సముద్రాల ప్రైవేటీకరణ యోచనలో యూరోపియన్ యూనియన్


fishing_hookఅభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలను శాసిస్తున్న బహుళజాతి సంస్ధలు తమ కంటికి కనబడినదల్లా తమదే అంటున్నాయి. భూమిపై ఉన్న సమస్త సంపదలను స్వాయత్తం చేసుకున్న ఈ సంస్ధలు ఇప్పుడు భూ గ్రహం పై మూడు వంతుల భాగాన్ని ఆక్రమించుకుని ఉన్న సప్త సముద్రాలపై కన్నేశాయి. సముద్ర జలాల్లొ ఉండే మత్స్య సంపద మొత్తాన్ని వశం చేసుకొవడానికి పావులు కదుపుతున్నాయి. దానిలో భాగంగా యూరోపియన్ యూనియన్ చేత సముద్ర సంపదలను ప్రవేటీకరించేందుకు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో దొరికే మత్స్యసంపదను కొన్ని సంవత్సరాలపాటు తమ స్వాధీనంలో ఉంచుకొనేందుకు పధకాలు పన్నుతున్నాయి.

సముద్రాల్లో చేపలవేట సాగించే ఓడలకు కనీసం 15 సంవత్సరాల పాటు మత్స్య సంపదలో నిర్ధిష్ట కోటాను కేటాయించేందుకు యూరోపియన్ కమిషన్ సమాయత్తమవుతున్నది. “ఉమ్మడి ఫిషరీ విధానం” (సి.ఎఫ్.పి) లో సంస్కరణలు తీసుకొవచ్చే ముసుగులో ఈ పనికి నడుం బిగిస్తున్నది. రానున్న జులై నెలలో ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చి 2013 సంవత్సరం నుండి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పర్యావరణ ఉద్యమకారులు ఈ ప్రతిపాదనలు సముద్ర జలాలను ప్రవేటీకరించడమేనని విమర్శిస్తున్నా వారు పట్టించుకునే స్ధితిలో లేరు. సముద్రంలో ఫంగై నుండి తిమింగలాల వరకు ఉండే జీవన వ్యవస్ధ పర్యావరణం అదుపు తప్పకుండా కాపాడడానికి దోహదపడుతుంది. ఈ సంపదను ప్రవేటీకరిస్తే లాభార్జన తప్ప మరొకటి ఎరుగని బహుళజాతి సంస్ధలు ఇప్పటికే నాశనం అయిన పర్యావరణ వ్యవస్ధను మరింతగా క్షీణింపజేయడానికి ఏ మాత్రం వెనకాడరు.

సముద్రంలో తిరుగాడే ప్రవేటు ఓడలకు కోటా ప్రకారం చేపలు పట్టేందుకు అనుమతి ఇస్తే సముద్రంలో కనీస స్ధాయిలో ఉండాల్సిన జీవజాలం ఉండడానికి శ్రద్ధ తీసుకొనే అవకాశం లేదు. మనుషుల ప్రాణాలపైనే శ్రద్ధ చూపని ప్రవేటు కంపెనీలు సముద్ర జీవాల సంఖ్యను పర్యావరణం చెడిపోకుండా ఉండేంత స్ధాయిలో ఉంచుతాయని నమ్మలేం. కోటాలను నిర్ణయించడంలొ శాస్త్రవేత్తలకు కాకుండా రాజకీయనాయకులకు అంతిమ నిర్ణయం తీసుకునే అధికారాన్ని దఖలు పరిచేందుకు నూతన విధానంలో చర్యలను పొందుపరిచారని బిబిసి వార్తా సంస్ధ తెలుపింది. 28 సంవత్సరాలనుండి అమలులో ఉన్న సి.ఎఫ్.పి లో సముద్రంలో జీవాలు ఏ స్ధాయిలో ఉండాలో నిర్ధారించే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ అనేక సార్లు ప్రవేటు ఓడలు చేపలు పట్టడానికి అనుమతులు మంజూరు చేశారు. పర్యావరణం చేడిపోకుండా కాపాడాల్సిన ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ప్రవేటు ఓడలకు పుస్కలంగా లాభాలు రావడానికే శ్రద్డ వహించాయి.

