాస్తవంలో జరిగింది కాదు.

  పెట్టుబడిదారీ విధానం గుత్త పెట్టుబడిదారీ విధానంగా మారింది. మార్కెట్ లో ఉన్న పోటీ సంస్ధల్ని కొనేసి పోటీ లేకుండా చేసుకోవడం దీని లక్షణం. పోటీ లేకుండా చేసుకోవడం వలన వారి ఇస్టమైన ధరకు అమ్ముకోవచ్చు. టూత్ పేస్టు చూద్దాం. ఇక్కడ కోల్గేట్ తప్ప మరొకటి దొరుకుతుందా? దేశీయ సంస్ధలు గతంలో బబూల్ లాంట్ అతి చౌక పేస్టులు తయారు చేసి అమ్మేవి. వాటన్నింటినీ కోల్గేట్ కొనేసింది. అది నిర్ణయించుకున్న ధరకే అమ్ముతోంది. ఎప్పుడైనా పేస్టు ధర తగ్గిన చరిత్ర ఉందా? కోకోకోలా వచ్చి ధమ్సప్ ని కొనేసింది. పెప్సీ వచ్చి లిమ్కా లాంటివాటిని కొనేసింది. అవి పోటీపడి తక్కువ ధరకు డ్రింక్స్ ఇచ్చే బదులు పెద్దది వచ్చి తక్కువకి అమ్మే చిన్నవాటిజి కొనేసి ఇంకా రేట్లు పెంచాయి. ఇలా ఏ రంగంలోనైనా చూడండి “మెర్జెర్స్ అండ్ ఎక్విజెషన్స్ కనపడతాయి. అంతిమంగా రుజువయ్యించేమంటే పోటీ సిద్ధాంతం గుత్త పెట్టుబడి ముందు వెలవెల బోయింది. పెట్టుబడిదారులకి నిరంతరం పెరిగే లాభాలు కావాలిగానీ జనాలని తక్కువ రేటుకి అమ్మడం కాదని ఇప్పుడు కాదు దశాబ్ధాల క్రితమె మార్క్సు రుజువు చేశాడు. అవి చూడ్డానికి వ్యతిరేకించి చూడకుండా గాలివాటు ప్రచారాల్ని నమ్మి వాదించడం ధర్మమేనా?

  మీరు చెప్పిన తీసెయ్యడం సోషలిస్టు వ్యవస్ధల్లో జరగలేదు. మీరు సోషలిస్టు వ్యవస్ధలుగా భావిస్తున్నవి సోషలిస్టువి కాదు.

  రష్యా, చైనా ప్రజలు పోరాటాలు చేసి విప్లవాలు తెచ్చారు. ఎవరూ అమలు చేయలేదు. విప్లవం అంటే మీరేం అర్ధం చేసుకున్నారో తెలియదు. దానర్ధం ‘మార్పు’ అని. మెజారిటీ ప్రజానికి పెట్టుబడిదారీ విధానం నచ్చకే దాన్ని మార్చుకుని సోషలిజాన్ని కోరుకున్నారు. చరిత్ర ఒక సారి తిరగేస్తే ముఖ్యమైన మార్పులు విప్లవాల వల్లే వచ్చాయి. ఫ్రాన్సు విప్లవం, పారిశ్రామిక విప్లవం, రష్యా చైనా విప్లవాలు ఇవన్నీ చరిత్రలో రికార్డయ్యాయి. మీరు లేవంటే లేకుండా పోవేమో సార్! సామాజిక మార్పులు ఏ ఒక్కరి స్వీయ సిద్ధాంతాలకి గానీ ఊహలకి గానీ బద్దులుగా ఉండావు. వాటికొక గమనం ఉంటుంది. మార్క్స్ ఆ గమనాన్ని వివరించాడంతే. అదే గమనంలో మరింత మెరుగైన సమాజం ఎలా తెచ్చుకోవచ్చోవివరించాడు.

  ఓ సారి మీ కామెంట్లు మళ్ళీ చదవంది దురుసుగా ఎవరు వాదిస్తున్నారో తెలుస్తుంది. ఈ బ్లాగ్ లొ మిమ్మల్ని ఎవరూ ఎద్దేవా చేయలేదు. వేరేచోట చేశారేమో నాకు తెలియదు. బెల్లాన్ని ఎల్లప్పుడూ బెల్లమనే అంటారు గదా సార్ ఆ పేరు పెట్టి చాలా కాలం అయ్యింది కనుక పేరు మారుద్దామని ఎవరన్నా ఒప్పుకోరు గదా. అలాగే సోషలిజం ఎప్పుడూ సోషలిజమే. ఇంతకీ మీరెవరి భక్తులు? దురుసు, ఏవగింపు, పడికట్టు, గెలుపోటములు, భక్తులు లాంటి పదాలు రాకుండా చూడాలని విజ్ఞప్తి. క్యూబాలో కాస్ట్రో సోషలిస్టు విప్లవమూ తేలేదు. ఇప్పుడున్నది సోషలిస్టు వ్యవస్ధా కాదు. కాస్ట్రో చెప్పుకోగానే సోషలిస్టు ఐపోదు.

