“వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు


పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ దేశాన్ని స్దాపించాయి. లక్షలమంది పాలస్తీనీయులను వారి ఇళ్ళనుండి భూములనుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. వారికి పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, జోర్డాన్ లలో శరణార్ధులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించి అక్కడి పాలస్తీనియులను వెళ్ళగొట్టి సెటిల్‌మెంట్లను ఇప్పటికీ నిర్మిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అక్రమాలకు అమెరికా, పశ్చిమ దేశాల వత్తాసు ఉండటం, మెజారిటీ అరబ్ దేశాల్లో ప్రభుత్వాలు అమెరికాతో కుమ్మక్కు కావడంతో పాలాస్తీనా ప్రజలకు విముక్తి లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు మే 15 తేదీని నక్బా (వినాశన దినం) గా పాలస్తీనీయులు ప్రతి సంవత్సరం పాటిస్తారు. ఈ సంవత్సరం పాలస్తీనియులు తమ స్వస్ధలాలకు తిరిగి రావడానికి ప్రయత్నించడంతో జరిగిన ఘర్షణల ఫోటోలు ఇవి. వీటిని రాయిటర్స్ సంస్ధ ప్రచురించింది.

2 thoughts on ““వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు

  1. బైబిల్ లో ఇజ్రాయెల్ పాలస్తీనాకంటే ముందునుండే ఉన్నదనీ, ఎప్పటికైనా ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందనీ అంటున్నారు. క్రిస్టియన్స్ తో నాకు వాదన జరిగింది. అసలు పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం ఏమిటో దాని గురించి ఇంకా కొంత సమాచారం ఉంటే బాగుంటుంది.

  2. బైబిల్ అనేది మతపర మైన నమ్మకాలకు సంబంధించింది. అది చరిత్ర పుస్తకం కాదు. పాలస్తీనాలో పాలస్తీనా, యూదులు ఇద్దరూ ఉండేవారు వేల సంవత్సరాల క్రితం. ఈ ప్రాంతంపైన, గ్రీకులు, రోమన్లు ఈజిప్షియన్లు అనేక సార్లు దండయాత్రలు చేసి పాలించారు. ఈ కాలాల్లో యూదుల్ని అక్కడినుండి వెళ్ళగొట్టారు. దాంతో వారు ప్రపంచంలో అన్ని వైపులకి వలస వెళ్ళారు. కొంతమంది అక్కడే ఉన్నారు. పాలస్తీనీయుల్ని కూడా వెళ్ళగొట్టిన సందర్భాలున్నాయి కానీ వాళ్ళు దాదాపు అన్ని కాలాల్లొ అక్కడున్నారు. యూదులు ఏ దేశంలో ఉన్నా ఉన్నత స్ధానల్లో ధనికులుగా ఉన్నారు. యూరప్ లో కూడా. రెండొ ప్రపంచ యుద్ధంలో యూదుల్ని యూరప్ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. హిట్లర్ అయితే అమానుషంగా చాలామందిని చంపేశాడు. యూరప్ నుండి యూదుల్ని వెళ్ళగొట్టే పనిని అమెరికా, యూరప్ లు హిట్లర్ చేసిన యూదు జాతి హత్యాకాండను అడ్డం పెట్టి సాధించారు. హిట్లర్ యూధుల్ని హత్యాకాండ చేసినందున వారికొక దేశం కావాలని బ్రిటన్ ప్రతిపాదించింది. హిట్లర్ అమానుషాల ఫలితంగా యూదుల పట్ల వచ్చిన సానుభూతిని దానికి వాడుకున్నారు. దాన్ని పశ్చిమదేశాలన్నీ అందుకున్నాయి. వాళ్ళ దేశాల్లో ధనికులుగా ఉన్న యూదుల్ని వెళ్ళగొట్టి వారి ఆస్తుల్ని వశం చేసుకునే ప్రయత్నం అది.