ఇప్పటివరకూ సముద్రంలొ పట్టిన చేపల బరువు నిర్ధారించిన కోటాకంటే అధికంగా ఉంటే అధికంగా ఉన్నంతవరకు అక్కడే సముద్రంలో వదిలి రావాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఓడలు పట్టిన చేపలను తీరానికి చేర్చాక అక్కడ పరిమితిని దాటిన చేపలను సముద్రంలోకి వదిలేలా నిబంధన మార్చారు. తీరాన్ని చేరేలోపు అనేక చేపలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రాణాలు కోల్పోయిన చేపలను అధికంగా పట్టారంటు సముద్రంలో విడిచినా ఉపయోగం ఉండదు. చేపలు కుళ్ళి పర్యావరణానికి మరింత హాని తప్ప. వేటకు వీలులేని చిన్న చేపలను కూడా సముద్రంలో వదిలేయాల్సి ఉంటుంది. తీరానికి చేరేలోపు చిన్న చేపలు చనిపోయే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి.

కొత్త విధానంలో మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి:

 • ఒక సంవత్సరం కంటె ఎక్కువ సంవత్సరాలపాటు కోటాలను విస్తరించి తిరిగి మత్స్య సంపద అభివృద్ధి చేయడానికి వేచి ఉండాల్సిన కాలాన్ని కూడా అన్ని సంవత్సరాలపాటు అనుమతినివ్వడం. దీనివలన ప్రవేటు పడవలన్నీ ఒకటి రెండు సంవత్సరాల పాటు తమ వేటను కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దానితో సముద్రంలో నిబంధనల ప్రకారం ఉండవలసిన మత్స్య సంపద కంటే బాగా తగ్గిపోయి ఉష్ణోగ్రతల్లో ఎగుడుదిగుడులు ఎక్కువై  సముద్రజల ప్రవాహాల్లో తేడాలు వస్తాయి. ఫలితంగా పర్యావరణ చక్రం దెబ్బతిని చేపల సంఖ్య తగ్గిన ప్రాంతంలోనే కాక భూగోళమంతా వాతావరణ చక్రంలో మార్పులు వస్తాయి. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలు, శీతల వాయువులు అటు పంటలతో పాటు ఇటు మనుషుల జీవనాన్ని కూడా దెబ్బతీస్తాయి.
 • మత్య్స సంపదను గరిష్ట స్ధాయిలో వేటకు లభ్యమయ్యేలా (గరిష్ట స్ధిర ఉత్పత్తి -మాక్జిమమ్ సస్టైనబుల్ ఈల్డ్) సముద్రంలో మత్స్య నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు 2015 లోపు పూర్తి కావాలి. ఈ నిబంధనను అమలు చేయగలగడం పైనే దాని మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి.
 • చేపలు పట్టే నిర్ధిష్ట యంత్ర పరికరాలను విస్తృతంగా వాడేందుకు ప్రోత్సహాకాలు ఇచ్చేలా ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. యంత్రాల ఉత్పత్తి పరిశ్రమలకు ఈ నిబంధన ఉపయోగం. కొన్ని యంత్రాల వినియోగానికి ప్రోత్సాహకం ఇవ్వడం, ఇతర యంత్ర పరికరాలకు ఇవ్వకపోవడం వలన పలుకుబడి ఉన్న పరిశ్రమలవారు ఎక్కువ లాభపడతారు. చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులు తమ పరిశ్రమలు మూసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అందులో పనిచేసే కార్మికులు నిరుద్యోగులవుతారు. కాకులను కొట్టి గద్దలకు మేపడమే ఇది.

ప్రస్తుత సి.ఎఫ్.పి నిబంధనలను ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం ఉల్లంఘిస్తూ వచ్చాయి. అందువలన అది విఫలమయ్యింది. దానితో పాటు కొన్ని బలహీనతల వలన కూడా విఫలమయ్యిందని “ప్యూ పర్యావరణ సంస్ధ” నిపుణుడు “మార్కస్ నిగ్గే” ని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “రెండు సంవత్సరాల క్రితం యూరోపియన్ కమిషన్ సి.ఎఫ్.పి పై విమర్శనాత్మక సమీక్షను ప్రచురించింది. కాని ఇప్పుడు ప్రతిపాదించిన విధానం యూరప్ జలాల్లో జీవజాలాన్ని దాని పూర్తి స్ధాయికి పునరుద్ధరించడానికి సరిపోదు. సి.ఎఫ్.పి వైఫల్యాన్ని పూడ్చడానికి కొత్త విధానం సరిపోదు. అన్ని రకాల జీవాల నిల్వలను అన్ని కాలాల్లో గరిష్ట ఉత్పత్తి స్ధాయికి చేర్చడం అసాధ్యమని శాస్త్రవేత్తలు కనపడినవారందరి దగ్గరా మొత్తుకుంటున్నారు. అదీ 2015 లోపు పూర్తిగా అసాధ్యమని చెబుతున్నారు” అని మార్కస్ వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా యూరోపియన్ యూనియన్ లోని దేశాల స్ధానిక అవసరాలను, ఆచరణలను దృష్టిలో పెట్టుకోకుండా ఒకే కేంద్రంలో నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా దేశాలకు నష్టకరంగా పరిణమిస్తాయని మార్కస్ తెలిపాడు.