  మీకు సమాధానంగానే “రష్యా, చైనాల్లో సోషలిజం – నెహ్రూ సోషలిజం – నిజానిజాలు” పోస్టు రాశానండీ. వీలయితే చదవగలరు.

 8. మీరు వ్రాసిన సుదీర్ఘ వివరణే నేను చెప్పిన వాదాన్ని బలపరుస్తున్నది. ఇప్పటివరకూ మీరు చెప్పే మార్క్సిజం ఎక్కడా అమలు కాలేదని, అది అమలు అయ్యే అవకాశాలు లేవనీ. అలా అమలు కావటానికి ఎన్నో అనుకూల పరిస్థితులు కావాలి. అవన్నీ సమకూడె అవకాశం ఎప్పటికీ లేదు. అందుకనే రష్యాలోనూ, చైనాలోనూ కొంతకాలం బలవంతానా ఉండి ఆ తరువాత కనుమరుగైనాయి.

  “..ఇంతకీ మీరెవరి భక్తులు…” అని అడిగారు కాబట్టి చెబుతున్నాను , నేను భారత దేశ భక్తుణ్ణి. నేనెప్పటికీ విదేశీ భావ జాలాలకి భక్తుణ్ణి అయ్యే అవకాశమే లేదు.

  దురుసుగా వాదనలు అని నేను అన్నది మీ గురించి కాదు మాస్టారూ, మీరెందుకు భుజాలు తడుముకుంటారు. సామాన్యంగా మార్క్సిజం అర్ధం అయిపోయింది అనుకునే వాళ్ళు ఇతరులతో తామేదో గొప్ప మేధావులైనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ గురించి నేను అన్నది, మీ గురించే అని అనుకోకండి.

 9. @ప్రవీణ్

  స్వేచ్చ అనేది అనేక రకాలు. మీ అభిప్రాయం మీరు స్వేచ్చగా ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. స్టాలిన్ పరిపాలనలో మీరు ఉండి మీకు కమ్యూనిజం ఇష్టం లేకపోతె మీరు ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చి ఉండగలిగేవారా! వ్యక్తీ స్వేచ్చ లేకుండా సామాజిక స్వేచ్చ అనేదే ఉండదు.

  ఇంతకు ముందు ఇదే బ్లాగులో చెప్పినట్టు ఏ ఇజమైనా సమాజంలో అందరూ సుఖంగా బతకటానికి మార్గాన్ని సూచించేదే కాని, ఈ ఒక్క ఇజమే అన్నిటికన్నా గొప్పది అని మెడను కట్టుకు తిరగటానికి ఏదీ పనికి రాదు. సామాజిక పరిణామ క్రమం సహజంగా జరుగుతూ ఉంటుంది. అందులో ఇజాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏ ఇజమైనా సరే సామజిగా పరిణామ క్రమానికి తల వొగ్గి పోవాలిసిందే.

 10. ఓహో అలాగా, ఇక్కడా రాస్తున్నారు కదా అని నాతో అని పొరబడ్డాను. దాన్నొదిలేయండి. మేధావుల్లా ప్రవర్తించేవారూ మేధావులు కాదేమోనండీ.

  విదేశీ భావజాలాలు అనుసరించదగినవిగా ఉంటే ఆహ్వానించడం లో తప్పులేదనుకుంటా. సైన్సుకు స్వ,విదేశీ తేడాలుండవు గదా. మార్క్సిజం సామాజిక, రాజకీయ, ఆర్ధిక శాస్త్రాల సమ్మిళితం. పైగా తత్వ శాస్త్రం. మానవాళినంతటికీ ప్రయోజనకరమైన శాస్త్రం. కనుక ఆ సైన్సుని నమ్ముతాను. ఇష్టపడతాను కూడా. ఆంధ్రా యూనివర్సిటీలో మార్క్సిజం మీద పి.హెచ్.డి చేసిన చలంగారు ఆ యూనివర్సిటీకి వి.సిగా కూడా పని చేసారు. మార్క్సిజం శాస్త్రం అని చెపడానికి ఈ ఉదాహరణ.