    1948 లో పాలస్తీనా భూభాగాల్లోని పాలస్తీనీయుల్ని బ్రిటన్, అమెరికా, అక్కడ ఉన్న యూదులు బలవంతంగా వెళ్ళగొట్టారు. నిరాకరించినవారిని చంపేశారు.దాదాపు ఆరు నుండి పది లక్షల దాకా పక్క దేశాలకి వలస వెళ్ళి అక్కడ శరణార్ధులుగా ఇప్పటికీ ఉన్నారు. అప్పటినుండీ పాలస్తీనీయులు తమ స్వస్ధలానికి తిరిగిరావడానికి ఎదురు చూస్తున్నరు. అమెరికా, యూరప్ అండతో ఇజ్రాయెల్ అరబ్ దేశాలపైన ఆధిక్యం సాధించింది. 1967 అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ పైన యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధంలో ఆరు రోజుల్లోనే అరబ్ దేశాల్ని ఓడించి పాలస్తీనా భూభాగాల్ని ఇంకా ఆక్రమించింది. ఈజిప్టు, సిరియా, జోర్డాన్ దేశాల భూభాగాల్ని కూడ ఆక్రమించింది. ఈజిప్టు ఆ తర్వాత మిగిలిన అరబ్ దేశాల్ని వదిలి ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ కి మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. ఉత్తరాన లెబనాన్, సిరియాలు, దక్షిణాన ఈజిప్టు, గాజా, తూర్పున వెస్టు బ్యాంకు ల్లో పాలస్తీనీయులు తల దాచుకుంటున్నారు. ఈజిప్టులో తక్కువే.

    1967 యుద్ధానికి ముందున్న సరిహద్దులకి వెనక్కి వెళ్ళాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉంది. ఆ యుద్ధంలో చేసిన ఆక్రమణలు చట్టవిరుద్ధమని ఇప్పటికీ వెస్ట్ బ్యాంక్ లో కడుతున్న సెటిల్ మెంట్లు చట్టవిరుద్దమని సమితి తీర్మానం ఉన్నాయి. కానీ అమెరికా యూరప్ ల అండవలన అవి అమలు కావడం లేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు 1967 సరిహద్దులకి వెళ్ళడానికీ ఒప్పుకోవడం లేదు. పెద్ద గూండాగా తయారయ్యింది. ప్రపంచానికి అమెరికా పోలీసయితే మధ్య ప్రాచ్యానికి (పశ్చిమాసియా) ఇజ్రాయెల్ గూండా. పాలస్తీనీయులమీద జాతివివక్ష అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ కొంతమంది పాలస్తీనీయులు ఉన్నారు. వారు రెండో క్లాస్ పౌరులుగా ఉన్నారు. ఇజ్రాయెల్ లో ని యూదుల్లో కొంతమంది ఇజ్రాయెల్ విధానాల్ని వ్యతిరేకించేవారూ ఉన్నారు. వార్ని యూదు జాతి ద్రోహులని ముద్రవేస్తారు.

    ఇజ్రాయెల్ కొత్తగా సాధించే విజయం ఏమీలేదు. అది అక్కడ పెత్తందారు. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఆక్రమణదారు. జాతివివక్ష పాటిస్తున్న జాత్యహంకారి. అమెరికాలో ఏ అధ్యక్షుడైనా పాలస్తీనాకి అనుకూలంగా ఉన్నా పడనీయరు. అమెరికాలో ఉన్న యూదుల్ని ఇజ్రాయెల్ ఆర్గనైజ్ చేస్తుంది. వారు పెద్ద లాబీగా ఏర్పడి అమెరికా విధానాల్ని ప్రభావితం చేశ్తారు. అమెరికాలో యూదుల లాబీ అత్యంత శక్తివంతమైనది. వాళ్ళ డబ్బు వారికా శక్తిని ప్రసాదించింది. చాలా పత్రికా సంస్ధలు, ఎం.ఎన్.సిలు యూదులవి. గూగుల్ ని యూదులు స్ధాపించిందే. ఇండియాలో క్రైస్తవులు ప్రపంచం అంతా యూదులపైనే ఆధారపడి ఉందని వాదిస్తూంటారు. అది నిజం కాదని మీకూ తెలుసు కదా.

    పాలస్తీనా పై గతంలో రాసిన పోస్టుల్లో వివరాలు క్లుప్తంగా రాశాను. అవి చదివితే తెలియవచ్చు. కాదు ఇంకా కావాలంటే చెప్పండి, రాస్తాను భాస్కర్ గారూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s