సి.ఎఫ్.పి ప్రతి సంవత్సరం జరిగే ఒక క్రతువుగా మారిందని బిబిసి విశ్లేషించింది. శాస్త్రవేత్తలు వివిధ చేపల జాతులకు సముద్రంలో ఉండవలసిన కోటాలు నిర్ణయించడం, కొన్ని జాతులను అసలు వేటాడరాదని కూడా నిర్ణయించడం, అటు పిమ్మట ఇ.యు సభ్య దేశాల మంత్రులు శాస్త్రవేత్తల సూచనలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తమ ఇష్టానుసారం ప్రవేటు పడవలకు కోటాలను నిర్ధేశించడం… ఇవన్నీ ఆటంకం లేకుండా జరిగిపోతుంటాయి. అమెరికా ఫిషరీ విధానం ఆచరణీయమని కొందరు సూచిస్తున్నారు. ఒక జాతి చేప నిలవ నిర్ధిష్ట పరిమితికంటే తగ్గితే ఇక ఆ చేపలను వేటాడ్డానికి అక్కడ వీల్లేదు. ఈ విషయంలో బేరాలకు అనుమతి ఉండదనీ వారు తెలిపారు. ఇప్పుడున్న పరిస్ధితే కొనసాగితే పరిమితికి మించి చేపలవేట ఆగదని వారు హెచ్చరించారు. అత్యవసర చర్యలు తీసుకునే అధికారం ఇ.యుకి ఉన్నా రాజకీయ, ఆర్ధిక పెత్తందార్ల వలన అది ఉపయోగపడదని వారు వివరించారు.

వేటాడిన చేపలను తిరిగి సముద్రంలో వదిలే అవసరం లేకుండా పరిమితి మేరకు వేటాడే పరిస్ధితి నెలకొల్పడానికి కొత్త విధానం ఉద్దేశించామని చెబుతున్నారు. ఈ నిబంధనలో ఆచరణలో ఎలా అమలు చేయాల్సిందీ ఇంకా అవగాహన లేదు. పైగా ఫిషరి కంపేనీలు ఆప్పుడే కొత్త విధానానికి వ్యతిరేకంగా లాబీయింగా ప్రారంభించాయని బిబిసి తెలుపుతోంది. ఏ వేటగాడయినా నేనీరోజు ఫలానా రకం చేపలు మాత్రమే వేటాడతానని చెప్పలేడు. అటువంటి నిబంధన అర్ధ రహితం. కోటా ముగిసాక చేపల వేటను అనుమతించకపోవడమే సరైన విధానం అని కేనడా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

8 thoughts on “సముద్రాల ప్రైవేటీకరణ యోచనలో యూరోపియన్ యూనియన్

 1. Meeru raasina ee point yelaa rassaro naaku theliyadhu kaanee…idhi correct kadhemonandi…nenu fishery science lo masters chesthunnanu..andhukane intha confident gaa chepthunnanu..”ఒక సంవత్సరం కంటె ఎక్కువ సంవత్సరాలపాటు కోటాలను విస్తరించి తిరిగి మత్స్య సంపద అభివృద్ధి చేయడానికి వేచి ఉండాల్సిన కాలాన్ని కూడా అన్ని సంవత్సరాలపాటు అనుమతినివ్వడం. దీనివలన ప్రవేటు పడవలన్నీ ఒకటి రెండు సంవత్సరాల పాటు తమ వేటను కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. దానితో సముద్రంలో నిబంధనల ప్రకారం ఉండవలసిన మత్స్య సంపద కంటే బాగా తగ్గిపోయి ఉష్ణోగ్రతల్లో ఎగుడుదిగుడులు ఎక్కువై సముద్రజల ప్రవాహాల్లో తేడాలు వస్తాయి. ఫలితంగా పర్యావరణ చక్రం దెబ్బతిని చేపల సంఖ్య తగ్గిన ప్రాంతంలోనే కాక భూగోళమంతా వాతావరణ చక్రంలో మార్పులు వస్తాయి. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలు, శీతల వాయువులు అటు పంటలతో పాటు ఇటు మనుషుల జీవనాన్ని కూడా దెబ్బతీస్తాయి.”