 11. బానిస వ్యవస్థ ఉన్న రోజుల్లో యజమానులకి బానిసలని ఉంచుకునే స్వేచ్ఛ ఉంది అనుకునేవాళ్ళు. చివరికి ఆరిస్టాటిల్ లాంటి మహాతత్వవేత్తలు కూడా బానిస వ్యవస్థని సమర్థించారు. వేతన శ్రమ (wage labour) వ్యవస్థలో కూడా ఒక వర్గానికి స్వేచ్ఛ ఉంటుంది, ఒక వర్గానికి స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ అనేది సమాజం అంతటికీ వర్తించాలి. హిట్లర్, ఆరిస్టాటిల్‌లలాగ వ్యక్తికో, వర్గానికో confinedగా ఉండాలని అనుకోను. ఆరిస్టాటిల్‌కి అప్పటి కట్టుబాట్లని ధిక్కరించే తెగింపు లేకపోవచ్చు. ఇప్పుడున్న మేధావులకి కూడా ఇప్పుడు ఉన్న కట్టుబాట్లని తెగించే ధైర్యం లేకపోవచ్చు. కానీ వ్యవస్థలో మార్పు ఎప్పటికైనా వస్తుంది. ఒకవేళ సమాజం మార్పుకి లొంగని జడపదార్థమైతే మనం ఇప్పటికీ ఆరిస్టాటిల్ కాలంలోనే ఉండేవాళ్ళం.

 12. Please delete my earlier comment, as there were few mistakes.
  వ్యాసం బాగుంది. ఈ వ్యాసంతోపాటు, “చైనా రష్యాల్లో సోషలిజం…” అన్న వ్యాసం చదివిన తర్వాత నాకు కలిగిన కొన్ని అనుమానాలు :
  1. మీరు గానీ సోషలిజం కమ్యూనిజానికి పర్యాయపదంగా భావిస్తున్నారా?
  2. నాకు తెలిసినంతలో కమ్యూనిజం ద్వారానే సోషలిజం సాధ్యమని మార్క్స్ అంటాడు. అంటే, సోషలిజానికి మించినదేదో అయ్యుంటుంది కదా కమ్యూనిజం? అదేమిటి?
  3. పైన ఒక కామెంటులో మీరు విప్లవం అంటే మార్పు అని అర్ధం చెబుతూనే, మార్పులు విప్లవాల వల్లే వచ్చాయని చెప్పారు. మీ ఉద్దేశ్యంలో విప్లవం అంటే ఏమిటి? మార్క్స్, లెనిన్ లు మాత్రం తిరుగుబాటు చేయమన్నారు. పోరాటం చేయమన్నారు. ఇంకా గట్టిగా చెబితే సాయుధ పోరాటమే మార్గం అన్నారు. ఈ సిద్ధాంతాల కనుగుణం చూస్తే, మన దేశంలో కొద్దోగొప్పో నక్సలైట్లే అసలు సిసలైన కమ్యూనిస్టులుగా భావింపబడతారు కదా?
  4. సామ్యవాద స్థాపనలో వ్యక్తి స్వేచ్ఛకన్నా, సామాజిక ప్రయోజనమే ముఖ్యమంటూ సోకాల్డ్ కమ్యూనిస్టు ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించటంలేదా?
  5. వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ సామ్యవాదాన్ని సాధిద్దామనే కమ్యూనిజం కన్నా, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూనే, సమసమాజం కోసం పోరాడమనే ప్రజాస్వామ్యం ఏ రకంగా తక్కువ, మీ ఉద్దేశ్యంలో?

 13. ప్రవీణ్ మీరన్నది నిజం. ఇప్పటి సమాజంలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తున్నపుడు ఆ లోపాలు లేని సమాజం రావాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఇప్పటి సమాజంలో కష్టాలు పడుతున్నవాళ్ళు అలా కోరుకుంటారు సహజంగా.

  అంధ్రలో పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి కొనేవాడు లేడిప్పుడు. ఇప్పుడున్న గిట్టుబాటు ధరే ఇవ్వడం లేదని రైతులు మొత్తుకుంటుంటే మన సి.ఎం ఢిల్లీ వెళ్ళి మరో రు.200/- గిట్టుబాటు కావాలని అడుగుతానని అంటున్నాడు. మూడు, నాలుగు వేలిచ్చి ఆఫీసుల్లో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. మూడు నెలలు మించితే పర్మినెంటు చేయాలన్న చట్టం నుంచి తప్పించుకోవడానికి మూడు నెలలకోసారి తీసేసి మళ్ళీ కొత్తగా పన్లోకి తీసుకుంటున్నట్లు రికార్డులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలా జరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్ధల్లోనూ జరుగుతోంది. కూలీల పరిస్ధితి చెప్పనవసరం లేదు. సంవత్సరంలొ సగానికి పైగా రోజులు పని దొరక్క పస్తులుంటున్నారు కోట్లమంది.

  సమాజంలో తొంభైమంది సంవత్సరంలో అన్ని రోజులు సుఖంగ గడప లేకపోతున్నపుడు కష్టాలులేని వ్యవస్ధ కోసం ఎదురు చూస్తారు. చూసి, చూసి తిరగబడతారు. ఈజిప్టు, ట్యునీషియాల్లో జరిగిందదే. పెట్టుబడిదారీ సమాజంలో అత్యధికులు కష్టాలు పడుతున్నపుడు మెరుగైన వ్యవస్ధకోసం ప్రజలు అనివార్యంగా కృషి చేస్తారు.

  మార్క్సు సోషలిస్టు సమాజం ప్రత్యామ్నాయంగా చూపించాడు. అది కాదు కేపిటలిస్టు, సోషలిస్టు కాకుండా మరో మెరుగైన సమాజం ఉంటే ఇంకెవరైనా సూచించొచ్చు. అవేమీ లేకుండా, మార్క్సిస్టు సిద్ధాంతాల గురించి తెలియకుండానే వాటిపైన ద్వేషం పెంచుకోవడం సరికాదని ఓపిగ్గానే వివరించాల్సి ఉంటుంది. ఓనమాలు లేకుండానే మార్క్సిజం మంచిది అని అర్బిట్రరీగా చెప్పేస్తే, మనకు తెలిసిన సూత్రాల్ని వల్లిస్తే అవి మింగుడుపడవని గమనించాలి.

 14. సాయికిరణ్ గారికి
  1. వాస్తవానికి అవి పర్యాయ పదాలు కాదు. కాని రెంటికీ తేడాలు చెబితే కన్ఫ్యూజన్ అని పర్యాయపదాలుగా వాడాను.
  2. మార్క్స్ అన్నది సోషలిజం ద్వారా కమ్యూనిజం సాధ్యమని. కమ్యూనిజం చేరడానికి జరిగే ప్రయాణమే సోషలిజం. సోషలిజంలో రాజ్యం ఉంటుంది. అది క్రమేపీ రద్దవుతూ పూర్తిగా రద్దయితే కమ్యూనిజం చేరుకున్నట్లు.
  3. విప్లవం అంటే ఆకస్మిక మార్పు. ఒక సమాజం నుండి మరో సమాజానికి జరిగిన మార్పు విప్లవం అనే ఆకస్మిక మార్పు వలన జరిగింది అని నా ఉద్దేశ్యం. నక్సలైట్లు తాము సాయుధ పోరాటం చేస్తున్నామని అంటున్నారు. కాని సాయుధ పోరాటం చేయాల్సింది వారు కాదు ప్రజలు చేయాలి. ప్రజల పాత్ర లేకుండా ఏ పోరాటమైనా వృధా. వారి చిత్త శుద్ధి శంకించదగింది కాదు. వారు ఎన్నుకున్న మార్గం ప్రజలు ఉద్యమాలకి సంసిద్ధం కాకుండానే ఒకేసారి సాయుధ పోరాటం అంటే వచ్చేది నిర్బంధమే తప్ప విప్లవం కాదు. వారి చర్యల వలన వచ్చిన నిర్బంధంలో కనీసం ప్రజల్ని ప్రజా ఉద్యమాలకి సిద్ధం చేయడానికి కూడా వీలు కాకుండా పోతోంది. సాయుధ పోరాటంలో అమలయ్యే తీవ్ర నిర్బంధం ప్రాధమిక పోరాటాలమీదనే అమలయ్యే పరిస్ధితిని వారు తెస్తున్నారు. అదే విషాదం. నిజాయితీ పరులు ఆ చివర్లో ఉంటే కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్నవారు ఈ చివరు ఉన్నారు. మధ్యలో ఉన్న ఒకటి అరా ఎవరికీ కనపడ్డం లేదు.
  4. సామాజిక స్వేఛ్ఛ వ్యక్తి స్వేఛ్ఛకి భిన్నం అనుకోవడంలోనే తప్పుంది. వ్యక్తి స్వేచ్ఛ లేకుండా సామాజిక స్వేచ్ఛకి అర్ధమే లేదు. అసలది ఊహకి కూడా అందనిది. వ్యక్తి స్వేఛ్ఛల సమాహారమే సామాజిక స్వేచ్ఛ. శ్రమలేకుండా మరొకరి మీద పెత్తనం చేసి బతుకుదామనుకునే వారికి సోషలిజంలో స్వేచ్ఛ ఉండదు. శ్రమ చేస్తున్నంతవరకూ ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. సోషలిజంలో శక్తికొద్దీ శ్రమ. శ్రమకొద్దీ సంపద అని సూత్రం. కమ్యూనిజంలో శక్తి కొద్దీ శ్రమ, అవసరం కొద్దీ సంపద అని. అసలు సోషలిస్టు వ్యవస్ధ కొద్ధి సంవత్సరాలే నిలబడింది. ద్రోహుల వలన కూలింది. మళ్లీ మళ్లీ సోషలిస్టు సమాజాలు స్ధాపించబడాలి. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చు కుంటూ సోషలిజం మరింత కాలంపాటు నిలుపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. బానిస సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజానికి రావడానికి రెండువేల ఏళ్లు పట్టింది. అలాగే. విప్లవాలు విజయవంతం కావాలంటే ప్రజల సంసిద్ధత మొదటి షరతు. వారు లేకుండా ఏ విప్లవమూ లేదు.
  5. ప్రజాస్వామ్యం, సోషలిజమ్ వేరు వేరు కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతుల్లో అధికారం. ప్రజల చేతుల్లో నిజమైన అధికారం ఏ సమాజంలో ఉంటుంది అన్నది ప్రశ్న. సోషలిస్టు సమాజంలోనే ప్రజలకి నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం దక్కుతుంది. ఇప్పుడున్నది యజమానులని మార్చుకునే స్వేచ్ఛ తప్ప అసలు యజమానే లేకుందా సొంతగా బతికే స్వేచ్ఛ లేదు కదా.