 2. ప్రబంధ్ గారూ
  బహుశా ఈ పాయింటు నేను సరిగా అర్ధం చేసుకోలేదేమో. ఎక్కడ తప్పు దొర్లిందీ తెలియజేయగలరు. సవరిస్తాను. ఈ వార్త బిబిసి ప్రచురించింది.

 3. మీ మెయిల్ కి బిబిసి వార్త లింక్ పంపాను. అది చూసి ఇక్కడ తప్పును తెలియజేయగలరు.

 4. $విశేఖర్ గారు

  చాలా బాధాకరమైన విషయం. నాకు మీరు రాసినదానిమీద అంతగా పరిజ్ఞానం లేదా అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా నమ్మకపోవడానికి కూడా ఆట్టే కారణాలు లేవు. అంతా కళ్ళముందు జరుగుతున్నదే.. విలయాన్ని సృష్టిస్తున్న కొన్ని బహుళ గబ్బిల జాతికి చెందిన సంస్థల పైత్యం గురించి.

  మరో మాట: టపాకు అనుబంధంగా మీరు పెట్టిన ఛాయాచిత్రం “ఒక ఛాయాచిత్రం వెయ్యిమాటలకి సమాధానం” అన్న సామెతకి వందకి వంద శాతం న్యాయం చేకూర్చింది.. ఆ వలకి చిక్కి రక్తమయమైన చేపలో నేను పేదవారినీ/మధ్యతరగతి వారినీ చూస్తున్నా.
  హ్మ్.. ప్చ్.. ఆహ్… !

  బాధాకరమైనా అందరూ తెలుసోకోవాల్సిన వార్తను పంచిన౦దుకు కృతజ్ఞతలు.

 5. రాజేష్ గారికి, మీలో భావుకత్వం పాళ్ళు దండిగానే ఉన్నట్లున్నాయ్. ధన్యవాదాలు.

 6. #.. భావుకత్వం పాళ్ళు ..

  హ్మ్.. మీరు ఏ ఉద్దేశ్యంతొ అన్నారో తెలీదు..దాని గురించి అలోచించి సమయం వృధా చేసుకునే తర్కమూ కనిపించలేదు. అందువల్ల మీరు మంచిగానే అని ఉంటారని దాన్ని ధనాత్మకంగా తీసుకుంటున్నా. మొన్న అజ్నాతేదో కూసాడని మీరు పట్టించుకోవద్దు. ఒకవేళపట్టించుకునివుంటే ప్రవీణ్ గారిని నా గురించి అడగగలరు.

  సరే ఇంతకీ ఎందుకు వచ్చా ఇక్కడికీ? ఇందుకు..:) కిందగొలుసు చూసి మీ అభిప్రాయం పంచుకోగలరు 🙂 http://saapaatusamagatulu.blogspot.com/2011/05/blog-post_13.html

 7. అదేం లేదే. అజ్ఞాత మీగురించి అన్నాడా? నేనా విషయమే గమనించలేదు. ఎరకు చిక్కిన చేపను పేద వారితో పోలిస్తే అందుకు అభినందనగానే అలా రాశాను. మీరు చెబుతున్నవేవీ నా బుర్రలో లేవు. నన్ను తిడుతూ బ్లాగ్ పెడితేనే పట్టించుకోవడం లేదు. పద్ధతి పాటిస్తున్న మీ గురించి మరోవిధంగా ఆలోచించే ఓపిక కూడా నాకు లేదు. ఛీరప్.

 8. అట్లైతే లేదు లేదు.. నా గురించి ఏమీ అనలేదు.. ఎవరి గురించో అయ్యుంటది 🙂

  #..ఆలోచించే ఓపిక కూడా నాకు లేదు. ఛీరప్.
  🙂 ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s