 15. మార్క్సిజం సైన్స్ !!!!! అందుకని చైనా వాళ్ళ దగ్గర నుంచైనా సరే మీరు తీసుకుని ఆచరిస్తారు? ఆ సూత్రాలు శత్రు దేశం నుంచి వచ్చినా సరే ఆచరణీయం అని మీరు అనుకోవటానికి ఇదా పునాది!?

  మానవాళికి ఉపయోగపడే వస్తువు ఎవరు కనిపెట్టినా అది మనకు ఉపయోగకరం ఐతే తీసుకోవచ్చు.దాని వల్ల మనకూ మన సమాజానికి పెద్దగా నష్టం ఉండదు.ఉంటే గింటే వ్యక్తిగతంగా నష్టపోవచ్చు (డ్రగ్స్, మనిషిని సోమరిని చేసే పనికిరాని ఉపకరణాల వంటివి). కానీ, మనవి కాని ఆలోచనా ధోరణులు ఎక్కడో దేశాల్లో అక్కడి కొంతమంది (మాత్రమె) ఆచరించారని తెచ్చి మన దేశంలో ఎలాలోగా జొప్పించాలని అనుకోవటం చివరకు విఫల ప్రయత్నమే కాని చివరకు ఒరిగేది ఏమీ ఉండకపోయినా, ఇక్కడ ఉన్న సమాజం మొత్తం మీద అనేక దుష్ప్రభావాలు చూపుతుంది.అమాయకులైన యువకులు ఈ మాయలో పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటారు , చేసుకుంటున్నారు. ఈ సూత్రాలు తమ కథల్లో, పద్యాల్లో, సినిమా పాటల్లో వ్రాసి ప్రచారం చేస్తున్నాం అనుకునే వాళ్ళు వాళ్ళ జీవితాలను హాయిగానే గడుపుకుంటూనే ఉంటారు, ఎటొచ్చీ, వాళ్ళ రచనలు చదివి అందులో ఉన్నదే గొప్ప సత్యాలని నమ్మేసి, అనవసరపు ఆవేశానికి లోనై , అనేకమంది తమ తమ జీవితాలు నరకం చేసుకున్నారు.

  ఆలోచనా ధోరణులు సైన్సు ఎలా అవుతాయి. ఎవరో ఒకాయన వేల విశ్వవిద్యాలయాల్లో ఒఅకటైన ఒక విశ్వవిద్యాలయంలో ఒక రిసెర్చ్ చెయ్యంగానే అది సైన్స్ అయిపోతుందా??!!

 16. ప్రవీణ్

  నేను చాలా సూటిగా నేను చెప్పదల్చుకున్నది చెప్పాను. మీరు స్టాలిన్ పరిపాలనలో ఉండి ఆ పరిపాలనకు సరిపోని మాటలు చెప్పి ఉండగలరా? సామాజిక స్వేచ్చ, వ్యక్తీ స్వేచ్చ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ వేరు వేరు కానేకాదు.

  మానవ పరిణామ క్రమంలో ఆ మొదటి రోజుల్లో జరిగిన అనేకానేక అక్రమాలు కాలక్రమాన మారినాయి. అలా మారటానికి ఏ ఇజాలూ అక్కర్లేదు. ఏ ఇజాలైనా సహజ మానవ పరిణామ క్రమంలో భాగాలే కాని, ఆ ఇజాలే మానవ పరిణామ క్రమం కానేరదు.

 17. “…విప్లవాలు విజయవంతం కావాలంటే ప్రజల సంసిద్ధత మొదటి షరతు. వారు లేకుండా ఏ విప్లవమూ లేదు…”

  బాగా చెప్పారు. ఆ సంసిద్ధత భయపెట్టో, తుపాకీ గొట్టం ద్వారానో, ప్రలోభ పెట్టో రాదని ఇప్పటికి అనేక సార్లు నిరూపించబడింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమంటే, ప్రజలకు తెలుసు వాళ్లకి ఏమి కావాలో, విదేశాల నుంచి తెచ్చిన భావజాలాలు వాళ్లకు బోధ చెయ్యనక్కర్లేదు. చేసినా అందులో ఎంతవరకూ, ఎంత కాలం తీసుకోవాలో, అసలు వాటి అవసరం ఉన్నదా అనే విషయాలు వాళ్లకు తేటతెల్లంగా తెలుసు.

 18. Thank you for your reply Sekhar gaaru. I think my question is not understood. Let me rephrase it.
  1. When I mention Democracy, I am not referring to the kind of Democracy we have in India and USA. Similarly, I am not referring to the Communism being practiced either in China or in Cuba.
  2. What is the basic difference between “IDEALISTIC COMMUNISM” and “IDEALISTIC DEMOCRACY”.
  3. As you mentioned in your comment “ప్రజాస్వామ్యం, సోషలిజమ్ వేరు వేరు కాదు”, you mean to say, Democracy is the means to reach Communism? How?

 19. చైనా నుండి తీసుకోవడం ఏంటండీ, అర్ధం లేకుండా. నేను చెప్పని విషయాన్ని నాకు అంటగట్టకండి దయచేసి.

  ఒక సిద్ధాంతాన్ని ఆచరణీయ సిద్ధాంతంగా అంగీకరిచడానికి కావలసింది అది దేశీయమా, విదేశీయమా అని కాదు. అది మన సమాజానికి వర్తిస్తుందా అని చూడాలి. వర్తిస్తుంది అని నేను భావిస్తున్నాను. మీరు భావించకపోతే అది మీ ఇష్టం.

  సామాజిక, ఆర్ధిక, రాజకీయ సిద్ధాంతాలకు దేశాల సరిహద్దులతో సంబంధం ఉండదు. మీరు చెప్పిన పోటీ సిద్ధాంతం ఆడమ్ స్మిత్ ది ఆయన స్కాట్లండ్ దేశస్ధుడు మీరు దాన్ని మానవ సహజంగా చెపారు కదా. అలాగే మానవ సమాజ శాస్త్రాలన్నీ దేశాల సరిహద్దులకు అతీతమైనవి. చొప్పించాలని నేను చెప్పకపోయినా పదే పదే అంటున్నారు మీరు. ప్రజల అంగీకారం లేకుండా సాధ్యం కాదని ఓ వైపు చెప్తున్నా కదండీ. మీరు ఆ సిద్ధాంతాలను నమ్ముతున్నవారితో ఎప్పుడైనా మాట్లాడి వాళ్ళు అమాయకులో కాదో నిర్ధారించుకోవచ్చు. వారికి దూరంగా ఉంటూ వారి సిద్ధాంతాలేవీ తెలియకుండా వారు అమాయకులని భావించడం కరెక్టు కాదేమో.

  మార్క్సిజం ఆలోచనా ధోరణి మీరంటున్నారు. నేను అదొక ఆచరణీయ సిద్ధాంతం అంటున్నాను. కనుక సైన్సు అంటున్నాను. అది సామాజిక శాస్త్రం. అలాగే రాజకీయ, ఆర్ధిక, తత్వ శాస్త్రం కూడా. అందుకే సైన్సు. రీసెర్చి, ఒక ఉదాహరణకి చెప్పాను.

 20. Hi Sai Kiran

  1. As per my knowledge, There is no Idealistic Communism or Idealistic Democracy. Unless an ism is proved practically, it can not become ideal. In other words, an ism can not exist ideologically without practical implementation. There may be people who discuss ideological Communism and Democracy. But it is a distortion of the originalities of Communist theory. Also, it is an attempt to limit the applicability of the Communist theory to a mere ideological discussion. I can not be part of it.
  2. It seems you did not get my point. Democracy is an important constituent of Socialism and Communism. The essence of the Socialism and Communism is Democracy when we observe democracy as the rule of people in real terms.

 21. “ఆ సంసిద్ధత భయపెట్టో, తుపాకీ గొట్టం ద్వారానో, ప్రలోభ పెట్టో రాదని…”
  —-
  అలా నేనెప్పుడూ చెప్పలేదు.

  అవును ప్రజలకు, తెలుసు వారికి ఏమి కావాలో. వారే అవసరం అనుకున్నపుడు తుపాకులు కూడా పడతారు తెలంగాణా, నగ్జల్బరీ ల్లో పట్టుకున్నట్లు. ఫలానాది విదేశం గనక మనకి అనవసరం అని కూడా ప్రజలకు భోద చేయ్యాల్సిన అవసరమూ లేదు. వారి అవసరాల్లోంచే అన్నీ ఉద్భవిస్తాయి.

 22. Unless an ism is proved practically, it can not become ideal. In other words, an ism can not exist ideologically without practical implementation.
  ___________________________________________________________________

  Has communism been proved, in your opinion?

 23. Also,

  Since you agree that people know what they want and since the majority of the people in the word rejected socialism and communism – can we conclude that the current society does not need them?

 24. Science does not accept anything without proof – be it Astrology, be it God or be it even the Communist approach.

  Scientific approach is: Postulate – Experiment – Proof, so Communism or Socialism should be on that framework to be regarded as scientific. As such you said communism hasn’t been proved but again said it was science. What’t this paradox?

 25. It’s like this ..

  People know what they want ….

  A majority of people have not implemented Communism … (according to you nobody implemented communism)

  So, it means communism doesn’t exist in the world and people don’t want communism … am I wrong?

 26. Yes. What you said about scientific is right. Chemical and Physical sciences are different from Politico-Economic science. While the former can be proved in labs within a span of short periods from minutes to days and even years, the latter can be proved through implementation process which takes decades to centuries. As I said somewhere before, it took more than two millennia for a journey from serfdom to Capitalist society to the humankind.

 27. Hmm, so you propose two types of sciences here … okay … but then, unless I am terribly wrong, even the social sciences work on Postulate – Experiment – Proof principle.

  When none of the principles of communism have been proved – let alone the scientific approach – nobody knows whether it works or not, since it was never implemented.

  What makes you say “It works” without really seeing it working?

 28. I never said I would never say the current system is the ultimate. But the current system is something that the people wanted and hence it is surviving.

  But as per the current logic, the present day human race does not want communism, hence it is not in. It’s not the fault of the theory .. its the fact that – right or wrong – the people dont want it. So the credit or discredit goes to the people .. not the framework.

 29. My answer is the same – the current system has survived and is surviving. So there is enough evidence, if not the proof that something works.

  But in case of communism, it has not been implemented yet – so we don’t know whether it works or does not.

 30. You agree that the current system is not ultimate. We see that the majority of the people are suffering in the present system in India are the U.S. (Refer my translation of the essay on top 1%, written by Joseph Stieglitz, the Nobel prize winner in Economics). How can you conclude the the people wanted it?

  I think this is not a matter of logic to prove or disprove, This is a matter of sufferings of the millions of the people around the country and around the globe. When majority of the people are not getting food to eat and opportunity to work, the issue of the change of the system arises. The people may not express in clear terms. But they express it in their own way through change of political parties or through their regular expression of dissent against the lack of food and opportunities. But there can be people who represent the wishes of the vast masses through certain social and political theories (and hence economic). They would be tested in time and those which get approval of people can only last long. Some failures may be temporary and some may be for ever. The people will certainly decide which suites to them.

 31. We see that the majority of the people are suffering in the present system in India are the U.S.
  __________________________________________________________________

  Did he say that the majority is suffering and did he get a Nobel for proving that?

  Again, I am going by what you have agreed up on… “People know what they want and they will get it”

  If people really don’t want the current system the system can not survive. The very fact that it is surviving means that the people are not averse to it. It doesn’t take even a few days for the people to get a new system in place if they really want it.

  If you quote one Nobel winner to prove your point, I can quote 100 such people to prove mine. Thats besides the discussion.

 32. I can’t say anything about Communism. I can say about Socialism. It worked in two countries. Their collapse is not the failure of the Socialism but the failure of the people in defending it. The people who wanted to build Socialism were killed, jailed, and oppressed by the Capitalist elements hidden in the Communist parties. They should have been taken care of even before their rise. But they couldn’t. People’s failure cannot be attributed to theories. The vast masses of the USSR and China benefited from Socialist building. Common man’s knowledge is limited about isms. They tend to believe what ever told by their leaders. The success of Socialism is dependent on the fairness of the people who describe themselves as Communists.

 33. When majority of the people are not getting food to eat and opportunity to work, the issue of the change of the system arises.
  ____________________________________________________________________

  Correct. But in the current scenario the Majority HAS food to eat and opportunity to work. So, as of now (Until that number touches 51%) the need for Communism doesn’t arise.

 34. The people who wanted to build Socialism were killed, jailed, and oppressed by the Capitalist elements hidden in the Communist parties.
  ______________________________________________________________________

  So, what does this tell us? Communists themselves were not sincere.. right?

  Their collapse is not the failure of the Socialism but the failure of the people in defending it.
  ____________________________________________________________________

  I am not talking about Socialism, I am talking about the people. Every ism tends to say good things in its own way. Moreover, every ism is a framework – IT CAN NEITHER SUCCEED OR FAIL – its only the policies built around that and the people responsible for that would succeed or fail.

  So the issue is about the people here. So the point again is that the people couldn’t defend their socialist stance because they didn’t have enough support from the rest of the people.

  – I dont dispute that.

 35. I believe what Joseph says. May be you know more than what Joseph knows, which I don’t know.

  I’m trying to understand the dynamics of the Societal developments. It seems you have acquired full knowledge of them. It may take some time for me to know it or may be not. But I’m trying.

 36. Yes it is about the people and theory also. When the people are sincere and the theory is not applicable, it is obvious that it leads to failure. Right theory and the right people are the need of the hour. if one fails, the other cannot succeed. Here people mean the people who are trying to form a right system with the help of vast masses.

 37. I may not know better than Joseph, but there are hundreds of others out there who know the stuff much better than him or Amartya Sen and they have been successful too.

  I’m trying to understand the dynamics of the Societal developments.
  ___________________________________________________________________

  As far as I understand, the understanding comes through an unbiased view of the things happening around you.

  Love it or hate it, US is still the largest economy in the world and the state of the poor population is much better than the state of the poor in most of the other countries. They have grown so much not without a reason. Similarly China or Deng werent foolish enough to jump to the capitalistic approach.

  If capitalism is implemented properly, communism is well contained within it. By the way capitalism and socialism can go hand in hand though its not the case with communism – take for instance a country like Denmark which has many of the ingredients of capitalism as well as socialism.

 38. I depend on some known people who are in the field to assess the pros and cons of the society, who disapprove your contention about the majority getting food and opportunities.
  ______________________________________________________________________

  Who are those people? Can you give me the names and references wherein they said at least 51% of the world population has no food / no jobs?

 39. So you depend on only one person? FIne lets come back to that later.

  Can you give me a reference where he said 51% of the people have no jobs and no food?

 40. This is what Joseph Stieglitz said:

  “The upper 1 percent of Americans are now taking in nearly a quarter of the nation’s income every year and in terms of wealth it’s 40%”

  So it means, 99% of the Americans take 75% of the income and 60% of the Wealth. How does it get translated to 51% percent having no food across the globe? Am I missing something here?

 41. He said “One out of Seven” surviving on food stamps .. it doesnt mean they have no food.

  Even if you consider food insecurity – it is one out of seven which is 14% which is nowhere near 51%

 42. @ మలక్ & విశేఖర్ : మీ అభిప్రాయాలనూ, వాదనలనూ తెలుగులోనే రాయటానికి ప్రయత్నించకూడదూ? పైన వ్యాఖ్యలను చదువుతుంటే ఏదో ఇంగ్లిష్ బ్లాగ్ లోకి వచ్చినట్టు అనిపిస్తోంది!

 43. అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది.

 44. We are talking about people not having food and jobs here. We are not talking about income limit right?

  So comung back to the point, do you or Joseph have any evidence to say that the majority of the Americans dont havd food or jobs?

 45. The currencies are different and the expenses are different. So they defined an international povert line and 41% are below that, almost half of what you have claimed. I can give you my references. Can you give me yours?

  But again it doesnt mean they dont have food.

 46. ఇతర దేశాలపై అమెరికా ఆధిపత్యాన్ని మాట్లాడకుండా అమెరికా గురించి మాట్లాడలేము. అమెరికా సంపదలో చాలా భాగం ఆధిపత్యంతో దోచుకున్నదే.

 47. do you or Joseph…
  ఇలా అనడం ఏంటో నాకర్ధం కావడం లేదు. మా ఇద్దరికి మీరు ప్రత్యామ్నాయం లాగా ధ్వనిస్తోంది.

 48. నేను స్టాండర్డ్ లాంటివేవీ పెట్టలేదు. అది అమెరికా విధించుకున్న ప్రాతిపదిక నాది కాదు.

 49. Wait a min please. We are talking about what Joseph said about the US and if I understood correctly you say that a majority in the US is poor.

  What I am saying is, going by the ground reality, your claim is false.

  This takes us back to the discussion about people rejectinv socialim and communism.

 50. సోషలిజం, కమ్యూనిజం ల గురించి తర్వాత చర్చిద్దాం. మీ రిఫరెన్సు ఇవ్వండి. చదువుకుంటాను.

 51. “….చైనా వాళ్ళ దగ్గర నుంచైనా సరే మీరు తీసుకుని ఆచరిస్తారు?….”

  నా దృష్టిలో చైనా ఒక శత్రు దేశం. ఈ సూత్రాలు వాళ్ళదగ్గరనుంచైనా సరే తీసుకుంటారా అన్నానుకాని. మీరు ఇప్పటికే వాళ్ళదగ్గరనుండి తీసుకుని ఉన్నారని అనలేదే!!

  ఆ తరువాత ఆడం స్మిత్ గురించి నేనెక్కడా ఉదహరించలేదు. ,. . మీరే ఎక్కడో చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s